Tuesday, June 11, 2019

By Subrahmanyam.Mగుణ దోషౌ బుధో గృహ్ణన్ ఇందు క్ష్వేడా వివేశ్వరః౹
శిరసా శ్లాఘ్య తే పూర్వం పరం కంఠే నియచ్ఛతి౹౹

భావం:-శివుడు గరళాన్ని కంఠమందుంచుకొని, చంద్రకళను శిరాన ధరించినట్లుగా
పండితుడైనవాడు పరుల దోషాలను లోపలే ఉంచుకొని, గుణలేశాలను శిరసావహిస్తాడు.

కంఠమందె నిలిపి గరళము దాచగ/
శిరము పైన శశిని శివుడు దాల్చె/
తపసి గుణములెన్ను తప్పుల దలచడు/
శివపురీశ దేవ చిద్విలాస/🙏

Monday, June 10, 2019

By I Understand

ప్రకృతిసంపద-విశేషలాభాలు7

ప్రతి మంగళ, శుక్రవారములు సాయం సమయములో దానిమ్మ ఫల విత్తనాలచే శ్రీ  మహాలక్ష్మి అష్టోత్తర/సహస్ర నామావళి దీక్షతో చేయగా మిగిలిన విత్తనాలనే నైవేద్య ముగా అర్పించి, దానిని మాత్రమే భుజించి, ఆ రోజంత యు ఉపవసించి, మరుసటి దినమున ఉదయముననే యథా శక్తితో పూజించి, ఉద్వాసన చేసి, ఆ ఫల విత్తన ము లను ప్రసాదము గా ఆ    కుటుంబము వారే స్వీకరించి, క్రమము తప్పకుండా  యేడు వారములు గావించు వారికి భోగభాగ్యముల ప్రాప్తి. దారిద్ర్యం దరిచేరదు.
సచ్చిదానంద స్ఫూర్తి... శివానంద మూర్తి
1935-36 ప్రాంతాలలో నెల్లూరులో కొందరు శ్రీరమణ మహర్షి పటం ఎదురుగా కూర్చొని భజన చేస్తున్నారు. ఆ పటంలో నుంచి శ్రీ రమణులు వచ్చి... భజన చేస్తున్న వారిలో ఉన్న ఒక బాలుని చెక్కిలి నిమిరి అంతర్ధానమయ్యారు. ఈ సంఘటన ఆ బాలునికి తప్ప మరెవరికీ తెలియదు. ఆ బాలుని పేరు కందుకూరి శివానందమూర్తి. ఆ బాలుడే ఉత్తరోత్తరా గొప్ప యోగిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, జ్ఞానిగా.. కొన్ని వేలమంది హృదయాలలో ఆధ్యాత్మిక దీపాలను వెలిగించారు. జూన్‌ 10వ తేదీ శనివారం ఆ మహనీయుని పుణ్యతిథి. ఈ సందర్భంగా.. సచ్చిదానంద స్ఫూర్తిగా కీర్తి గడించిన శివానంద మూర్తి జీవిత విశేషాలు..

రువుశివానందమూర్తి గారు రాజమహేంద్రవరంలో 1928 డిసెంబరు 20న జన్మించారు. వీరి తల్లితండ్రులు కందుకూరి వీర బసవరాజు, సర్వమంగళాదేవి. గురువుగారు చిన్న వయసు నుంచీ అసమాన ప్రజ్ఞ ప్రదర్శించేవారు. వారి పన్నెండో ఏట ఒక ఉత్తర భారత యోగి.. కోరకుండానే ఆయనకు మంత్రోపదేశం చేశారు.

తన జన్మకొక ప్రయోజనం ఉందని చిన్ననాడే గ్రహించిన ఆయన.. సస్యశ్యామలమైన గోదావరీ డెల్టా ప్రాంతాన్ని విడిచి.. వరంగల్లు ప్రాంతానికి చేరుకున్నారు. అప్పుడు ఆయన వయసు పదిహేడేళ్లే. ‘వెళ్తే వెళ్లావు గానీ, వెయ్యి రూపాయలన్నా తీసుకుని వెళ్ల’మని వారి తండ్రి ఎంత చెప్పినా... ‘నాకొక వంద రూపాయలు చాల’ంటూ వచ్చేశారాయన. వరంగల్లు చేరి పోలీసు శాఖలో నెలకు 140 రూపాయల జీతమ్మీద చిన్న ఉద్యోగం సంపాదించారు. ఆ శాఖలో ఎన్నో ఏళ్లు పని చేసి స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. వారి వివాహం 1950లో జరిగింది. నలుగురు సంతానం. 1984లో సతీవియోగమైంది.

శివానందమూర్తిగారు ఉద్యోగ బాధ్యతలనూ, సంసార విషయాలనూ చూసుకుంటున్నా... యోగ సాధనని మాత్రం విడువక అందులో అద్భుతమైన ఫలితాలు పొందారు. అంతేకాక మన వేదవేదాంగ సంబంధమైన గ్రంథాలనూ, భగవద్గీతనూ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. జంగమ విజ్ఞాన సర్వస్వమయ్యారు. 1970 దశకం వచ్చేటప్పటికి తన కార్యక్రమం మొదలుపెట్టారు. ఆసక్తి గల వారికి మన సనాతన ధర్మం గురించీ, ఉపనిషత్తుల గురించీ, గురుతత్త్వం గురించీ ఎన్నో ప్రవచనాలు చేశారు. వారు చెప్పిన విషయాలను ఎప్పటికప్పుడు రాసుకొని దాదాపు 1,500 పేజీల గ్రంథాన్ని తయారు చేశారు పుణ్యాత్ములు కొమాండూరి విద్యావతి- ఆమె భర్త శ్రీనివాసన్‌. గురువుగారు స్వయంగా ఎన్నో గ్రంథాలూ, వ్యాసాలూ రాశారు. ఏ గ్రంథానికదే గొప్పది. ఆయన కఠోపనిషత్తుపై రాసిన భాష్యం అతి విశిష్టమైనది.

ఆత్మానుభూతి పొందడానికి, ఆధునిక కాలంలో శ్రీరమణ మహర్షి బోధించిన ఆత్మమూలాన్వేషణ ఉత్తమ పద్ధతి అనేవారు. కానీ, ముముక్షువులెంత మంది ఉంటారు. సామాన్య ప్రజలకు కూడా ఒక మార్గం చూపాలనేవారు శివానందమూర్తి గారు. ఇతరుల పట్ల గల అక్కరని సూచించే వారి సందేశం చూడండి... ‘‘నేను ఈశ్వరుణ్ణి ప్రార్థించేది ఒక్కటే నా అంతఃకరణలో నేను పొందిన క్షేమం, తృప్తి, శాంతి ఈ మూడూ అందరికీ ఈశ్వరుడివ్వాలి. దేశంలో సంక్షోభము, అశాంతి మొదలైనవి శాంతించాలనీ, మంచివారంతా సుఖపడాలనీ, అందరూ మంచివారు కావాలని కోరడం... భగవంతుని అందుకై ప్రార్థించడం, ఇదే నా కర్తవ్యం.

తృప్తి, అహింస, మత్సరం లేని సర్వభూత హితం, గొప్ప తపస్సు... ఇవి ప్రతి వ్యక్తికీ సాధ్యమే. అదే దేశమంతటా చేసిన ఈశ్వర ప్రతిష్ఠ అవుతుంది. ఎక్కడో ఆలయ ప్రతిష్ఠ కన్నా ఇది గొప్పది’’ (ఇది 2011 డిసెంబరు 20 తన 83వ జన్మదినాన గురువు శివానందమూర్తి గారు ఇచ్చిన సందేశం). ఉద్యోగ విరమణ తరువాత ఆయన ఆధ్యాత్మిక నిలయమనదగిన ‘ఆనందవనం’ అనే తోటలో స్థిరపడ్డారు. ఇది భీమునిపట్టణంలో ఉంది. ఈ తోటలోనే వానప్రస్థాశ్రమ దశకు చేరుకున్న వృద్ధ దంపతులు కూడా నివసించడానికి వీలుగా ఇళ్లు కట్టుకునే వెసులుబాటు కల్పించారు. ఆనందవనంలో ఇంకో రెండు విశేషాలున్నాయి. మొదటిది ఆయన సొంత లైబ్రరీ. దీనిలో అనేక విషయాల గురించి దాదాపు ఇరవైరెండువేల గ్రంథాలున్నాయి.

వీటన్నిటినీ ఆయన చదివారు. రెండోది... మహాలక్ష్మీదేవి దేవాలయం. మన దేశ పశ్చిమ తీరంలో ఉన్నంత సిరిసంపద తూర్పు కోస్తాలో లేదనీ, ఆ కొరతను తీర్చడానికి ఆయన ఈ ఆలయాన్ని ఉద్దేశించారు. ‘దైవభక్తి కన్నా... దేశభక్తి గొప్పది’ అని శివానందమూర్తి నమ్మకం. మన పుణ్యస్థలాలన్నింటినీ శిష్యబృందంతో పర్యటించారాయన. అంతేకాక వేదమతమైన హిందూ ధర్మానికి మూల స్తంభాలు యజ్ఞాలని చెప్పేవారు. లోక కల్యాణానికై... దేశంలో వివిధ ప్రాంతాల్లో దాదాపు రెండు వందలకు పైగా యజ్ఞాలు నిర్వహించారు.

సనాతన ధర్మ ట్రస్టు నెలకొల్పి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి... అజ్ఞాత కళాకారులకు ఒక వేదిక కల్పించారు. ‘సుపథ’ అనే త్రైమాసిక పత్రికను స్థాపించి.. తద్వారా ఎన్నో ఆసక్తికరమైన, చారిత్రక విషయాల గురించి వ్యాసాలు రాసేవారిని ప్రోత్సహించారు. మన దేశ చరిత్రకు వక్రభాష్యం చెప్పిన పాశ్చాత్యులూ, వాళ్లనే అనుసరిస్తూ రాస్తున్న భారతీయ చరిత్రకారుల కబంద హస్తాల నుంచి విముక్తి కలిగించాలనీ, భారత దేశ చరిత్రను సదవగాహనలో మళ్లీ రాయాలనీ అనుకునేవారు.
కఠోపనిషత్తునే విశ్లేషించిన ఆ మహాయోగికి మృత్యుభీతి ఎలా ఉంటుంది? మృత్యువు మన అధీనంలో ఉండాలంటూడేవారు. తదనుగుణంగానే తమ అవతార సమాప్తికి సంబంధించిన నిర్ణయం తీసుకుని... ముందుగానే తన కుమారునికి చెప్పి స్వచ్ఛందంగా దేహత్యాగం చేశారు.

2015 జూన్‌ 10న వరంగల్‌లో ఇది జరిగింది. వారి సమాధి కూడా అక్కడే ఉంది. దీనిని గురుధామం అంటారు. భీమునిపట్టణంలోని ఆనందవన ఆశ్రమమూ, వరంగల్‌లోని గురుధామమూ గురువుగారి స్మృతికి శాశ్వత నిలయాలు. ఇవి కాక కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సమీపంలో ఉన్న బలుసుపాడు అనే గ్రామంలోని గురుధామంలో ఆయన కాంస్య విగ్రహముంది. శివానందమూర్తి గారి బోధనలు సదా ఆచరణీయం. అజ్ఞానాన్ని దూరం చేసే వెలుగు రేఖలు. భాగవతోత్తముడైన గురువుగారిని తలచినంత మాత్రాన ఆనందం కలుగుతుంది. అందుకే ఆయన సదా స్మరణీయుడు.

-పింగళి సూర్యసుందరంBy KK

ఆంధ్రజ్యోతి పత్రిక నుంచి సేకరణ
http://www.andhrajyothy.com/artical?SID=423973
ఆహా ఏమి  రాశావయ్యా!!!!!
ఏమి స్వామి  నీ మహిమ?

 శ్రీశైల మల్లన్నను పాల్కురికి సోమన్న అచ్చులు,హల్లులతో ఎలా స్తుతించాడో
చూడండి.

'అ'ఖిల లోకాధార
'ఆ'నంద పూర
'ఇ'న చంద్ర శిఖి నేత్ర
'ఈ'డితామల గాత్ర
'ఉ'రు లింగ నిజరూప
'ఊ'ర్జితా జలచాప
'ఌ'లిత తాండవకాండ
'ౡ'నికృతా జాండ
'ఏ'కైక వర్యేశ
'ఐ'క్య సౌఖ్యా వేశ
'ఓం' కార దివ్యాంగ  
'ఔ'న్నత్య గుణ సంగ
'అం'బికా హృదయేశ
'అః'స్తోక కలనాశ

'క'నద హీనాభరణ
'ఖ'ల జలంధర హరణ
'గ'ల నాయక విధేయ
'ఘ'న భక్తి విజేయ
'జ'శ్చూల కాలధర
'చ'రిత త్రిశూల ధర
'ఛ'ర్మ యాధ్వస్త
'ఞ'న గుణ ధళ ధీర
'ట' త్రయాది విదూర
'ఠ' ప్రభావాకార
'డ'మరుకాది విహార
'ఢ' వ్రాత పరిహార
'ణ' ప్రవాగార
'త'త్త్వ జోనేత
'థ'వి దూర జవ పక్ష
'ద'వన పాలన దీక్ష
'ధ'రణీ థవోల్లీడ
'నంది కేశారూఢ
'ప'ర్వతీశ్వర లింగ
'బ'హుళ భూత విలాస
'భ'క్త్వ హృద్వ నహన
'మం'త్రస్తుతోధార
'య'క్ష రుద్రాకార
'ర'తిరాజ బిన హంస
'ల'లిత గంగోత్తంస
'ళ'మా విదవ్రంశ
'వ'రద శైల విహార
'శ'ర సంభ వాస్ఫార
'ష'ట్తింశ తత్త్వగత
'స'కల సురముని వినుత
'హ'రి నేత్ర పదపద్మ- అంశిత భూధరపద్మ
'క్ష'ర రహిత చరిత్ర - అక్షరాంక స్తోత్ర
శ్రీ పర్వత లింగ
నమస్తే నమస్తే నమస్తే నమః🙏🙏🙏By Purnachandar 
సోమవారం నాడు శివుడిని పూజిస్తే ఋణ బాధలు ( అప్పులు ) వదిలిపోతాయి ...
By I. Umashankar 
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా, ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. మనకున్న ఎనిమిది దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు ఆయనే అధిపతి.

ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఉమా అంటే మహేశ్వరితో కూడిన వాడైన పరమేశ్వరుడు. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మనకున్న దారిద్ర్యము, సమస్యలు పోవాలంటే శివుడిని ఈవిధంగా పూజించాలి.

1. సోమవారం ముందుగా తలస్నానం చేయాలి. ఆ తరువాత పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టుపెట్టి దీపారాధన చెయ్యాలి. పూలు సమర్పించుకోవాలి ( తుమ్మి పూలు , మోదుగ పూలు శ్రేష్టమైనవి ). తరువాత శివఅష్టోత్తరం చదువుతూ విభూదిని సమర్పిచి , ఆ విభూతిని నుదిటిన ధరించాలి.సాయంత్రం వరకు ఉపవాసము ( పాలు , పండ్లు వంటివి తీసుకోవచ్చు ) ఉండి , శివాలయానికి వెళ్లి ఆవు నేతితో దీపారాధన చేయాలి .

2. సాయంత్రము పరమశివునికి నైవేధ్యంగా నేతితో తాలింపు వేసిన దద్యోధనం ( పెరుగన్నం ) సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. ముఖ్యంగా దేవునికి పూజ చేసినా, ప్రసాదం పెట్టినా ఏకాగ్రమైన మనసుతో చేయాలి. అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు.

3. మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని మూడు కనులకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది.

4. ఏ పండైనా శివునికి ప్రసాదంగా పెట్టవచ్చు. అయితే శివునికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయిష్షును సూచిస్తుంది. ఈ పండుని స్వామికి సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది.

5. ఉమామహేశ్వరులను వేకువ జామున పూజించడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు.

వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి

దయచేసి అందరికీ షేర్ చేయండి

అందరం అరుణాచల శివ అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ...

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

Sunday, June 9, 2019

Veeerabhadra Pallem  . Posted by Samanth Mudigonda - details not posted 

శివుని యాజ్ఞ మనకు శిరోధార్యముగాన/
హరుని ధ్యానమొసగు హాయి గనుక/
మీదు స్మరణలోన మీమాంస లేదులే/
శివపురీశ దేవ చిద్విలాస/🙏