Wednesday, June 12, 2019

*రేపు శ్రీ కూర్మ జయంతి  కూర్మ జయంతి నాడు "శ్రీకూర్మం"కూర్మ జయంతి రోజు ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి!*  forwaded by S

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలెత్తాడు. అందులో రెండో కూర్మావతారం. కృతయుగంలో దేవ, దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకడం మొదలు పెట్టారు. మందరగిరిని కవ్వంగా, వాసుకుని తాడుగా చేసుకుని దేవాసురులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్ర మధనానికి ఆటంకం కలిగింది. ఈ ఆటంకం నుంచి బయటపడేలా అనుగ్రహించమని దేవతలు మహావిష్ణువు వేడుకున్నారు.

అప్పుడు నారాయణుడు కూర్మరూపం దాల్చి సముద్రంలోకి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్భవించినదే కూర్మావతారం. కూర్మవతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ చాలా తక్కువ. కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మదేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. అరుదైన శిల్పకళతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ అబేధాన్ని సూచించే క్షేత్రంగా విరాజిల్లుతోంది. 

శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో శ్రీకాకుళం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వంశధారా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. కళింగరాజైన అనంగభీముడు కూర్మనాధస్వామి ఆలయాన్ని పునర్‌నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. కర్పూరేశ్వరుడు, హఠకేశ్వరుడు, సుందేశ్వరుడు, కోటేశ్వరుడు, పాతాళ సిద్దేశ్వరుడు అనే అయిదుగురు ఈశ్వరులు క్షేత్రపాలకులుగా వున్న ఈ క్షేత్రం కళింగరాజుల కాలంలో ఓ వెలుగు వెలిగిందనీ, కళింగ రాజుల కాలంలో అత్యంత విశిష్టతను చేకూర్చిందని చరిత్ర చెబుతోంది. 

కూర్మావతారుడు తన భక్తుని కోరికపై స్వయంగా వెలసిన క్షేత్రమే శ్రీకూర్మం. కృతయుగంలో శ్వేతరాజు, అతని భార్య వంశధారల తపస్సుకు, భక్తికి మెచ్చుకున్న కూర్మనాధుడు వారి కోరిక ప్రకారం ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖంగా వెలిశాడట. ఈ క్షేత్ర ప్రస్తావన కూర్మ, బ్రహ్మాండ, పద్మ పురాణాలలో వుంది. 

శ్రీరాముడు, బలరాముడు, జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయంలో శిల్ప సౌందర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మరే దేవాలయంలోను లేనివిధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలను ఈ ఆలయంలో చూడవచ్చు.

ఈ స్తంభాలు రెండూ శివ కేశవులకు ప్రతీకలుగా చెప్తారు. చెప్పడానికి ఇది వైష్ణవ క్షేత్రమే. అయినా శివ కేశవులకు చిహ్నాలుగా చెప్పే ఈ ధ్వజస్తంభాలు శివకేశవుల అభేద తత్వాన్ని సూచిస్తున్నాయి. ఈ క్షేత్రం కృతయుగం నాటిది. దేవాలయంలోని మూలవిరాట్టు సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్టించబడిందట. 

దేవతలచే నిర్మించబడిన ఆలయం ప్రతిరోజు రాత్రివేళల్లో దేవతలు వచ్చి దేవాలయ నిర్మాణం చేసి సూర్యోదయం అయ్యే వేళకు అదృశ్యం అయిపోయేవారట. అందుకనే ఆలయంలోని స్తంభాలు ఒకదానికి మరొకటి పోలికలేని విధంగా వుంటాయని ఒక కథనం. 

శ్రీ కూర్మంలోని స్వామి వారి పుష్కరిణిని శ్వేతగుండం అని పిలుస్తారు. ఇది అత్యంత విశిష్టమైంది. ఆ స్వామి చేతిలోని సుదర్శనచక్రం చేత పుష్కరిణి ఆవిష్కరించబడిందనీ, అందుకే ఈ గుండంలో స్నానం చేస్తే కలిదోషాలు తొలగిపోతాయని చెప్తారు. మరణించినవారి అస్థికలను ఈ గుండంలో నిమజ్జనం చేస్తారు. 

ఈ గుండంలో స్నానం చేసి ఇక్కడ వున్న విష్ణుపాదాల దగ్గర పిండప్రదానం చేస్తే పితరులకు ఉత్తమ గతులు కలుగుతాయని విశ్వాసం ఇక్కడ చేసిన పితృకర్మలకు గయలో పితృకర్మలు చేసిన ఫలితం లభిస్తుందని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.

ఇక శ్రీ కూర్మ జయంతి (13-గురువారం) రోజున స్వామివారిని దర్శించుకునే వారికి సకల పాపాలు హరింపవేయబడుతాయని విశ్వాసం. అలాగే ప్రతి సంవత్సరం మార్చిలో హోళీ పున్నమినాడు పెద్దఎత్తున ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశినాడు స్వామికి కల్యాణోత్సవం, *జ్యేష్ట ద్వాదశినాడు కూర్మ జయంతి* నాడు జరిగే ఉత్సవాల్లో పాల్గొంటే సకల సంతోషాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.
శ్రీ శరభేశ్వరస్వామి By MVMRAO
****
 ఆలయం,తిరుభువనం,తమిళనాడు
******************
హిరణ్యకశిపుడిని చంపి, ప్రహ్లాదుణ్ణి రక్షించటానికి మహావిష్ణువు నరసింహావతారం ఎత్తినట్లు మనందరికీ తెలిసిన విషయమే.  హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత మన కధల ప్రకారం నరసింహుడి ఉగ్ర రూపాన్ని మహాలక్ష్మి శాంతింప చేస్తుంది. కానీ తమిళ నాట ప్రచారములో నున్న కధ ప్రకారం...
హిరణ్యకశిపుడి రక్తం నరసింహస్వామి శరీరంమీద, లోపల వుండి ఆయనని చాలా రౌద్రంగా చేసిందిట. హిరణ్యకశిపుడి రక్తం నేల మీద పడితే అనేక మంది హిరణ్యకశిపులు జన్మిస్తారుట. దానితో వాళ్ళు భయపడ్డారు.  దానిని ఆపటానికి  ఆయనని చల్లబరచటానికి దేవతలు శివుణ్ణి ప్రార్ధించారుట.శివుడు వింత రూపాన్ని ధరించాడు. సింహ ముఖం, మానవ శరీరం, పక్షి రెక్కలు, 8 కాళ్ళు, 4 చేతులతో ఆయన రూపం ప్రత్యక్షమయింది. ఆయన రెండు రెక్కలలో ఒక రెక్క ప్రత్యంగరాదేవి, రెండవది శూలిని దుర్గ అవతరించారు. ఆయన నరసింహుణ్ణి ఆకాశంలో భూమ్యాకర్షణ శక్తి పని చేయనంత ఎత్తుకు తీసుకెళ్ళాడు. ఆ ప్రదేశంలో శరభేశ్వరుడు నరసింహుడి శరీరాన్ని నొక్కి చెడ్డ రక్తమంతా బయటకి పోయేటట్లు చేశాడు. భూమ్యాకర్షణ శక్తి లేక పోవటంతో ఆ రక్తం కింద పడలేదు. శరీరంలోంచి చెడు రక్తం పోగానే నరసింహుడు శాంతించి శివుణ్ణి పూజించాడుట.శరభేశ్వురుణ్ణి పూజిస్తే నలుగురు దేవతలని పూజించినట్లే. శరభేశ్వరుని ఆకారంలో నలుగురు దేవతా మూర్తులు, శివుడు, కాళి, దుర్గ, విష్ణు వున్నారు. శరభేశ్వరస్వామిని పూజించటంవల్ల ఆరోగ్యం,మనసు చికాకులు,గ్రహదోషాలు తొలగిపోతాయి.

Tuesday, June 11, 2019

🕉️అర్ధనారీశ్వరం🕉️
By Yes P K


వాసుదేవనల్లూరు  ఒక
అందమైన చిన్న ఊరు. తమిళనాడు , తిరునల్వేలి జిల్లాలోని పుళియంకుడికి సమీపంలోవుంది. ఈవూరు
నెల్లై ప్రాంత  ధాన్యపు గిడ్డంగిగా పేరుపొందింది.  ప్రకృతి అందాలతో పాటు ప్రాచీన పౌరాణిక చరిత్ర
యీ ఊరి ఖ్యాతి ని మరింత  పెంచాయి.

స్త్రీ వేరు , పురుషుడు వేరు
కాదు . సృష్టిలో ఇద్దరూ సమానమే
అని నిరూపించేs మూర్తియే అర్ధనారీశ్వరమూర్తి. అటువంటి అపురూపమైన ఆదిదంపతులు అర్ధనారీశ్వరుని రూపంగా యీ వూరిన వెలసారు.

సాధారణంగా శివాలయాలన్నింటిలో
శివుని కి పార్వతి కి ప్రత్యేక సన్నిధులు వుంటాయి.   కానీ , యీ ఆలయంలో
శివ పార్వతులు అర్ధనారీశ్వర మూర్తిగా దర్శనమివ్వడం అపూర్వం.

కైలాసవాసులైన శివ పార్వతుల నిత్య దర్శనమే భాగ్యమే భాగ్యమని ఋషిపుంగవులంతా
కైలాసం లోనే నివసించాలని తపిస్తారు.
కానీ , భృంగి ముని మాత్రం
ఈశ్వరుడొక్కడే తన దైవమని, అన్యులతో పనిలేదని పార్వతీదేవిని
అలక్ష్యపరిచాడు. తాను ఒక తు మ్మెదగా మారి అమ్మవారికి పరమేశ్వరునికి మధ్య చేరి  శివుడిని మాత్రం పూజించాvడు.
ఇది చూసిన పార్వతి దేవి
మనిద్దరం ఒకే శక్తి కదా ?
వేరు  వేరు కాదు కదా అని ఈశ్వరుని ప్రశ్నించింది.

 ఈ పరమార్ధాన్ని భృంగి మునికి తెలియజేయాలని  , మహేశ్వరుడు పార్వతీ దేవిని తన అర్ధ భాగం గా చేసుకుని  దర్శనమిచ్చాడు .

"దేవీ ,నీవు వేరు నేను వేరని  భావించేవారికి
నీవు నేనూ ఒకటే నన్నది,
యీ సమయంలోనే
తెలియ చేద్దాంl.
నీవు భూలోకానికి వెళ్లు.
గతంలో , మన కళ్యాణోత్సవాన్ని పొదిగమలై నుండే  వీక్షించిన అగస్త్య మహర్షి వంటి అనేక  ఋషులు,యోగులు ,
జ్ఞానులు, భక్తులు నివసిస్తున్న  సిందవనంలో తపమాచరించమని
శివుడు పార్వతీ దేవిని
ఆదేశించాడు.

ఆ విధంగా పార్వతీదేవి
వాసవనూరు అనే యీ
స్ధలానికి వచ్చి, మంచినీటి
నూతిని, నందనవనాన్ని
ఏర్పాటు చేసుకుని,
ఒక చింత చెట్టు  నీడలో
శివలింగాన్ని , ప్రతిష్టించి
 మంచి నీటితో అభిషేకించి, సువాసన కలిగిన పుష్పాలతో ఈశ్వరుని భక్తి శ్రధ్ధలతో పూజించింది.
చింతచెట్టు క్రింద ప్రతిష్టింప బడి పూజించినందున
యీ ఈశ్వరునికి చింతామణి
నాదర్  అనే పేరు వచ్చింది.

అమ్మ వారి పూజలకు మెచ్చిన  శివుడు ప్రత్యక్ష మై పార్వతీదేవిని
వరము కోరుకోమన్నాడు.

" స్వామి, శివ పార్వతులమైన మనము  వేరు వేరుగా కాకుండా ఏకమూర్తిగా నే వుండాలి" అని కోరుకొన్నది పార్వతీదేవి.
ఈశ్వరుడు పార్వతీదేవి కోరిక చెల్లించేవిధంగా , ఆమెను  తన వామ భాగమున
చేర్చుకుని అర్ధనారీశ్వర మూర్తి గా వెలిశాడు.
 దేవేంద్రుడు  తన పరివారంతో వచ్చి ఈ స్ధలంలోని
అర్ధనారీశ్వరుని పూజించి తరించాడు.

రవివర్మ అనే చేరదేశ రాజు యొక్క పుత్రుడైన కులశేఖర్ కు కుష్టు వ్యాధి రాగా, ఎవరూ వ్యాధి నివారణ చేయలేక పోయారు. ఆ సమయంలో
రాజుగారి దర్శనానికి ఒక
శివ యోగి వచ్చాడు.

రాజు తన పుత్రుని వ్యాధి విముక్తుని చేయమని ఆయోగిని వేడుకున్నాడుs.
 ఆ యోగి, రాజు కుమారుడిని చూసి , యీ స్ధలంలో వున్న  పవిత్ర పుష్కరిణిలో స్నానం చేసి ఒడలంతా విభూతి పూసుకుని , యిక్కడి నిక్షేప నదీతీరాన కూర్చుని
ఈశ్వరనామాన్ని భక్తితో  జపింపజేయమని చెప్పాడు.

యోగి ఉపదేశానుసారం
కులశేఖరుడు కుంభ పుష్కరిణి లో స్నానం చేసి శివయోగి చెప్పినట్టుv శివుని ధ్యానించి  తన వ్యాధి నుండి విముక్తుడైనాడు.

 ఆ తర్వాత ఈశ్వరునికి  మరింత పెద్ద ఆలయం
నిర్మించాడు.  కాలక్రమేణా ఆలయం  చుట్టూ ఊరు పెరిగింది.

పుణ్యనదిగా  పురాణంలో పేర్కొనబడిన
నిక్షేప నదీ తీరాన
యీ ఆలయం వున్నది.
ఈ  అర్ధనారీశ్వరుని ఆలయ వెలుపలి ప్రహారీ గోడలు కోట బురుజుల్లా వుంటాయిl.
ఆలయ ముఖ ద్వారం వద్ద ఎత్తైన స్ధంభాలు.
స్ధంభాల వెనుక ప్రాకారంలో ధర్మశాస్తా ఆలయం వున్నది.

ఆగమశాస్త్ర ప్రకారం
నిర్మింప బడిన యీ ఆలయ ముఖ మండపం
కళ్యాణ మండపం అని
పిలవబడుతోంది. అందమైన వేదిక తో ఉయ్యాల మండపం,
నటరాజ స్వామి  సన్నిధి
వున్న మండప ప్రధాన ద్వారం కుడి ప్రక్కన వినాయకుని సన్నిధి వున్నsది.

వెలుపలి ప్రాకారాన్ని చుట్టి, దక్షిణ ప్రాకారానికి
వస్తే,  అక్కడ ఆలయ స్ధల వృక్షమైన చింత చెట్టును
దర్శిస్తాము.

గర్భగుడి వెలుపల ఒక మండపం వున్నది.  ఇక్కడే
సుందరమైన అర్ధనారీశ్వరుని శిలా విగ్రహం  అందరిని ఆకర్షిస్తూ బహు సుందరంగా దర్శనమిస్తుందిv. ఈ ప్రాంగణంలో చేరమాన్, భృంగి మహర్షి, రవి వర్మ,చంద్రశేరుల
విగ్రహాలను చూడగలము.
మూలస్ధాన పై కప్పు
చందన కలపతో నిర్మించబడింది.

ఈ ఆలయంలో  జ్యేష్ట మాసంలో  ఉత్సవాలు వైభవంగా చేస్తారు.l
ధ్వజారోహణం తరువాత
పది రోజులపాటు  ఉత్సవాలు
జరుపుతారు. మూడవ
రోజున పరమేశ్వరుడు  భృంగి మహర్షి కి ప్రత్యక్షమైన ఉత్సవం గా జరుపుతారు.
వారణాశియందు బాఱగ సురనది/
ఆదరించు అమ్మ అన్నపూర్ణ/
విశ్వనాధుడిచట విశాలాక్షీ విభుడు/
శివపురీశ దేవ చిద్విలాస/🙏By Subrahmanyam M
జ్యేష్ఠశుద్ధ దశమి (12/06/2019) దశపాపహరాదశమి, గంగావిర్భావదినం. Forwaded by S

ఈరోజు సమీప నదిలో గంగాస్మరణతో స్నానం చేయాలి. నది లభ్యం కానప్పుడు వాపీకూప తటాకాదులు వేటిలోనైనా, లేదా ఇంట్లో స్నానం చేసేటప్పుడైనా గంగా నామస్మరణ చేయాలి.

నందినీ నళినీ సీతా మాలినీ చ మహాపగా!
విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపథ గామినీ!!
భాగీరథీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ
ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే!
స్నానకాలే పఠేన్నిత్యం మహాపాత నాశనమ్!!

ఈ పన్నెండు నామాలతో గంగను స్మరించితే పాప హరణం.

గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానామ్ శతైరపి
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి!!
అంబ త్వద్దర్శనాన్ముక్తిః న జానే స్నానజం ఫలం!
స్వర్గారోహణ సోపానే మహాపుణ్య తరంగిణి!!
విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవమ్
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికామ్!!
అతి తీక్ష్ణ మహాకాయ కల్పాంత దహనోపమ
భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి!!
త్వం రాజా సర్వ తీర్థానాం త్వమేవ జగతః పితా
యాచితో దేహి మే తీర్థం సర్వ పాపాపనుత్తయే!!
యోsసౌ సర్వగతో విష్ణుః చిత్స్వరూపీ జనార్దనః
స ఏవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయః!!
✍ చదివే సమయంలో పెదవి మాత్రమే తగిలే పద్యం

భూమీ భామాంబు భవా
వామాపా వైభవ భువి భావావాపా
వేమమ్మోముము భూభవ
భీమ భవాభావ భావ విభువామావిభా

చదివే సమయంలో పెదవులు తగలనిది

శ్రీశా సతత యశః కవి
తాశా ధాత్రీశ ఖండితాశా నిస్సం
కాశా నిరతారాధిత
కీశేశా హృష్ణ గగనకేశా యీశా

ఒక అక్షరం పెదవికి తగలనిది తరువాతి అక్షరం తగిలేది
అంటే పెదవి తగలనిది, తగిలేది

దేవా శ్రీమాధవ శివ
దా వేగాభిజ్ఞ మురభిదా మాధామా
జ్యావగ వంద్యా వాసవ
సేవితపద పగవిరామ శివ జపనామా

కేవలం నాలుక కదిలేది

సారసనేత్రా శ్రీధర
రారా నన్నేల నిందు రాక్షసనాశా
నారద సన్నుత చరణా
సారతరానందచిత్త సజ్జనరక్షా

నాలుక కదలని (తగలని) పద్యాలు

కాయముగేహము వమ్మగు
మాయకు మోహింపబోకు మక్కువగ మహో
పాయం బూహింపుము వే
బాయగ పాపంబు మంకుభావమవేగా
భోగిపభుగ్వాహ మహా
భాగా విభవైకభోగ బావుకభావా
మేఘోపమాంగభూపా
బాగుగమముగావువేగ బాపాభావా

నాలుక కదిలీ కదలని పద్యం

ఓ తాపస పరిపాలా
పాతక సంహారా వీర భాసాహేశా
భూతపతిమిత్ర హరి ముర
ఘాతా కాలాంబుదవిధ గాత్రవరాహ్వా

తెలుగు కవులకు, రచయితలకు జోహార్లు
🙏 by MVMRAO
అందుకే అన్నారు దేశభాషలందు తెలుగు లెస్స అని ✍
సంధ్యావందనం – వైజ్ఞానిక విశ్లేషణ - విభిన్న దృష్టి కోణం :

మనకు విధించిన సంధ్యావందన విధి గురించి మరొక శాస్త్రీయ దృష్టి కోణం నుండి పరిశీలిస్తే ఆ ఉపాసించే ముముక్షువు సాధించే శారీరక మానసిక లాభాలు ఎన్నెన్నో ఉన్నవి. వాటిలో కొన్ని నేడు చర్చించుకుందాం. సంధ్యావందన విధి భూతశుద్ధి, ప్రాణాయామం, మార్జనము, మంత్రాచమనము, పాప పురుష విమోచనము, అర్ఘ్యప్రదానము, పరిషేచనము, గాయత్రి ఆవాహనం, ముద్రల ప్రదర్శనము, గాయత్రి మంత్రజపము, సూర్యోపస్తానము, దిగ్దేవతా నమస్కారము, దేవతా స్మరణము, అభివాదము ముఖ్య క్రియలగా చెప్పబడ్డాయి. ఇందులో ఒకొక్క విధికి ఒకొక్క ప్రయోజనం ఉన్నా, కొందరు పెద్దలు అర్ఘ్య ప్రదానము, గాయత్రి మంత్రజపము దీనిలో ప్రధానమైన అంగములుగా వివరిస్తారు.

ముందుగా మనం కూర్చోబోయే ప్రదేశాన్ని శుద్ధి చేసుకుని ప్రాణాయామంతో మొదలవుతుంది సంధ్యావందనం. అసలు ప్రాణాయామం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నేటి కాలంలో కేవలం ముక్కును మూడు వేళ్ళతో పట్టుకోవడం అనే మొక్కుబడిగా తయారయింది కానీ ప్రాణాయామం వలన మనకొచ్చె మానసిక ప్రశాంతత, ఉల్లాసం గురించి చెప్పడం అంటే ఒక తిరుపతి లడ్డూ ఎంత తియ్యగా వుంటుందో, అమ్రుతోపమానంగా వుంటుందో పదాల్లో చెప్పే సాహసం చెయ్యడమే. ఆ అనుభవం ఎవరికి వారు స్వయంగా అనుభవించి తెలుసుకోవాలి కానీ వాటి వలన వచ్చే శారీరక, మానసిక లాభాలు – ప్రశాంతత, శరీరం నిస్తేజం నుండి ఉత్తేజం వైపు పయనం, నాడుల సమతౌల్యం, డయాబెటిస్, స్ట్రెస్, బీపీ, కోలేస్త్రోల్ నియంత్రణ, ఇలా చెప్పుకుపోతే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సగం శారీరక రోగాలు మానసిక స్ట్రెస్ వలన వచ్చేవే. వాటిని మరల ప్రాణాయామం ద్వారానే తిరిగి తగ్గించుకోగలం అని నేటి వైద్య నిపుణులే చెబుతున్నారు.

మీరు రాజయోగ, లేక పిరమిడ్ మెడిటేషన్, లేక రామచంద్రాజీ మిషన్ లాంటి ధ్యానం నేర్పే వారి వద్ద ధ్యానం నేర్చుకున్నట్టు అయితే వారు చెప్పే పద్ధతులలో కొంత వ్యత్యాసం ఉన్నా ఇంచుమించు అందరూ శ్వాస పై ధ్యాస, లేక హృదయాంతరాలలో కానీ కనుబొమల మధ్య ఒక జ్యోతిని దర్శించమని చెబుతారు. రోజుకు రెండు సార్లు ధ్యానం చెయ్యమని, సాయంత్రం ధ్యానం లో మీనుండి పాప పురుషుడు విదివడుతున్నట్టు ఊహతో ధ్యానం చెయ్యమని చెబుతారు. ఇతిమిద్ధంగా చూస్తె ఈ పద్ధతులన్నీ కూడా సంధ్యావంధనంలో ముఖ్య ఘట్టాలైన ప్రాణాయామం, మంత్రజపం చెబుతారు. సంధ్యావందనంలో మరెన్నో పూర్వ క్రియలు చెప్పి ఆ సాధకునికి మంత్రజపానికి సన్నద్ధం చేస్తుంది. ఎలాగంటే ఒక జిం లో ముందు బరువులు ఎట్టేముందు కొంతసేపు పరిగెత్తించి వార్మ్ అప్ చేయించినట్టు. ఇక్కడ కూడా ముందుగా చేసిన క్రియల ద్వారా మనం ధ్యానానికి సన్నద్ధం అవుతాం. ధ్యానం చేసేటప్పుడు వేళ్ళ కణుపుల మీద లెక్క పెట్టడం ద్వారా ఆయా నాడుల మీద accupressure పెడతాం. శారీరకంగా ఆ pressure వలన మనలోని శరీర భాగాలకు రక్త ప్రసరణ, కొన్ని నాడుల ఉత్తేజం చెయ్యడం, తద్వారా శారీరక ఆరోగ్యం దీనిలో ముఖ్యోద్దేశం.

మన మనస్సు ఒక అద్దం లాంటిది. పరమాత్ముని తేజస్సు యోగులలో ఆ అద్దం శుభ్రంగా ఉండడం వలన reflect అయ్యి తామే ఆ దైవిక శక్తిలా ప్రకటితం అవుతారు. మనబోటి వాళ్ళు ఎన్నో జన్మలనుండి ఎంతో మలినాలను ఆ అద్దానికి అంటించుకుని వచ్చాం. అందుకే మనం ఆ దైవిక తేజస్సును బయటకు వ్యక్త పరచలేకపోతున్నాం. గాయత్రీమంత్రజపం ద్వారా మంత్ర శక్తి వలన కొంత సంచితాన్ని చెరిపేసుకుంటూ, ఇప్పుడు మనం రోజులో పగలు, రాత్రి అంటించుకుంటున్న కొత్త మలినాలను శుభ్రపరచుకుంటూ ఉంటాం. మనం నిత్యం ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం. అవన్నీ కూడా ఇంప్రెషన్స్ లా మన మనస్సు పొరలలో దాక్కుని ఉంటాయి. కొన్ని కళ రూపంగా బయటకు పోగా, కొన్ని అలాగే ఉండిపోయి పోగుపడుతూ ఉంటాయి. తద్వారా మన ప్రవర్తన మారుతుంది. ఈ శుద్ధీకరణ ద్వారా ఎప్పటికప్పుడు అటువంటి ఆలోచనలను చదివి అవతల పారేసి స్ట్రెస్ తగ్గించుకుంటూ, అనవసరపు ఆలోచనలను త్రుంచి వెయ్యగలం. దీని ద్వారా మానసికంగా ప్రశాంతత సాధించి, యుక్తాయుక్త వివేచన కలుగుతుంది. ఒక గాయత్రి మంత్రం ఒక్కసారి జపించడానికి పావు నిముషం అంత సమయం పడుతుంది. కనీసం 108 చెయ్యమంటారు. పరమాచార్య వారు వారంతాలలో 1008 చెయ్యమని చెప్పారు. అంత సమయం నిశ్చలంగా జపం చెయ్యడం వలన మనకొచ్చే లాభాలు జపించి చూడండి. కొన్ని మెడిటేషన్ పద్ధతులలో మీ వయస్సు అన్ని నిముషాలు ధ్యానం చెయ్యమంటారు. సంధ్యావందనం ఒక క్రమ పద్ధతి ద్వారా మనకు ఎన్నో లాభాలు చేకూర్చిపెడుతుంది.

ఇప్పటివరకు చెయ్యలేకపోయాం అని బాధపడవలసిన అవసరం లేదు. ఇప్పటికైనా మొదలు పెట్టి ఇతోధికంగా జపం చేసుకుని మనల్ని మనం ఉద్ధరించుకుందాం. సంధ్యావందనం చెయ్యని వాడు ఎన్ని యాగాలు, హోమాలు చేసినా నిష్పలమే. సంధ్యావందనానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు మన పెద్దలు. వారేమి వేర్రివారై చెప్పలేదు. ఎన్నో లాభాలను ఆర్జించే ఒక కర్మ కింద మనకు అందించారు. వాటిని పాటించి బాగుపడదాం.

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీవేంకటేశ్వరార్పణమస్తు !!forwaded  by  MVMRAO


----MVA Kiran