Wednesday, July 3, 2019

ముదిగొండ శంకరారాధ్యుల వారిచే రచింపబడిన " భావలింగ శతకము " లోని కొన్ని పద్యరత్నాలు......by Ravishankar Mudigonda

36)ఆ.వె.
 మొదలు జూడ నీవె తుద జూడగా నీవె
నడుమ నేనటన్న నవ్విపోరె
ఏదియైన నీవె యెన్నటికిని నీవె
పాప భయ విభంగ భావలింగ


37)ఆ.వె.
 నీరులేని చేను, నీతిలేని నరుండు,
దాన గుణము లేని ధనిక వరుడు,
జపము లేని భక్తి సాగునా చెడిపోక
పాప భయ విభంగ భావలింగ


38)ఆ.వె
 తెలుసు నన్న మాట, తెలియ దన్నను మాట,
మాట వట్టిదన్న మాట యయ్యె
ఇట్టి మాట బెట్టి యెంత జేసితివౌర,
పాప భయ విభంగ భావలింగ


39) ఆ.వె
 కన్ను నిల్పు వాడు ఘనయోగ వర్యుండు,
మనసు నిల్పువాడు మహిని శివుడు,
మాట నిల్పువాడు మరి యెవ్వడో కాన
పాప భయ విభంగ భావలింగ


40)ఆ.వె.
 పలుక దగిన మాట తలుప దగిన తలంపు,
వెదకి చూడ లేదు విశ్వము నను,
నరులు దేనినమ్మి,  మురియుచు నున్నారొ,
పాప భయ విభంగ భావలింగ.....
రాయి రప్పలిచట రతనములాయెను/
శివపురీశు రాక సిరులనిచ్చె/
రెండు పదుల యేండ్లు రెప్పపాటున జనె/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏హరుని ఎరుక లేక ఆకులల్లాడవు/
భవుని బాట నడచు బ్రతుకు చెడదు/
శివుని యాజ్ఞ లేక చీమైన కుట్టదు/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏By Subrahmanyam M
కైలాశ పర్వతం నుండి జాలువారే విభూతి ధార forwaded by Jagadamba

కైలాస పర్వత ప్రదక్షిణం చేస్తుంటారు కొంతమంది యాత్రికులు , కానీ మరీ దగ్గరగా వెళ్లేవారు మాత్రమే మాటల్లో వర్ణించలేని ఈ అనుభూతి పొందగలరు.కైలాస పర్వతాన్ని సమీపిస్తున్న కొద్దీ సుగంధ పరిమళాల సువాసనలు వీస్తుంటాయట. అక్కడ మంచు బదులు విభూతి ఉంటుందట. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరవలసిన క్షేత్రాలలో ఇదీ ఒకటి.

దయచేసి మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి . దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో మన ఊహకు అందదు.అందరికీ దర్శనభాగ్యం కలగాలనే మా ప్రయత్నం.

" సంభవామి యుగే యుగే " పేజ్

Tuesday, July 2, 2019

Forwarded by Umashankar I 
ముదిగొండ శంకరారాధ్యుల వారిచే రచింపబడిన " భావలింగ శతకము " లోని కొన్ని పద్యరత్నాలు.....

31) ఆ.వెforwaded by Ravishankar Mudigonda
 నోటి మాట నాది నొసటి మాటగు నీది,
నొసలు బల్క కున్న నోరుబల్క
దిట్లె దెలుసు కొనగ నేది భేదము నీలొ
పాప భయ విభంగ భావలింగ

32) ఆ.వె.
 నేనటన్న తప్పు నీవటన్నను దప్పు,
పేరు బెట్ట నదియు పెద్ద తప్పు
అట్టి తప్పు మాటలాడి కుందగనేల
పాప భయ‌ విభంగ భావలింగ

33).ఆ.వె
 కలదు లేదటంచు కలహించిరే గాని
నీ నిజంబు బల్క నేరరైరి
కల్ల గాద నీలొ కలదు లేదను మాట
పాప భయ విభంగ భావలింగ

34) గొప్ప కులము గాదు, గొప్ప ధనము గాదు
గొప్ప విద్య గాదు కోటి యేల
మాట వశము గొన్న మాదిగైనను గొప్ప
పాప భయ విభంగ భావలింగ

35) ఆ.వె
 వేప చెట్ల లేదు వెదకిన తియ్యాకు
మాటలందు లేదు మంచి మాట,.
అట్టి చెడ్డ మాటలాడి చింతిల నేల
పాప భయ విభంగ భావలింగ
శ్రీ పంచమ్యై నమః.    Forwarded by MALLIKHARJUN 

వారాహీ దేవిని పంచమీ అనే నామంతో అర్చిస్తారు. ఆషాఢ నవరాత్రులు శ్రీ వారాహీ దేవి యొక్క నవరాత్రులు. `భజే శ్రీ చక్ర మధ్యస్థాం దక్షిణోత్తర యోస్సదా శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం' అని శ్యామలా వారాహీ సమేత లలితాంబికను ధ్యానించే శ్లోకం. ఇందులో క్రియాశక్తికి ప్రధానంగా గల దేవత శ్రీ వారాహీ దేవి.

ఇవి జగన్నాథ నవరాత్రులు కూడా. వసంత నవరాత్రులు శ్రీ వేంకటేశ్వర స్వామికి, అమ్మవారికి కూడా ఎలా సంబంధించినవో ఇవి అలా జగన్నాథునికి, వారాహీ దేవికి సంబంధించినవి. సుభద్రా దేవి భువనేశ్వరిగా జగన్నాథుడు శ్యామలగా శక్తి ఉపాసకులు భావిస్తారు. అలాగే బలభద్రుడు క్రియా శక్తికి ప్రతీక అయిన వారాహీ దేవిగా కొలుస్తారు. అంతే కాక జగన్నాథస్వామి కాళీ దేవి రూపం కూడా. శ్రీ కృష్ణుడు కూడా కాళీదేవియొక్క రూపమే కదా.."కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో" అని భగవద్గీతలో చెప్పినట్లు. ఇక బలభద్రుడు బలరాముని రూపం. వారాహీదేవికి లాగే బలభద్రునికి కూడా హలము (నాగలి) ఆయుధం. ఈ 9 రోజులు పూరీలో రోజుకో అవతారంతో ఈ మూర్తులను అలంకరిస్తారు. అందులో ఇవాళ (పంచమి) వరాహ అవతారంతో అలంకరిస్తారు. అంతే కాక ఈ రోజున హీరా పంచమి అని ప్రత్యేక ఉత్సవం కూడా చేస్తారు. పూరీలో బలభద్రుని ధ్యానశ్లోకంలో " శాంతం చంద్రాదికాంతం ముసల హల ధరం" అని వారాహి యొక్క ముసలము, హలము రెండిటినీ ధరించిన మూర్తిగా ఇప్పటికీ పూజిస్తారు. శక్తి ఉపాసన ప్రధానంగా ఉన్న తాంత్రిక గ్రంథాలలో విస్తారంగా బలభద్రుని ప్రసక్తి ఉంది.

ఆహా ఏమి  రాశావయ్యా!!!!!
ఏమి స్వామి  నీ మహిమ?

 శ్రీశైల మల్లన్నను పాల్కురికి సోమన్న అచ్చులు,హల్లులతో ఎలా స్తుతించాడో
చూడండి.

'అ'ఖిల లోకాధార
'ఆ'నంద పూర
'ఇ'న చంద్ర శిఖి నేత్ర
'ఈ'డితామల గాత్ర
'ఉ'రు లింగ నిజరూప
'ఊ'ర్జితా జలచాప
'ఌ'లిత తాండవకాండ
'ౡ'నికృతా జాండ
'ఏ'కైక వర్యేశ
'ఐ'క్య సౌఖ్యా వేశ
'ఓం' కార దివ్యాంగ  
'ఔ'న్నత్య గుణ సంగ
'అం'బికా హృదయేశ
'అః'స్తోక కలనాశ

'క'నద హీనాభరణ
'ఖ'ల జలంధర హరణ
'గ'ల నాయక విధేయ
'ఘ'న భక్తి విజేయ
'జ'శ్చూల కాలధర
'చ'రిత త్రిశూల ధర
'ఛ'ర్మ యాధ్వస్త
'ఞ'న గుణ ధళ ధీర
'ట' త్రయాది విదూర
'ఠ' ప్రభావాకార
'డ'మరుకాది విహార
'ఢ' వ్రాత పరిహార
'ణ' ప్రవాగార
'త'త్త్వ జోనేత
'థ'వి దూర జవ పక్ష
'ద'వన పాలన దీక్ష
'ధ'రణీ థవోల్లీడ
'నంది కేశారూఢ
'ప'ర్వతీశ్వర లింగ
'బ'హుళ భూత విలాస
'భ'క్త్వ హృద్వ నహన
'మం'త్రస్తుతోధార
'య'క్ష రుద్రాకార
'ర'తిరాజ బిన హంస
'ల'లిత గంగోత్తంస
'ళ'మా విదవ్రంశ
'వ'రద శైల విహార
'శ'ర సంభ వాస్ఫార
'ష'ట్తింశ తత్త్వగత
'స'కల సురముని వినుత
'హ'రి నేత్ర పదపద్మ- అంశిత భూధరపద్మ
'క్ష'ర రహిత చరిత్ర - అక్షరాంక స్తోత్ర
శ్రీ పర్వత లింగ
నమస్తే నమస్తే నమస్తే నమః🙏🙏🙏By Umashankar I