Wednesday, October 30, 2019
Tuesday, October 29, 2019
కార్తిక పురాణం -2 వ భాగం:
కార్తీక పురాణము -- ద్వితీయాధ్యాయం:
అథద్వితీయాధ్యాయ ప్రారంభః
శ్రుణురాజన్ ప్రవక్ష్యామి మహాత్మ్యం కార్తీకస్యచ! కర్మత్రయ కృతాత్పాపాత్ ముచ్యతే శ్రవణాదపి!! ఓ రాజా! కార్తీకమహాత్మ్యమును వినుము. విన్నంతనే మనోవాక్కాయములవలన చేయబడిన పాపమంతయు నశించును. కార్తీకమాసమందు శివప్రీతిగా సోమవార వ్రతమాచరించువాడు కైలాసనివాసియగును. కార్తీకమాసమున సోమవారమందు స్నానముగాని, దానమును గాని, జపమును గాని చేసినయెడల అశ్వమేధయాగముల ఫలమును పొందును. ఇందుకు సందేహములేదు. కార్తీకమాసమందు ఉపవాసము, ఒకపూట భోజనము, రాత్రి భోజనము, ఛాయానక్తభోజనము, స్నానము, తిలదానము, ఈఆరున్నూ ఉపవాస సమానములగునని ఋషులు చెప్పిరి. శక్తిగలవాడు కేవల ఉపవాసము చేయవలెను. అందుకు శక్తిలేనివాడు రాత్రిభోజనమును చేయవలెను. అందుకు శక్తిలేనివాడు చాయానక్తము జేయవలెను. అందు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనముపెట్టి వారితో పగలే భోజనము చేయవలెను. ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట. సాయంకాలము 4 ½ గంటలకు భుజించుట చాయానక్తమగును. మానవులు పైన చెప్పిన ఆరింటిలో దేనినయినను ఆచరించినయెడల యెనిమిది యుగములు నరకమందు కుంభీపాకనరకములోను, రౌరవనరకములోను బాధలనొందుదురు. కార్తీక సోమవారమందు విధవ యధావిధిగా ఉపవాసముచేసి శివుని పూజించినట్లయిన శివలోకమునుబొందును. స్త్రీలుగాని, పురుషులుగాని ఎవరు కార్తీకసోమవారమందు నక్షత్రములను జూచి రాత్రి భోజనము చేయుదురో వారి పాతకములు అగ్నియందుంచబడిన దూదివలె నశించును. కార్తీకసోమవారమందు శివలింగమునకు అభిషేకమును, పూజయుచేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడగును. ఈవిషయమునందొక కథగలదు. చెప్పెద వినుము. ఇది వినువారికిని చెప్పువారికిని పాపనాశనమగును.
కాశ్మీరదేశమందొక పురోహితుని కూతురు స్వాతంత్ర్యనిష్ఠురియనునొక స్త్రీగలదు. అతి చక్కని రూపముతో మంచి యౌవనముతో గూడియుండి తలదువ్వుకొని అలంకరించుకొని బహుగా మాట్లాడుచూ జారిణియై యుండెడిది. ఈమె దుర్గుణములను జూచి తల్లిదండ్రులును, అత్తమామలును ఆమెను విడిచిరి. ఆమె భర్త సౌరాష్ట్ర దేశశ్థుడు. అతని పేరు మిత్రశర్మ. అతడు వేదవేదాంగ పారంగతుడును, సదాచారవంతుడును, సమస్త భూతములందు దయగలవాడును, అనేక తీర్థముల సేవించినవాడును, అబద్ధమాడనివాడును, నిరంతరము దయగలవాడును భర్త ఇట్టి ఉత్తమగుణములు గలవాడైనప్పటికి ఆదుర్మార్గపు భార్య ఇతనిని నిత్యము కొట్టుచుండెడిది. అట్లు నిత్యము ఆమెచేత దెబ్బలు తినుచును గృహస్థధర్మమందుండు కోరికచేత భార్యను విడువలేక ఆమెతో కష్టపడుచుండెడివాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము, అంగములనగా శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడు వేదవేదాంగ పారగుడనబడును. ఈమిత్రశర్మ భార్యకు కర్కశయనియు నామముగలదు. భర్యయైన మిత్రశర్మయు సంభోగవాంఛచేత ఆమెయందు రాగముతోనుండెను. అంతనొకనాడు ఆమె రంకుమొగుడు ద్రవ్యములను నగలను వస్త్రములును తృప్తిగా ఇచ్చి నిరంతరము నీభర్తవల్ల భంగము గలుగుచున్నది గాన నీభర్తను చంపుమని చెప్పగా ఆమె సమ్మతించి రాత్రి భర్త నిద్రించగానే తానులేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను. ఆ దెబ్బతో అతడు మృతినొందెను. తరువాత కర్కశస్వయముగా తన భత శవము వీపుమీద వేసుకొని తీసుకొనిపోయి పాడునూతిలో పడవేసెను. ఇట్లు భర్తను చంపి తరుణులును పరస్త్రీ సంగమాభిలాషులును, కామశాస్త్ర ప్రవీణులును, వర్ణ సంకరకారకులును, అయిన అనేకజాతి పురుషులతో ఆలింగన చుంబనాదులతో నిత్యము సంభోగముచేయుచుండెడిది. ఇంతేగాదు. భర్తయందనురాగముతో గూడియున్న భార్యలను దుర్బోధలచేత ఇతరులతో సంభోగము చేయించుచు ఏకపత్నీ వ్రతపరాయణులను భంగపరచి వారితో సంభోగించుచు నిత్యము పరనిందచేయుచు పరద్వేషము కలదై దేవతాద్వేషి అయియుండెను. నిరంతరము దయాశూన్యయై ఆడంబరము చేతగాని, నవ్వుచేతగాని, కపటముచేతగాని, విష్ణు పాదారవిందమును ధ్యానించలేదు. హరికథను విననూలేదు. ఇటుండగానే ఆమెకు యౌవనము పోయి ముసలితనము వచ్చినది. తరువాత వ్రణ వ్యాధి కలిగినది. ఆ కురుపునకు పురుగులు జనించి తరువాత దుర్గంధముతో కూడినదయ్యెను. తరువాత జారులందరు రూపవంతులు మదయుక్తులైవచ్చి చూచి విగతాశులై వేశ్య ఇంటికి వచ్చుట మానివేసిరి. తరువాత పాపాధిక్యముచేత చాలా బాధనొంది ఆవ్రణవ్యాధితోడనే మృతినొందెను. తరువాత భయంకరులయిన యమదూతలు వచ్చి ఆకర్కశను పాశములచేత కట్టి యమునికడకు తీసుకొని పోయి యమునికి అప్పగించిరి. యముడు దానిని చూచి కోపముచేత కళ్ళెర్రజేసి దీనిని భయంకరమగు ముళ్ళతో గూడినదియు, ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి మండుచుండగా ఆలింగనము చేయించుడని కఠినమైన శిక్షను విధించెను. అంత యమాజ్ఞ మీద భటులు ఆకర్కశను చేసిన పాపములను జెప్పుచు ఆవేడి స్తంభమును సంభోగించుమనిరి. ఆమె పాదములు రెండు పట్టుకొని గిరగిర త్రిప్పి రాతిమీద కొట్టిరి. రక్తమును కాచి త్రాగించిరి. సీసమును కాచి రెండుచెవులలోను పోసిరి. యమకింకరులు యమాజ్ఞ చిత్రగుప్తాజ్ఞలచే అనేక నరక బాధలకు గురిచేసిరి. ఆకర్కశ ఇట్లు తన పితృ పతామహులతోను, తన బాంధవులతో తనకు పూర్వము పదితరములు తరువాత పదితరముల వారితో ఘోరములందు నరకములందు మహాబాధలుపొంది తరువాత భూమియందు జన్మించెను. భూమియందు పదిహేనుమార్లు కుక్కగ జన్మించినది. అందులో పదిహేనవ జన్మ కళింగదేశమందు బ్రాహ్మణుని ఇంటివద్ద కుక్కగా పుట్టి యింటింటికి తిరుగుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీకమాసమందు సోమవారము దినంబున పగలంతయి ఉపవాసముచేసి గృహమునందు శివలింగాభిషేక పూజాదులను జేసి నక్షత్రమండలమును జూచి గృహమునకు బోయి దేవ నివేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకువచ్చి భూమిమీద బలిని ఉంచి కాళ్ళు కడుగుకొని ఆచమనము చేసి తిరిగి యింటిలోనికి వెళ్ళెను. ఆకుక్క ఆనాడు పగలంతయి ఆహారము కొద్దియైనను దొరకనందున కృశించినదై కార్తీకసోమవారము రాత్రి విప్రుడువేసిన బలిని భక్షించెను. ఆబలిభోజనముచేత కుక్కకు పూర్వజాతిస్మృతిగలిగి బ్రాహ్మణోత్తమా! రక్షింపుము. రక్షింపుమని పలికెను. ఆమాటవిని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో గూడినవాడై ఓ శునకమా! మాఇంటిలో ఏమేమిచేసితివి. రక్షింపుమనుచున్నావు అని యడిగెను. కుక్క ఇట్లనెను. బ్రాహ్మణోత్తమా! వినుము. నేను పూర్వజన్మమందు బ్రాహ్మణస్త్రీని. పాపములను చేయుదానను. వర్ణసంకరము చేసినదానను. అన్యపురుషులను మరగి నిజభర్తను చంపితిని. ఈవిధిపాపములు అనేకములు చేసి చచ్చియమలోకమునకు పోయి అచ్చట అనేక బాధలనొంది తిరిగి భూమికి వచ్చి 15మార్లు కుక్కగా జన్మించితిని. చివరికి ఇప్పుడు నాకీ జాతిస్మరణ కలిగినది. ఎట్లు కలిగినదో చెప్పుము. విని తరించెదను. ఆబ్రాహ్మణోత్తముడీమాట విని జ్ఞానదృష్టితో చూచి తెలిసికొని యిట్లనియె. ఓ శునకమా! ఈకార్తీక సోమవారమునాడు ప్రదోషసమయము వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి గనుక నీకు జాతిస్మృతి గలిగినది. ఆమాటవిని కుక్క బ్రాహ్మణోత్తమా! ఈకుక్కజాతి నుండి నాకెట్లు మోక్షముగలుగునో చెప్పుమని విప్రుని అడిగెను. ఆకుక్క యిట్లు ప్రార్థించగా పరూపకార బుద్ధితో కార్తీకసోమవారములందు తానుజేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యమును కుక్కకు ధారపోసెను. బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఈయగానే కుక్క దేహమును విడిచి ప్రకాశించుచున్న శరీరముగలదై ప్రకాశించెడి వస్త్రములను మాల్యములను, ధరించి ఆభరణాలంకృతయై తన పితరులతోగూడ కైలాసానికిబోయి అచ్చట పార్వతీదేవివలె శివునితోగూడ ఆనందించుచుండెను. కాబట్టి కార్తీకమాసమందు సోమవారవ్రతము ఆచరించదగినది. ఎవరు కార్తీక సోమవార వ్రతమును జేయుదురో వారికి మోక్షము హస్తమందుండును. కాబట్టి ఓ జనకమహారాజా! పుణ్యప్రదమైన కార్తీకవ్రతమును నీవు చేయుము.
ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ద్వితీయోsధ్యాయస్సమాప్తః

*ఆకాశదీప మహాత్మ్యం*
*కార్తికమాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. నిజానికి ఏవి ఆకాశదీపాలు. మీరు నేను పెట్టక్కరలేదు. ఆకాశదీపాలు వెలిగించినవాడు పరమేశ్వరుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవీ ఆకాశదీపాలు. మరి కార్తికమాసం ప్రారంభం దేంతో మొదలు? ఆకాశదీపంతో ప్రారంభం. ఆకాశదీపం ఎక్కడ వెలిగిస్తారు? దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజ స్తంభానికి తాడుకట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి, గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా శమంతకంగా భగవంతుని నామాలు చెపుతూ, భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా, ఆ దీపాన్ని పైకెత్తుతారు. ఎవరి శక్తి కొలదీ వాళ్లు తగినట్లుగా వారు కార్తిక మాసంలో భక్తులు ఆకాశదీపానికి చమురో, వత్తులో ఇస్తూ ఉంటారు. ఆ దీపాన్ని పైకెత్తుతారు ఎందుకని? ఆ దీపం ధ్వజస్తభంం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే, పతాకాన్ని ఆరోహణ చేశారు అంటే ఈశ్వరునికి ఉత్సవం అవుతుందని గుర్తు.*
*ఇంకా కార్తికమాసంలో మనమే ఉత్సవం చేస్తున్నాం. మనకి మనం ఉత్సవం. ఉత్ అంటే తలపైకెత్తడం, తల పైకెత్తి చూశాడు కాబట్టి ఉత్సవం. ఏమిటి తల పైకెత్తి చూడ్డం? నాకు ఉన్న గౌరవం ఏమిటి? ఈ శరీరంలో ఉంటూ నేను చేయగలిగిన అధికారం ఏమిటి? సమస్త భూతాలకు నేను మహోపకారం చేయగలను కార్తికపౌర్ణమి నాడు. ఇతర ప్రాణులు చేయలేవు. నేనే చేయగలను. ఏమిటి చేయగలను? దీపం తీసుకెళ్లి ఓ గదిలో పెట్టాననుకోండి కొంత ఫలితం. వీధిలోకి తీసుకువచ్చి దీపం పెట్టాననుకోండి విశేషఫలితం. అందుకే గుత్తు దీపాలని పెడతారు. ఇంతంత వత్తులు వేసి కట్టకట్టి దీపం వెలిగిస్తారు ఆ రోజున. యథార్థానికి శాస్త్రంలో ఏమి చెప్పారంటే ఆ రోజున చెత్త కూడా వెలిగించాలి. వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించేసేయమన్నారు.*
కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. మీ ఇంట దీపం వెలిగించి కార్తిక పౌర్ణమి నాటి ప్రదోషవేళ, *దామోదరమావాహయామి అనిగాని,* *త్రయంబకమావాహయామ అనిగాని* అని, ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఒక శ్లోకం చెప్పాలి:
*కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాః*
*జలేస్థలే... ఫలే ఏ నివసంతి*
*జీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః*
*భవతింత్వ స్వపచాహి విప్రాః*
ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేయాలి. ఇప్పుడు నువ్వు నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. ఒరేయ్ వీడికి నేను మనుష్య శరీరాన్నిస్తే వీడు ఇన్ని భూతాలలో ఉన్న విభూతులను వాడుకున్నాడు. ఇన్నిటిని వాడుకున్నందుకు ఇవాళ వీడు ప్రత్యుపకారం చేశాడు. ఈ ఉపకార బుద్ధి, కృతజ్ఞత ఉన్నవాడు కాబట్టి నా మాట నమ్మి ఉపకారం చేశాడు. కాబట్టి వీడికి నేను మళ్లీ మనుష్యు శరీరం ఇవ్వవచ్చు. ఈ మాట చెప్పినపుడు *కీటాఃపతంగాః మశకాశ్చ వృక్షాః’* ~ కీటకములుంటాయి. చిన్నచిన్న పురుగులు. అవి ఎందుకు పుడతాయంటే దీపంలో పడి చచ్చిపోవటానికి పుడతాయి. వాటివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే నాకేం ఉండదు. బల్లులకుంటుంది. పురుగులను పట్టి తింటాయి. ఇతర భూతములకు ఆహారమై పోతాయి. అధవా వాటి ఆయుర్ధాయం దేనివల్ల నశించిపోతుంది. ఆ దీపం యొక్క జ్యోతి మీద కొంచెంగా పడిపోతాయి. కింద పడిపోయి వాటి రెక్కలు ఊడిపోతాయి.
అటువంటి దీపపు పురుగులు దీపం మీద పడి కాలిపోవడం చచ్చిపోవడమే తప్ప అభ్యున్నతి పొందినది లేదు. ఆ దీపం వల్లనే అని తెలిస్తే కదూ! పైగా దీపంలో ఎక్కువగా పడిపోతే దీపం నిధనమైన పాపం వస్తుంది వాటికి తప్ప, దీపం వల్ల ప్రయోజనం పొందలేదు. అని ఇవాళ ఈశ్వరా నేను ఒక సంకల్పం చెప్తున్నాను, ఈ దీపం దీపం కాదు, ఇది త్రయంబకుడు, ఇది దామోదరుడు, కాబట్టి దీనివల్ల మొదటి ఫలితమెవరికి వెళ్లాలంటే *కీటాఃపతంగాః మశకాశ్చ,*~ కీటకములు: పురుగులు, పతంగాలు, మశకాశ్చ: దోమలు, వృక్షాః అవి యెంతో ఉపకారం చేస్తాయి. కాయలిస్తాయి, పళ్లు ఇస్తాయి. ఆకులిస్తాయి, కొమ్మలిస్తాయి, రెమ్మలిస్తాయి, కలపనిస్తాయి, ఇళ్లు కట్టుకుంటాం. ఇన్ని చేస్తాం. కానీ ఎండలో అది నిలబడి మనకు నీడనిస్తుంది తప్ప దాని జన్మాంతరంలో అది మాత్రం ఎక్కడికీ వెళ్లలేదు. అలాగే ఉండాలి. ఒక ఆవు వచ్చి దాని కొమ్మలు కొరుక్కు తినేస్తున్నా, ఒక ధూర్తుడు వచ్చి కొమ్మ విరిచేస్తున్నా, ఏవో ప్రాణులొచ్చి దాని మీద కెక్కి అలజడి చేసేసేసి, కొమ్మలన్నీ వొంచేస్తున్నా, గొడ్డలి పెట్టి తనను నరికేస్తున్నా, ఒక్క అడుగు ఇలా తీసి, అలా వేయలేని దైన్యం చెట్టుది. అదలాగే నిలబడుతుంది. ఆ చెట్టు ఎలా అభ్యున్నతిని పొందుతుంది. కదలలేనపుడు, కర్మ లేనపుడు, దానికి కర్మాధికారం ఏది? అది సంపాదించుకోలేదు. కాబట్టి ఈశ్వరా! నీ దీపపు వెలుతురు ఆ చెట్టుమీద పడుతోంది. కాబట్టి దామోదరుడి చేయి దానిమీద పడినట్టే! త్రయంబకుని చేయి దానిమీద పడినట్టే! అది అభ్యున్నతిని పొందాలి.
నీటిలో ఉండే చేపలుంటాయి, కప్పలుంటాయి, తాబేళ్లుంటాయి. ఈ దీపపు వెలుతురు నీటిమీద పడినపుడు, నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడితో సరిపోతుందా? ఇది కాదు. జలేస్థలే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగినః వాటికేం తెలియదు. అవేం పుణ్యం చేయలేదు,. కానీ ఈ వెలుతురు వాటిమీద పడిన కారణం చేత ఇక వాటికి జన్మ లేకుండుగాక! అక్కడితో వాటికున్నటువంటి పాప పుణ్యాలన్నీ కూడా నశించిపోవుగాక! అని భవతింత్వ శపచాపవిప్రాః అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలం ప్రాపంచిక కర్మాచరణము మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలం ఉదర పోషణార్థమే బతుకుతున్న భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడిమీద ఈ దీపం యొక్క కాంతి ప్రసరించిన కారణం చేత వాడుకూడా వచ్చే జన్మలో వేదము యొక్క ప్రమాణం తెలుసుకున్న వాడై స్వరంతో వేదాన్ని చదువుకొని వేదాన్ని ప్రచారం చేసి వేదానికి చేతులడ్డుపెట్టి లోకోద్ధరణ చేయగలిగిన నిస్వార్థతపూరితమైన లోకోపకారియైున బ్రాహ్మణుడిగా జన్మించి అభ్యున్నతిని పొందుగాక! కాబట్టి భవంతిత్వం స్వపచాహివిప్రా: ఈ దీపపు కాంతి అంత గొప్పది. కాబట్టి ఈశ్వరా, నీ యందు త్రయంబకుణ్ణి, దామోదరుణ్ణి అవాహన చేసి ఈ దీపపు వెలుతురు నీయందు ప్రసరించేటట్లు చేస్తున్నాను.
అందుకే కార్తిక పౌర్ణమి నాడు అన్ని చోట్లా దీపాలెత్తుతారు. ఇక దీపమెత్తని ప్రదేశముండదు. కార్తిక పౌర్ణమి నాడు సాయంకాలం ఉపన్యాసం చెప్తే ఎవరూ ఉండరు. చెప్పకూడదు. ఎందుకంటే కార్తికపౌర్ణమి అంటే ప్రతీ వాళ్లూ ఇళ్లలో చేసుకోవాలి.
(Forwarded as received )

*_గాయత్రి జపించండి..._
*ఒకసారి పరమాచార్య స్వామివారి దర్శనానికి మద్రాసులోని వన్నియ తెయ్ నంపేట్ నుండి నలభై మంది బ్రాహ్మణులు వచ్చారు. స్వామివారికి నమస్కరించి వారందరినీ బాధిస్తున్న ఒక సమస్య గురించి స్వామివారికి విన్నవించారు. వారు ఉంటున్న ప్రాంతంలో బ్రాహ్మణులు ధైర్యంగా తిరగడానికి సిగ్గుపడుతున్నారని, అక్కడ ఉన్న కొంతమంది నాస్తికవాదులు తమని చూసి గేలి చేస్తున్నారని, కనపడిన ప్రతిసారి వారి శిఖలు, యజ్ఞోపవితాలు, వైష్ణవ ప్రతీకలైన ఊర్ధ్వపుడ్రాలు చూసి చాలా హేళనగా మాట్లాడుతున్నారని స్వామివారితో వాపోయారు.*
*అంతా విన్నవెంటనే స్వామివారు వారిని ఇలా అడిగారు, “మీరందరూ రోజూ గాయత్రి జపం చేస్తున్నారు కదా?” అని. అందరూ మౌనంగా ఉన్నారు. వారి మౌనంలోని సమాధానాన్ని స్వామివారు గ్రహించి, “ఇక రోజూ గాయత్రి జపం చెయ్యడం కొనసాగించండి. అంతా సర్దుకుంటుంది” అని ఆదేశించారు.*
*పరమాచార్య స్వామివారి ఆదేశం అనుసరించి వారు రోజూ గాయత్రి జపం చెయ్యడం మొదలుపెట్టారు. రెండు నెలల్లోనే పరిస్థితి మారిపోయింది. వారు చాలా సంతోషించారు. మహాస్వామి వారిని దర్శించి విషయం అంటా చెప్పారు.*
*మహాస్వామి వారందరితో ఇలా అన్నారు, “మీకు కలిగిన కష్టాలకు కారణం అంతా మీరు గాయత్రి జపాన్ని వదిలేయడమే. గాయత్రి మంత్రం యొక్క శక్తిని అంచనా వెయ్యడం, లెక్కగట్టడం సాధ్యమయ్యే పని కాదు”*
*“మీ సమస్యలన్నిటికీ మూలం మీరు గాయత్రిని వదిలెయ్యడమే”*
*ఇది కేవలం అక్కడున్న బ్రాహ్మణులకు మాత్రమే చెప్పిన విషయం కాదు. శాస్త్రం చెప్పినట్టు మన ధర్మాన్ని మనం తప్పక పాటించినట్లయితే ఎవరూ మనల్ని బాధపెట్టారు. అందరూ అందరిని గౌరవిస్తారు.*
*అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం*।।🙏🙏
*_కంచిపరమాచార్యవైభవం_*forwaded by DVR KOTESWARA RAO

⚘《《《 బిల్వపత్రాల
విశిష్టత 》》》⚘
☆ ☆ ☆ ☆ ☆
శివపూజకు బిల్వపత్రాలు [మారేడుదళాలు] సర్వశ్రేష్టమైనవి. మారేడువనం కాశీక్షేత్రంతో సమానం ... అని శాస్త్రప్రమాణం. మారేడుదళాలతో శివార్చన చేయడంవల్ల కాశీక్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలం లభిస్తుంది. సాలగ్రామ దానఫలం,శాత అశ్వమేధయాగాలు చేసిన ఫలం, వేయి అన్నదానాలు చేసిన ఫలం, కోటి కన్యాదానాలు చేసిన ఫలం. ఒక బిల్వాదళంతో శివార్చన చేయడం వలన లభిస్తుంది అని "బిల్వాష్టకం''లో చెప్పబడింది. "ఏకబిల్వం శివార్పణం'' అని శివుని అర్చిస్తే, అనేక జన్మల పాపాలు నశిస్తాయి..
బిల్వదళంలోని మూడు ఆకులూ, సత్త్వ, రజ, స్తమోగుణాలకూ, శివుని త్రినేత్రాలకూ, త్రిశూలానికి ప్రతీకలు. ఆ మూడు ఆకులే త్రిమూర్తులు. బిల్వదళం ముందు భాగంలో అమృతం, వెనుక భాగంలో యక్షులు ఉంటారు కనుక. బిల్వదళం ముందు భాగాన్ని శివునకు చూపిస్తూ పూజించాలి. ఒకసారి కోసిన బిల్వదళాలు 15 రోజుల వరకూ పూజార్హతను కలిగి ఉంటాయి. ఆలోపు ఆ బిల్వదళాలు వాడినా దోషం లేదు. కానీ, మూడు దళాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.
ఈశ్వర పూజకు మారేడు దళాలు ఎందుకు?
“ఏకబిల్వం శివార్పణం” అని మారేడు దాళలలతో శివుని పూజిస్తారు.
మూడు దళములు కలసి ఒక్క అండముననే ఉండును కావున, దీనికి బిల్వము అని పేరు వచ్చింది. ఈ మూడు రేకులకు ఆధ్యాత్మికంగా,
“పూజకుడు – పూజ్యము – పూజ”,
“స్తోత్రము – స్తుత్యము – స్తుతి”,
“జ్ఞాత – జ్ఞేయము – జ్ఞానము “
అని అర్థాలు చెప్పు చున్నారు. ఈ విధంగా (3×3) మూడు, మూడును వేర్వేరుగా భావించుటయే త్రిపుటిజ్ఞానము, ఇదియే అజ్ఞానము, వేరువేరుగా కనిపించినను, ఆధారకాండము ఒక్కటే అయినట్లు, “ఓ మహాదేవా!” సృష్టి, స్థితి, లయ కారకుడవైన నీవే “మారేడుదళము” నందు మూడు పత్రములుగా వేరువేరుగా వున్నట్లు తోచుచున్నావు. “పూజకుడవు నీవే, పూజింపబడునది నీవే, పూజాక్రియవు నీవే” – అనే భావంతో అభేదబుద్ధితో పూజించుటయే సరియైన పద్ధతి, మరియు పుణ్యఫల ప్రదము. ఈ విధమైన భావముతో పూజించకుండుటయే అజ్ఞానము మరియు పాపహేతువు. ఈ జ్ఞానరహస్యమును తెలుసుకుని – బిల్వపత్రరూపముతో “త్రిపుటి జ్ఞానమును” నీ పాదములచెంత నేను సమర్పించుచున్నాను. ‘శివోహం – శివోహం ‘ అను మహావాక్య జ్ఞానమును, స్థిరపర్చునదియే బిల్వార్చనయగును.
పవిత్రమగు ఈశ్వర పూజకు ఈ “బిల్వపత్రము” సర్వశ్రేష్ఠమైనది మరియు అతి పవిత్రమైనది. శివార్చన లకు మూడు రేకులతోనున్న పూర్తి బిల్వదళముననే ఉపయోగించవలెను. ఒకసారి కోసిన బిల్వపత్రములు, సుమారు 15 రోజులవరకు పూజార్హత కల్గియుండును. వాడిపోయినను దోషములేదు, కాని మూడురేకులు మాత్రము తప్పనిసరిగా ఉండవలెను.
ఏకబిల్వ పత్రంలోని మూడు రేకులలో ఎడమవైపునది బ్రహ్మ అనియు, కుడీవైపునది విష్ణువనియు, మధ్యనున్నది సదాశివుడనియు, పురాణములలో తెలియుచున్నది.
మరియు బిల్వదళములోని ముందుభాగమునందు అమృతమును, వెనుక భాగమున యక్షులును వుండుటచేత, బిల్వపత్రము యొక్క ముందుభాగమును శివునివైపు వుంచి పూజించాలి.
బిల్వవనము కాశీక్షేత్రముతో సరిసమానమైనది అని శాస్త్రములలో తెలుపుచున్నారు. మారేడుచెట్టు వున్నచోట ఆ చెట్టు క్రింద శివుడు ఉంటాడు.
ఇంటి ఆవరణలో ఈశాన్యభాగమున మారేడు చెట్టు వున్నచో, ఆపదలు తొలగి సర్వైశ్వర్యములు కల్గును. తూర్పున వున్నచో సుఖప్రాప్తి కల్గును, పడమరవైపున వున్నచో సుపుత్రసంతానము కల్గును. దక్షిణవైపున వున్నచో యమబాధలు వుండవు.
శ్లో!! బిల్వానాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం!
అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!
బిల్వపత్రము యొక్క దర్శనంవలన పుణ్యము లభించును, వాటిని స్పృశించుట వలన సర్వపాపములు నశించును. ఒక బిల్వపత్రమును శివునికి భక్తిశ్రధ్ధలతో అర్పించుటవలన, ఘోరాతిఘోరమైన పాపములు సైతము నిర్మూలమగును. ఇట్టి త్రిగుణములు గల బిల్వదళమును నీకు అర్పించుచున్నాను. నన్ను అనుగ్రహింపుము.
బిల్వాష్టకం:
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం
త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః
శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం
అఖండ బిల్వ పత్రేణ పూజితే నందికేశ్వరే
శుద్ధ్యంతి సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పణం
సాలిగ్రామ శిలామేకాం విప్రాణాం జాతు చార్పయేత్
సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం
దంతికోటి సహస్రాణి వాజపేయ శతాని చ
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం
లక్ష్మ్యాస్తనత ఉత్పన్నం మహాదేవస్య చ ప్రియం
బిల్వవృక్షం ప్రయచ్ఛామి ఏకబిల్వం శివార్పణం
దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణం
కాశీక్షేత్రనివాసం చ కాలభైరవదర్శనం
ప్రయాగేమాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం
మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే
అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణం
ఫలశృతి :
బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ. Forwarded by kvg Sarma
సర్వపాప వినిర్ముక్తః శివలోకమవాప్నుయాత్ ||

కార్తీకమాస స్నాన సంకల్పము
ప్రార్థనం:
"నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే" (అనుకుంటూ ఆచమనం చేసి)
సంకల్పం:
దేశకాలౌ సంకీర్త్య గంగావాలుకాభి సప్తర్షి మండల పర్యంతం కృతవారాశేః పౌండరీకాశ్వమేధాది సమస్త క్రతు ఫలావాప్త్యర్థం, ఇహ జన్మని జన్మాంతరేచ బాల్య కౌమార యౌవన వార్థకేషు జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థాషు జ్ఞానతోజ్ఞానతశ్చ, కామతోకామతః, స్వతః ప్రేరణాయా సంభావితానాం సర్వేషాం పాపానా మపనోదనార్థం, ధర్మార్థకామ మోక్ష చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం, క్షేమస్థయిర్య విజయాయురారోగ్యైశ్వర్యాదినాం ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం శ్రీ శివకేశవానుగ్రహ సిద్ధ్యర్థం వర్షేవర్షే ప్రయుక్త కార్తీకమాసే.....వాసరయుక్తాయాం........తిధౌ.........శ్రీ........గోత్రాభిజాతం........నామధేయోహం పవిత్ర కార్తీక ప్రాతఃస్నానం కరిష్యే.
మంత్రం:
తులారాశింగతే సూర్యే, గంగా త్రైలోక్యపావనీ |
సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణా భవేత్తదా ||
అనే మంత్రంతో ప్రవాహానికి ఎదురుగానూ, వాలుగానూ, తీరానికి పరాంగ్ముఖంగానూ స్నానం ఆచరించి, కుడిచేతి బొటనవ్రేలితో నీటిని ఆచమనంచేసి, 3 దోసిళ్ల నీళ్లు తీరానికి జల్లి, తీరంచేరి, కట్టుబట్టలకొనలను నీరు కారేలా పిండాలి. దీనినే యక్షతర్పణం అంటారు. అనంతరం మడి వస్త్రాలను, నామాలనూ ధరించి ఎవరెవరి కులాచారాల రిత్యా సంధ్యావందన గాయత్ర్యాదులను నెరవేర్చుకుని నదీతీరంలో గాని, ఆలయానికి వెళ్లిగాని శివవిష్ణువులను అర్చించి, ఆవునేతితో దీపారాధనం చేసి, అనంతరం స్త్రీలు తులసి మొక్కనూ, దీపాన్ని - పురుషులు కాయలున్న ఉసిరికొమ్మనూ, దీపాన్ని బ్రాహ్మణులకు దక్షిణయుతంగా దానం చేయాలి.
దానము చేయువారు చెప్పవలసిన మంత్రము
ఓం ఇదం, ఏతద్ ఓమితిచిత్తనిరోధస్స్యాత్ ఏతదితి కర్మణి ఇదమితి కృత్యమిత్యర్ధాత్ అముకం ......గోత్ర, ....నామధేయః దాతృ సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాదిక సమస్త దుష్ఫలవినాశార్ధం ఇదం అముకం దానం ఇదమితి దృష్ట్యాన అముకమితి వస్తు నిర్దేశాదిత్యాదయః పరిహృహ్ణామి స్వీగృహ్ణామి దానమును తీసికొనవలయును.
దానము తీసుకొనువారు చెప్పవలసిన మంత్రం
ఓం ఇదం, ఏతద్ ఓమితిచిత్తనిరోధస్స్యాత్ ఏతదితి కర్మణి ఇదమితి కృత్యమిత్యర్ధాత్ అముకం ......గోత్ర, ....నామధేయః దాతృ సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాదిక సమస్త దుష్ఫలవినాశార్ధం ఇదం అముకం దానం ఇదమితి దృష్ట్యాన అముకమితి వస్తు నిర్దేశాదిత్యాదయః పరిహృహ్ణామి స్వీగృహ్ణామి దానమును తీసికొనవలయును.Forwarded by kvg Sarma

*పరోక్షజ్ఞానం.....*
లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన.. ఈ మూడింటి వల్లనే వేదాంత శాస్త్రాల్లో చెప్పిన విధంగా అపరోక్ష జ్ఞానం కలుగదు.
జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం. ఇది పరోక్షజ్ఞానం. ఈ పరోక్షజ్ఞానమే అపరోక్ష జ్ఞానం కావాలి. అనుభవజ్ఞానం కావాలి. అదే మోక్షం. అయితే దీనికి అడ్డుపడేవే వాసనలు. అవే..
1) లోకవాసన
2) దేహవాసన
3) శాస్త్రవాసన.
మోక్షాన్ని పొందాలంటే అపరోక్ష జ్ఞానాన్ని పొందాలంటే ముందు పరోక్ష జ్ఞానాన్ని పొందాలి. అలా పొందాలంటే శాస్త్రాలను అధ్యయనం చేయాలి. అవి చక్కగా అర్థం కావాలంటే శాస్త్రజ్ఞానం, అనుభవజ్ఞానం కలిగిన ఒక సద్గురువును ఆశ్రయించాలి.
అప్పటిదాకా సాధారణంగా అందరికీ 'నేను ఈ దేహాన్నే' అనే భ్రమ ఉంటుంది. అది పోవాలి. నేను ఈ దేహాన్ని కాదు. దేహమనోబుద్ధులతో కూడిన ఈ క్షేత్రాన్ని కాదు. ఈ క్షేత్రాన్ని తెలుసుకొనే ఈ క్షేత్రానికి చైతన్యానిచ్చి, దాని పని అది చేసుకోవటానికి వీలు కల్పించే నిరాకార, నిర్గుణ, నిర్వికార, చైతన్యాన్ని, చావు పుట్టుకలు లేని, శాశ్వత సర్వవ్యాపక చైతన్యాన్ని అని దృఢంగా భావన కలగాలి. సంశయ రహితంగా ఈ దృఢభావన కలగటమే ఆత్మజ్ఞానం, ఇదే.. పరోక్షజ్ఞానం.
ఇట్టి భావన కలగటానికి శాస్త్రజ్ఞానమూ కావాలి. దేహేంద్రియాల పోషణా జరగాలి. అవసరమైనంత వరకు ఈ లోకాన్ని అనుసరిస్తూ కూడా రావాలి. అయితే ఒకసారి ఈ జ్ఞానం కలిగిన తర్వాత అది అనుభవానికి రావాలంటే అనుభూతి కలగాలంటే, నేను బ్రహ్మమును అనే భావన స్థిరపడి బ్రహ్మముగానే ఉండిపోవాలంటే.. ఈ లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన ఉండరాదు. ఇవే నిజంగా మనకు అడ్డమౌతాయి.
లోకంలోని జనులంతా పుట్టిన దగ్గర నుండి చచ్చేదాకా ఉండే ఈ జీవితాన్ని గురించి ఆలోచిస్తారే గాని, ఇంతవరకు ఎన్ని జన్మలెత్తాము.. ఇంకా ఎన్ని జన్మలెత్తాలి.. జన్మలెందుకు వస్తున్నాయి? జన్మలొస్తే నష్టం ఏమిటి.. రాకుండా చెయ్యాలంటే ఈ జన్మలో ఏంచేయాలి? అని ఆలోచించరు. నిజంగా జంతువులు ఇలాంటి ఆలోచన చేయలేవు. ఎందుకంటే వాటికసలు బుద్ధే లేదు గనుక. మానవులకు బుద్ధి ఉంది గదా! మరి వారెందుకు చేయరు.. అంటే వారు బుద్ధిని దీనికోసం ఉపయోగించరు.
అలా ఉపయోగించకుండా దానిని దేహపోషణ, భార్యాబిడ్డల పోషణ, ధనసంపాదన, కీర్తిప్రతిష్టలు సంపాదన, భోగాల సంపాదన, వీటిలో పడిపోయి పూర్తిగా వీటికే జీవితాన్ని అంకితం చేస్తారు బుద్ధిని దీనికే ఉపయోగిస్తారు. అంటే భగవంతుడు ఒకందుకు ఇచ్చిన బుద్ధిని దాని కొరకు ఉపయోగించకుండా మరొకందుకు ఉపయోగిస్తున్నారు. అంటే వ్యర్థం చేస్తున్నారు. దుర్వినియోగం చేస్తున్నారు. మరి అట్టివారిని అనుసరించవచ్చునా.. అయ్యో అనుసరించ లేకపోతున్నామే అని బాధపడవచ్చునా... కనుక లోకం ఏమనుకుంటుందో, ఎవరు ఏమనుకుంటారో ...
అయ్యో! ఇది లోకవిరుద్ధం కదా! అందరూ అలా సంపాదించుకుంటుంటే మనమేమిటి అన్ని వ్యవహారాలు వదిలేస్తున్నాం.. అందరూ ఇంకొక ఇల్లు, మరొక ఇల్లు, మా పెద్దోడికొక ఇల్లు, మా బుజ్జిగాడికొక ఇల్లు, మా వృద్ధాప్యంలో విస్రమించి సయనించటానికి తీసుకోవటానికొక ఇల్లు అని ఇలా కట్టించుకొని మురిసిపోతుంటే, ఉన్న ఇల్లునే వదిలేస్తున్నామేంటి.. అనే పిచ్చి ఆలోచనలు చెయ్యకూడదు. భాద్యతలు బరువులు, బంధాలు పెంచుకుంటూ పోయి బంధంలో ఇరుక్కుపోగూడదు...
Forwarded by Surendra pss
Subscribe to:
Posts (Atom)