Thursday, November 2, 2017

28/10/17, 7:33:29 PM: ‪+91 94411 78068‬: శివ పదం - జీవన పథం

నేను విజయవాడలో ఉద్యోగం చేస్తున్నటువంటి రోజుల్లో 1993వ సంవత్సరంలో ఎందుకో చెన్నై నగరం రావాలి అని కోరిక పుట్టి, రావడం జరిగింది. అక్కడకు వచ్చిన నాకు ఎందుకో కాంచీపురం వచ్చి స్వామివారిని చూడాలని అనిపించింది. అంతకు కొద్ది కాలం నుంచే స్వామివారి దివ్యమైన లీలలు, మహిమలు విజయవాడ నగరంలో కొందరు మిత్రుల ద్వారా తెలుసుకున్న తరువాత వారిని ఎలాగైనా దర్శించాలనే కోరిక అప్పుడు నెరవేరింది. నేను వచ్చాను అని నేను భావించడంలేదు జన్మాంతరంలో ఏం సుకృతముందో వారు ఇక్కడకు రప్పించారు అని ఇక్కడకు వచ్చిన తరువాత తెలిసింది.

అలా వచ్చినప్పుడు, నాకు ఇప్పటికి గుర్తు ఆ ప్రాంతంలో శ్రీవారు కూర్చుని ఉన్నారు, మౌనంలో ఉన్నారు. అది మధ్యాహ్న సమయం. షుమారు అక్టోబరు ఆ మాసంలో. భక్తుల వరుస ఎక్కువగా ఉన్నది అక్కడ చివరి వరకు కూడా. ఆ వరుసలో నేను కూడా నిలబడి, ముందుకు వస్తూ ఉంటే, అప్పుడు నేను చేతివ్రాతలో ఉన్న “శివపదం” కీర్తనలు మొత్తం పట్టుకుని ఉన్నాను. సరిగ్గా ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి, వరుసలో నుండే కొంతదూరం నుండి శ్రీవారి దర్శనమవుతున్నది.

మహాతేజోమయమైన ఆ మూర్తిని చూస్తూ ఉంటే నాకు అనిపించింది ఇంతమందిలో నన్ను ప్రత్యేకంగా నన్ను చూశారు అని స్పష్టమైన, గాఢమైన అనుభూతి కలిగింది. ఇప్పటికి మర్చిపోలేను అది. నన్నే చూస్తున్నారు నాపై ఆయనకు అఖండమైన వాత్సల్యమున్నది. అది ఎప్పట్నించో నన్ను వాత్సల్యంతో గమనిస్తున్న చూపే ఇప్పుడు నేను ప్రత్యేక్షంగా చూస్తున్నాను అనే అనుభవం కలిగింది. అప్పుడు కేవలం ఆ చేత్తో గ్రంథం పట్టుకోగానే నానోట ఆప్రయత్నంగా వెలువడినటువంటి శ్లోకం,

మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం
వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||

గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ |
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ||

ఇదే అప్రయత్నంగా వెలువడుతూంటే చిత్రం ఆ హడావిడిలో ప్రతివారు దర్శనం చేసి వెళ్ళిపోవడమే జరుగుతోంది అక్కడ. ఆయన సమీపంలో ఉన్నటువంటి ఒక మహాత్ములేవరో లోపలనుండి వచ్చారు. వచ్చి మీ చేతిలో ఉన్న పుస్తకాన్ని స్వామివారు అడుగుతున్నారు అన్నారు. నేను ఆశ్చర్యపోయి చేతివ్రాతలో ఉన్న గ్రంథాన్ని ఆయన చేతిలో పెట్టాను. అక్కడ శ్రీవారి సమీపానికి వెళితే దాన్ని తాకి,  వారు దానిమీద చేతితో కుంకుమని, పటికబెల్లాన్ని వేసి తిరిగి నాకు పంపించారు.

ఆ “శివపదం” ముందు వారి చేతి స్పర్శ చేత ధన్యమైంది. అటు తరువాత కేవలం ఆధ్యాత్మికతని మొదలైన వాటిని నా వ్యక్తిగత సాధన కోసం ఉపయోగించుకుంటూ మిగిలిన జీవన వ్యవహారాలు మిగిలిన వాటిలో ఉందామని భావించిన నాకు, అటుతరువాత నా జీవితమంతా భగవత్ సాధనగా ఆ క్షణం నుంచే మారడం జరిగింది. కనుక ఈ జీవితం ఆయన చేతి స్పర్శతో మలచబడి సాగుతున్నదని భావిస్తూ ఎక్కడున్నా ఎలా ఉన్నా నన్ను శ్రీవారు నడిపిస్తున్నది, వారు నన్ను గమనిస్తున్నారను స్పృహ ఆనాటి నుంచి కలుగుతున్నది.

ఆ తరువాత ఆశ్చర్యకరంగా నేను చెన్నై నగరం రావడం, వచ్చిన తరువాత గురువుగారి చరణాలకి మరింత సన్నిధియై ఒక్కొక్కప్పుడు ఆ చరణాల్లో “నిమజ్జన్మ జీవః కరణ చరణైహి శత్చరణతాం” అన్నట్లుగా ఆ చరణాల్లో లినమైపోతున్నామా అన్నంత అనుభూతి నాకు కలిగించడానికి చంద్రశేఖర యతీంద్ర స్వామివారి విషయంలో నాకు గురు స్వరూపమైనటువంటి వారు చల్లా విశ్వనాథ శాస్త్రిగారు.

నాకు స్పష్టంగా తెలిసినది, తరువాత అనేకమంది మహాపండితులు, పెద్దలు వీరందరి ద్వారా నేను గ్రహించింది ఏమిటంటే పరమాచార్యుల విషయంలో పరమ ప్రామాణికంగా ఏదైనా ఒక మహా విషయాన్ని తెలియజేయాలంటే దానికి సర్వ సమర్థులు విశ్వనాథ శాస్త్రిగారని మాకు స్వానుభవంతో తెలుసు.

--- బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం


28/10/17, 10:17:22 PM: MVMRAO: కార్తీకమాసాన కనువిందు జేసెడి
దీ పాల వరుసలో దీప్తినీవె!
స్నానాల పానాల దా నాల గానాల
సారాల నిచ్ఛేడి శక్తి నీవె!
మంత్రాల తంత్రాల యంత్రాల జంత్రాల గాత్రాల సల్పేడిఘన త నీవె!
నాదా ల వేదాల పాదాల నవ్య మౌ
బోధనల్ గ్రహియించు భోక్త నీవె!
రక్తితో భక్తి తో శక్తి యనురక్తి తో ముక్తిని గూర్చే డి
మూలమీవె!
హృద్య మైనట్టి పద్య నై వైద్య మిఛ్చి
భక్తి గేయాలు పాడుచు పరవశించు
నీ దు భక్తుల బ్రోవుమా !నిర్మలాంగ !
శరణు !కారుణాంత రంగ!శ్రీ శంభు లింగ!

31/10/17, 10:47:36 AM: Mani-TTE-Tenali: *_కార్తీక‌పురాణ‌ము (12వ) ద్వాద‌శాధ్యాయ‌ము._*
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

వశిష్ఠమహాముని తిరిగి ఇట్లు చెప్పెను. ఓరాజా! కార్తీకమాసమందు సోమవారమహాత్మ్యమును వినుము. సోమవారముకంటే శనిత్రయోదశి నూరురెట్లు ఫలముగలది. శనిత్రయోదశికంటె కార్తీక పూర్ణిమ వెయ్యిరెట్లు ఫలముగలది. పూర్ణిమకంటే శుద్ధ పాడ్యమి లక్షరెట్లు అధిక ఫలము. శుక్ల పాడ్యమికంటే చివర ఏకాదశి కోటి గుణ ఫలప్రదము. అంతిమైకాదశికంటే కార్తీకద్వాదశి అనంతగుణ ఫలప్రదము. ఇచ్చట అంతిమైకాదశియనగా కార్తీకబహుళ ఏకాదశి వచ్చుచున్నది గాని పూర్ణిమాంతమాస శాస్త్ర ప్రకారముగా చూచిన యెడల కార్తీకశుద్ధ ఏకాదశియేయగును. వింధ్యోత్తరదేశమందు అంతిమైకాదశియనగా కార్తీకశుద్ధైకాదశినే గ్రహింతురు. అచ్చట పూర్ణిమాంతమే మాసము. ఇదిగాక ముందు కార్తీకశుద్ధైకాదశిని గురించియే అనంత మహిమ చెప్పబడుచున్నది. అంబరీషుని చరిత్రమందును శుద్ధైకాదశియే గ్రహించబడినది. మోహముచేతనైనా అంతిమైకాదశినాడు ఉపవాసముచేసి గీతవాద్య పురాణములచేత జాగరణమాచరించువాడు సమస్త పాపవిముక్తుడై విష్ణులోకమందు నివసించును. ఏకాదశినాడు ఉపవాసమాచరించి క్ద్వాదశినాడు బ్రాహ్మణులతో గూడా పారణచేయువాడు సాయుజ్యముక్తిపొందును. ద్వాదశినాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధిబొందును. సూర్యగ్రహణమందు గంగా తీరమున కోటి బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశినాడు ఒక బ్రాహ్మణునకు అన్నము పెట్టిన లభించును. వేయి గ్రహణములును, పదివేల వ్యతీపాతయోగములును, లక్ష అమావాస్యలును కలిపి ద్వాదశీ వ్రతఫలానికి పదహారవ వంతుకు కూడా చాలవు. పుణ్యములనిచ్చెడు తిథులనేకములున్నవి గాని ద్వాదశి హరిప్రియముగాన వాటికన్నిటికంటె అధికఫలప్రదము. క్షీరాబ్దిద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవతగా కలది. కార్తీక శుద్ధ ద్వాదశినాడు అనగా ఏకాదశినాడు రాత్రి యామముండగా హరి పాల సముద్రమునుండి నిద్ర లేచును గాన ఆద్వాదశి హరిబోధినియనబడును. ఆద్వాదశినాడు ఒక బ్రాహ్మణునకయినను అన్నదాన మాచరించువాడు యిచ్చట భోగములనుబొంది అంతకాలమందు హరిసన్నిధి పొందును. కార్తీకమాసమందు ద్వాదశినాడు పెరుగు అన్నమును దానముచేసిన యెడల సమస్త ధర్మములకంటే అధిక ఫలమునుబొందును. స్త్రీగాని, పురుషుడుగాని, కార్తీక శుక్ల ద్వాదశినాడు పాలిచ్చెడియావునకు బంగారపు కొమ్ములు వెండి డెక్కలను చేయించి పెట్టి పూజించి దూడతోగూడ గోదానమాచరించిన యెడల ఆగోవుకు యెన్నివేల వెంట్రుకలుండునో అన్నివేల యేండ్లు స్వర్గనివాసు కలుగును. కార్తీకమాసమందు ద్వాదశినాడు భక్తితో వస్త్రదానమాచరించు వాడు పూర్వజన్మార్జిత పాపములను నశింపజేసికొని వైకుంఠలోకమునకుబోవును. ఇందుకు సందేహములేదు. కార్తీకమాసమందు ద్వాదశియందుగాని, పూర్ణిమయందుగాని, పాడ్యమియందుగాని, కంచుపాత్రలో ఆవునెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువానికి కోటి జన్మలలో చేయబడిన పాపములు నశించును. కార్తీక ద్వాదశినాడు ఫలమును, యజ్ఞోపవీతమును, తాంబూలమును, దక్షిణను, యిచ్చువాడు ఈలోకమందు అనేక భోగములను బొంది అంతమందు వైకుంఠమున విష్ణువుతో గూడా చికాలము సుఖించును. కార్తీక ద్వాదశినాడు బంగారపు తులసీవృక్షును, సాలగ్రామమును దానము చేయువాడు పొందెడి ఫలమును జెప్పెదను వినుము. కార్తీకద్వాదశినాడు పూర్వోక్తానమును జేసినవాడు ాలుగు సముద్రముల మధ్యనున్న భూమినంతయి దానమిచ్చువాడు పొందిన ఫలమును బొందును. ఈవిషయమందు ఒక కథగలదు చెప్పెదను వినుము. విన్నవారి సమస్త పాతములు నశించును. గోదవరి తీరమందు దురాచారవంతుడైన యొక కోమటిగలడు. అతడు స్వల్పదానమైనను చేయుట ఎరుగడు. ానైనను అనుభవించుటయును లేదు. వాడు ఎవ్వనికిని ఉపకారమాచరించలేదు. నిత్యము పరనిందచేయు వాడు, పరద్రవ్యములందాసక్తి గలిగియుండువాడు. ఆకోమటియొక బ్రాహ్మణునకు అధికముగా అప్పునిచ్చి ఆ ఋణమును తిరిగి పుచ్చుకొనుటకొరకు ఆయన యూరికి వెళ్ళి అతడు గ్రామాంతరమందున్నట్లు తెలిసికొని అచ్చటికి వెళ్ళి బ్రాహ్మణుడా! నాసొమ్ము నాకిమ్ము అనియడిగెను. బ్రాహ్మణుడా మాటవిని ఓయీ! యీనెలాఖరుకు నీ సొమ్మును నీకు యేదోయొక విధముగా యిచ్చెద్దను. కాబట్టి కొంచెము నిదానించి నీ సొమ్మును తీసికొని పొమ్మనెను. ఋణమును పుచ్చుకొని తిరిగి సొమ్మునివ్వనివాడు నరకమందు యాతనలనొంది తిరిగి ఋణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును యివ్వవలసియుండును. బ్రాహ్మణుడిట్లు చెప్పినమాటను విని వైశ్యుడు కోపముచేత కళ్ళెర్రజేసి ఓరీ మూఢా! బ్రాహ్మణాధమా! నాధనము నాకిప్పుడేయిమ్ము లేనియెడల యీకత్తితో నిన్ను నరికెదనని దుర్మార్గ బుద్ధితో ఆవేదాంతవేత్తయైన బ్రాహ్మణుని జుట్టుపట్టుకొని లాగి క్రిందపడద్రోసి పాపబుద్ధిగలవాడగుటచేత తన కాలితో వానిని తన్ని కత్తితో కొట్టెను. ఆకత్తిదెబ్బచేత ఆ బ్రాహ్మణుడు సింహముదెబ్బచేత లేడివలె మృతినొందెను. తరువాత కోమటి రాజదండన వచ్చునను భయముతో అచ్చటనుండి పరిగెత్తి యింటికిపోయి క్బ్రాహ్మణుని చంపితినను సిగ్గులేక సుఖముగా నుండి కొంతకాలమునకు మృతినొందెను. అంత కరాళముఖులును, అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతిగలవారును, భయంకరులును, నగు యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆవైశ్యుని యమపాశములచేత బంధించి యమలోకమునకు గొనిపోయి అచ్చట భయంకరమైన రౌరవమను నరకమందు యమాజ్ఞచొప్పున బాధించుచుండిరి. రౌరవము రురువనగా మృగవిశేషము. దాని సంబంధమైనది రౌరవము. అనగా రురు మృగములచేత వాటి కొమ్ములతో బాధింపించెడి నరము రౌరవనరకమనబడును. ఆవైశ్యుని పుత్రుడు ధర్మవీరుడనువాడు తండ్రి పోయిన తరువాత తండ్రి సంపాదించిన ధనముచేత నూతులు త్రవ్వించి తోటలు వేయించి చెరువులు త్రవ్వించి చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి ఉపనయనములు వివాహములు చేయించుచు యజ్ఞములను జేయింుచు నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయుచు అన్నిజాతుల వారికి ఆకలిగలిగిన వారికి అన్నము పెట్టుచు నిత్యము ధర్మములను జేయుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆధర్మవీరుడు హరిని బూజించుసమయమున నారద మహాముని సమస్తలోకములందు తిరుగుచు ఆనాడు యమలోకమునుండి బయలుదేరి తన వీణాతంతువులను ధ్వనిచేయుచు రోమాంచితుడై "గోవింద, నారాయణ, కృష్ణ, విష్ణో, అనంత. వైకుంఠ, శ్రీనివాస, శ్రీ వత్స భూష విశ్వంభర, సమస్త దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే" ఇట్లని కీర్తనము చేయుచు వచ్చెను. ఇట్లు నృత్యము చేయుచున్న నారదమునీశ్వరు జూచి వైశ్యుడు ఆనంద సాగరమగ్నుడై నేత్రములవెంట ఆనంద భాష్పములను వదలుచు ముని పాదములకు నమస్కరించి దండ ప్రణామమాచరించెను. నారదుు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో కౌగిలించుకొనెను.
తరువాత ఆవైశ్యుడు నారదమునీశ్వరుని ముందర అంజలినిబట్టినవాడై అర్ఘ్యాదులచేత పూజించి హేనారదా మీరు మాగృహమునకు వచ్చుట చాలా దుర్లభము. నేను పూర్వమందు యేమిపుణ్యు చేసితినో మీరు దర్శనమిచ్చినారు. కాబట్టి నా పూర్వ పుణ్యమిప్పుడు ఫలించినది. మునీంద్ా! మీకు దాసుడను ఏమిసేవచేయవలెనో చెప్పుము చేసెదను. వైశ్యుడిట్లు పలికిన మాటను విని నారదమునీశ్వరుడు చిరునవ్వుతో గూడిన ముఖముగలవాడై ధర్మవీరునితో నిట్లనియె. నారదుడిట్లు పల్కెను. ధర్మవీరా! నామాటను జాగ్రత్తగా వినుము. కార్తీకద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది గను ఆరోజున చేసిన స్నానదానాదికము అనంతఫలప్రదమగును. సూర్యుడు తులారాశియందుండగా కార్తీకమాసమందు ద్వాదశినాడు ధనికుడుగాని, దరిద్రుడుగాని, యతిగాని, వానప్రస్థుడుగాని, బ్రాహ్మణుడుగాని, క్షత్రియుడు గాని, వైశ్యుడుగాని, శూద్రుడుగాని, స్త్రీగాని, సాలగ్రామదానమాచరించువారికి జన్మ జన్మాంతరకృత పాపములు నశించును. ధర్మవీరా! వినుము. నీతండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధలనొందుచున్నాడు. అతని పాపవిశుద్ధికొరకు కార్తీకద్వాదశినాడు శీఘ్రముగా సాలగ్రామ శిలదానమును జేయుము. నారదమునీశ్వరుడిట్లు చెప్పిన మాటలను విని వైశ్యుడిట్లనియె. మునీంద్రా! గోదానము, భూదానము, తిలదానము, సువర్ణదానము మొదలయిన మహాదానములచేత కాని ముక్తి శిలాదానము చేత యెట్లు గలుగును? శిలాదానము వృధాగా చేయుట యెందుకు? అది భోజ్యముగాదు. భక్షణముగాదు. కనుక నేను రాతిని నీచుని వలె దానము చేయను. నారదమహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడ మూఢుడై సాలగ్రామ దానమును జేయుటకు సమ్మతించలేదు. అంత నారదుడు అంతర్థానమయ్యెను. తరువాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతినొంది మహాత్ములమాట వినని దోషముచేతను, సాలగ్రామ దానము చేయని దోషముచేతను నరకమందు బాధలనొంది తరువాత మూడుసార్లు వ్యాఘ్రమై జన్మించి తరుాత ముమ్మారు కోతిగా పుట్టి అనంతరము అయిదు మారులు వృషభమై యుండి తరువాత పదిమార్లు స్త్రీగా జన్మించి గతభర్తయై వైధవ్యమును బొందియుండెను. ఇట్లు పదిజన్మలు గడచిన తరువాత పదకొండవ జన్మమందు యాచకుని కుమార్తెగా జన్మించెను. తరువాత కొంతకాలమునకు యౌవనమురాగానే తండ్రి తగినవరునికిచ్చి వివాహము చేసెను. కానీ పూర్వకర్మవలన ఆవరుడపుడే మృతుడయ్యెను. దానిని, మృతినొందిన ఆఅల్లుని బందువులందరు వచ్చి చూచి అట్టి బాల్యవైధవ్యమును చాలా దుఃఖించిరి. యాచకుడు దివ్యదృష్టితో జూచినవాడై ఆచిన్నదాని బాల్యవైధవ్యమునకు కారణమును దెలిసికొని బంధువులందరికిని కుమార్తెయొక్క పూర్వపుణ్యమును, పూర్వపాపమును జెప్పెను. ఇట్లు చెప్పి కూతురుయొక్క పాపముల నాశనము కొరకు జన్మాంతరార్జిత పాపనాశన సమర్థమగు సాలగ్రామ దానమును కార్తీకసోమవారమందు వేదాంతవేత్తయైన బ్రాహ్మణునకు దానము చేసెను. ఆసాలగ్రామ శిలా దానమహిమ చేత కూతురభర్త తిరిగి జీవించెను. తరువాత దంపతులిద్దరు సుఖముగా చిరకాలమునుండి స్వర్గమునకు బోయి అందు బహుకాలమానందముతో యుండి తిరిగి భూమియందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యముచేత వానికి జ్ఞానోదయమయ్యెను. ప్రతి సంవత్సరమందు కార్తీకసోమవారమున సాలగ్రామశిలాదానమాచరించి ఆపుణ్యముతో మోక్షసామ్రాజ్యపదవిని పొందెను. రౌరవనరకమందున్ వాని తండ్రియు ఆసాలగ్రామ దాన మహిమ చేతముక్తుడాయెను. కాబట్టి జనకమహారాజా! కార్తీకమందు సాలగ్రామ దానము చేత హరి సంతోషించును. ఇందుకు సందియములేదు. పాపకర్ములు కోటి జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశ్యుపవాస ద్వాదశీ సాలగ్రామదానాదులచేత పోగొట్టుకొన గల్గుదురు. కార్తీకమాసమందు సాలగ్రామదానమువలన సమస్త పాపములు నశించును. ఇదియే ముఖ్యమైన ప్రాయశ్చిత్తము. ఇంతకంటే వేరు ప్రాయశ్చిత్తములేదు. ఇందుకు సందియము లేదు.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ద్వాదశోధ్యాయః
31/10/17, 10:55:46 AM: Mani-TTE-Tenali: 🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉
*ॐ* *ఓం నమః శివాయ* *ॐ*

తమిళనాడు రాష్ట్రములోని నవగ్రహ ఆలయాలు

నవగ్రహములు తొమ్మిది , ఒకొక్క గ్రహనికి ఒక్కొక్క దేవాలయము ఉన్నది.

1) సూర్యనార్ కోయిల్ - తిరుమంగళంకుడి.
తమిళనాడు రాష్ట్రము లోని తంజావూరు జిల్లలో కుంభకోణం నుండి 15 km దూరములో గల తిరుమంగళంకుడి అను ప్రాంతములో సూర్యనార్ కోయిల్ పిలువబడే సూర్యదేవలయము వున్నది. ఈ ఆలయములో సూర్యభగవానుదు ఆయన సతిమనులు అయిన ఉష , ఛాయా సమేతముగా భక్తులకు దర్శనమిస్తున్నారు .
ఈ ఆలయాన్ని క్రీ . శ 1075 -1120 సంవత్సరాల మధ్య కాలం లో ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది .
ఈ ఆలయ ప్రగాణములో కాశీ విశ్వేశ్వరుడు విశాలక్షి ని , నవగ్రహాల చే ప్రతిష్టించిన వినాయకుని దర్శించుకోవచు.
ఈ ఆలయములో సూర్యభగవానుడికి తామర పుష్పాలతో పూజలు చేయడము విశేషము.
ఈ ఆలయ పూజలు చాల నిష్ఠ గా జరుగుతాయి , పూజంనతరము ( పూజ తరువాత ) ఆలయము చుట్టూ 9 సార్లు ప్రదక్షణ చెయ్య వలసి వుంటుంది , మరియు ఇక్కడ పూజలు చేయిస్తే ఆయురారోగ్యాలతో వున్నతరి అక్కడి భక్తుల ద్వారా తెలుస్తుంది ..

2) చంద్రగ్రహ దేవాలయము - తిరువైయార్ .
తిరువైయారుకు 5 k.m దూరములొ చంద్రగ్రహ దేవాలయము వుంది . త
తిన్గాలుర్ కోవిల్ అని పిలువబడే చంద్ర దేవాలయము లోని చంద్రభగావానుని దర్శనము సుఖాన్ని , దిర్ఘాయుస్సున్ని , ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకము .
సెప్టెంబర్ - అక్టోబర్ మాసాలలో వొచ్చే ఫల్గుణ నక్షత్ర సమయాలలో చంద్రకాంతి ఇక్కడి ఆలయములోని శివలింగము పై సరాసరిగా ప్రసరించడము విసేషమయినది...

3) అంగారక (కుజ) గ్రహ దేవాలయము - తిరువైయర్ .
తిరువైయర్కు 6 k.m దూరములొ అంగారక ( కుజ) గ్రహ దేవాలయము వున్నది .
ఇక్కడ అనేక వ్యాధులను అంగారకుడు రూపుమపుతాడని భక్తుల విశ్వాసము , నమ్మఖము ,
ధైర్యము , విజయము , శక్తికి అంగారకుడే కారణము ,.
వివాహము ఆలస్యము అయితే ఈ అంగారక క్షేత్రాని దర్శిస్తే వెంటనే వివాహము అవుతుందని స్థానికులు చెపుతున్నారు .

4) బుధగ్రహ దేవాలయము - తిరువెన్నాడు .
అంగారక ఆలయానికి 10 k.m దూరములో బుధగ్రహ దేవాలయము వున్నది ,
ఇక్కడి స్వామి శ్వేతారన్యేశ్వ రుడు . అమ్మవారు బ్రహ్మ విద్యయంభికాదేవి .
వాల్మీకి రామాయణములో ఈ దేవాలయము గురించి వుంది అని చెబుతారు .కనుక ఈ ఆలయానికి 3000 ఏళ్ల నాటి చరిత్ర వున్నది అని తెలుస్తుంది .
ఇక్కడ వ్యాపారానికి మరియు బుది ని ప్రసాదిస్తాడని ఇక్కడ ప్రజలకు నమ్మకము .

5) బృహస్పతి ( గురు) గ్రహ దేవాలయము - ఆలంగుడి.
కుంభకోణానికి 18 k.m దూరములొ ఆలంగుడి లో గురు గ్రహ దేవాలయము వున్నది . ఈ ఆలయాని గురు దక్షిణామూర్తి ఆలయంగా భక్తులు పిలుస్తారు . ఇది తమిళనాడులో ప్రఖ్యాతి గాంచిన దివ్యక్షేత్రము .
దీనిని క్రి.శ 1131 లో విక్రమచోల చక్రవర్తి నిర్మిచారు .
శివుడే దేవ గురువు బృహస్పతి నామదెయము తో గురుదక్షిణామూర్తి గా పూజలు అందుకుంటూన్న పుణ్యక్షేత్రము ఇది .
భోలాశంఖరుడు ఇకదె హాలాహలని సేవించి గోతులో దాచిన స్థలము ఇదె. ఆ విధము గా ఆపద నుంచి గట్టేకించిన శివుణ్ణి ' ఆపత్ సహాయే శ్వ రర్ ( ఆపద్భాందవుడు ) గా కొలిచారు దేవతలు .
గురుడికి ఇష్టమైన గురువారము నాడు , నానా బెట్టిన శనగలను పసుపుతాడుతో మాల గ చేసి గురు గ్రహానికి దండ వేసిన చదువులో ఆటంకాలు , వెనుకబడిన వారు చదువులో మరియు ఎ పని అయిన అయిపోవలిసిన వారికి , విద్యలో ఆటకములు , పనిలోనూ అన్ని తొలగి పోతాయని నమ్మకము ..
గురు గ్రహ దోషాలు వున్నవారు ఆలం గుడి దక్షిణామూర్తి గుడి చుట్టూ 24 ప్రదక్షిణలు చేసి ఈ స్వామి సన్నిధములొ నేతితో 24 దీపాలు భక్తి తో వెలిగిస్తే ఆ దోషాలు తొలిగిపోయి , గ్ర్హహ శాంతి కలుగుతుంది అని భక్తుల ప్రగాడా విశ్వాసము .

6) శుక్ర గ్రహ దేవాలయము - కామ్చనూరు .
3 k.m దూరములొ శుక్ర గ్రహ దేవాలయము వుంది .
దీనెకి పాలాశవనం , బ్రహ్మపరి , అగ్నిస్థలము అని పేర్లు కోడా వున్నాయి .
ఇక్కడ తమ భార్యల ఆరోగ్యము కొరకు తమ భర్తలు పూజలు చేస్తారు .

7) శని గ్రహ దేవాలయము - తిరునల్లార్ .
ఇది కుభాకోణానికి 53 k.m ధూరములొ వున్నది .
ఇక్కడి నది తిర్ధములో స్నానం చేస్తే సర్వపాపాలు హరిన్చిపోతాయి అయిని భక్తుల నమ్మకము .
ఈ ఆలయములో వెలిసిన శ్వమివారి పేరు దర్భారన్యేశ్వరుడు , ఈ దేవుడికి గారిక అంటే చాల ప్రీతి . అందుకే ఈ గుడిలో గరిక మొక్కను అతి పవిత్రము గా భావిస్తారు . అందువల్ల ఈ స్వామిని దర్భాదిపతి అని కోడా అంటారు .
ఈ దేవాలయములో దర్శించినపుడు భక్తులు దర్భల కోసలు ముడివేస్తారు . ఇలా ముడివేస్తే తమ కష్టాలు గట్టు ఎక్కుతాయని భక్తుల నమ్మకము .
ఇచట నలనారాయణ అనే విష్ణు దేవాలయము వున్నది ., ఇక్కడ నలదమయంతుల విగ్రహాలు వున్నా గుడి ఇదే .
శనిశ్వరుని తో పాటు నలదమయంతులను పూజ చేస్తే శని ప్రభావము ఉండదు .
ఇక్కడ బ్రహ్మదండ అనే తీర్ధము కొద వున్నది .
ఇక్కడ శనిశ్వరుని కి నిత్యము అభిషేకము జరుగుతుంది .

8) రాహు గ్రహ దేవాలయము - తిరునగేశ్వరాము
కుభాకోణానికి 5 k.m దూరములో వుంది .
ఇక్కడ రాహు గ్ర్హమునకు గల దేవాలయము ఇది ఓక్కటే .
ఇక్కడ నిత్యము వోచే రాహు కాల సమయములో పాలా భిషేకము చేస్తారు . ఆ పాలా భిషేఖము జరిప

ినపుడు రాహువు శిరస్సు పైన నుండి పాలు పోస్తే కంట భాగము

( మెడ ) దగరకు వోచేసరికి పాలు అన్ని నేలము రంగులోకి మారతాయి . మిగిలిన సమయాలలో ఇలా జరగదు .
ఇక్కడ పూజలు చేసుకునేవారికి రాహు దోషాలు పోతాయి ..

9) కేతు గ్రహ దేవాలయము - కిల్ పేరుంపళ్లమ్ .
తిరువేన్నాడ్ నుండి 6 k.m దూరములో వున్నది .
ఈ ఆలయములో కేతు గ్రహ దోషానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు .. ఈ ఆలయము వద్ద ఒక ప్లేటులో 7 ప్రమిదలలో దీపము వెలిగిస్తారు ...ఇక్కద కేతు గ్రహానికి సంభందిచిన ఎ నివారణ పూజలు అయిన చేస్తారు .
ఈ ఆలయాలలో వధ గల 9 పుష్కరిణి లో స్నానములు చేసి 12 వారాలు ఆరాదిస్తే నవగ్రహాలను , ఈ నవగ్రహ అనుగ్రహము లభిస్తుంది .
31/10/17, 10:55:47 AM: Mani-TTE-Tenali: అ౦భ‌రీష‌ ఉపాఖ్యాన‌ము...

*కార్తీక మాసం శుద్ధ ఏకాదశి నాడు, ఉపవాసం ఉండి, ఈ రోజున భాగవత పురాణంలోని " అంబరీష ఉపాఖ్యాన" పఠనం సర్వ శ్రేష్ఠం!*
అంబరీషుని కథ భాగవత పురాణంలో ఇలా ఉంది.
అంబరీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు. నభగ మహారాజు కుమారుడు. శ్రేష్టుడైన అంబరీషుడు ఏడు దీవులతో కూడిన భూమండల భారాన్ని తన భుజస్తంభాలమీద మోపి శుభాలనూ పొంది, రాజ్యసంపదను కలిగి చెడునడతకు లోనుకాకుండా, విష్ణుపూజలతోనే కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఏమరుపాటు పొందక ఈ లోకంలో ప్రశస్తి గాంచాడు. ఈయన గొప్ప విష్ణు భక్తుడు. శ్రీ మహావిష్ణువు గురించి భక్తితో గొప్ప యాగం చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన శ్రీహరి ఆయన రాజ్యం సుఖ సంపదలతో విలసిల్లేలాగా తన సుదర్శన చక్రాన్నే వరంగా ఇచ్చాడు.
ఒకసారి అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాడు.ఈ వ్రతంలో ఏకాదశి నాడు ఉపవాసం ప్రారంభించి, ఒక సంవత్సరం పాటు దీక్షలో ఉండి, ద్వాదశి ప్రారంభంలో దీక్ష విరమించి తరువాత తన ప్రజలందరికీ అన్నదానం చేయాలి. ఉపవాస దీక్ష కొద్ది గడియల్లో ముగియనుండగా దుర్వాస మహర్షి అక్కడికి విచ్చేసాడు. ఆయనను అత్యంత భక్తి ప్రపత్తులతో ఆహ్వానించి ఆ రోజుకి దుర్వాసుణ్ణి తన గౌరవ అతిథి గా ఉండమని అర్థించాడు అంబరీష మహారాజు. దుర్వాసుడు అందుకు సంతోషంగా అంగీకరించి తాను నదిలో స్నానం చేసి వచ్చేవరకు వేచి ఉండమని చెప్పి నదివైపు వెళ్ళాడు.
దీక్ష విరమణకు నిర్ణయించిన శుభముహూర్తం దాటిపోతోంది. నదీ స్నానానికని వెళ్ళిన దుర్వాసుడు ఎంతసేపైనా తిరిగి రాలేదు. అంబరీషుడు తమ కులగురువైన వశిష్ఠుని సలహా మేరకు ఆ శుభముహూర్తంలో కేవలం తులసీ దళం తో కొంత మంచి నీళ్ళు పుచ్చుకుని దీక్ష విరమించి దుర్వాస ముని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇది శాస్త్రం ప్రకారం సమ్మతమే. కానీ స్నానం చేసి తిరిగి వచ్చిన దుర్వాసుడు తన దివ్యదృష్టి ద్వారా జరిగిన విషయాన్ని గ్రహించి రాజు మాట తప్పినందుకు ఆగ్రహించాడు. దుర్వాస ముని కోపం గురించి తెలిసిందే కదా!
అప్పటికప్పుడే తన జడల నుంచి ఒక వెంట్రుకని లాగి ఒక రాక్షసుణ్ణి సృష్టించి అంబరీషుణ్ణి సంహరించమన్నాడు. ఆ రాక్షసుడు అత్యంత భయానకంగా అంబరీషుడి ఎదుట నిలువగానే ఆయనకు రక్షణగా ఉన్న సుదర్శన చక్రం ఒక్క వేటుతో ఆ రాక్షసుణ్ణి సంహరించి దుర్వాసుడి వెంట పడింది. దుర్వాసుడు ప్రాణభయంతో నలుదిక్కులకు పరిగెత్తాడు. ముందుగా బ్రహ్మ, శివుడి దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళిద్దరూ చక్రాన్ని ఆపడం తమ వల్ల కాదనీ, శ్రీ మహావిష్ణువు దగ్గరకే వెళ్ళమన్నారు. చివరికి దుర్వాసుడు శ్రీ మహా విష్ణువును వేడుకున్నాడు. ఆయన కూడా తాను అంబరీషుని భక్తికి బంధీ కాబట్టి ఆయన్నే వేడుకోమన్నాడు. చివరికి దుర్వాసుడు వెళ్ళి అంబరీషుని వేడుకోగానే, ఆయన శ్రీహరిని సుదర్శన చక్రాన్ని ఉపసంహరించమని ప్రార్థిస్తాడు. భక్తికి పరమాత్ముని సైతం శాసించగల శక్తి ఉందన్న మాట ఈ ఘటన మనకి మరొక్క ఉదాహరణ!
అంబరీషోపాఖ్యానం కార్తీక మహాత్మ్యం లో కూడా వస్తుంది. ఈ సమయంలోనే దూర్వాస ముని కోపముతో అంబరీషుని రక రకాల జంతువులుగా కమ్మని శపిస్తే వాటన్నిటినీ విష్ణువు తీసుకుని ఆయన ఎత్తిన జన్మలే మన దశావతారాలు. ఈ అంబరీషుని కద్థ వేరు వేరు పురాణాల్లో వివిధ రకాలుగా చెప్పబడింది. శివపురాణం లో కథ వేరే గా ఉన్నట్లూగా చెబుతూ ఉంటారు. సుదర్శన చక్రం రాక్షసుని చంపివేసిన తరువాత దుర్వాసుని వైపు వెళ్ళిందనీ, ఆయన శివ స్వరూపం కాబట్టి చక్రం వెనక్కు తగ్గిందనీ, నంది వచ్చి అంబరీషుని దుర్వాసుని క్షమాపణ వేడుకోమన్నాడనీ, అలాగే అంబరీషుడు దుర్వాసుని క్షమాపణ కోరాడని ఉంటుంది. అయితే ఈ అంబరీషుని కథ మనకి మాత్రం భాగవతంలో ఉన్నది ప్రమాణం గా తీస్కుంటాము.

(బ్ర‌హ్మ‌శ్రీ చాగ‍౦టి కోటేశ్వ‌ర‌రావు గురూగారి fb page ను౦డి సేక‌రి‍౦చ‌బ‌డిన‌ది.)