Wednesday, June 5, 2019

ధరను వ్యాధి తొలగు ధర్మము చేతను/
మిత్రులౌ గ్రహాలు శత్రు హరము/
ధర్మమున్నచోట దక్కును విజయము/
శివపురీశ దేవ చిద్విలాస/🙏by M. SUBRAHMANYAM

Tuesday, June 4, 2019

*కుల దైవాన్ని ఎందుకు మీరు మరచి పోతున్నారు? అలా చేయడం శ్రేయస్కరం కాదు.* by I. Umashankar

భారతీయ కుటుంబ వ్యవస్థలో, కులదైవం ఆరాధన ఎంతో విశిష్టమైనది. ఈ రోజు చాలా భారతీయ కుటుంబాలు, కులదైవాన్ని మరచి పోతున్నాయి. తదనుగుణ నష్టాలు చవి చూస్తున్నాయి. భార్యా-భర్తల మధ్య మధ్య సంతానం లేకపోవడం , వారిద్దరి మధ్య మనస్పర్దలు రావడం, తద్వారా కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్దలు రావడం, కుటుంబ ఆర్దిక పరిస్థితులు తలక్రిందులు కావడం....ఇలాంటి వన్నీ కుల దేవతారాధన నిర్లక్ష్యం వలనే వస్తాయి.
కులం అనేది ఒక సామాజిక వ్యవస్థ లో ఒక భాగం.కాబట్టి కుల దేవతా ఆరాధనలు మరల ణనం ప్రోత్సహించాలి. ఆయా కులాల్లో ఎప్పటి నుండి ఉందో..... అప్పటి నుండి కులదేవతలు ఉన్నారు. ఒక కులం ఒకే రకమైన ఆచార వ్యవహారాలు పాటిస్తే, వారంతాఒక దేవతను పూజిస్తే ఆ దేవతను ‘కులదైవం’ అంటారు. ఉదా॥ విశ్వబ్రాహ్మణులు ‘విశ్వకర్మ’ను కులదేవతగా పూజిస్తారు. అలాగే చాలా కులాలకు కులదేవతలు ఉన్నారు.

అదే విధంగా ఎవరి ఇంటిని ఈ దేవుడు కాపాడుతున్నాడో వారిని ఇంటిదేవతగా భావిస్తారు. ఈ ఇంటి దేవతల సంప్రదాయం త్రేతాయుగం లేదా అంతకు మించిన కాలాల  నుండి కన్పిస్తుంది. ఈ ఇంటిదేవతలను గృహంలో చిన్న అరలో ప్రతిష్టించుకొని, గృహాల్లో ఆయా సమయాల్లో పూజించి తిరిగి పైనున్న గూడు(అర)లో పెట్టడం పూర్వ సంప్రదాయం. అందుకే ‘ఉద్వాసన’ (దేవుని పూజ తర్వాత చెప్పడం) అనే మాట వచ్చింది. ఉత్  అంటే పైన, వాసం  పెట్టడం అని అర్థం. పూజాది ఉత్సవాల అనంతరం ఈ ఇంటిదేవతను ఉద్వాసంతో అటకపైకి ఎక్కిస్తారన్నమాట. మొదటి యుగాల్లో చాలామందికి గ్రామదేవతల్లాంటి దేవతలే ఇలవేల్పులుగా ఉండేవారు. అయితే చాలా మందికి పురాణదేవతలు కూడా ఇంటి దేవతలుగా ఉంటుంటారు. కొందరికి దక్షిణామూర్తి, మరికొందరికి హయగ్రీవుడు ఇంటిదేవుళ్లు ఉంటే, మరికొందరికి నరసింహస్వామి, వేంకటేశ్వరుడు, శ్రీరాముడు, పాండురంగడు, శ్రీరంగడు ఇంటిదేవుళ్లుగా ఉన్నారు. ఈ ఇంటి దేవతలు గల గృహస్థులు తమ గృహాల్లో జరుపుకొనే ఏ కార్యక్రమంలోనైనా వీరికి ప్రాధాన్యతనిచ్చి, మొదట పూజించి ఇతర కార్యక్రమం పూర్తి చేస్తుంటారు.సీతారాములు తమ పట్టాభిషేకానికి ముందు నారాయణోపాసన చేసినట్లు శ్రీమద్రాయణం తెలియచేస్తుంది.

అలాగే శ్రీకృష్ణుడి ఆగడాలను యశోద ఫిర్యాదు చేసే సమయంలో తమ గోడలపై ఉన్న దేవతలను బాలకృష్ణుడు ఎంగిలి చేశాడని భాగవతం కూడా తెలియచేస్తుంది. కాబట్టి ఇంటి దేవతల సంప్రదాయం యుగాల నుండి  ఉన్న ఉన్నది తెలుస్తుంది.తమ కోర్కెలు సిద్ధింపచేసే దేవతల్ని ఇష్టదైవం అంటారు. అందులో పౌరాణిక దేవతలు, గ్రామ దేవతలు ఎవరైనా ఉండవచ్చు. ఇష్టదైవానికి నమస్కరించి యోగం చేయాలని యాజ్ఞవల్క్యమహర్షి కూడా చెప్పడం జరిగింది. అలాగే పరబ్రహ్మ సాధకమైన యోగమార్గానికి ఆటంకం కలిగించకుండా ఇష్టదేవతలను, ఇంటిదేవతలను ప్రార్థించాలని యోగశాస్త్రాలు తెలియచేస్తున్నాయి.

 *కుల దేవతారాధన వలన ప్రయోజనములు :*

 గృహకలహాలు ఉండవు,ఆర్దిక సమస్యలు ఉండవు, చుట్టు ప్రక్కల ఉన్న ఉన్న సమాజంతో సమస్యలుండవు, సంతాన సమస్యలుండవు,పిల్లలు చెప్పిన మాట వినక పోవడం లాంటి సమస్యలుండవు. భార్యా భర్తల మధ్య వైమనస్యాలు ఉండవు.
👆forwaded By I . Umashankar
*Mantrapushpam from Yajurveda*. It is a treasure, save it in a separate folder in your memory card and listen daily morning to get good health  and wealth. For the benefit of all english meaning also given. Stay blessed. This is the truth. I 
సంన్యాసులు ఆరు రకాలు :By Sivananda Nirmala

1. కుటీచకుడు : శిఖ , యజ్ఞోపవీతము, దండ- కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తి మార్గంలో పయనిస్తూ  అల్పాహారం తీసుకుంటూ ఉంటారు .

2 .బహూదకుడు : ఇతను రోజుకు ఎనిమిది కబళములు ఆహారం తీసుకుంటూ, నిత్యం సాధన చేస్తూ ఉంటారు.

3. హంస : ఇతను జడధారియై కౌపీనం ధరించి, జ్ఞానియై ఉంటాడు.

4 .పరమహంస : వెదురు దండాన్ని కలిగి , ఐదు గృహాల నుండి భిక్ష తెచ్చుకుని కౌపీనం మాత్రం ధరించి ,
 నిరంతర సాధన లో ఉంటారు .

5.తురియాతీతుడు : దేహాన్ని ఓ శవంలా చూస్తాడు .

6.అవధూత :

ఇతనికి ఏవిధమైన నిష్ఠ నియమాలు లేవు .జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం అంటూ ,
నాశనమయ్యే ఈ శరీరం నేను కాదు, చూసే వాడికి కనిపించే ఈ రూపం నాది కాదు .
నాకు పాప పుణ్యాలు , సుఖ దుఖాలు లేవు , గర్వము మాత్సర్యము , దంభము , దర్పము , ద్వేషము ,
అన్నింటిని త్యజించి ప్రాణాలు నిలుపుకోవడానికి
అగ్ని దేవుడికి కాస్త దొరికిన ఆహారం అర్పణ చేస్తూ ,
దొరకని రోజు ఏకాదశి , దొరికిన రోజు ద్వాదశి అంటూ....
రాత్రి పగలు నిత్య ఎరుకతో సంచారం చేస్తూ పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు .
కర్మలు అన్ని క్షయం అయిపోయి, వరించిన మోక్షం అనే కంబళి కప్పుకుని ఉంటాడు ... ( నిర్వాణ షట్కానికి ప్రతి రూపం - అవధూతల మరో రూపం )


ఆత్మసాత్కాక్షారం నుండి ..........

Monday, June 3, 2019

*మాంగల్యం*~ దాని ప్రాముఖ్యత:

దౌర్భాగ్య పరిస్థితి ఏమిటంటే మన హిందూ సోదరీమణుల నవీనత పరాకాష్టకి వెళ్లి మంగళసూత్రాన్ని త్యజించడం / లేదా పక్కనపెట్టడం పరిపాటిగా మారింది. అంతేకాక ఈ  సినిమాలు టీవీల పుణ్యమా అని అది ఒక ఆట వస్తువుగా మారిపోయింది. 
మన ఖర్మ కొద్దీ మన బంధు మిత్రగణాల నుండి వచ్చే వాట్సాప్ లు ఫేస్బుక్ లలో వచ్చే ఫోటోలు కూడా,  ఎక్కువ శాతం మంగళసూత్రాలు, బొట్టు, గాజులు లేకుండా ఉన్నవే. ఇది చాలా అరిష్టం.
క్షీరసాగరమధన సందర్భంలో మాంగళ్యవివరణ
“మ్రింగెడివాడు విభుండని మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మ్రింగుమనే సర్వమంగళ మంగళసూత్రంబు నెంత మదినమ్మినదో!*

పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవి గా ఉన్నడంటే అది ఆయన గొప్ప కాదట, అమ్మ పార్వతీ దేవి కంఠాన్న ఉన్న మాంగల్యాభరణం గొప్పదనమట.

“మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాంశతం”

ఓ సుభగా! నా జీవనానికి ఆధారమైన ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్ళు జీవించు, అంటే పుణ్యస్త్రీగా, ముత్తయిదువుగా సకల సౌభాగ్యాలతో జీవించు అని స్పష్టముగా తెలుస్తున్నది.

పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు ఎటువంటి ఆచారాలు, కట్టుబాట్లు ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి.

భారతావనిలో పిండారీలు, థగ్గులు వంటి కిరాత జాతులవారు వలస వచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొనిపోయేవారు. మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు. కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని గౌరవించారు. అలా కోట్లాది మగువల మాన ప్రాణాలను కాపాడిందీ మంగళసూత్రం. అందుకే అప్పటినుండీ ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్ళి చేసి మాంగల్యం వేసేవారు.

ఆదిశంకరాచార్యుల వారు వ్రాసిన సౌందర్యలహరి పుస్తకములో కూడా మంగళ సూత్రానికి విశేష విశిష్టత కల్పించారు.

మంగళసూత్రంలో ముత్యం, పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది, ఎందుకంటే, ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు, అన్యోన్యదాంపత్యములకు కారకుడు, శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంథులు, సిరలు, ధమనులు, స్తనములు, స్త్రీల గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భధారణ, ప్రసవములకు కారకుడు.

పగడం కుజగ్రహనికి ప్రతీక. కుజగ్రహ దోషాల వలన అతికోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని, విద్యుత్భయములు, పరదూషణ, కామవాంఛలు, దీర్ఘసౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు మరియు శారీకంగా ఉదరము, రక్తస్రావము, గర్భస్రావము, ఋతుదోషములు మొదలగునవి.

ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27. ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారంగావించి 28వ రోజున
కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతుసమయం. అంటే అర్ధం, ఆరోగ్యమైన స్త్రీకి 28వ రోజులకు ఋతుదర్శనమవాలి.

భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యం మించిన విలువైనది లేనేలేదు, దానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది.
అదేమిటంటే ముత్యం పగడం ధరించిన పాత తరం స్త్రీలలో ఆపరేషన్ అనేది చాలా అరుదైన విషయం. కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్తోనే జరగటం సర్వ సాధారణమైపోయింది.

ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీకేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగా, భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయనటంలో ఎటువంటి సందేహం వలదు.

కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం, పగడం రెండూ కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభఫలితాలు సమకూర్చగలవు.

పాశ్చాత్య అనుకరణ వెర్రిలో ఊగుతున్న మన ఆడ కూతుర్లను మందలించైనా తిరిగి మన ధర్మం వైపు తీసుకుని వద్దాం. దీని విశిష్టతని అర్ధం అయ్యే వరకు తెలియపరుద్దాం.by MALLIKHARJUN 

ఎందరో మహానుభావుల కష్టము/
మేటి బాటలేసె పీఠమునకు/
వారి దూరదృష్టి వమ్ముకాదెన్నడు/
శివపురీశ దేవ చిద్విలాస/🙏

Sunday, June 2, 2019

శైవ పాఠకులకు సేతువుగా నిలచు/
మాసపత్రికొకటి మనది గలదు/
పొసగ శైవమతప్రబోధినియను పేర/
శివపురీశ దేవ చిద్విలాస.                                          /🙏లలిత భావముల సలక్షణ రచనలు/
వాసి గల్గి దనరు వాటి మించి/
సాంఘికాంశములతొ సంపాదకీయాలు/
శివపురీశ దేవ చిద్విలాస/🙏                                        ఇందుధరుని కృపతొ ఇంతింతగా నెదిగె/
పాఠకులను పెంచి పదునుబెట్టె/
మనసు దోచబూనె మన మాసపత్రిక/
శివపురీశ దేవ చిద్విలాస/🙏