*తొలి ఏకాదశీ
దక్షిణాయనంలో ప్రారంభమయ్యే పండుగల పరంపరకు ముందు వచ్చే పర్వదినం తొలి
ఏకాదశీ.. మరి ఈ పర్వదినం రోజున *'తులసీ దళములచే సంతోషముగా పూజింతు' అనే
త్యాగరాజ వారి కీర్తనతో ఐదు నిముషాలు సంతోషంగా మనసులో ఆ పరమాత్ముని
ధ్యానిద్దాం..*
త్యాగయ్య గారు నిత్యము చేయు పూజానుష్టానము కొరకు ఆయన శిష్యుడు వేంకటరమణ
ప్రతిదినము అయ్యంపేట నుండి *తులసీ దళములను,* మాలలను సమకూర్చి, అయ్యంపేట
నుండి తిరువయ్యారుకు అడ్డత్రోవన ఏడు మైళ్ళు నడిచి, వాటిని పూజా సమయానికి
అందించేవారు. అంతేకాక పూజ అయిన తర్వాత మంగళం కూడా గానం చేసేవారట. అయితే,
పూజ కోసం ఈ తులసీపత్రిని సమకూర్చేది వేంకటరమణ గారేనన్న విషయము త్యాగయ్య
గారికి తెలియదు. ఒకనాడు కొంత అస్వస్థత కారణంగా వేంకటరమణ గారు పూజా సమయానికి
తులసీ దళాలను అందించలేక పోయారు. ఆనాడు పూజలో తులసీ దళాలు లేకపోవడంతో,
విషయమేమిటో తెలుసుకొని, వేంకటరమణ గారి భక్తి విశేషములను గ్రహించారు. ఇంతలో
త్యాగయ్యగారు పూజకు ఉపక్రమించగా వారి భార్య కమలమ్మ గారి దగ్గరకు ఒక సాధువు
రూపంలో *శ్రీకృష్ణుడు* వచ్చి భాగవతార్ వస్తున్నారు! వచ్చి మంగళం పాడతారు,
ఆగండి అని చెప్పి వెళ్ళిపోయారు. వేంకటరమణ గారు కృష్ణభక్తుడు కావడం వలన
కృష్ణుడే ఆ విధంగా వచ్చి వేంకటరమణను భాగవతార్ అని సంభోధించడం వలన, ఆనాటి
నుండి వీరు వేంకటరమణ భాగవతార్ గా పిలువబడ్డారు. ఈ సంఘటన వలన కమలమ్మ గారికి
కూడా కృష్ణుని దర్శన భాగ్యం కలిగింది.
మరుసటి దినము నుండి వేంకటరమణ భాగవతార్ తిరిగి తులసి దళములను త్యాగయ్యకు
సమర్పించడం, వాటిని త్యాగయ్య గారు ఆనందంగా స్వీకరించడం జరిగింది. ఒకనాటి
ఉదయం వేంకటరమణ గారు గురువుగారికి పూజకోసం తులసీదళాలు, పూవులు సమకూర్చారు.
*త్యాగరాజు గారు పూజను ప్రారంభించి తులసీ దళములచే అను కృతి పాడుతూ
పుష్పార్చన చేస్తున్నారట. ఆశ్చర్యకరంగా, సరసీరుహ పున్నాగ అని చరణం
పాడుతుండగా, వారు పాడుతున్న వరుస క్రమములోనే అవే పుష్పములను చేతిలోనికి
తీసుకుని పూజించటం గమనించారు.* అనుకోని ఈ ఘటన యందు గల దైవసందేశాన్ని
గ్రహించి త్యాగరాజు గారు వేంకటరమణకి సంగీతం చెప్పడం ప్రారంభించారు.
త్యాగరాజుగారు కృతులను ఆశువుగా పాడి రచిస్తూండేటప్పుడు పక్కన కూర్చుండి
వ్రాసే శిష్యులలో ప్రముఖుడీయన. వ్యాసునకు భారతం వ్రాసిపెట్తిన గణపతి వలె
గురువుగారి కితడు వ్రాసిపెడుతున్నాడనే అభిమానంతోనో, లావుగా, పొడుగ్గా
ఉండేవాడనో ఇతనిని సహాధ్యాయులంతా గణపతి అని పిలిచేవారట.
మరి త్యాగయ్య గారు _మాయామాళవగౌళ_ రాగములో రచించిన ఈ మహిమాన్వితమైన కృతిని
*కేజే ఏసుదాస్* గారు అద్భుతంగా ఆలపించిన అమృత స్వరం ఎంపీత్రీ ఎటాచ్
చేయబడినది. మీకు సమయం అనుకూలించినపుడు ఈ రోజు ఈ కృతిని వినగలరు.
🙏🎸🎸🎧🎸🎸🙏
_పల్లవి_
తులసీ దళములచే సంతోషముగా పూజింతు
_I shall joyously (santOshamugA) worship (pUjintu) with tulasI leaves (daLamulacE)_
_అనుపల్లవి_
పలుమారు చిర కాలము పరమాత్ముని పాదములను (తులసీ)
_For a long (cira) time (kAlamu), I shall always (palumAru) (literally
often) joyously worship the holy feet (pAdamulanu) of the Supreme Lord
(paramAtmuni) with tulasI leaves._
_చరణం_
సరసీరుహ పున్నాగ చంపక పాటల కురువక
కరవీర మల్లికా సుగంధ రాజ సుమముల్
ధరనివియొక పర్యాయము ధర్మాత్ముని సాకేత
పుర వాసుని శ్రీ రాముని వర త్యాగరాజ నుతుని (తులసీ)
_In this (oka) birth (paryAyamu) (literally occasion or opportunity) on
the Earth (dharanu), I shall joyously worship Lord (vara) SrI rAma –
dharmA embodied (dharmAtmuni), resident (vAsuni) of ayOdhyA (sAkEta)
town (pura), extolled (nutuni) by this tyAgarAja – with these (ivi)
(dharaniviyoka) best (rAja) fragrant (sugandha) flowers (sumamul) -
lotus (sarasI-ruha), punnAga, campaka, pATala, henna (kuravaka),
oleander (karavIra), jasmine (mallikA), and tulasI leaves._
🙏👇🎧👇🙏