Thursday, July 4, 2019

*ప్రవర యొక్క అర్ధం.*

*చతుస్సాగర పర్యంతం*
(మానవ పరిభ్రమణానికి నలువైపులా కల మహాసముద్రాల అంచుల వరకూ)...

*గో బ్రాహ్మణేభ్య శుభం భవతు*(సర్వాబీష్ట ప్రదాయిణి అగు..గోవూ మరియు నిత్యం సంఘహితాన్నే అభిలషించే సద్బ్రాహ్మణుడు అతడి రూపంలో ప్రకాశించే వేదధర్మం.. సర్వే సర్వత్రా దిగ్విజయంగా.. శుభప్రదంగా వర్ధిల్లాలని కోరుకుంటూ)....

*×××××××. ఋషేయ ప్రవరాన్విత..*
(మా వంశమునకూ..మా గోత్రమునకూ మా నిత్యానుష్ట ధర్మశీలతకు మూలపురుషులైన మా ఋషివరేణ్యులకూ..

*త్యాగే నైకే అమృతత్త్వ మానశుః......*
అన్న వారి మహోన్నతమైన త్యాగనిష్ఠకు సాక్షీభూతుడనై..

*×××××× గోత్రః*
(మా గోత్రమునకూ..)

*ఆపస్తంభ సూత్రః కృష్ణ యజుశ్శాఖాధ్యాయీ.....*
(మా శాఖకూ..అందలి శాస్త్ర మర్మంబులకు..)

*శ్రీ* *** *శర్మ నామధేయస్య*
( కేవలం జన్మతహానే కాక.. ఉపనయనాది సంస్కారాలతో.. శాస్త్రపఠనంతో..వేదాధ్యయనాది వైదిక క్రతువులతో..
1. స్నానము
2. సంధ్య
3. జపము
4. హోమము
5. స్వాధ్యాయము
6. దేవ పూజ
7. ఆతిధ్యము
8. వైశ్యదేవము అనబడే అష్టకర్మలనూ క్రమంతప్పక నిర్వహిస్తూ..త్రివిధాగ్నులు...
1.కామాగ్ని
2.క్రోధాగ్ని
3.క్షుద్రాగ్ని..
అనే త్రివిధాగ్నులను అదుపులో(సమస్థితిలో) ఉంచుకొన్న వాడినై..పేరుకు ముందు శ్రీ అనబడే..ప్రకృతి స్వరూపమైన శక్తిస్వరూపాన్ని.. శుభప్రదమైన శ్రీకారాన్ని ధరించిన..

*శ్రీ * *శర్మా* అనబడే సుశ్రోత్రియుడనైన నేను..జన్మప్రధాతలైన జననీజనకులముందు..  జ్ఞానప్రధాతలైన ఆచార్యులముందు.. జ్ఞానస్వరూపమైన వేదముముందు..యావత్ ప్రపంచానికే మార్గదర్శకమైన వేదధర్మము ముందు.. నిరాకార నిర్గుణ అవ్యాజ పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మ ముందు..

*అహంభో అభివాదయే..*
( కేవలం నేనూ అన్నదిలేక.. సర్వం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహ భాగ్యమేయన్న అహంకారభావ రహితుడనై.. నిగర్వినై..త్రికరణ శుద్ధిగా (మనసా,వాచా,కర్మణా) సాష్టాంగ పూర్వక (మానవశరీరంలోని అత్యంత ప్రాధాన్యమైన ఎనిమిది శరీరాంగములనూ శరణాగత హృదయంచే నేలపై వాల్చి సమర్పిస్తున్న)దండ ప్రణామమిదే..అన్న పరిపూర్ణమైన ఆత్మపూర్వక వేదపూర్వక హృదయపూర్వక నమస్కార భావమే.. సశాస్త్రీయమైన ఈ ప్రవరలోని..అర్ధం అంతరార్ధం పరమార్ధం కూడా..
                          స్వస్తి!
Forwarded by I. Umashankar 
అమ్మకిస్తురతివలందరూ బోనాలు/
బీద బిక్కియన్న బెడద లేక,/
ముదితలొక్కటై సమూహముగా జేరి/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏

గోలుకొండలోన గొప్పగా బోనాలు/
తొలకరి తరువాత తొలుత యగును/
అనుసరింతురింక అన్ని ప్రాంతంబులు/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏By Subrahmanyam M

Wednesday, July 3, 2019

తులసి వృక్షం  forwaded by MALLIKHARJUN Rao 

సాధారణంగా ఇళ్లల్లో  తులసి మొక్కలు పెంచుకుంటారు.. అంతవరకే మనకు తెలుసు....కానీ కర్ణాటకలోని చమరజనగర జిల్లాలోని యలందుర్ తాలూకా బిలిగిరిరంగణ అనే ఊరిలో ఈ తులసి వృక్షం ఉన్నది.....

*🌹 రుద్ర నమకము - చమకము - భావము మీకు తెలుసా? 🌹*
 *భాగము 2*

*🌴రుద్రము - నమకము🌴*

*🌻 అనువాకము 1 - 1🌻*

*దీనిలో మొత్తం 15 మంత్రములు కలవు.*

*1వ మంత్రము.*

 *నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః.*
*నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తేనమః.*

*ఓ రుద్రుఁడా! నీ కోపమునకు నమస్కారము. నీ కోపము నా బాహ్యాంతశ్శత్రువులపైన ప్రవర్తించును గాక. (నన్ను బాహ్యాంతశ్సత్రుహీనునిగా చేయుదువు గాక అని భావము) అంతే కాదు. నీ బాణమునకు, ధనుస్సునకు ధనుర్బాణ సహితములైన నీ బాహువులకు ఇదే నా నమస్కారము.*

*2వ మంత్రము.*

 *యాత ఇషుశ్శివతమా శివం బభూవ తే ధనుః.*
*శివాశరవ్యా యాతవతయానో రుద్ర మృడయ.*

*ఓ రుద్రుఁడా! నీ యీ శరము చాలా శాంతమైనదాయెను. నీ ధనుస్సు శాంతమైనదాయెను. నీ యమ్ములపొది శాంతమైనదాయెను. కావున శాంతించిన శరీరము తోడను, అమ్ములపొది తోడను మమ్ములను సుఖపరచుము.*

*3వ మంత్రము.*

*యాతే రుద్ర శివా తనూర ఘోరాపాపకాశినీ.*
*తయాన స్తనువా శంతమయా గిరిశంతాభిచా కశీహి.*

*ఓ రుద్రుఁడా! మమ్ములను అనుగ్రహించు నీ శివ యను శరీరము మా పట్ల అఘోరమై యుండును గాక. ఆ నీశరీరము మా పట్ల హింసారూపమైన అనిష్టమును ప్రకాశింప జేయకుండును గాక.(ఇట పాపమనగా హింసా రూపమగు అనిష్టము) ఓ పరమ శివా నీ శరీరము మమ్ములను స్వయముగా హింసింప కుండుటయే కాదు. పరుల వలన యే అనిష్టము కలుగ నీయక కాపాడ వలయును. మమ్ములనెవరును హింసింపకుండ కాపాడవలెను. మాకేపాపములు అంటనీయక కాపాడవలెను. మాలోనేవేని పాపములు, లోపములు ఉన్నచో తొలగింపుము. వానిని బహిర్గతములు కానీయకుము, అని మేము నిన్ను ప్రార్థించు చున్నాము.*

*4వ మంత్రము.*

*యామిషుం గిరిశంతహస్తే బిభర్ష్యస్తవే*
*శివాం గిరిత్ర తాం కురు మాహిగ్ ంసీః పురుషం జగత్.*

*ఓ గిరిశంత! రుద్ర! వైరులపై చిమ్ముటకు నీవు చేత బాణములను దాల్చితివి. కైలాస గిరిని పాలించు ఓ రుద్రుఁడా! శత్రువులను శిక్షించుటకు చేత దాల్చిన నీ యా బాణమును మాపై చిమ్మక, దానిని శాంతము కలదిగ నుంచుము. పురుషులమగు మమ్ములను, మనుష్య వ్యతిరిక్తమై స్థావర జంగమములతో నిండిన యే జగత్తును హింసింపకుము తండ్రీ! అని ప్రార్థించెను.*

*5వ మంత్రము.*

*శివేనవచసాత్వా గిరిశాచ్ఛావదామసి.*
*యధానస్సర్వమి జ్జగదయక్ష్మగ్ ంసుమనా అసత్.*

*మహా శివా! నీవు కైలాసమున నివసించు చున్నావు. నిన్ను జేరుటకు మంగళకరమైన స్తుతు లొనర్చుచు ప్రార్థించుచున్నాను. మాదగు ఈ సర్వ జగత్తు మనుష్య పశ్వాది జంగమములతో నిండి యున్నది. ఈ జంగమ ప్రపంచము నిరోగమై సౌమనస్య సంపన్నమగులట్లు గావింపుము తండ్రీ!*

*6వ మంత్రము.*

*అధ్యవోచ దధివక్తా ప్రథమోదైవ్యోభిషక్.*
*అహీగ్ శ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః*

*మహాదేవా! మాయందరిలో నీతడే యధికుఁడని నిన్నుద్దేశించి చెప్పుటచే నీవే అధివక్తవైతివి. దేవతలలో నీవే ప్రథముఁడవు, ముఖ్యుఁడవు కదా! నీవు దైవ్యుఁడవు(దేవతలనెల్లస్వయముగా పాలింప సమర్థుఁడవు) నిన్ను దలంచి నంతనే సర్వ రోగములును ఉపశమించును. కాన నీవు చికిత్సకుఁడవు. సర్వ సర్పములను, వ్యాఘ్రాదులను, సర్వ రాక్షసులను నశింపజేయువాఁడవు కదా! కావున మమ్ములను కాపాడుము తండ్రీ!*

*7వ మంత్రము.*

*అసౌయస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సుమంగళః.*
*యేచేమాగ్ం రుద్రా అభితో దిక్షు శ్రితాస్సహస్రశోవైషాగ్ ంహేడఈమహే.*

*ఏ రుద్రుఁడు ఈ మండలస్థాదిత్య రూపుఁడో అతఁడు ఉదయ కాలమున అత్యంత రక్త వర్ణుఁడాయెను. ఉదయాత్పూర్వము ఇంచుకంత రక్త వర్ణుఁడాయెను.  అంతే కాదు ఉదయానంతర కాలమున పింగళ వర్ణుఁడాయెను.ఆయా కాలములందు అతనిలో మిగిలిన వర్ణములు కలవు. అంధకారాదులను నివారించుటచే అత్యంత మంగళ స్వరూపుఁడాయెను.   కిరణ రూపులైన ఏ యితర రుద్రులు ఈ భూమిపై నంతటను, తూర్పు మున్నగు దిక్కులందును,  వ్యాపించి యున్నారో  వారునూ సహస్ర సంఖ్యాకులై కలరు.  సూర్య రూపులును, సూర్య రశ్మి రూపులును అగు ఈ రుద్రులకు అందఱకును   ఏ క్రోధ సదృశమైన తీక్షణత్వము కలదో దానిని భక్తి నమస్కారాదులతో నివారించు చున్నారము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🙏 ప్రసాద్* Forwarded by Mallaiah
శివుడికి ఇల్లు ఎందుకు లేదు? Forwarded by MVMRAO
🙏🌿 🙏🙏🌿 🌿🙏🙏🌿 🌿🙏
ఒకనాడు పార్వతీదేవి శివుడితో! స్వామి ఇంద్రుడికి గృహం ఉంది, దేవతలకి గృహాలు ఉన్నాయి. కాని మనకి మాత్రం లేదు. కట్టించండి అని అడిగింది. అప్పుడు శివుడు! వద్దు పార్వతి. మనకి ఇల్లు అచ్చురాదు. ఆలోచన మానుకో అన్నాడు. కాని పార్వతి కాదు కుదరదు అనేసరికి. సరే అని అమరాశిల్పిని పిలిపించి అత్యద్భుతమైన ఇల్లు ఒకటి కట్టమని ఆజ్ఞాపించాడు. అమరశిల్పి తక్షకకోటిని పిలిపించి బ్రహ్మాండమైన ఇల్లు కట్టాడు. గృహప్రవేశానికి అందరికి ఆహ్వానం పంపించారు. ఎవరికి ఏ వరం కావాలో కోరుకొండి అడిగిన తక్షణమే ఇచ్చేస్తా అన్నాడు. ఆ ఆహ్వానం రావణాసురుడికి కూడా వెళ్ళింది.

గృహప్రవేశానికి అందరు వచ్చి వరాలు అడిగి తీసుకుంటున్నారు. రావణుడు వంతు వచ్చింది. రావణుడు! శివ ఏవరం కావాలన్నా లేదనకుండా ఇస్తాను అని మాట ఇచ్చావ్ కనుక అడిగింది కాదనకూడదు అన్నాడు. సరే ఏమి కావాలో అడగమంటే ఈ ఇల్లు నచ్చింది. ఇచ్చేసేయి అనేసరికి శివుడు పార్వతి ఆశ్చర్యపోయి ఏమిచేయలేక ఇస్తున్నా తీసుకో అని ఇచ్చేశాడు. అక్కడికి ఒక ఇల్లు ఇచ్చేశారు. ఇంకోన్నిరోజుల తరువాత మళ్లి అడిగింది. మళ్లి దేవశిల్పిని పిలిపించి మల్లి కట్టించాడు. ఈ సారి రావణుడిని పిలవలేదు. ఐతే గృహప్రవేశానికి ''శని'' వచ్చాడు.

ఆయన్ని చూడగానే అగ్నిహోత్రుడు గజగజ వొణికిపోయాడు. నన్ను ఏమి చేస్తాడో శని అనుకుని భయంతో ప్రజ్వలించి ఆ ఇంటిని కల్చేశాడు. అలా రెండో ఇల్లుకూడా పోయింది. పార్వతీ మనకి ఇల్లు అచ్చుబాటు లేదు, ఒద్దు అని చెప్పాను కదా! ఇంకా ఇంటిమీద ఆశలు వదిలిపెట్టు అనగానే చేశేది లేక సరే అని ఊరుకుంది. ఆ విధంగా శివుడికి ఇల్లు లేకుండా పోయింది...
సేకరణ;- భక్తి సమాచారం
ఆషాడ మాసంలో ఇలా చేస్తే ఎంతో పుణ్యఫ‌లం Forwaded by MVMRAO

పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాడ మాసంగా చెప్పబడింది. ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని అంటారు. వర్షఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాడంలో చేసే సముద్ర నదీస్నానాలు ఎంతో ముక్తిదాయకాలు. ఆషాఢమాసం లో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం మంచి ఫలితాలనిస్తుంది. ఆషాడం మాసం లోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకం లోనికి సూర్యుడు ప్రవేశించడం తోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణం గా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది.

ఈ మాసం లోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ కూడా. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఆషాడ శుద్ద విదియ నాడు పూరీ జగన్నాధ, బలభద్ర, సుభద్ర రథయాత్ర కన్నుల పండుగగా జరుపుతారు.

ఆషాడ సప్తమి ని భాను సప్తమి గా చెప్పబడింది. ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న ప్రభాకరుడు మూడు నెలలు తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం ఘడియ విఘడియల తేడా లేకుండా సరిసమానంగా  ఉంటాయి. ఆషాడ శుద్ద ఏకాదశి ని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని అంటారు. ఈ రోజు నుండి చాతుర్మాస వ్రతం ఆరంభమవుతుంది. దీనినే మతత్రయ ఏకాదశి అని అంటారు.

వర్ష ఋతువు కూడా ఈ మాసం లోనే ప్రారంభమవుతుంది.ఈ నెలలో చేసే స్నానం,దానం, జప,పారాయణలకు మొదలగు పనులకు విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుంది. ఆషాఢ మాసంలో చేసే సముద్ర, నదీ స్నానాలు ఎంతో ముక్తి దాయకాలు. ఆషాఢమాసంలోనే దక్షిణాయణ కాలం ప్రారంభమవుతుంది. కర్కాటక రాశిలోనికి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అని అంటారు....మీ... *చింతా గోపి శర్మ సిద్ధాంతి*భువనేశ్వరి పీఠం* పెద్దాపురం
*లక్ష్మీదేవి - ధర్మం* .forwaded by MVMRAO

లక్ష్మీదేవి భూమి మీదకు రావడానికి భయపడి విష్ణుమూర్తిని   వేడుకుంది. "స్వామీ.. మానవుల వద్దకు నేను వెళ్ళలేను. వారు లోభులు, బద్దకస్తులు, విచ్చలవిడితనం ఎక్కువ. కొంచెం సంపద చేతిలో ఉంటే చాలు నా అంతవాడు లేడు అంటారు. ఇలా ఒకటా రెండా? సంపదల కోసం ఏమి చేయడానికైనా వెనుకాడరు. కనుక నేను వెళ్ళలేను కనికరించండి" అని మొరపెట్టుకుంది.

అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు.....

"నువ్వు భయపడకు. నీకు తోడుగా నలుగురుని పంపుతున్నాను. రాజు, అగ్ని, దొంగ, రోగం...
ఈ నలుగురు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు.

ధర్మంగా సంపాదించి దానధర్మాలు, పుణ్యకార్యాలు చేస్తూ ఉండే వారికి ఎల్లవేళలా నువ్వు తోడుగా ఉండు. చిన్న చిన్న కష్టాలు వచ్చినా అవి ఎంతోకాలం ఉండవు. ధర్మమే వారిని నిలబెడుతుంది.

ఈ ధర్మాన్ని ఎప్పుడైతే తప్పి అధర్మంగా జీవిస్తారో..
ఆనాడు రాజు వీళ్ళ సంపదని స్వాధీనం చేసుకుంటాడు.

ఇది కుదరకపోతే అగ్ని దహించివేస్తుంది.
మొత్తాన్ని తగలబెట్టేస్తాడు అగ్ని.

ఇక్కడి నుండి తప్పుకుంటే బంధువులు, స్నేహితులు, సుతులు, పుత్రికల రూపంలోనో, లేక దొంగ రూపంలోనో వచ్చి వాడిని సర్వం హరించేస్తారు.

ఇది కూడా కాకుంటే రోగాలు చుట్టుముట్టి చంపేస్తాయి. సంపాదించినదంతా రోగాలకో, రొష్టులకో తగలబెట్టేస్తారు.  ఇలా ధర్మం తప్పి ప్రవర్తించిన వారిని పైన చెప్పిన 4 కూడా ఒక్కోసారి పట్టేయవచ్చు.

కనుక నువ్వు నిర్భయంగా వెళ్లి ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ క్షేమంగా ఉండు. ధర్మం తప్పిన నాడు నలుగుురు నీకు తోడుగా ఉంటారు" అని వరమిచ్చి పంపించాడు.🌹

ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు