Tuesday, January 9, 2018

                               ఆరాధ్య   

                            
       
 శ్రీశైవమహాపీఠం -జంటనగరశాఖ -(2003-2018)-ప్రత్యేక సంచిక






                             శ్రీ శైవమహాపీఠం
                  జంటనగర శాఖ వారి ప్రచురణ 





                             

                        

Saturday, January 6, 2018

aradhya front cover

                    

                             ఆరాధ్య 
   శ్రీశైవమహాపీఠం -జంటనగరశాఖ -(2003-2018)-ప్రత్యేక సంచిక 


                 
 శ్లో !! త్ర్యం బకం ,,,             
శ్రీ శైవమహాపీఠం
 జంటనగర శాఖ వారి ప్రచురణ 

Thursday, January 4, 2018

04/01/18, 7:19:07 AM: ‪+91 98660 49721‬: 🙏నమస్కారం ఒక సంస్కారం 🙏
నమస్కారానికి ప్రతిగా నమస్కరించడం సంస్కారం. మనం తోటివారికి నమస్కరించేటప్పుడు, అది సంస్కారవంతంగా ఉండాలి. మనల్ని ఎదుటివారు ఎంతగా గౌరవించారో, వారిని అంతకు మించి గౌరవించని పక్షంలో ఆ నమస్కారం తిరస్కారానికి ఆస్కారమిస్తుంది.
నమస్కారానికి ఆశీర్వాదం పొందే శక్తి ఉంది. మార్కండేయుడు పదహారేళ్లకే చనిపోతాడని కొందరు పండితుల ద్వారా తెలుసుకున్న అతడి తండ్రి మృకండుడు- నారదుణ్ని వేడుకున్నాడు. తన పుత్రుడు నిండు నూరేళ్లు జీవించేలా ఏదో ఒకటి చేయాలని ప్రార్థించాడు. అందుకు ఆయన ‘కనిపించిన ప్రతి వ్యక్తికీ మార్కండేయుడితో పాదాభివందనం చేయించా’లన్నాడు. అదే విధంగా అందరికీ పాదాభివందనం చేస్తూ సాగిపోయిన అతణ్ని వారందరూ ‘దీర్ఘాయుష్మాన్‌ భవ’ అని దీవించారు. అలా నమస్కారాలు చేయడం ద్వారా అందరి ఆశీస్సులూ పొందిన మార్కండేయుడు అంతిమంగా దీర్ఘాయుష్మంతుడైనట్లు పురాణగాథలు చెబుతున్నాయి.
ఒక మహారాజు అడవి మార్గంలో వెళుతున్నాడు. దారిలో ఒక బౌద్ధ భిక్షువు ధ్యానముద్రలో కనిపించాడు. వెంటనే ఆ రాజు శిరస్సు వంచి పాదాభివందనం చేశాడు. అది చూసిన మంత్రి ‘ఈ మహాసామ్రాజ్యానికి అధిపతి, కిరీటధారులైన మీరు ఒక యాచకుడి ముందు తల వంచారేమిటి?’ అని ప్రశ్నించాడు. రాజు చిరునవ్వుతో మౌనం వహించాడు.
తరవాతి రోజు ఆ మహారాజు ఒక మేక తల, పులి తల, యుద్ధంలో మరణించిన ఒక సైనికుడి తలను తెప్పించాడు. వాటిని విక్రయించాలని మంత్రిని ఆజ్ఞాపించాడు. మేక తల, పులి తల అమ్ముడయ్యాయి. మనిషి తలను తీసుకువెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు ఆ రాజు ‘మరణించిన తరవాత మనిషి తలకు ఏ విలువా ఉండదు. అలాంటి తలను వంచి పాదాభివందనం చెయ్యడంలో తప్పేముంది?’ అనడంతో, మంత్రికి జ్ఞానోదయమైంది.
యోగశాస్త్రంలో ‘నమస్కారాసనం’ ప్రసక్తి ఉంది. నమస్కారం చేసినప్పుడు చేతులు జోడిస్తాం. అవి హృదయానికి దగ్గరగా నిలుస్తాయి. అది సమర్పణకు ప్రతీక. ఆ సమర్పణతో, గుండెపై ఒత్తిడితో పాటు అహమూ తగ్గుతుంది. అది ఒక ఆరోగ్యకరమైన చర్య.
రాముడు అరణ్యవాసానికి వెళుతూ తల్లి కౌసల్యకు పాదాభివందనం చేశాడు. సరయూ నదిలోకి ప్రవేశించే సమయంలో, వైకుంఠానికి వెళ్లబోయే ముందు తల్లి తన పక్కన లేకున్నా ఆమెను స్మరించి నమస్కరించాడు.
‘ఎదిగేకొద్దీ ఒదగాలి’ అంటారు పెద్దలు. ఆ విషయంలో భగవంతుడూ తనను తాను మినహాయించుకోలేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా, అందరికీ ఆదర్శంగా నిలవడం కోసం ఒదిగే కనిపించాడు. ధర్మరాజు రాజసూయ యాగం చేసే సమయంలో, బహుమతులు స్వీకరించే పనిని దుర్యోధనుడు చేపట్టాడు. అతిథుల కాళ్లు కడిగి ఆహ్వానించే బాధ్యత తీసుకునేందుకు అందరూ వెనకంజ వేస్తే, శ్రీకృష్ణుడు తానే ఆ పని చేశాడు. అలా ఆయన ఒదిగే ఉండటం వామన అవతారంలోనూ సాగింది.
శ్రీకృష్ణావతారంలో విశ్వరూపం చూపించిన మహావిష్ణువే వామనావతారంలో మూడడుగుల మరుగుజ్జుగా మారిపోయాడు. త్రివిక్రముడిగా భక్తుల గుండెల్లో నిలిచాడు. వామనుడు త్రివిక్రముడిగా ఆకాశం అంతటా వ్యాపించడంతో, ఆయన పాదాన్ని బ్రహ్మ భక్తితో కడిగాడని పురాణాలు చెబుతున్నాయి. అలా బ్రహ్మ సైతం విష్ణుమూర్తి విశ్వరూపానికి దాసోహమన్నాడు. ఎదిగేకొద్దీ ఒదగాలని, అలా ఒదిగేకొద్దీ మరింత ఎదుగుతామని- పాదాభివందనంలోని పరమార్థాన్ని, నమస్కారంలోని సంస్కారాన్ని ఎందరో ఆచరించి చూపారు.
అందుకే ‘అందరికీ పోషణ, రక్షణ కావాలి. అందరం వైషమ్య రహిత, శాంతియుత జీవనం వైపు నడవాలి. నీలో, నాలో, ప్రకృతిలో శాంతి వర్ధిల్లాలి’- ఇలా ప్రార్థించుకుంటూ, ఒకరికొకరం నమస్కరించుకుందాం!🙏🙏🙏🙏🙏

04/01/18, 7:51:42 AM: ‪+91 79811 59026‬: *దేవద్విజగురుప్రాజ్ఞ*
*పూజనం శౌచం ఆర్జవమ్।*
*బ్రహ్మచర్యం అహింసా చ*
*శారీరం తప ఉచ్యతే ॥*
🥀
కేవలం భగవంతుని ధ్యానిస్తూ చేసేది మాత్రమే తపస్సు కాదు!

సత్ప్రవర్తన కూడా ఒక విధమైన తపస్సువంటిదే....

దేవతలను, జ్ఞానులను, గురువులను, అనుభవజ్ఞులను పూజించడం;

శరీరాన్ని శుచిగా, శుభ్రంగా ఉంచుకోవడం;

నిరాడంబరత;

అహింస...

వంటి పద్ధతులన్నీ శరీరంతో చేసే తపస్సుకి సూచనలుగా చెప్పబడుతున్నాయి.


Wednesday, January 3, 2018

pictures


















30/12/17, 7:45:04 AM: ‪+91 98660 49721‬: *శ్రీ రుద్రం విశిష్టత :*

శత రుద్రీయం యజుర్వేదంలో భాగం.
ఇది మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం.

జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది.
మనిషిలో శ్వాస నింపేది మరల దానిని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మే నని తెలియజేస్తుంది.
శ్రీ రుద్రాన్ని రుద్ర ప్రశ్న అని కూడా అంటారు.
వేద మంత్రాలలో ఏంతో ఉత్కృష్టమైనది.

శ్రీ రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. “నమో” పదం వచ్చే మొదటి భాగం, యజుర్వేదంలో ౧౬వ అధ్యాయంలో ఉంటుంది. దీనిని నమకం అంటారు.

రెండవ భాగంలో “చమే” అన్న పదం మరల మరల రావటం వాళ్ళ దీనిని చమకం అంటారు. ఇది ౧౮వ అధ్యాయంలోఉంది.

చమకం నమకం చైవ పురుష సూక్తం తథైవ చ |
నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే ||

నమకం చమకం ఎవరైతే మూడు మార్లు పురుష సూక్తంతో ప్రతీ దినం చదువుతారో వాళ్లకు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.
అని అర్థం,

*నమకం విశిష్టత :*

నమకం, చమకం 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని “అనువాకం” అంటారు.

మొదటి అనువాకంలో పరమశివుడిని తన రౌద్ర రూపాన్ని చలించి, తన అనుచరులను, ఆయిదాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది.

శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది.
ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి.
కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి....

*అనువాకం – 1:*

తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్ని, దైవం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా, చేసి, క్షామం, భయం పోవునట్టు చేసి, ఆహార, గోసంపద సమృద్ధి గావించి, గోసంపదను చావునుండి, ఇతర జంతువులనుండి, జబ్బులనుండికాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనంచేస్తుంది.

*అనువాకం – 2 :*

ప్రకృతిలో, సర్వ ఔషధములలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన..
శత్రు వినాశనానికి, సంపద మరియు రాజ్యప్రాప్తికి, జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు.

*అనువాకం – 3:*

ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణిస్తుంది.
అతడు సర్వాత్మ.
ఈ విషయంలో మనిషి ఆ మహాస్వరూపాన్ని అర్ధం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవార్చుకున్టాము, ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్టించుతాడు.
ఈ అనువాకం వ్యాధి నివారనంకు కూడా చదువుతారు...

*అనువాకం – 4:*

ఇందులో రుద్రుడు సృష్టి కర్త. కారకుడు. చిన్న పెద్దా ప్రతీది అతడు చేసిన సృష్టే,
ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణకై చదువుతారు.

*అనువాకం – 5:*

ఈ అనువాకంలో రుద్రుడు పారు నీట ఉండే రూపంగా కొనియాడబడుతాడు.
అతడి పంచ తత్వాలు వర్ణించబడతాయి అనగా – సృషి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింపబడడం మరియు మోక్షప్రదానం.

*అనువాకం – 6:*

ఇందులో రుద్రుడు కాలరూపుడు.
అతడు అన్ని లోకాల కారణం, వేద రూపం మరియు వేదాంత సారం.
ఐదు ఆరు అనువాకాలు ఆస్తులు పెంపుకు, శత్రువులమీద విజయానికి, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికి, సుఖ ప్రసవానికి , జ్యోతిష పరమైన ఇబ్బందులను నివారించడానికి, పుత్రుల పరిరక్షనకు కూడా చదువుతారు.

*అనువాకం – 7:*

నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న ర్ద్రుని వర్ణిస్తుంది.
ఈ అనువాకాన్ని తెలివితేటలకు, ఆరోగ్యానికి, ఆస్తిని , వారసులను పొందడానికి పశుసంపద, వస్తాలు, భూములు, ఆయుష్షు, మొక్షంకోసం కూడా చదువుతారు.

*అనువాకం – 8:*

ఇందులో శివుడు ఇతర దేవతలా కారకుడుగాను, వారికీ శక్తి ప్రదాతగాను వర్ణింపబడ్డాడు.
యితడు అన్ని పుణ్య నదులలో ఉన్నవాడు, అన్ని పాపాలను పోగొట్టేవాడు. శత్రువులను నాశము చేసి, సామ్రాయ్జ్యాన్ని సాధించడానికి ఈ అనువాకాన్ని చదువుతారు.

*అనువాకం –9:*

ఈ అనువకంలో రుద్రుని శక్తి, ప్రకాశం సకల దేవతలకు శక్తిని ఇచ్చేవిగా ప్రస్తుతించబడ్డాయి. సృష్టిలో సర్వ శక్తులను శాసించే శివ స్కక్తిని మించి ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారముకోసం, మంచి సహచారికోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు.

*అనువాకం – 10:*

ఈ అనువాకంలో మల్ల రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపసమించి, పినాకధారియైనా, అమ్బులను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై ప్రసన్నవదనంతో, దర్శనమివ్వవలసిందిగా ప్రార్ధన ఉంటుంది. ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం , వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టుటకు, భైరవ దర్శనార్ధమై, అన్నిరకముల భయములను పోగొట్టుటకు, అన్ని పాపాలను పోగొట్టుటకు చదువుతారు.

*అనువాకం – 11:*

ఈ అనువాకంలో రుద్రుని గొప్పతనాన్ని ప్రస్తుతించి, అతని కరుణా ప్రాప్తికై నిర్బంధమైన నమస్సులు అర్పించబడుతాయి.
ఈ అనువాకాన్ని తమ సంతాన సౌఖ్యంకోసం, ఆయురారోగ్యవృద్ధి కోసం, పుణ్య తీర్తి దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం యొక్క జ్ఞానానికి చదువుతారు.

*చమకం విశిష్టత:*

నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్ధన చేసేది చమకం.
ఇది ప్రతీ ఒక్కరికి పనికి వచ్చేది.
జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గములో ప్రతీ పనిని మనిషి ఆస్వాదించి, చివరకు అంతులేని ఆనందం కలగచేసే మంత్రం.
సృష్టి కర్తకు ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి విభేదం లేడు. సమస్తం అతనినుంది ఉద్భవించినది కనుక, మోక్ష కాంక్ష దైవత్వమునకు సూచనే...
*మీ*
*శశికాంత్ శర్మ దహగం*

30/12/17, 5:23:11 PM: K.Ramesh: Bharatiya Shastras
The very meaning of Shastra is that which dictates unlike science which is subject to corrections and alterations. Shastra is a broad term and include any book which has codes and conduct given by God. Shastras include Vedas, Puranas and Upanishads. The term Veda means knowledge and in ancient India all science were believed to be derived from and based on Vedas. Vedas were spoken by lord himself to Brahma, from within his heart. Vedic knowledge is “Sruthi” mean to be learned by aural reception. I am just presenting, in a nut shell, the greatness of my ancestors who hail from this Punyabhoomi
In kali, due to lower intelligence and memory the people were unable to acquire knowledge by just hearing hence Vedas were compiled in written form by Vasamaharishi. Numerous rishis and scholars have acquired the knowledge of Vedas and have discovered and invented many things and have written many books in various fields of sciences.
Atom
Acharya Kanad conceptualized atomic theory. Kanad was a sixth century scientist of Vaisheshika School, one of the six systems of Indian philosophy. His original name was Aulukya. He got the name Kanad, because even as a child, he was interested in very minute particles called “kana”. He says, “Every object of creation is made of atoms which in turn connect with each other to form molecules.” In Srimad-Bhagavatam, Canto-3, Chapter 11, Calculation of Time, from the Atom is been described.
Matter
Matter can neither be created nor destroyed. In bhagavad gita chapter 2. 16th verse it is written as – “naasato vidyate bhavo naabhavo vidyate satah” it means that “The non-existence cannot be brought into being and that which exist cannot be un-existed, meaning it cannot be destroyed”.
Gravity
Varahamihira was another well-known scientist of the ancient period in India. He lived in the Gupta period. Varahamihira made great contributions in the fields of hydrology, geology and ecology. Varahamihira stated that there were some attractive forces in the stars of the universe due to such forces the earth was able to float
Bhaskaracharaya had referred about gravity in his work of Siddanta Siromani Bhuvanakosham 6
Mathematics
Many rishis and scholars have done splendorous job in the field of mathematics, such as Baudhayan, Aryabhatta, Brahmgupta, Bhaskaracharya, Mahaviracharya, Lallacharya etc.
The value of pi was first calculated by ‘Baudhayana’. The Baudhayan’s Sulva Sutra, (Sulba Sutras) describes Pythagoras theorem which was written several years before the age of Pythagoras. Baudhayana was the first one ever to arrive at several concepts in Mathematics, which were later rediscovered by the western world.
Aryabhatta was an astronomer, astrologer and physicist. He was a pioneer in the field of mathematics. At the age of 23, he wrote Aryabhatiya, which is a summary of mathematics of his time. Aryabhatta showed that zero was not a numeral only but also a symbol and a concept. Discovery of zero enabled Aryabhata to find out the exact distance between the earth and the moon. The discovery of zero also opened up a new dimension of negative numerals.
Bhaskaracharya was the leading light of 12th Century. He was born at a, Karnataka. He is famous for his book Siddanta Shiromani. It is divided into four sections: Lilavati (Arithmetic), Beejaganita (Algebra), Goladhyaya (Sphere) and Grahaganita (mathematics of planets). Bhaskara introduced Chakrawata Method or the Cyclic Method to solve algebraic equations. This method was rediscovered six centuries later by European mathematicians, who called it inverse cycle. In the nineteenth century, an English man, James Taylor, translated Lilavati and made this great work known to the world.
In 7th century, Brahmgupta took mathematics to heights far beyond others. In his methods of multiplication, he used place value in almost the same way as it is used today. He introduced negative numbers and operations on zero into mathematics. He wrote Brahma Sputa Siddantika through which the Arabs came to know our mathematical system.
There is an elaborate description of mathematics in Jain literature (500 B.C -100 B.C). Jain gurus knew how to solve quadratic equations. They have also described fractions, algebraic equations, series, set theory, logarithms and exponents in a very interesting manner. Jain Guru Mahaviracharya wrote Ganit Sara Sangraha in 850A.D. which is the first textbook on arithmetic in present day form. The current method of solving Lowest
common Multiple (LCM) of given numbers was also described by him. Thus, long before John Napier introduced it to the world, it was already known to Indians.
TO BE CONTINUED......