Sunday, June 9, 2019

*ఓ పవిత్ర స్మరణ*

【ఈ రోజు (జూన్ పది) పూజ్యులు, శివైక్య సద్గురు 'కందుకూరి శివానంద మూర్తి' గారి వర్ధంతి  సందర్భంగా...】

సద్గురు కందుకూరి శివానంద మూర్తి గారు సాధారణ జీవితం గడిపిన గృహస్థ సాధువు. ఆ రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి తమదైన సమాజ సేవకు అంకితమయ్యారు. సంపద సృష్టించడం, ఉపాధి కల్పించడం, వైజ్ఞానిక విప్లవం తీసుకురావడం మొllవంటివి మాత్రమే సమాజ సేవలు అనుకుంటే పొరపాటు. ధర్మాన్ని తెలపటం తద్వారా మానవీయ  నైతిక విలువలు  దెబ్బతినకుండా చూడటం, ఙ్ఞాన వైరాగ్యాల పట్ల  జిజ్ఞాసను  కలిగించడం తద్వారా అనవసర విషయాలపై వెంపర్లాటకు లోనుకాకుండా ప్రజల్లో చైతన్యం తేవడం వంటివి కూడా అత్యుత్తమ సమాజ సేవలే. సద్గురు శివానంద మూర్తిగారు చేసిన ఈ తరహా సమాజ సేవ మనఃవందనీయం.
ఇల్లు, సంసారం, పిల్లలు వీటిని తలకు మించిన భారంగా భావించే వారికి వీరి జీవనవిధానం ఒక మేలుకొలుపు. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ తమ పిల్లలను పదిమందికి పనికొచ్చే మంచి పౌరులుగా తీర్చిదిద్దారు శివానంద మూర్తిగారు. రకరకాల భారాలను మానసికంగా మోస్తూ కూడా ప్రసన్నవదనంతో సౌమ్యంగా ప్రవర్తించేవారు సద్గురు. వ్యక్తిగత సుఖాలను త్యాగం చేసి వీరిని  విశ్వసించిన సమాజ సమూహానికి సుఖ ప్రదమైన జీవితాన్ని అవలంబించుకునేలా మార్గనిర్దేశం చేశారు.  స్వధర్మాన్ని, సనాతన హైందవ ధర్మాన్ని తమవంతు బాధ్యతగా సుబోధ చేశారు. గుండెలకు హత్తుకునేలావుండే  మృదువైన మితభాషతో అమిత విషయపరిజ్ఞానాన్ని ప్రబోధించేవారు. వీరి నిర్మలమైన మనసును,  ఙ్ఞాన సంపదను గుర్తించిన అనుగాములు దైవంగా తలచి  సద్గురువని భావించేవారేగాని  శివానంద ముర్తిగారు తమకైతాము  ఎన్నడూ దైవంగా ప్రకటించుకోలేదు సరికదా గురువుగా కూడా ప్రకటించుకోలేదు. కేవలం హితబోధ ద్వారానే కాకుండా తమ నడవడికద్వారా కూడా ఆదర్శాలకు నిదర్శనంగా నిలిచారు సద్గురు.
     
ఇది రచన కాదు...
సద్గురునిపై  కృతజ్ఞతతో నివేదించిన
నా హృదయ స్పందన...
ఓ పవిత్ర స్మరణ...9052116568  ప్రహ్లాద్ నెల్లుట్ల    రచయిత సినీరంగం
         
                         


శ్రీ శరభేశ్వరస్వామి By M. Usha Sundari 
****
 ఆలయం,తిరుభువనం,తమిళనాడు
******************
హిరణ్యకశిపుడిని చంపి, ప్రహ్లాదుణ్ణి రక్షించటానికి మహావిష్ణువు నరసింహావతారం ఎత్తినట్లు మనందరికీ తెలిసిన విషయమే.  హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత మన కధల ప్రకారం నరసింహుడి ఉగ్ర రూపాన్ని మహాలక్ష్మి శాంతింప చేస్తుంది. కానీ తమిళ నాట ప్రచారములో నున్న కధ ప్రకారం...
హిరణ్యకశిపుడి రక్తం నరసింహస్వామి శరీరంమీద, లోపల వుండి ఆయనని చాలా రౌద్రంగా చేసిందిట. హిరణ్యకశిపుడి రక్తం నేల మీద పడితే అనేక మంది హిరణ్యకశిపులు జన్మిస్తారుట. దానితో వాళ్ళు భయపడ్డారు.  దానిని ఆపటానికి  ఆయనని చల్లబరచటానికి దేవతలు శివుణ్ణి ప్రార్ధించారుట.శివుడు వింత రూపాన్ని ధరించాడు. సింహ ముఖం, మానవ శరీరం, పక్షి రెక్కలు, 8 కాళ్ళు, 4 చేతులతో ఆయన రూపం ప్రత్యక్షమయింది. ఆయన రెండు రెక్కలలో ఒక రెక్క ప్రత్యంగరాదేవి, రెండవది శూలిని దుర్గ అవతరించారు. ఆయన నరసింహుణ్ణి ఆకాశంలో భూమ్యాకర్షణ శక్తి పని చేయనంత ఎత్తుకు తీసుకెళ్ళాడు. ఆ ప్రదేశంలో శరభేశ్వరుడు నరసింహుడి శరీరాన్ని నొక్కి చెడ్డ రక్తమంతా బయటకి పోయేటట్లు చేశాడు. భూమ్యాకర్షణ శక్తి లేక పోవటంతో ఆ రక్తం కింద పడలేదు. శరీరంలోంచి చెడు రక్తం పోగానే నరసింహుడు శాంతించి శివుణ్ణి పూజించాడుట.శరభేశ్వురుణ్ణి పూజిస్తే నలుగురు దేవతలని పూజించినట్లే. శరభేశ్వరుని ఆకారంలో నలుగురు దేవతా మూర్తులు, శివుడు, కాళి, దుర్గ, విష్ణు వున్నారు. శరభేశ్వరస్వామిని పూజించటంవల్ల ఆరోగ్యం,మనసు చికాకులు,గ్రహదోషాలు తొలగిపోతాయి.

Saturday, June 8, 2019

By MALLIKHARJUN 
32. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితా 

రత్నములు, బంగారము ,ముత్యములతో చేయబడిన కంఠాభరణములను దాల్చినది అని అర్థము . 
కంఠము ఊర్ధ్వ లోకమునకు,మానవ లోకమునకు మధ్యస్థమైన లోకము . మానవ ప్రజ్ఞ, విశిష్ట శుద్ధి  నొందనిదే  దివ్య లోకానుభవములకు పాత్రత పొందదు.ఈ నామమున చెప్పబడిన కంఠాభరణములలో రత్నములు, ముత్యములు, బంగారము ఉన్నవి . రత్నములు బంగారములో పొదగబడినవి . అవి కంఠమున అలంకరించగా చలించుచున్న ముత్యపు హారము ఒకటి కంఠాభరణమునకు తగుల్కొని యున్నది . ముత్యపు హారము చలించుట మనో చాంచల్యమును సూచించును . ఈ చపల స్వభావము ఉపాసకుని కంఠములందు చింతములు కలవారిగా సూచించును . చింతలను గురించి దేవిని ధ్యానించు వారు ఈ కదులుచున్న ముత్యపు హారము వంటి వారు. ముత్యమునకు, చంద్రునకు , మనస్సునకు గల స్వాభావిక సంబంధమును యిచ్చట గమనించదగును . 

కంఠమున పరిశుద్ధి కలిగినకొలది నిశ్చలమైన రత్నము , బంగారము కాంతులు దర్శనమగును . అంతకుపూర్వం చంచలమైన ఆరాధన ఇప్పుడు నిశ్చలమైన ఆరాధనగా పరిణతి చెందును . క్రిందవున్న ముత్యపుహారము తను స్వభావము, దేవి స్వభావము మిశ్రమముగా నుండుటచే కదులుచు నుండును . దానికి ఆధారమైన కంఠాభరణము జీవుని  భూమికయైన దేహపుంజము (మనస్సు , ఇంద్రియములు , శరీరము )అధిష్టించి యున్న ప్రజ్ఞకు సంకేతము . నిశ్చలమైన కాంతిలోక ప్రవేశమునకు కూడా సంకేతము .ఇట్టి వారు దేవిని నిశ్చలముగా ధ్యానము చేయగలరు . 

పై నిశ్చలత్వమును పొందుటకు ఉపాసకుడు వాఙ్మయ తపస్సును చేయవలసియుండును . కంఠపు లోయనుంచి వచ్చు శభ్దములను
దైవముగా దర్శించి మాట్లాడుట ఈ తపోనియమము . ఎట్టి పరిస్థితులలోను అశ్లీలము , అపవిత్రము , అబద్ధము కలుగచేయు ధ్వనులను పలుకరాదు . కంఠాభరణమును , దానిమధ్య వ్రేలాడు ముత్యపు హారమును పై విధముగా ఆరాధన చేయట ఉపశకునకు శ్రేయస్కరము . 
ఓం శ్రీ మాత్రే నమః...

(శక్తి ఆరాధన శ్రీచక్ర ఉపాసన)
శ్రీ గురు దత్త🚩🚩

Friday, June 7, 2019

*వీళ్ళు నరకానికి వెళ్ళరు* (వరాహ పురాణం)By MVMRAO

ఒక రావి చెట్టు,
ఒక నిమ్మ చెట్టు,
ఒక మఱ్ఱి చెట్టు,
రెండు దానిమ్మ చెట్లు,
రెండు మాధీ ఫలపు చెట్లు, అయిదు మామిడి చెట్లు,
పది పూల చెట్లు నాటినవారు నరకానికి వెళ్ళరు.

*వరాహ పురాణం శ్లోకం*

శ్లోకం :- అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం, స్య గ్రోధమేకం, దశ పుష్ప జాతీం ı
ద్వే ద్వే తధా దాడిమ మాతులింగే పంచామ్ర వాపీ నరకం న యాతీ ıı

ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి మన పూర్వీకులు..

పై విషయాన్ని చిన్నప్పుడు స్కూల్స్ లో నేర్పి ఉంటే,
గత యాభై సంవత్సరాలలో ఎంత *పెద్ద అడవి* సృష్టించ బడి ఉండేదో ఊహించుకోవచ్చు.

*ఓం నమఃశ్శివాయ*🙏

అష్టాదశ శక్తి పీఠములు

అష్టాదశ శక్తి పీఠములు


























చాగంటి కోటేశ్వరరావు గారి షష్టిపూర్తి సంబరాలు

చాగంటి కోటేశ్వరరావు గారి షష్టిపూర్తి సంబరాలు 

Thursday, June 6, 2019

*వారణాసి కాశీి వైభవం*by I. Umashankar

కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం:

# కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు.

# విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం.

# ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచ సాంస్కృతిక నగరం.
# స్వయంగా శివుడు నివాసముండె నగరం.

# ప్రళయ కాలంలో మునుగని అతి  ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు.

# కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది.

# పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం.

# కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం....

# ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని  కాశీ లోనికి అనుమతించడు.

# కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.

# కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది....

# డిండి గణపతి, కాల భైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు ...

# కాబట్టే కాశీలో  కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు.

# కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యం తో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.

# కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.

# అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు.

# మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా  విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.

# గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశీి పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది

# ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.

@ శివుని కాశీలోని కొన్ని వింతలు...

# కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

# కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ  జాడ దొరకకుండా ఉంటుంది.

# కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.

# అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు.

# అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి?

# అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు

# అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.

# కాశీి విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనం తో పూజ ప్రారంభిస్తారు .

# కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.

# కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది; పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.

# విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.

# ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.

# ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.

కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి..

ఇందులో దేవతలు, ఋషులు, రాజుల తో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి. అందులో కొన్ని :

1) దశాశ్వమేధ ఘాట్:
బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.

2) ప్రయాగ్ ఘాట్:
ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.

3) సోమేశ్వర్ ఘాట్:
చంద్రుని చేత నిర్మితమైనది.

4) మీర్ ఘాట్:
సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం.
ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.

5) నేపాలీ ఘాట్:
పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.

6) మణి కర్ణికా ఘాట్:
ఇది కాశీలో మొట్ట మొదటిది. దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో  తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.

7) విష్వేవర్ ఘాట్:
ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.

8) పంచ గంగా ఘాట్:
ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.

9) గాయ్ ఘాట్:
గోపూజ జరుగుతున్నది.

10) తులసి ఘాట్:
తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం  పొందినది.

11) హనుమాన్  ఘాట్:
ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది
ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.

12) అస్సి ఘాట్:
పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.

13) హరిశ్చంద్ర ఘాట్:
సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...

14) మానస సరోవర్ ఘాట్:
ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది.
ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.

15) నారద ఘాట్:
నారదుడు లింగం స్థాపించాడు.

16)చౌతస్సి ఘాట్:
ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు.
ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం... ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.

17) రానా మహల్  ఘాట్:
ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు.

18)అహిల్యా బాయి ఘాట్

ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ
విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము.

కాశీలోని గంగా నది ప్రవాహంలో                     అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.

పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.

కానీ  మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా  చేసుకొని దాడులు చేసి  ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము.

విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు.

నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, మసీదు వైపు గల కూల్చ బడ్డ మందిరం వైపు చూస్తోంది.

అక్కడే శివుడు త్రిశూలం తో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.

ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిర అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు

*కాశీ స్మరణం మోక్షకారకం*!b