Sunday, May 31, 2020

Grocery distribution

ఆరాధ్య బంధుమిత్రులందరికీ నమస్కారములు.

1) గౌరవనీయులు శివశ్రీ చంద్రశేకర రావు‌,ప్రధాన కార్యధర్శి - శైవమహాపీఠం గార్ల సమక్షంలో నేడు (31/5/2020) ఘనంగా  శంకరారాధ్య మఠం ప్రాంగణమందు,  మఠ, శైవ మహా పీఠం మరియు జంట నగర శాఖ ల  సంయుక్త   సహకారం తో జరుపబడిన నిత్యాన్నవసర సరుకుల పంపీణీ.

2) అదిక సంఖ్యలో హాజరైన బ్రాహ్మణులకు ఈ సరుకుల ప్యాకేజి ని అందించడం జరిగింది. కొంతమంది మహిళామణులు కూడా పాల్గొని ప్యాకేజి ని స్వీకరిండం జరిగింది.

3) అనంతరము ఆర్థిక సహాయము చేసిన దాతలందరికీ  ధన్యవాదాలు తెలియపరుస్తూ, వారందరికీ, వారి కుటుంబాలకూ శాంతి, సంతోష సౌఖ్యాలను ప్రసాదించమని శంకరాచార్యులవారి ని వేడుకోవడం తో కార్యక్రమం పరిపుష్టి  పొందింది.

ఇట్లు.
- - - ములుగు పవన్ కమార్, యస్.పి. బద్రీ రావు మరియు ముదగొండ వీరేష్.

























Saturday, May 30, 2020

* 🙏🙏Today In cordination with Sri . Sankararadhaya Matam,Sri Saiva Mahapeetham and Sri Saiva Mahamapeetam Jantanagar Sakha*
 distributed 75 kits of Groceries to the  poor & needy Brahmins at Sri Kasi Viswaeswaraalayam, Nagole,
Our General Secretary Sri Mudigonda Chandrasekhar garu & Sri Attaluri Gangadhar Rao garu graced the groceries distribution.

M Pavan Kumar - 9246358204
SP Badri - 95023 59124
Mudigonda Veeresh - 92461 09664








Friday, May 29, 2020

🌹🌹🌹శివలీలలు 🌹🌹🌹
🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
శివుడు జననమరణాలుకు అతీతుడు.కాలతీతుడు అనగ కాలమునకు వశము కానివాడు. అందుకే సదాశివుడు అంటాము. అంతయు శివుడే అందుకే అందరు దేవ తలు శివారాధకులే.విష్ణువు, బ్రహ్మ, ఇతర దేవతలు సదా శివలింగారాధన చేస్తుంటారు.పరమశివుడు అనగా అంతటా ఉండేవాడు. శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనటం అసంభవం. అది విష్ణువు, బ్రహ్మ లకు కూడా అసంభవం.అందుకే పరమశివుడు అంటారు.

మరొక ఇతిహాసములో.. "బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులగు త్రిమూర్తులకు జన్మనిచ్చిందిఆదిపరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరీదేవి. అప్పుడు రాజరాజేశ్వరీ దేవికి మూడవ నేత్రం ఉండేది. అనంతరం, తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహమాడవలసిందిగా కోరింది. మొదట ముగ్గురూ నిరాకరించారు. ఆమె నచ్చచెప్పిన పిమ్మట, శివుడు తనని వివాహమాడేందుకు అంగీకరించి, ఒక షరతు పెట్టాడు. అది, తనను (ఆది పరాశక్తిని) వివాహమాడిన అనంతరం మూడవ నేత్రం శివునికి ఇవ్వాలి. అందుకు ఆ దేవత అంగీకరించి, వివాహానంతరం శివునికి మూడవ నేత్రమును ఇచ్చింది. అప్పుడు శివుడు ఆ మూడవ నేత్రముతో ఆ దేవతను భస్మం చేసి, ఆ భస్మరాశిని మూడు భాగాలుగా విభజించి, లక్ష్మి, సరస్వతి, పార్వతిలను సృష్టించారు .

కాశీనాధుని సుబ్రహ్మణ్యం
గాంధీనగర్, విజయవాడ.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Wednesday, May 27, 2020

❤🔱వల్లీ,దేవసేనా,సమేత సుబ్రహ్మణ్యస్వామి స్వరూపంలో అంతరార్ధం...........!!🔱❤

వల్లీ అనే మాటకి తీగ, లత అని అర్ధం.

 తీగ అల్లుకొని   అలా పైకి వెడుతుంది క్రిందనే అలా ఉండిపోతే లాభంలేదు.

 దానికో కొయ్యకావాలి ఆ కొయ్యని అల్లుకొని తీగ పైకి వెడుతూ ఉంటుంది.

 పురాణాన్ని పరిశీలిస్తే సుబ్రహ్మణుడు చెట్టుగా మారిన ఘట్టం కూడా ఉంది.

 లతా-వృక్షములు సాధారణంగా భార్యభర్తలుగా చెప్పబడతాయి.

ఒక తీగ చెట్టుకి అల్లుకున్నట్టుగా సుబ్రహ్మణ్యుడిని అల్లుకుంటుంది.

పురాణాలలో సంకేతవాదాలు, ప్రతీకవాదాలు ఉంటాయి..

 క్రిందన తీగ(అనగా మనలో  కుoడలిని) చుట్టలు చుట్టుకొని ఉంటే లాభం లేదు.

ఆ తీగ పైకి పాకాలి.

 మూలాధారం నుంచి సుషుమ్న అనబడే వెన్ను కొయ్యని అల్లుకొని పైకి పాకుతున్న శక్తిలతే వల్లీ.

 కుండలినీ శక్తి అనబడే ప్రాణశక్తి చేత అల్లుకోబడిన ఆత్మస్వరూపుడే సుబ్రహ్మణ్యుడు.

వల్లీ అనగా కుండలినీ శక్తి.

ఇంక దేవసేన:
యోగభాషలో, శాస్త్రభాషలో దేవతలంటే మన ఇంద్రియశక్తులు.

 ఇంద్రియాధిదేవతలు.

మన పురాకృత సుకృతం బట్టి ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఇంద్రియంలో కూర్చుంటుంది.

 దానితో మనం మంచి పని చేస్తే అక్కడి దేవత శభాష్ అంటుంది.

 చెడ్డపని చేస్తే ఛీఛీ అని తిడుతుంది.

అవి శభాష్ అంటే పుణ్యాలై, ఛీఛీ అంటే దోషాలై మనకి లభిస్తాయి.

మనం చేసే పనులు ఏ  ఇంద్రియంతో చేస్తామో ఆ ఇంద్రియశక్తే పరీక్షిస్తూ ఉంటుంది.

అవి శక్తిని ఇచ్చి సాక్షిగానే చూస్తూ ఉంటాయి.

నేత్రాలకి సూర్యుడు, చేతికి ఇంద్రుడు, ఇలా ఒక్కొక్కదానికి ఇంద్రియాధిదేవతలు ఉంటారు.

 ఇన్ని దేవతలు శక్తులు మనలో ఉన్నాయి.

ఒక సేనాపతి సేనలతో వెళ్ళి యుద్ధం ఎలా చేస్తాడో మన శరీరంలో "నేను" అనేవాడు కూడా ఇంత సేన లేకపోతే వాడు పనిచేయలేడు.

కనుక మన ఇంద్రియశక్తులే దేవసేనలు.

వీటినన్నిటికి కలిపి ఒక నాయకుడులా నడిపించేవాడే మనలో "అహంరూపచైతన్యం", ఒకటున్నది.

 అదే దీన్ని చూడు, దాన్ని విను అని ఇంద్రియాలకి చెప్తోంది.

మనలో ఉన్న ఆత్మచైతన్యమే ఇంద్రియరూపదేవసేనలని నడుపుతోంది.

 కనుక ఇంద్రియరూప
దేవసేనలకి పతియై

 కుండలినీరూప వల్లీశక్తితో అల్లుకొని

 మనలో ఉన్న పరమాత్మ చైతన్యమే వల్లీదేవసేనాసమేత సుబ్రహ్మణ్యస్వామి.❤By I Umashankar 

Monday, May 25, 2020

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


శివలింగం యొక్క ఆథ్యాత్మిక రహస్యము!

శివుని లింగాకారం పైన మూడు విభూతిరేఖలను దిద్దుతారు వాటి యొక్క రహస్యము.

1. మొదటిది బ్రహ్మ కి గుర్తు
2. రెండవది విష్ణువు కి గుర్తు
3. మూడవది శంకరుడు కి గుర్తు

మద్యలో గంధాన్ని బిందువుగా పెడతారు, అది పరమాత్మని యొక్క స్మృతి చిహ్నమునకు గుర్తు అదే పరమాత్మని యొక్క యథార్థ స్వరూపం.

1. పరమాత్ముని నామం సదా శివ,

2. సదా శివ అంటే
సదా - ఎల్లప్పుడూ , శివ అనగా కళ్యాణకారి " మంగళకారి " మరియు "శుభకారి"

3. పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడైన చైతన్య మూర్తి ఇతనికి స్థూల సూక్ష్మ స్వరూపములు రెండూ లేవు.

4. పరమాత్మ బ్రహ్మా-విష్ణు-శంకరుల సూక్ష్మలోకాలకు పైన బ్రహ్మలోకంలో (ముక్తిధామంలో) ఉంటారు.

5. పరమాత్మ త్రిమూర్తి, అనగా బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడ సృష్టించినవాడు.

6. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా సృష్టి స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుని ద్వారా మహావినాశనము,
ఈ ముగ్గురు చేత మూడు కర్తవ్యాలను చేయించువాడు పరమాత్మడు అందుకే ఇంగ్లీష్ లో GOD అంటారు.

7. లింగం శబ్ధము లీనము అనగా వస్తువును తెలియపరచు చిహ్నమని మరియు లక్షణములు చూపించేది అని
అర్థము. పరమాత్మ లక్షణములు చూపించేది కావున శివలింగం అని అంటారు .

8. ఓం నమః శివాయ అంటే
ఓం - నేను ఆత్మను
నమః - నమస్కారం
శివాయ -పరమాత్మడు
ఆత్మనైనా నేను పరమాత్మకి నమస్కారం చేస్తున్నాను అని అర్ధం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉Forwarded by Subrahmanyam m

Sunday, May 24, 2020

* 🙏🙏Today In cordination with Sri . Sankararadhaya Matam,Sri Saiva Mahapeetham and Sri Saiva Mahamapeetam Jantanagar Sakha*
 distributed the Groceries to the  poor & needy Brahmins at Sri Kasi Viswaeswaraalayam, Nagole,
 Nearly 200 kits  of (5 Kg rice, 1 Kg Toor Dal, 1 Kg Atta, 1 Kg Sugar, Chilli powder & Salt) distributed.
**** Sponsorer  Sivasri Sivalenka Sridhar garu along with his family members,  Sri Mudigonda Chandrasekhar garu & Sri MVM Rao garu graced the groceries distribution.

M Pavan Kumar - 9246358204
SP Badri - 95023 59124
Mudigonda Veeresh - 92461 09664





Thursday, May 21, 2020

_*నేడు మాస శివరాత్రి ? ఎందుకు జరుపుకోవాలి? ఎలా జరుపుకోవాలి? వలన ఉపయోగములు*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

1. మాస శివరాత్రిని ఎప్పుడు జరుపుకోవాలి
ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిధిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు.
అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం.
శివుని జన్మ తిధిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి

*2. మాస శివరాత్రి  ఎందుకు జరుపుకోవాలి?*
మహాశివుడు లయ కారకుడు.  కనీనికా నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము లయానికి (మృత్యువునకు) కారకుడు  కేతువు, అమావాస్య  ముందు వచ్చే చతుర్ధసి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు.

*చంద్రోమా మనస్సో జాతః*

అనే సిద్దాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూయించడము వలన జీర్ణ శక్తి మందగిస్తుంది. తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది. తద్వారా ఆయా జీవులు ఈ సమయంలో మానసికముగా సమయమును కోల్పోవడమో, చంచల స్వభావులుగా మారడమో, మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో  తమకే కాకుండా తమ సమీపములో ఉన్న ప్రజల యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణము లకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు.

అందుకే మనం గమనించవచ్చు .., అమావాస్య తిధి ముందు ఘడియాలలో కొందరి అనారోగ్యం మందగించండం లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించదానికి కారణము ఇదే అని చెప్పవచ్చు.
కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉన్నది.

*3. మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి ?*
ఈ అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చెయ్యాలి. అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 5,11,18,21,56,108 ఇలా ప్రదక్షణములు చేయవచ్చు. అలాగే ఈ రోజు శివాలయములో పూజలో ఉంచిన చెరకు రసమును భక్తులకు పంచినచో వృత్తి అంశములో ఇబ్బందులను ఎదుర్కొనేవారికి అటువంటి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది.

అలాగే ఆరోజు ప్రదోష వేల శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది. ఇవేమీ చేయడానికి అవకాశము లేని వారు, ఆరోగ్యవంతులు, అలాగే గృహములో అశుచి దోషము లేని వారు ఈ రోజు ఉపవాసము ఉండి, మూడు పూటలా చల్లటి నీటితో వీలు అయినంత ఎక్కువ సమయం స్నానం చెయ్యాలి. మంచం మీద కాకుండా నేలపై పవళించాలి.

*4. మాస శివరాత్రిని జరుపుకోవడము వలన ఉపయోగములు ?*
ప్రత్యేకించి ఈ రోజు ను సశాస్త్రీయంగా జరుపుకోవడము వలన వలన మన జాతకములోని క్షీణ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది.
సంతానలేమి సమస్యలు నుండి విముక్తి లభిస్తుంది.
వృత్తి అంశంలో ఉన్న ఆలశ్యాలు, అవరోధాలు అంశంలో మార్పు కల్గుతుంది.
దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి  ఉపశమనం లభిస్తుంది.
ముఖ్యంగా మొండిగా, పెంకిగా, బద్దకంగా, మూర్ఘంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈ రోజు ఉపవాసమును చేయించి దేవాలమునకు వెళ్ళే అలవాటును చేయించగల్గితే వారిలో కాలక్రమము లో ఖశ్చ్హితముగా మార్పు వస్తుందని భావించవచ్చు.
మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
కావున మనం అందరం కూడా ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రిని సశాస్త్రీయంగా జరుపుకోవడము ద్వారా శుభములను పొందుదాం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏