Monday, July 22, 2019

రెండు  ఎత్తైన భవనాల మధ్య ఒక తాడు కట్టబడి ఉంది.దాని మీద ఒక వ్యక్తి నడవసాగాడు.వందల అడుగుల ఎత్తున అత్యంత జాగ్రత్తగా అతను నడవ సాగాడు.
చేతిలో పొడవయిన కర్ర ఉంది...
బుజాన అతని కొడుకు ఉన్నాడు.

అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు....
అతను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రెండో భవనం వైపు వచ్చాడు,అందరూ చప్పట్లు కొట్టారు.కేరింతలలో ఆహ్వానం పలికారు...
చేతులు కలిపారు ఫోటో లు తీసుకున్నారు.

నేను ఈ తాడు మీద తిరిగి అవతలికి వెళ్లాలను కుంటున్నాను వెళ్లగలనా? అతను ప్రశ్నించాడు...
వెళ్లగలవు, వెళ్లగలవు జనం సమాదానం.
నా మీద నమ్మకం ఉందా?..ఉంది,ఉంది. మేం పందానికి అయినా సిద్దం!  అయితే మీ లో ఎవరయినా నా భుజం మీద ఎక్కండి, అవతలకి తీసుకు పోతాను!
అక్కడంతా నిశబ్దం..
జనం మాటలు ఆగి పోయాయి...
ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు,
ఉలుకు లేదు, పలుకు లేదు,
నమ్మకం వేరు, విశ్వాసం వేరు.

విశ్వాసానికి సర్వస్వ సమర్పణ భావం కావాలి.ఈరోజుల్లో దైవభక్తిలో మనం కోల్పోతున్నది ఇదే....
దేవుడు అంటే నమ్మకమే ... కానీ విశ్వాసం లేదు..By Spk Prasad 


మిత్రమా....by M Ravishankar

 నీవె దిక్కంచును నిక్కము గెవ్వారు

       నిరతంబు మదిలోన నిన్నె దలచు...

పలుకుఁబల్కుల యందుఁ బలుమారు నీఁబేరు

       తనివార నెవ్వారు తలచుచుండు......‌

కరములారగనిన్ను కరువు దీర నెవరు

       పూజించు నెలమిని బూన్కితోడ...‌.‌‌‌

సర్వకాలములందు శర్వుండె దిక్కంచు

       నమ్మి గొలుచునట్టి నరుడెవండు....

అట్టి నరు పాదధూళియె జాలునింత
పాతకంబుల పోద్రోలు పావకంబు,
నీదు భక్తాళికెల్లను నీవెదిక్కు
భక్త జన హృదయ విహార భవ విదూర
సోమవారం నాడు శివుడిని పూజిస్తే ఋణ బాధలు ( అప్పులు ) వదిలిపోతాయి ...forwaded By S

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా, ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. మనకున్న ఎనిమిది దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు ఆయనే అధిపతి.

ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఉమా అంటే మహేశ్వరితో కూడిన వాడైన పరమేశ్వరుడు. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మనకున్న దారిద్ర్యము, సమస్యలు పోవాలంటే శివుడిని ఈవిధంగా పూజించాలి.

1. సోమవారం ముందుగా తలస్నానం చేయాలి. ఆ తరువాత పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టుపెట్టి దీపారాధన చెయ్యాలి. పూలు సమర్పించుకోవాలి ( తుమ్మి పూలు , మోదుగ పూలు శ్రేష్టమైనవి ). తరువాత శివఅష్టోత్తరం చదువుతూ విభూదిని సమర్పిచి , ఆ విభూతిని నుదిటిన ధరించాలి.సాయంత్రం వరకు ఉపవాసము ( పాలు , పండ్లు వంటివి తీసుకోవచ్చు ) ఉండి , శివాలయానికి వెళ్లి ఆవు నేతితో దీపారాధన చేయాలి .

2. సాయంత్రము పరమశివునికి నైవేధ్యంగా నేతితో తాలింపు వేసిన దద్యోధనం ( పెరుగన్నం ) సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. ముఖ్యంగా దేవునికి పూజ చేసినా, ప్రసాదం పెట్టినా ఏకాగ్రమైన మనసుతో చేయాలి. అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు.

3. మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని మూడు కనులకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది.

4. ఏ పండైనా శివునికి ప్రసాదంగా పెట్టవచ్చు. అయితే శివునికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయిష్షును సూచిస్తుంది. ఈ పండుని స్వామికి సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది.

5. ఉమామహేశ్వరులను వేకువ జామున పూజించడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు.

Sunday, July 21, 2019

 
    





    





  

ఆరాధ్య బంధువులకు నమస్కారము 
మా జంట నగర శాఖ ప్రారంభించి సుమారు పదహారున్నర సంవత్సరములు అయింది. ఈ గడచిన కాలంలో మేము ఆ పరమశివుని అనుగ్రహముతో ,ఎన్నో కార్య క్రమములు విజయ వంతం గా చేసాము. అందులో ముఖ్యం గా మాస శివరాత్రి హోమ కార్యక్రమము ఒకటి. 
 మేము ఇప్పటి వరకు 200 లు మాస శివ రాత్రుల కార్య క్రమములు నిర్విఘ్నంగా నిర్వహించినామ ని తెలియ చేయుటకు గర్వ పడుతున్నాము.
ఈ సంధర్భంగా మేము ఆగస్ట్ 4వ తేదీన విజయోత్సవం ఘనంగా చేసినాము.
మా ఈ కార్యక్రమములో 
1. గత 200 వ మాస శివరాత్రి కార్య క్రమము లలో సుమారు 50 మంది శివ పూజా నిష్ణాతు లైన వారు గురు స్థానంలో ఆశీనులయి పూజలు అందుకొని ఆశీర్వదించారు.వారి ఆ ఆశీర్వాద ఫలమే మమ్మల్ని ,మా కార్య క్రమాఁ లను విజయ పథంలో ఉంచి నది.
అందువలన వారందరినీ గుర్తు పెట్టుకొని , వారికి సన్మానం చేసి నాము.
2.అలాగే మన శైవ పీఠ పూర్వ కార్య దర్శి శివ 
శ్రీ ములుగు హనుమంత రావు గారికి, వారు పీఠానికి చేసిన సేవలకు గాను, 'జీవిత సాఫల్య పురస్కారం' తో సన్మానము చేయ తలచి నా ము.



పై రెండూ కాక
మహిళలచే లలితా సహస్ర నామ పఠ నమూ,



చిన్న పిల్లలచే  సాంస్కృతిక కార్య క్రమములు. 
వి వాహ పరిచయ వేదిక 
వంటి ఎన్నో ఇతర కార్య క్రమములూ.
చివరిగా మన పీఠ థిపతి గారి అనుగ్రహ భాషణ. 
 , ఇతర అతిథుల చే శైవ పరమైన ప్రసంగాలు ఉంటాయి.
ఈ కార్య క్రమము లో పాల్గొనిజయ ప్రదం చేయ వలసినదిగా కోరుచున్నాము.
ఒక ముఖ్య గమనిక 
మన శైవ మహా పీఠం ప్రపంచం లో ఉన్న ఆరాధ్య బంధువుల చిరునామాలు సేకరించి అందరికీ అనువుగా ఉండే విధంగా ఒక Global directory ని తీసుకోని రావాలనే ప్రయత్నం లో ఉన్నారు. ఈ విషయం లో అన్నీ మాధ్య మాల లోనూ ప్రకటించారు. ఎవరైనా వారి, వారి బంధువు ల వివరాలు ఇవ్వ తలచి న చొ ఆ విషయ మై ప్రత్యెక ఏర్పాటు కూడా చేయ తలచినాము. సఁద్వి నియోగము చేసు కొన మనవి.
ఈ కార్య క్రమము 04.08.2019 ఆదివారం శ్రీముదిగొండ శంకరారాఁధ్య మఠం,కవాడిగూడా లో ఉదయం 9.30 నుండీ సాయంత్రమ్ 6.00 వరకు జరుగు తుంది.
అందరూ అధిక సంఖ్య లో పాల్గొని జయ ప్రదం చేయ కోరు చున్నాము 

                                 
        
       












   
💐💐ఈశ్వరారాధనలో స్వామిని అర్ధించవలసిన ఆకాంక్షను ఒక శ్లోకంలో అమర్చి చెప్పారు మహాత్ములు.💐💐by Subrahmanya Sastry M

"అనాయా సేన మరణం వినా దైన్యేన జీవనమ్!
సదా రాజిత తవ నామ స్మరణం,
దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే!!"
ఆయాసం లేకుండా మరణం ,
దైన్యం లేని జీవితం,
ఎల్లప్పుడూ మీ నామ స్మరణం,
దేహం విడిచాక మోక్షం..
ఈ మూడింటినీ ప్రసాదించవలసినదిగా పార్వతీపతిని అర్ధిస్తున్నారు.
మొదటిది....
ముందుగా ముగింపు సుఖంగా జరగాలనే కోరికను వ్యక్తం చేయడం చక్కని ఔచిత్యం. ప్రాణ ప్రయాణ సమయంలో కలిగే శారీరక, మానసిక యాతన మన ఆధీనంలో లేదు. కనుక ఆ సమయంలో ఎటువంటి యాతన ఉండకుండా; భగవత్ స్మరణతో అనాయాసంగా దేహాన్ని విడవడం ఒక వరం.
రెండవది...
బతుకు గడవవలసిన తీరు. ఇది దైన్యం లేకుండా ఉండాలి. దిగులు, ఆధివ్యాదులు లేకుండా, మనసును కుంగదీసే పరిస్థితులు రాకుండా సాఫీగా జీవితం సాగాలనే అందరి కోరిక. అదే దీనిలో ఉంది.
మూడవది...
అంతిమలక్ష్యం,జీవితానికి చివరి గమ్యం మృత్యువు కాదు. మృత్యువు తరువాత జీవుని స్థితి ఏమిటి? చేసిన దుష్కర్మలకు అనుగుణంగా దుర్గతులు తప్పవు. అందుకే మళ్ళీ దుర్గతుల పాలవకుండా, జన్మ పరంపరలకు లోనుకాకుండా పరమేశ్వరునిలో లీనం కావాలని కోరుకోవాలి.
ఆ లక్ష్యం నెరవేరాలంటే జీవితమంతా సద్బుధ్ధితో, సత్కర్మలతో, సద్భక్తితో సాగాలి. అటువంటి జీవితమే దైన్యరహిత జీవితం. నిరంతరం భక్తితో సదాశివుని స్మరించేవారికి , ఆరాధించేవారికి ఈ మూడు కోరికలు నేరవేరతాయనడంలో సందేహం లేదు.....
భోగ భాగ్యముల తులతుాగువేళ/నినుగొలువ మనసురాదు/భక్తియే ముక్తి యను నిజము మనుజుడెపుడెరుగునో/
కాశీపురాధీశ/శ్రీ విశ్వనాథ By M Shekar 112
🌹 *నవగ్రహాలకి ఇష్టం లేని పనులు..!!* 🌹 forwaded by MVMRAO

*అద్దం పుట్టడానికి చంద్రుడు కారణమట.*
*అందుకే అద్దములో దిగంబరముగా చూచుకొనుట, వెక్కిరించుట చేయకూడదు.*

*సర్వ శాస్త్రములు తెలిసిన గురువు బృహస్పతి.* *ఎవరైనా గురువుని కించపరచితే గురుదేవునికి అగ్రహము కలుగుతుందట.*

*బుధుడికి చెవిలో వ్రేలు పెట్టి తిప్పుకుంటే కోపమట. అందునా బుధవారం అస్సలు చేయకూడదట.* *వ్యాపారాన్ని అశ్రద్ధ చేసిన, జ్ఞానం ఉంది అని విర్రవీగిన కోపమట.*

*శనికి పెద్దల్ని కించపరచిన, మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా కోపమట.* *తల్లితండ్రిని చులకన చేసిన కోపమట.*
*సేవక వృత్తి చేసిన, సేవ చేసిన వారిని కాపాడతాడు.*

*పితృ దేవతలని దూషిస్తే రవికి కోపమట.*
*సూర్య దేవునికి ఎదురుగా మల మూత్ర విసర్జన దంతావధానం చేయకూడదట.*

*శుక్రుడికి భార్య/భర్త అగౌరవ పరచుకుంటే కోపమట. లక్ష్మీ దేవి కృప లేకపోతే శుక్ర కృప కష్టమే. అమ్మకి శుచి శుభ్రత లేని ఇళ్లు మనుషులు నచ్చరుట. గొడవలు లేని ఇల్లు ఇష్టము.*

*అప్పు ఎగ్గొడితే కుజుడికి కోపమట.*
*వ్యవసాయ పరంగా మోసం చేస్తే ఊరుకోడట.*

*జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకబడిన, మోక్ష కారకుడు అయిన కేతువుకి పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యములు చేయకపోతే కోపమట.*
*ఈయన జాతకంలో బాగోలేకపోతే పిశాచపీడ కలుగుతుంది.*

*రాహువుకి వైద్య వృత్తి పేరుతో మోసగించినా, సర్పములని ఏమైనా చేసిన ఆయనకి కోపము కలుగునట.*
*ఈయన భ్రమ మాయ కి కారణము..!!*
🌹🌹🌹🌹🌹