Tuesday, July 17, 2018

యజ్ఞోపవీతం.





గణార్చన 11.07.2018

గణార్చన  11.07.2018

  మహే శ్వర స్థానములో ములుగు హనుమంత రావు గారు . 

తాడికొండస్ శశిభూషణ్ దంపతులు -పూజ నిర్వహించారు 

|| మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర |

తస్మాత్ జాగ్రత జాగ్రత !

1. శ్లో|| మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర |
              అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు అందుచే ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

2. శ్లో|| జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|
      సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, ఈ సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

3. శ్లో|| కామశ్చ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|
      జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా :-  కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు  విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

4. శ్లో|| ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|
      ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఎదియో చేయవలెనను ఆశతోనే జీవింతురు. కానీ తరిగిపోవుచున్న జీవిత కాలమును గుర్తింపరు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

5. శ్లో|| సంపదః స్వప్రసంకాశాః యౌవనం కుసుమోపమ్|
      విధుఛ్చచంచల ఆయుషం తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, యౌవనము ఒక పూవు వలె మనజీవితములో స్వల్ప కాలము మాత్రమే ఉండునది. ఈ జీవితమూ మెరుపు వలె క్షణభంగురము. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

6. శ్లో|| క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితమావయోః|
      యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

7. శ్లో|| యావత్ కాలం భవేత్ కర్మ తావత్ తిష్ఠతి జంతవః|
      తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్ర కా పరివేదన||

తా:- మనుషులకు వారి కర్మానుసారము జీవితకాలము ఉండును. అది తీరిన తరువాత వారును నశింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?

8. శ్లో|| ఋణానుబంధ రూపేణ పశుపత్నిసుతాదయః|
      ఋణక్షయే క్షయం యాంతి తత్ర కా పరివేదన||

తా:- గత జన్మ ఋణానుబంధముచే పశు, పత్ని పుత్ర లాభము గల్గును. ఆ ఋణము తీరగనే వారును పోవుదురు. దానికై దుఃఖించుట ఎందులకు?

9. శ్లో|| పక్కాని తరుపర్ణాని పతంతి క్రమశో యథా|
      తథైవ జంతవః కాలే తత్ర కా పరివేదన||

తా:- చెట్ల యొక్క పండిన ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?

10. శ్లో|| ఏక వృక్ష సమారూఢ నానాజాతి విహంగమాః|
      ప్రభతే క్రమశో యాంతి తత్ర కా పరివేదన||

తా:- రాత్రి చెట్లపై వివిధ జాతుల పక్షులు చేరును. మరల సూర్యోదయము కాగానే ఒక్కటోక్కటిగా ఎగిరిపోవును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?

11. శ్లో|| ఇదం కాష్టం ఇదం కాష్టం నధ్యం వహతి సంగతః|
      సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన||

తా - ప్రవహించుచున్ననది లో కళేబరములు తేలుచు, ఒకప్పుడు కలియుచు ఒకప్పుడు by విడిపోవుచుండును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?

Saturday, July 14, 2018

మహా వరాహీ దేవి.

ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్తనవరాత్రులు అంటారు. అమ్మవారి వైభవం గురించి కొంత.......

లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహా వరాహీ దేవి. లలితా దేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు. ఆమెకు ప్రత్యేక రథం ఉంది, దానిపేరు కిరి చక్రం. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి, రథసారథి పేరు స్థంభిని దేవి. ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరీ, మరియు దేవవైధ్యులైన అశ్విని దేవతలు. 

కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |
జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా || 27 ||
భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా || 28 ||
భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా |
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా || 29 ||
విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |

అంటూ లలితా సహస్రనామాల్లో హయగ్రీవ, అగస్త్యులు ఈ అమ్మవారి గురించే చెప్పుకున్నారు. విశుక్రుడిని ఈ తల్లి హతమార్చింది.
ఈ అమ్మవారిని ఆజ్ఞా చక్రంలో ధ్యానిస్తారు.

వారాహీ అమ్మవారు అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు, శ్రీ మహావిష్ణువు వరాహరూపంలో అవతరించి, వాడిని సంహరించి, భూమాదేవిని రక్షిస్తాడు. స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహీ రూపం తీసుకుందని, అందువలన ఈమె #వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యానశ్లోకాల్లో కనిపిస్తుంది. అంటే వారాహీ అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ #మహాలక్ష్మీ. అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీ ధరణీ ధ్రువా అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరహాస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది. భూతగాదాలను నివారిస్తుంది, లేదా పరిష్కరిస్తుంది. 

అమ్మవారిని చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆవిడ హలము (నాగలి), ముసలము (రోకలి) ధరించి కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే, రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీనిబట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లీ శ్రీ వారాహీ మాత. అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు. ఎందుకంటే వ్యవసాయం ఈ జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లోనే మొదలుపెడతారు. నిజానికి రైతు గోఆధారితం వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి, సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహీ ఉపాసనే అవుతుంది. ఎందుకంటే వారాహీ అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత. 

#వారాహీ అమ్మవారిని చూసి ఉగ్రదేవతగా భ్రమపడతారు కొందరు. కానీ వారాహీ చాలా శాంతస్వరూపిణి. వెంటనే అనుగ్రహిస్తుంది, కరుణారస మూర్తి అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. వారాహీ అమ్మవారిని స్మరిస్తే శత్రు నాశనం జరుగుతుంది, అంటే వ్యక్తిలో ఉన్న అంతఃశ్శత్రువులైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అహంకారం, అజ్ఞానం నశిస్తాయి. అంతఃశ్శత్రువులను జయించినవాడికి బయట శత్రువులు ఉండరు లేదా కనిపించరు, అంత విశాలమైన దృష్టి అతడికి కలుగుతుంది. అలాంటి దివ్యస్థాయిని ప్రసాదిస్తుంది వారాహీ మాత. 

మహాదేవా🙏🙏

Thursday, July 12, 2018

గణార్చన 11.07.2018

గణార్చన  11.07.2018

  మహే శ్వర స్థానములో ములుగు హనుమంత రావు గారు . 

తాడికొండస్ శశిభూషణ్ దంపతులు -పూజ నిర్వహించారు 

SRADDHANJALI TO S.P.RAMESH

ఎస్ .పి .రమేష్ కి  శ్రద్ధాంజలి          కైలాసవాసి శ్రీ sp రమేష్ ,(రామలింగం) గారి సంతాప సభ,                                               💐శ్రధ్ధాంజలి.💐            అందరి  లాగే  Ramesh  కు  కూడా  వారి  తల్లితండ్రులైన  పూజ్యనీయులైన  సరోజనీ విశ్వనాథం గార్ల  ద్వారా  జీవితం లభించింది.  కాకపోతే  Ramesh  కు  తన  జీవితాన్ని  ఆస్వాదించే  యోగం  కుదరింది.  అది  ఆకస్మికంగా నో‌‌, అకస్మాత్తుగా నో, ఏ ప్రాతఃకాలాన్నో  మరే సమయమందో  అబ్బినదికాదు.  దాదాపు గత 4 దశాబ్దాలుగా  Ramesh మన  society లోని  అందరితోపాటు‌‌, అన్ని కుటుంబాలతోపాటు అందరి వాడై మెలిగాడు.  లబ్ధప్రతిష్టులతో కలసి పని చేయడం వల్ల కావచ్ఛు "సేవా సేవా సేవా",సేవ ద్వారా నే యోగం గా భావించారని చెప్పవచ్చు.    Ramesh  తో కలసి పని చెసిన లబ్ధప్రతిష్టులందరి  personal diary's లలో  మరియు జll నll శాll వారు‌‌, వారి service digest  నంటూ తయారు చేసుకుంటే, అందులోనూ Ramesh కంటూ కొన్ని  green pages వుంటాయి అనడం -ఏ మాత్రం అతిశయోక్తికాదు.        జllన llశాll. వారు ఏ కార్యక్రమం తలపెట్టినా‌‌,  దానికి first resources - Ramesh,  ఒక వేళ ఏ కారణం వలనైనా ,            తన ప్రత్యక్ష, పరోక్ష involvement లేదంటే  అపూట ఆ కార్యక్రమం       "ఉప్పు లేని పప్పు, చింతపండు లేని చారు లా వుండేది. "                       మాకైతే  ఇది భర్తీ చేయరాని లోటు. ఇక శ్రద్దగా  అన్నగారి కర్మ  కార్యక్రమాలు నిర్వహించిన వారి సోదరులందరకీ‌,  Ramesh గారి కుటుంబానికీ  శాంతి ని ప్రసాదించాల్సింది  గా ఆ పరమేశ్వరున్ని ప్రార్థిద్దాం.  ఇది మా వ్వక్తిగత స్పందన మాత్రమే కాదు, ఇది జంట నగర శాఖ, జంట నగరంలో ని  ఆరాధ్య బందువులందరి  హృదయ  స్పందన. ------  తప్త హృదయం తో      💐 💐 🙏










                           అందరినీ తనవారుగా భావించే ఆత్మీయ నేస్తం.చిన్నా, పెద్దా తేడా లేకుండా ఆప్యాయంగా పలకరించే ఆదర్శమూర్తిమత్వం...
కైలాసవాసులైన మిమ్మల్ని మేమెలా మరచిపోగలం.....
అశ్రునయనాలతో...
మీకు ఘన‌నివాళులు...

ఆరాధ్య బంధువులు,
ఆస్ బెస్టాస్ కాలనీ,
కూకట్ పల్లి, హైదరాబాద్.


అందరినీ తనవారుగా భావించే ఆత్మీయ నేస్తం.చిన్నా, పెద్దా తేడా లేకుండా ఆప్యాయంగా పలకరించే ఆదర్శమూర్తిమత్వం...
కైలాసవాసులైన మిమ్మల్ని మేమెలా మరచిపోగలం.....
అశ్రునయనాలతో...
మీకు ఘన‌నివాళులు...

ఆరాధ్య బంధువులు,
ఆస్ బెస్టాస్ కాలనీ,
కూకట్ పల్లి, హైదరాబాద్.

Sunday, April 15, 2018

184గవ మాసశివరాత్రి /శివశ్రీ ముదిగొండ నాగలింగశాస్త్రీ గారి జయంతి 14.4,18

184గవ మాసశివరాత్రి /శివశ్రీ ముదిగొండ నాగలింగశాస్త్రీ గారి జయంతి 14.4,18






కొంపల్లి వినయ్కుమార్ శర్మ -శ్రీమతి శివలెంక భవాని  గార్లకు పండిత పురస్కారములు