Saturday, August 3, 2019

మంచి కోరువాడపరిచితుడైనను/
బంధువగును ముదము పంచు మనకు/
మనల గూల్చు చుట్టమైన పరాయియే/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏
కష్టబడెడువారె పుష్టిగాయుందురు/
ఒడలు వంగెనేని యుసులు చిక్కు/
కాయకంబె యగును కైలాసమందురు/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏
శ్రీ పరమాచార్యులు ఉపదేశించిన మంత్రం

ఆఫీసులో పని చేస్తున్న ఒక మహిళ పరమాచార్యులను దర్శించడం కొఱకు వచ్చింది. నేటి రోజుల్లో మహిళకు లోలోపల భక్తి ఉన్నప్పటికీ నిత్య విధులనూ, స్తోత్ర పఠనాదులనూ పద్ధతిగా నేర్చుకొని అనుష్ఠించడానికి వీలుగాలేదు అన్న తాపం ఆమెను దహించి వేస్తుoడేది.

పరమాచార్యుల మనసు కరిగే విధంగా ఈ విధంగా వేడుకొన్నది: “నేను పనికి వెళుతున్నాను. విరామ కాలం చాలా తక్కువగా వుంటున్నది. అంతేకాక మడి, ఆచారం అంటూ కఠినమైన నియమాలను ఆచరించడానికి వీలుగావడం లేదు. పొడవైన స్తోత్రాలు, పారాయణాలు చేయడానికి వీలుపడటం లేదు. కానీ, యేదో ఒక సులభమైన మంత్రజపం చేయాలన్న తీవ్రమైన కోరిక వుంటున్నది. మీరు అనుగ్రహించాలి.”

వెంటనే కరుణామూర్తియైన పరమాచార్యులు, ఆ మహిళయొక్క అంతర్భావనను, చింతనను అర్థం చేసుకొని, “చెప్పు” అని అన్నారు.

“హరి నారాయణ దురిత నివారణ
పరమానంద సదాశివ శంకర”

ఉపదేశాన్ని పొందిన ఆ మహిళామణి, మనసులో సంతోషం ఉప్పొంగుతుండగా పరమాచార్యులకు నమస్కరించింది.

‘ఆచార అనుష్ఠానాలు లేని నీ వంటి దానికి మంత్రోపదేశ మెందుకు?’ అన్న కఠినమైన వాక్కులను యెదురుచూచి వచ్చిన ఆమె, అమూల్యమైన ఉపదేశంచే సంపూర్ణమైన తృప్తిని అనుభవించింది.

కానీ, ఈ మంత్రం ఆమెకు మాత్రమే ఉపదేశించినది కాదు; మనoదరికీ కూడా!

--- వైఖానస కరుప్పూర్ శ్రీనివాస అయ్యర్, కాంచీపురం.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।Forwaded by Subrahmanya Sastry M
⭕శివానందలహరి
శ్లోకం-3

_త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం_
_జటాభారోదారం చలదురగహారం మృగధరం |_
_మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం_
_చిదాలంబం సాంబం శివమతివిడంబం హృదిభజే ||_

*భావం:*

వేదములచేతెలియబడువాడు,మనోహరుడు,త్రిపురాసుర సమ్హారి,ఆది పురుషుడు,
మూడు కన్నులవాడు,గొప్ప జటాజూటము కలవాడు, కదలుచున్న పాము హారముగా ధరించినవాడు,మహాదేవుడు,
నాపై దయకలవాడు, పశుపతి, జ్ఞానమునకు ఆలంబనమైనవాడు, జగదంబతో కలిసినవాడు, అనుకరించుటకు శక్యం కానివాడు అగు దేవుడైన శివుడిని హృదయంలో సేవించుచున్నాను.
■■■Forwaded By MALLIKHARJUN 
నిన్న సిద్దిపేట లో 20వశతాబ్దంలో అవధానసాహిత్య మనే అంశంపై ప్రసంగస్తూ డా ముదిగొండ

G


 2.8.2019 నిన్న సిద్దిపేట లో 20వశతాబ్దంలో అవధానసాహిత్య మనే అంశంపై ప్రసంగస్తూ డా ముదిగొండ అమర్నాథ శర్మ గారు


201 Masasivaratri on 30.7. 2019