Tuesday, March 12, 2019

మన కర్మలకు పద్దెనిమిది మందిసాక్షులు...!!
ఓం శని ఈశ్వరాయనమః.

🤝చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత...కానీ...
🤝‘నేను ఒక్కడినే కదా ఉన్నాను,
నన్ను ఎవరూ గమనించడం లేదు’
అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు .
🤝మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి . అవి
నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి .

🤝వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి .

🤝ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని,
🤝వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు .

🤝దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు .

🤝ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి .
🤝అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి .
🤝ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి . అది వాటిని కర్మలుగా మలుస్తుంది . మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది . సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి .

🤝అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు .
🤝ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం .
 🤝అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు .
🤝అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది .

🤝 కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే .
🤝 ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం .
కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము . అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం .
 🤝నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం .

 🤝అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం .
🤝ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు .

 🤝ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం . ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు .

                     ఇట్లు
                       మీ
                   స్వామీజీ

Sunday, March 10, 2019

 🙏
స్నానం చేస్తుండగా
మాట్లాడుతూ
స్నానం చేస్తే
వరుణ దేవుడు
అందాన్ని అపహరిస్తాడు,!!

హోమం&జపం
చేస్తున్నప్పుడు
మాట్లాడుతూ చేస్తే
అగ్ని దేవుడు
సంపదను అపహరిస్తాడు,!!

భోజనం చేస్తున్నప్పుడు
మాట్లాడుతూ
భోజనం చేస్తే
మృత్యు దేవుడు
ఆయుష్షు ని
అపహరిస్తాడు,!!

కావున
"స్నానం"
"హోమం" +"జపం"
"భోజనం"
చేస్తున్నప్పుడు,
మౌనం" పాటించాలి,...

(వ్యాస 'మహర్షుల)
వారి ఉవాచ...
👏
**అంటు దోషము లేనివి**

శ్లోకం!!
అజ్ఞానం శుచిసర్వమాపణిగతం భైక్షం గుడం మాక్షికం!
శృంగం చర్మపతత్రిఖండితఫలం కారో:కరం స్త్రీ ముఖం!
దంతస్థా: పృపతశ్చ వేదవిదుషా మాచామలేశాశ్శుభా!
శ్శయా వస్త్రవధూకమండలునుతాస్స్వీయాశ్చ మేధ్యాశ్శుభా:!!
తాత్పర్యము:-
మనకు తెలియక పూర్వము అపవిత్రమైన ఉన్నను మనం చూసే సరికి శుచిగా ఉన్న ప్రతి సరుకును బజారు ఎందుకు ఉన్న మధుకరాన్నాదులు, బెల్లం, తేనె,గొరదేదికొమ్ము, కృష్ణాజినము,చిలుక కొరికిన పండు,కంసాలి ముంజేయి,స్త్రీ ముఖము,వేదోచ్చారణ చేయునప్పుడు  నోటి నుండి పడే తుంపరలు,ఆచమనము చేయునప్పుడు చెదిరిపడిన నీరు, పక్క పరుపు,కట్టుబట్ట,భార్య,కమండలము(తన చెంబు),కుమారుడు వీరు ఎల్లప్పుడూ శుచిగలవారు.

Saturday, March 9, 2019

 రాజమండ్రి లోపెండ్లికి వ్యాఖ్యానం చేస్తూ డా ముదిగొండ Amarnath Sarma garu 
శ్రీ మాడుగుల నాగఫణిశర్మగారి శతావధానం లో. సమస్యాపృచ్ఛకుడిగా ....
మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ.
అది ఏమిటంటే..!

"అనాయాసేన మరణం
వినా ధైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం."

మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి.

దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి.

"అనాయాసేన మరణం"
*****************
నాకు నొప్పి లేక బాధ కానీ లేని
మరణాన్ని ప్రసాదించు.

"వినా ధైన్యేన జీవనం"
*****************
నాకు ఎవరి మీదా ఆధారపడకుండా,
నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.

"దేహాంతే తవ సాన్నిధ్యం"
*******************
మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను
నిన్ను దర్శించుకునే విధంగా దీవించు.

*దేహిమే పరమేశ్వరా*
*****************
ఓ పరమేశ్వర నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.

1)అనుక్షణం నీ ప్రార్ధనలొనే గడిపే విధముగా అనుగ్రహించు.నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.
2)ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.
3) నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా
ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు.
ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు  చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాదిస్తాడని మరువకండి.
" లోకా సమస్తా🚩 సుఖినో భవంతు..!! 🌹🌞

*అనాయాసేన మరణం*
*వినా ధైన్యేన జీవనం*
*దేహాంతేతవసాన్నిధ్యం*
*దేహిమే పరమేశ్వరా*
******************
శివుని ఆభరణాలు..!!
ఓం నమః శివాయ హరహర మహాదేవ శంభో శంకరా..!!

శివుని ఆభరణాలు, ఆయుధాలకి సంబంధించి ఏదైనా అంతరార్థం ఉందా?
దానికి ధర్మగుప్తులు వారు ఈ వివరణ ఇచ్చారు: "గణపతికి పాశాంకుశాలు,
విష్ణువుకి సుదర్శన చక్రం
ఎలాంటి ముఖ్య ఆయుధాలో..
శివునికి త్రిశూలం అలాంటి ముఖ్య ఆయుధం.

త్రిశూలానికి మూడు కొనలుండి అడుగున
వాటిని కలుపుతూ శూలహస్తం ఉంటుంది.
మూడు కొనలు సత్వ, రజస్, తమో గుణాలను సూచిస్తే..
ఆ శూలహస్తం వాటి ఏకత్వాన్ని.సూచిస్తుంది.

ఇక్కడ త్రిగుణాల ఏకత్వం అంటే వాటికి అతీతమైన తత్త్వం అని అర్థం.
అంతేకాకుండా ఇడ, పింగళ, సుషుమ్ననాడులు మూడూ శిరస్సులోని జ్ఞాన కేంద్రం దగ్గర కలుస్తాయి.
దీన్నే త్రివేణి సంగమం అంటారు.
ఆ మూడు నాడులు మూడు కొనలని సూచిస్తే
జ్ఞానకేంద్రం శూలహస్తాన్ని..
వాటి ఏకత్వం త్రిగుణ సంగమాన్ని
సూచిస్తుంది.

ఆకాశం శబ్ద గుణంతో కూడుకొని ఉంది.
ఆకాశంలో ధ్వనుల ప్రకంపనలు ప్రయాణం చేస్తుంటాయి.
మనం పవిత్రమైన మంత్రాలను శ్రద్ధాసక్తులతో చదివేటప్పుడు కాని, వినేటప్పుడు కాని
వాటినుండి మధురమైన ఢమరుక నాదం వినిపిస్తుంది.
యోగులకు ఇది మహదానందాన్ని కలిగిస్తుంది.
దీన్ని సూచిస్తూ శివుని త్రిశూలానికి ఢమరుకం కట్టి ఉంటుంది.

సర్పిలాకారంలో ఉండే కుండలినీశక్తిని సూచిస్తూ శివుడు సర్పాలను మెడలో ధరిస్తారు.
అందుకే నాగాభరణుడు అనే పేరు ఉంది.
ఈ కుండలినీ శక్తి విజృభించినపుడు అష్ట సిద్ధులు కలుగుతాయి.
ఈ అష్టసిద్ధులు శివుని నియంత్రణలో ఉండటం వల్ల, వారు అష్టసిద్ధులకు ప్రభువు అవడం వల్ల
ఆయన్ని ఈశ్వరుడు అని పిలుస్తారు.
ఈశ్వరుడు అనే పదానికి ప్రభువు అని అర్థం.

జ్ఞానికి యోగదృష్టి కలగడానికి,
భూత, భవిష్యత్, వర్తమానాలు గ్రహించడానికి ఆజ్ఞాచక్రం వికసించాలి,
అది వికసించినదన్న సంకేతమే శివుని మూడోకన్ను.

తాంత్రిక సిద్ధులు పులిలా భయంకరమైనవి.
వాటిని పూర్తిగా లొంగదీసి తమ అధీనంలో పెట్టుకున్నానని తెలుపుతూ శివుడు
వ్యాఘ్రచర్మం ధరిస్తారు.
నిర్మలమైన బ్రహ్మ జ్ఞానానికి, అమృతత్త్వసిద్ధికి
పరమ పావని గంగ సంకేతమయితే
నిత్య ప్రసన్నత్వంవల్ల కలిగే ప్రశాంత ఆనందాన్ని నెలవంక సూచిస్తుంది.

స్త్రీ పురుషులు ఇద్దరిలోను స్త్రీ, పురుష తత్త్వాలు రెండూ కలిసే ఉంటాయి.
శరీరం కుడిభాగంలో ఉండే శక్తి పురుష శక్తి, ఎడమభాగంలో ఉండే శక్తి స్త్రీశక్తి.
ఈ శక్తుల అవిచ్ఛిన్న సంయోగమే అర్థనారీశ్వరత్వం. ఇంతేకాక కాలచక్రం కూడా అర్థనారీశ్వర తత్త్వమని, ఎన్నడూ విడదీయరాని జంట అని తెలుసుకోగలగాలి.
రాత్రి-పగలు, పౌర్ణమి-అమావాస్యల వంటివి
అన్నీ ఒక దానిమీద ఒకటి ఆధార పడి ఉంటాయి.
ఒకటి లేనిదే మరొకటి లేదు.

శివుడు సంహారకారకుడు అంటే పాతసృష్టిని తీసి
కొత్త సృష్టిని కల్పించేవాడని అర్థం.
ధనుస్సు ధరించి ఆర్ద్రా నక్షత్రంలో గోచరమయ్యే రుద్రుడు పరుగులు తీస్తూ పారిపోతున్న జింకను వెన్నంటి వేటాడే వేటగానిలా కనిపిస్తారు.
ఇది ఆకాశంలో మిథున కర్కాటక రాసులకు అడ్డంగా ఐమూలగా ఉంటుంది.
ఈ నక్షత్ర మండలానికి దగ్గరగా క్రూరగ్రహాలైన
శని, కుజ, రాహు, కేతువులు సంచారం చేసినట్లయితే
ప్రపంచ యుద్ధాలు, ప్రళయాలు జరుగుతాయి.

యోగాగ్ని వల్ల అన్ని కోరికలు భస్మమైనట్లయితే
ఏ కోరికలూ లేని వైరాగ్యస్థితి కలిగి,
ఆ వైరాగ్య స్థితిలో చక్కటి ప్రశాంతతతో కూడిన నిర్వాణస్థితి అనుభవంలోకి వస్తుంది.
దీన్ని సూచిస్తూ శివున్ని స్మశానవాసి అంటారు.

విభూతి పవిత్రమైన తెల్లటి జ్ఞానానికి గుర్తు.
అధిభౌతిక, అధిదైవిక, ఆధ్యాత్మిక,
ఈ మూడు స్థాయిలలోను జ్ఞానప్రాప్తి లభిస్తుంది.
పైన చెప్పిన బాధలను శరీరం అనుభవిస్తూ ఉన్నా నిజమైన సాధకుడు ఆత్మను పరిశుద్ధంగా ఉంచుతూ దైవ సాన్నిధ్యాన్ని పొందవచ్చును అనే విషయాన్ని సూచిస్తూ శివభక్తులు మూడు విభూతి రేఖలను (త్రిపుండ్రాలు) ధరిస్తారు.
స్వస్తి..!!