Friday, September 1, 2017

01/09/17, 7:17:15 AM: ‪+91 98484 03424‬: ✋గాయత్రి గురించి మహాత్ములు చెప్పినవి✋
🚩🚩🚩
వేదవ్యాస మహర్షి - గాయత్రి మంత్రమును జపించకుండా ఇతర మంత్రములను జపించుట భోజనానికి సిద్ధంగా ఉన్న భోజనాన్ని వదిలి ఆడుక్కుని తినటం లాంటిది.శతపథ బ్రాహ్మణం ఐతరేయబ్రాహ్మణం లో
' బ్రహ్మయే గాయత్రి గాయత్రియే బ్రహ్మ ' అని చెప్పబడింది.
🚩🚩🚩
విశ్వామిత్రుడు - " బంగారపు రంగులో ఉన్న సూర్యబింబము మధ్యలో గాయత్రీ మాతను ధ్యానిస్తూ మంత్రజపం చేసిన యడల శీఘ్రముగా జనన మరణాల నుండి ముక్తుడవుతాడు.
🚩🚩🚩
దేవీభాగవతము - గాయత్రీ మోక్ష విద్య తెలుపు రంగు తేజస్సుతో ప్రకాశించి బుద్ధిని పవిత్రంచేస్తుంది.' తత్ సవితుర్వరేణ్యం భర్గః '
🚩🚩🚩
కూర్మపురాణము - ముల్లోకాలకు జ్ఞానమును ప్రసాదించేసి గాయత్రీ దేవతయే ఆమెయే వేదమాత గాయత్రిని మించిన మంత్రము లేదు
🚩🚩🚩
యాజ్ఞవల్క్యుడు - ఓక త్రాసులో ఇటు వేదాలు ఆటు గాయత్రి మంత్రమును ఉంచి తూచినచో గాయత్రి మంత్రము వైపే త్రాసు మొగ్గును.
🚩🚩🚩
ఆర్షసూక్తి - 'న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పర దైవతం'
🚩🚩🚩
భీష్మాచార్యులు - ఓ ధర్మరాజా గాయత్రీ మంత్రమును విడిచి పెట్టకుండా ఏవరు జపిస్తారో వారు దుఃఖం పోందరు
🚩🚩🚩
అత్రి మహర్షి భవిష్య పురాణం - సూర్యుని ఏదుట ఏనిమిది వేలు గాయత్రీ జపం చేసిన యడల సర్వ పాపములనుండి విముక్తుడవుతాడు
🚩🚩🚩
లఘు అత్రి సంహితా - గాయత్రీ ని జపించే వారిని మాత్రమే పితృకార్యాలకి ఆహ్వానించాలి
🚩🚩🚩
పద్మపురాణం పరాశర మహర్షి - గాయత్రిని జపించు వారి మహాపాపాలు పాపాలు ఉపపాపాలు కూడా నశిస్తాయి
🚩🚩🚩
అగ్నిపురాణం - ఏ బ్రాహ్మడు నిత్యం ఉదయం సాయం సంధ్యలలో గాయత్రీ ఉపాసన చేస్తాడో ఆతడు ఏలాంటి దానము స్వీకరించినా దోషములు కలుగవు
🚩🚩🚩
శంఖ స్మృతి - నరక నివారణకి వేదముల ఉపనిషత్తుల సారమైన గాయత్రిని మించిన మంత్రము లేదు
🚩🚩🚩
సూత సంహితా యజ్ఞవైభవ ఖండం - అన్నముతో జలముతో సమానమైన దానము అహింసతో సమానమైన తపస్సు గాయత్రిని మించిన మంత్రము లేదు
🚩🚩🚩
నారద మహర్షి - గాయత్రీ సమస్త దేవతా స్వరూపము ఆమె ఉన్న చోట శ్రీమన్నారాయణుడు నివసిస్తాడు ఇందు సందేహము లేదు
🚩🚩🚩
వశిష్ట మహర్షి - మూర్కుడు కూడా గాయత్రిని జపించిన ఉన్నత స్తితికి వెళ్ళును.వాడు దేవతలలాగా భూమిమీద ప్రకాశిస్తాడు.

🚩🚩🚩
ఆదిశంకరులు - గాయత్రి మహిమ వర్ణించ మానవ సామర్థ్యం సరిపోదు ఇదియే ఆది మంత్రంము.
👏👏👏👏
అందుకే నిత్యం ఉదయం సాయంత్రం గాయత్రీ ఉపాసన చేయటం చాలా మంచిది...
హ్రీం తత్సత్.
31/08/17, 8:45:34 AM: ‪+91 79811 59026‬: *సత్య హీన వృధా పూజా సత్య హీన వృధా జపః*
*సత్య హీన తపో వ్యర్థం ఊషర క్షేత్రే వపనం యధా*


చవిఁటి  నేలలో (నిస్సారమైన) విత్తనములు చల్లుట  వ్యర్థ మైనట్లే సత్య హీన మైన పూజ, జపము, తపము యివన్నీ కూడా నిరుపయోగములే.
30/08/17, 8:00:31 PM: ‪+91 98490 65431‬: ఎవరి కర్మ వారికే.
🌼🐘🌼🐘🌼🐘🌼🐘🌼🐘🌼🐘🌼🐘
ఒకానొక గ్రామంలో ఒక ఆశ్రమం ఉండేది. ప్రతి రోజూ సాయంత్రం ఆశ్రమంలో ఒక సాధువు ప్రవచనం చెప్పేవాడు. గ్రామస్థుల్లో చాలామంది ఆ ప్రవచనం వినడానికి వెళ్లే వాళ్లు. ప్రవచనం పూర్తయిన తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోతుండేవారు. అయితే ఒక వ్యక్తి మాత్రం ప్రతి రోజూ ప్రవచనం మధ్యలో ఉండగానే లేచి అక్కడి నుంచి వెనుదిరిగేవాడు. ఆ వ్యక్తి.. ప్రతి రోజూ ప్రవచనం మధ్యలోనే వెళ్లిపోవడం సాధువు గమనించాడు. ఒకరోజు అతణ్ణి పిలిచి.. ‘‘నాయనా! రోజూ ఎందుకలా మధ్యలోనే వెళ్లిపోతున్నావు?’’ అని అడిగాడు. దానికా వ్యక్తి.. ‘‘స్వామీ! మీ ప్రవచనం అద్భుతంగా ఉంటుంది. అయితే, చీకటి పడేలోపు నేను ఇంటికి వెళ్లిపోవాలి. నా కోసం నా భార్యా, బిడ్డలూ, తమ్ముళ్లూ, మరదళ్లూ, వారి పిల్లలూ.. అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. నా రాక కాస్త ఆలస్యం అయినా.. తట్టుకోలేరు. నాపై వారికంత ప్రేమ. అందుకే మధ్యలోనే వెళ్లిపోతున్నాను’’ అని బదులిచ్చాడు. సాధువు నవ్వి.. ఆ వ్యక్తి చెవిలో ఒక విషయం చెప్పాడు.
మరుసటి రోజు ఆ వ్యక్తి యథాప్రకారంగా ప్రవచనం మధ్యలో లేచి వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన భర్తను చూసి భార్య మురిసిపోయింది. పిల్లలు తండ్రితో ఆడుకుంటున్నారు. తమ్ముళ్లూ, మరదళ్లూ ఏవో కబుర్లు చెబుతున్నారు. అంతలో.. ఆ వ్యక్తి మూర్చ వచ్చి పడిపోయాడు. ఇంట్లో అందరూ కలవరపడసాగారు. ఇంతలో సాధువు వాళ్లింటికి వచ్చాడు. తమ ఇంటి యజమానికి ఎలాగైనా కాపాడమని సాధువుతో అందరూ వేడుకున్నారు. అందరినీ సంయమనం పాటించమన్నాడు సాధువు. లోనికి వెళ్లి ఒక పాత్రలో నీరు తీసుకురమ్మని చెప్పాడు. అలాగే తెచ్చారు. ‘‘బాధ పడవలసింది ఏమీ లేదు. మీ ఇంటి యజమానికి దుష్టగ్రహం పట్టింది. దానిని ఈ పాత్రలోని నీటిలోకి ఆవాహన చేస్తాను. అయితే, మీలో ఎవరో ఒకరు ఆ నీటిని తాగి.. ఆ దుష్ట
గ్రహాన్ని గ్రహించాలి’’ అన్నాడు. ఆ మాట వినడంతోనే ఇంట్లో వాళ్లందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ‘‘మా ఇంటి యజమానిపై మాకు ప్రేమ ఉన్న మాట వాస్తవమే! ఆయన బాధ తప్పించాలనే భావన ఉన్న మాటా నిజమే! కానీ, చూస్తూ.. చూస్తూ.. దుష్టగ్రహ బాధను ఎవరు తీసుకుంటారు. అయినా స్వామీ! ఎవరి కర్మ వారు అనుభవించాలని మీరే చెబుతారు కదా! ఇది ఆయన కర్మ.. ఆయన్నే అనుభవించనీయండి’’ అని బదులిచ్చారు. ఆ మాటలు విన్న తర్వాత ఆ ఇంటి యజమానికి అసలు విషయం తెలిసొచ్చింది. అంతసేపూ మూర్చతో పడిపోయినట్టు నటించిన ఆ వ్యక్తికి.. వాస్తవం ఎలా ఉంటుందో బోధపడింది. సంసార బంధాలు, కుటుంబ బాధ్యతలు అందరూ ఆచరించాల్సిన ధర్మాలే. అయితే, అవే ముఖ్యమనుకొని వాటిలోనే పడి కొట్టుకుపోతే.. ముక్తిని పొందాల్సిన మానవ జన్మ పరమార్థం పక్కదారి పడుతుంది! భగవంతుడిని దర్శించాలన్న కోరిక.. కోరికగానే మిగిలిపోతుంది!!
🌻🐀🌻🐀🌻🐀🌻🐀🌻🐀🌻🐀🌻
31/08/17, 11:51:23 AM: ‪+91 98490 65431‬: 🙏 *సూర్యుడి నుండి వచ్చే* *ఏడు*
*కిరణాలు సప్త జ్ఞాన భూమికలు* 🙏
*జ్ఞానం*
జ్ఞానంలో ఏడు స్థితులున్నాయి. వీటినే సప్త జ్ఞాన భూమికలు అంటాం.
(1) శుభేచ్ఛ (2) విచారణ (3) తనుమానసం (4) సత్త్వాపత్తి (5) అసంసక్తి (6) పదార్ధభావని (7) తురీయం
అన్నవే సప్త జ్ఞాన భూమికలు.

☄ *శుభేచ్ఛ:* నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అన్న ఇచ్ఛ; నేను శాశ్వత దుఃఖరాహిత్య పదవి పొందాలి అన్న తీవ్ర ఆకాంక్ష.

☄ *విచారణ* : బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఏ విధంగా పొందాలి? అన్న మీమాంస; *బ్రహ్మజ్ఞాన* ప్రాప్తి విధానమే – ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అని తెలుసుకోవడం.

☄ *తనుమానసం* : ఇంక విచారణ ద్వారా సాధనా మార్గం తెలుసుకున్నాం గనుక, తత్ సాధనలో నిమగ్నులై ఉండడమే తనుమానసం. అంటే, ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలకు ఏ రోజూ విఘ్నం లేకుండా గడపడం. అదే *తనుమానసం* .

☄ *సత్త్వాపత్తి* : శుద్ధసాత్త్వికం సాధించడమే సత్త్వాపత్తి, అంటే తమోగుణం, రజోగుణం అన్నవి పూర్తిగా శూన్యమైన స్థితి. ఇక మిగిలింది శుద్ధ సాత్త్వికమే.
    💥 *తమోగుణం* అంటే సోమరితనం,
    💥 *రజోగుణం* అంటే నాకు తెలుసు అనే అధికార దర్పం.
ఈ నాల్గవ జ్ఞానభూమిక ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల సాధన తీవ్రస్థాయి నందుకునే స్థితి; ఆ తీవ్రత ద్వారా నాడీమండలం పూర్తిగా శుద్ధమైన స్థితి; మనస్సు పూర్తిగా కంట్రోలు అయిన స్థితి; అదే యోగి అయిన స్థితి. అహం బ్రహ్మాస్మి అని చక్కగా సిద్ధాంతపరంగా తెలుసుకున్న స్థితి. బ్రహ్మవిదుడు అయిన స్థితి.

☄ *అసంసక్తి* : దివ్యచక్షువు ఉత్తేజితమవుతున్న స్థితి. తనువు, మరి సంసారం, రెండూ తాత్కాలికమైనవే అని సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి. కనుక, ఈ రెంటి మీద పూర్తిగా అనాసక్తి పొందిన స్థితి; అదే అసంసక్తి. దీన్నే పద్మపత్రమివాంభసా అన్నాడు కృష్ణుడు గీతలో. అయితే ఇతనికి సంసారంలో అసంసక్తి వున్నా, ధర్మ-నిష్టుడు, మరి కర్మ – నిష్టుడు; తనువు పట్లా, మరి సంసారం పట్లా తటస్థ దృష్టి కలిగి వున్నవాడు. దివ్యచక్షువు ఉత్తేజితమైంది కనుక, సత్యద్రష్ట కాబోతున్నాడు కనుక, పూర్తిగా దాని మీదే ఆసక్తినీ, ఏకాగ్రతనూ నిలిపినివాడు. ఇదే అసంసక్తి. ఇతనినే బ్రహ్మవిద్వరుడు అంటాం.

☄ *పదార్ధభావని* : అంటే దివ్య చక్షువును క్షుణ్ణంగా ఉపయోగించుకుంటున్నవాడు. ప్రతి పదం యొక్క అర్ధంలో, ప్రతి వస్తువు యొక్క భావంలో ప్రత్యక్షంగా నివసిస్తున్న వాడు. అంటే బ్రహ్మవిద్వరీయుడు అయిన స్థితి. ఇదే సిద్ధస్థితి; ఇదే సవికల్ప సమాధిస్థితి కూడా. అంటే ఎన్నో సమాధానాలు దొరికినా ఇంకా కొద్దిగా, సంశయాలు వున్న స్థితి.

☄ *తురీయం* : ఇది మానవుని యొక్క పూర్ణవికాసస్థితి, సిద్ధుడు బుద్ధుడు అయిన స్థితి. అందరినీ యోగులుగా, సిద్ధులుగా, బుద్ధుళ్ళుగా మలచడానికి కంకణం కట్టుకొని, తత్ పరిశ్రమలో పూర్తిగా నిమగ్నమై వున్నవాళ్ళనే *బుద్ధుడు* అంటాం. ఇదే *సహస్రదళకమలం* .

ఒక్కొక్క మనిషినీ యోగిగా మలచినప్పుడల్లా *సహస్రదళ కమలంలో ఒక్కొక్క రేకు విచ్చుకుంటుంది.* ఇతనినే బ్రహ్మ విద్వరిష్టుడు అంటాం.

*తురీయం* అంటే సర్వసామాన్యమైన జాగృత, స్వప్న, సుషుప్త స్థితులను దాటినవాడు. తురీయ అంటే మూడింటినీ దాటిన అని అర్థం; అంటే నిర్వికల్పసమాధి స్థితి కి చేరుకున్న స్థితి. సమాధి అంటే సమాధానాలు తెలుసుకున్న స్థితి. నిర్వికల్ప సమాధి అంటే ఏ సందేహాలూ, ఏ సంశయాలూ లేని స్థితి
30/08/17, 8:08:49 PM: ‪+91 98490 65431‬: కర్మఫలాలు
☀☀☀☀☀☀☀☀☀☀☀☀☀
'పుట్టిన ప్రతి మనిషీ ఒక్కక్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేడు' అని భగవద్గీతలో కృష్ణుడు అంటాడు. అంటే మనిషికి పుట్టుకతోనే కర్మకూడా వెంట వస్తుందని తాత్పర్యం. 'కర్మ' అంటే 'పని' అని కదా అర్థం! మనిషి జీవితంలో మూడు విధాలైన కర్మల్ని ఎదుర్కొంటాడని వేదాంతశాస్త్రం చెబుతోంది. చేసిన ప్రతిపనికీ ప్రతిఫలం ఉంటుందనేది యథార్థం. మంచిపని చేస్తే సత్ఫలం, చెడుపని చేస్తే దుష్ఫలం లభిస్తుందనే మాటా అక్షర సత్యమే. ప్రతి జీవికీ అనేక జన్మలుంటాయని ధర్మశాస్త్రాలు ప్రవచిస్తున్నాయి. కనుక జీవకోటిలోనివాడైన మనిషీ తాను చేసిన, చేస్తున్న పుణ్యపాపాలకు అనుగుణంగా జననమరణాలను ఎదుర్కొంటాడంటారు. మనిషిగా, జంతువుగా, కీటకంగా, చెట్టుగా ఇంకా ఎన్నెన్నో రూపాల్లో జన్మల్ని పొందుతాడని పెద్దలమాట. ఎన్నో సుకృతాలు చేసిన కారణంగానే మానవజన్మ లభిస్తుంది. జీవకోటిలో నరజన్మ దుర్లభమనే సూక్తి ఈ విషయాన్నే సమర్థిస్తుంది. కనుక మనిషి ప్రపంచంలో గొప్పవాడు.

మనిషి చేసే కర్మలు భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాలకు సంబంధించినవై ఉంటాయి. అంటే గతకాలంలో చేసినవీ, ప్రస్తుతకాలంలో చేస్తున్నవీ, రాబోయే కాలాల కోసం చేసేవీ అన్నీ అతడి విషయంలో పరిగణనలోకి వస్తాయన్నమాట. మనిషి గతంలో చేసిన పుణ్యపాపాలను 'సంచిత' కర్మలుగా పిలుస్తారు. సంచీలో సరకులను వేసి దాచినట్లు ఇవి దాగి ఉంటాయి కనుక ఇవి సంచితాలు.

చేసిన పాపాలుగానీ, పుణ్యాలుగానీ పక్వమై మనిషి అనుభవించడానికి సిద్ధంగా ఉంటే అవి 'ప్రారబ్ధ' కర్మలు. పుణ్యం చేయడం, పాపం చేయడం అనేవి మనిషి విచక్షణకు సంబంధించిన అంశాలు. మనిషి చెడు నడతలకు లోనైతే పాపాలు చేస్తాడు. మంచి నడవడిక కలిగి ఉంటే పుణ్యాలు చేస్తాడు. ఒక్కొక్కసారి మనిషి చెడుపనులను చేసి, ఆ తరవాత జ్ఞానోదయమై 'ఇలా ఎందుకు చేశాను?' అని అనుకొంటాడు. చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఆరాటపడుతాడు. కానీ చేసిన పాపం వూరకేపోతుందా? పోనే పోదు.

ఒక వేటగాడు మృగాన్ని వేటాడటానికి అడవికి వెళ్లాడు. చెట్లపొదలో ఏదో జంతువు కదులుతున్నట్లు అలికిడి వినబడింది. వెంటనే ధనుస్సుకు బాణాన్ని సంధించి, ఆ పొదలోని జంతువుపై ప్రయోగించాడు. బాణం తగిలిన వెంటనే ఆ జంతువు పెద్దగా అరుస్తూ నేలకూలి మరణించింది. అప్పుడు వేటగాడు ఆ పొదలోకి వెళ్లిచూస్తే సాధుజంతువు అయిన ఆవు చచ్చిపడి ఉంది. వేటగాడు తాను గోవును చంపాలనుకోలేదు. అడవిపందిని చంపి, దాని మాంసాన్ని తినాలనుకున్నాడు. కానీ తన తప్పు వల్ల గోహత్య జరిగింది. అందుకు పశ్చాత్తాపం చెందాడు. కానీ ప్రయోజనం ఏమిటి? బాణం తప్పు చేయదు. దాన్ని వినియోగించినవాడే తప్పు చేస్తాడు. చేసిన తప్పువల్ల ఫలాన్ని అనుభవించవలసిందే. ఇదే ప్రారబ్ధం అంటే.

రాబోయే కాలంలో ఉత్తమ స్థితిని కలిగి ఉండటం కోసం మనిషి చేసే సత్కర్మలు 'ఆగామి' కర్మలు. ఇతరులకు చేసే దానధర్మాలు, ఉపకారాలు, త్యాగాలు మనిషికి ఆగామికాలంలో ఉపయోగపడతాయి. వృద్ధాప్యంలో కాళ్లూచేతులూ ఆడవు కనుక యౌవనంలో ఉన్నప్పుడే పుష్కలంగా ధనాన్ని సంపాదించాలని అనుకొంటారు అందరూ. అంటే తాము సంపాదించి, కూడబెట్టుకున్న ధనం ముసలితనంలో శ్రమపడనవసరం లేకుండా ఉపయోగపడుతుందనే కదా దాని అర్థం! ఇలాగే పుణ్య, పాపకర్మల విషయంలోనూ మనిషి ఆలోచించాలి అనేదే ఈ కర్మల పరమార్థం.

ఎన్ని శాస్త్రాలు చెప్పినా, ఎంతమంది ప్రవక్తలు ప్రబోధించినా వాటన్నింటి సారం ఒక్కటే- అదే సత్కర్మాచరణ. పాపానికి భయపడి మంచి పనులు చేయాలి. పుణ్యానికి ఆశపడి మంచి పనులు చేయాలి. ఎలాగైనా మంచి పనులే చేయాలి. ఇదే పరమార్థం.

గత జన్మలూ, ఆగామి జన్మలూ ఉన్నాయని నమ్మినా, నమ్మకపోయినా ఏ ప్రమాదమూలేదు కానీ- మంచి పనులు చేయడం మరచిపోతే మాత్రం అడుగడుగునా ప్రమాదాలే ఎదురవుతాయనేది త్రికాల సత్యం. అందుకే మనిషి మంచినే భావించాలి. మంచినే భాషించాలి. మంచినే ఆచరించాలి. మంచినే అనుసరించాలి
30/08/17, 10:28:45 AM: Yes Pk: *తాంబూలానికి తమలపాకులనే ఎందుకు వాడతారు?*
🍃🌺🍃🌺🍃🌺🍃🌺🍃
1. హిందూ ధర్మంలో తమలపాకు ప్రాముఖ్యత
హిందూ ధర్మం లో తమలపాకును అష్ట మంగళాల లో(1. పూలు 2. అక్షింతలు, 3. ఫలాలు,4,అద్దం, 5. వస్త్రం, 6. తమలపాకు మరియు వక్క ,7.దీపం, 8. కుంకుమ)  ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో మరియు సంప్రోక్షణ లు చేసేటప్పుడు తమలపాకుని వాడతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు.పసుపు గణపతినీ, గౌరీదేవినీ తమలపాకుపైనే అధిష్టింపజేస్తాం.  భారత దేశం లో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదల లోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడూ, భోజనానంతరం తమలపాకుని తప్పని సరిగా ఉపయోగిస్తారు. దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెబుతారు.

2. తమలపాకు పూజలలో ఎందుకు ముఖ్యం?
క్షీర సాగర మథనం లో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు ఒకటని స్కాంద పురాణం లో చెప్పబడింది. శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని జానపద కథలు చెబుతున్నాయి . తమలపాకు యొక్క మొదటి భాగం లో కీర్తి, చివరి భాగం లో ఆయువు, మధ్య భాగం లో లక్ష్మీదేవీ నిలిచి ఉంటారని పెద్దలు చెబుతారు.

3. తమలపాకు లోని ఏయే భాగాలలో ఏ దేవతలు ఉంటారో తెలుసుకుందాం
తమలపాకు పైభాగం లో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు.

సరస్వతీదేవి మధ్యభాగం లో ఉంటుంది.

తమలపాకు చివరలలో మహాలక్ష్మీ దేవి ఉంటుంది.

జ్యేష్టా దేవి తమలపాకు కాడకీ కొమ్మకీ మధ్యన ఉంటుంది.

విష్ణుమూర్తి తమలపాకు లో ఉంటాడు.

శివుడు, కామదేవుడు తమలపాకు పైభాగం లో ఉంటారు.

తమలపాకు లోని ఎడమవైపున పార్వతీదేవి, మాంగల్య దేవి ఉంటారు.

భూమాత తమలపాకుకి కుదిభాగం లో ఉంటుంది.

సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడు.

4. తమలపాకు లోని అద్భుతమైన ఆయుర్వేద గుణాలు
తమలపాకు నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటిపుండ్లు, నోటిపూత వంటి వ్యాధులను తగ్గిస్తుంది. లైంగిక శక్తిని పెంచుతుంది. అరుగుదలకు తమలపాకు ఎంతగానో సహకరిస్తుంది కనుకనే భోజనానంతరం తాంబూల సేవనాన్ని చేస్తారు.

తమలపాకు ఎ మరియు సి విటమిన్లకు నిలయం. తమలపాకులలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల అనేక వ్యాధులు నిర్మూలించబడతాయి. తాంబూలం లో వేసుకునే ఇతర సుగంధ ద్రవ్యాలైన జాజికాయ, జాపత్రి శ్లేష్మాన్ని,కఫాన్నీ నిర్మూలిస్తాయి. ఏలకులు అసిడిటీ మరియు గ్యాస్ సమస్యలను పోగొడతాయి. నరాల బలహీనత,మూత్ర సంబంధ వ్యాధులు కూడా తమలపాకు వల్ల తొలగుతాయి.

కాన్సర్ నివారణకు తమలపాకు అద్భుతమైన ఔషధం.

శరీరం లో వేడి ఎక్కువగా ఉన్నవారు, తలనొప్పితో బాధపడుతున్న వారు తమలపాకును నుదుటిపై ఉంచడం ద్వారా ఉపశమనం పొందుతారు. చెవిపోటుతో బాధపడుతున్నవారు తమలపాకు నూనెను లేదా రసాన్ని గోరువెచ్చగా చేసి చెవిలో పోయడం ద్వారా చెవిపోటు తగ్గుతుంది. చీము,పుండ్లు వంటివి నశిస్తాయి. తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

తమలపాకు రసం రాయడం వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి.

పూర్వకాలం లో స్త్రీలు తాంబూల సేవనం శృంగార ప్రేరేపకంగానూ, సౌందర్య వస్తువుగానూ భావించేవారు. తాంబూలం నోటినీ పెదవులనూ ఎర్రగా చేయడం ఇందుకు ప్రధానకారణం. చేతులకు గోరింటాకు లాగే నోటికి తాంబూలం శోభాకరంగా భావించేవారు. ఆ భావన ఇప్పటికీ కొంసాగుతోంది.

5. తమలపాకు వాడకం లో తప్పనిసరిగా తీసుకోవలసిన  జాగ్రత్తలు
తమలపాకుని పూజలకు ఉపయోగించేటప్పుడు రంధ్రాలు ఉన్నవి గానీ, వాడిపోయినవి గానీ ఉపయోగించరాదు. అవి తాంబూల సేవనానికి కూడా మంచివికావు.

తమలపాకు అతిగా సేవించడం వల్ల రక్తం పలచబడే అవకాశం ఉంది. కాబట్టి భోజనానంతరం ఒకటి లేదా రెండుకు మించి అతిగా తినరాదు.

తమలపాకులో పొగాకు వంటివాటిని వాడటం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. సంప్రదాయ బద్ధమైన తాంబూల సేవనం మాత్రమే ఆరోగ్యాన్ని ఇస్తుంది. తమలపాకులో హానికారకమైన వస్తువులని కలిపి సేవించడం అనారోగ్యాలకు దారితీస్తుంది
31/08/17, 5:10:24 PM: Dr .mallikharjuna Rao: Dr.Harinarayana.V.Veeramraju - Psychologist -9440187805.
"తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాల మూల వాక్యాలు తెలుసుకోవాలని అనిపించడం సహజం కదా. అలాంటి వాటిని కొన్నింటిని మీకోసం సిద్ధం చేశాను చూడండి:

ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ:

👉 *ధర్మో రక్షతి రక్షిత:*

👉 *సత్య మేవ జయతే*

👉 *అహింసా పరమో2ధర్మ:*

👉 *ధనం మూలమిదం జగత్*

*జననీ జన్మ భూమిశ్చ*
*స్వర్గాదపి గరీయసి*

👉 *కృషితో నాస్తి దుర్భిక్షమ్*

👉 *బ్రాహ్మణానా మనేకత్వం*

👉 *యథా రాజా తథా ప్రజా*

👉 *పుస్తకం వనితా విత్తం*
*పర హస్తం గతం గత:*

👉 *శత శ్లోకేన పండిత:*

👉 *శతం విహాయ భోక్తవ్యం*

👉 *అతి సర్వత్ర వర్జయేత్*

👉 *బుద్ధి: కర్మానుసారిణీ*

👉 *వినాశ కాలే విపరీత బుద్ధి:*

👉 *భార్యా రూప వతీ శత్రు:*

👉 *స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:*

👉 *వృద్ధ నారీ పతి వ్రతా*

👉 *అతి వినయం ధూర్త లక్షణమ్*

👉 *ఆలస్యం అమృతం విషమ్*

👉 *దండం దశ గుణం భవేత్*

👉 *ఇవీ మన చెవిని పడుతూ ఉండే మూల వాక్యాలు. కదా?*

*ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూదామా ?*

@ ధర్మ ఏవో హతో హంతి
ధర్మో రక్షతి రక్షిత:
తస్మా ధర్మో న హంతవ్యో
మానో ధర్మో హ్రతోవ్రధీత్

🔥ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !🔥


సత్యమేవ జయతే నానృతం
సత్యేన పంథా వితతో దేవయాన:
యేనా క్రమం తృషయో హా్యప్త కామా
యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్

🔥సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.🔥


అహింసా పరమో ధర్మ:
తథాహింసా పరం తప:
అహింసా పరమం ఙ్ఞానం
అహింసా పరమార్జనమ్

🔥అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి ఙ్ఞానం. గొప్ప సాధన🔥


ధనమార్జాయ కాకుత్స్థ !
ధన మూల మిదం జగత్
అంతరం నాభి జానామి
నిర్ధనస్య మృతస్య చ

🔥ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.🔥


అపి స్వర్ణ మయీ లంకా
న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి.

🔥సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !🔥


కృషితో నాస్తి దుర్భిక్షమ్
జపతో నాస్తి పాతకమ్
మౌనేన కలహం నాస్తి
నాస్తి జాగరతో భయం.

🔥చక్కగా వ్యవసాయం చేస్తే కరవు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగురూకతతో ఉంటే దేనికీ భయపడే పని లేదు.🔥

గజానాం మంద బుధ్ధిశ్చ సర్పాణా మతి నిద్రతా
బ్రాహ్మణానా మనేకత్వం త్రిభిర్లోకోపకారకమ్

🔥ఏనుగుల మంద బుద్ధి తనం, పాముల అతి నిద్రా గుణం, బ్రాహ్మణులలో ఉండే అనైక్యత ... వీటి వల్లన లోకోపకారం జరుగుతోంది కదా !🔥


రాఙ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, పాపే పాప పరా: సదా
రాజాను మను వర్తంతే, యథా రాజా తథా ప్రజా !

🔥రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.🔥


పుస్తకం వనితా విత్తం
పర హస్తం గతం గత:
అధవా పునరా యాతి
జీర్ణం భ్రష్ఠా చ ఖండశ:

🔥పుస్తకం, స్త్రీ , ధనం ఇవి మన వద్ద ఉన్నంత సేపే . ఇతరులు చేతిలో పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయను కో వద్దు. ఒక వేళ వచ్చినా. సర్వ నాశన మయి పోయిన స్థితిలో మనకి తిరిగి దక్కుతాయి సుమీ. ( స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అనే భావం ఇక్కడ గ్రహించాలి)🔥


శత నిష్కో ధనాఢ్యశ్చ
శత గ్రామేణ భూపతి:
శతాశ్వ: క్షత్రియో రాజా
శత శ్లోకేన పండిత:


🔥వంద నిష్కలు ( ధన విశేషం) ఉన్న వాడే ధనవంతుడు అనిపించు కుంటాడు. వంద గ్రామాలకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. వంద గుఱ్ఱాలు కల వాడే రాజు అనిపించు కుంటాడు. వంద శ్లోకాలు వచ్చిన వాడే పండితుడు.🔥


విద్వత్త్వం చ నృపత్వం చ
నైవ తుల్యం కదాచన
స్వ దేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

🔥పండితుడికీ, రాజుకీ పోలికే లేదు ! ఎందు కంటే, రాజు తన దేశంలో మాత్రమే పూజింప బడతాడు. కాని, పండితుడు లోకమంతా గౌరవించ బడుతాడు.🔥


శతం విహాయ భోక్తవ్యం
సహస్రం స్నాన మాచ రేత్
లక్షం విహాయ దాతవ్యం
కోటిం త్యక్త్వా హరిం భజేత్

🔥వంద మందిని విడిచి పెట్టి అయినా భుజించాలి. వేయి మందిని విడిచి పెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాక పోయినా దానం చేయాలి. కోటి మందిని విడిచి పెట్టయినా శ్రీహరిని సేవించు కోవాలి.🔥


అతి దానాత్ హత: కర్ణ:
అతి లోభాత్ సుయోధన:
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్
( ఇది మరోవిధంగా కూడా ఉంది)

🔥విచ్చల విడిగా దానం చేయడం వలన కర్ణుడు చెడ్డాడు. మిక్కిలి స్వార్ధ గుణం చేత దుర్యోధనుడు చెడ్డాడు. అతి కామం చేత రావణుడు నాశన మయ్యాడు. కనుక అంతటా అతిని విడిచి పెట్టాలి. ఎప్పుడూ అతి పనికి రాదు. ఓవరాక్షను వికటిస్తుంది.🔥


సత్యాను సారిణీ లక్ష్మీ
కీర్తి: త్యాగాను సారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ.

🔥లక్ష్మీ దేవి ఎప్పుడూ సత్యాన్ని అనుస రించే ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అలగే, కీర్తి త్యాగాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగ గుణం లేనిదే కీర్తి ప్రతిష్ఠలు రమ్మంటే రావు. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. నిత్యం చదవనిదే చదువు ఎలా స్తుంది ? అభ్యాసం కూసు విద్య కదా. ఇక, బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది. చెడి పోయే రాత మనకి ఉంటే మన బుద్ధి చెడు త్రోవలోను, బాగు పడే రాత ఉంటే మన బుద్ధి మంచి దారిలోను ప్రవర్తిస్తుంది. బుద్ధి మన కర్మలను అనుసరించి ఉంటుంది సుమా !🔥


న నిర్మితో వై నచ దృష్ట పూర్వో
న శ్రూయతే హేమ మయం కురంగ:
తథాపి తృష్ణా రఘు నందనస్య
వినాశ కాలే విపరీత బుద్ధి:

🔥బంగారు లేడి ఉన్నదని ఎన్నడయినా విన్నామా ? ఎప్పుడయినా ఎక్కడయినా చూసామా ? అయినప్పటికీ రాముడు తన చెలి కోరిందని ముందు వెనుకలు యోచించ కుండా బంగారు లేడిని తెస్తానని వెళ్ళాడు. వినాశ కాలం దాపురించిన నాడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి. చెడ్డ కాలం వచ్చి నప్పుడు తర్కం పని చెయ్యదు. బుద్ధి మందగిస్తుంది.🔥


ఋణ కర్తా పితా శత్రు:
మాతా చ వ్యభిచారిణీ
భార్యా రూపవతీ శత్రు:
పుత్ర: శత్రురపండిత:

🔥. అప్పుడు చేసి, మనకి ఆస్తి కాకుండా అప్పు మిగిల్చే తండ్రి మనకి శత్రువుతో సమానం. వ్యభిచరించే తల్లి శత్రువు. రూపవతి అయిన భార్య శత్రువు. పండితుడు కాని కుమారుడు శత్రువు.🔥


ఆత్మ బుద్ధి: సుఖం చైవ
గురు బుద్ధిర్విశేషత:
పర బుద్ధి ర్వినాశాయ
స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:

🔥 మనకి తోచినది చేయడం అన్నిటి కన్నా మేలు. పెద్దల సలహా ప్రకారం నడచు కోవడం ఇంకా మంచిది. కాని పరుల (శత్రువుల అని కూడా అర్ధం చెప్పు కోవచ్చును) ఆలోచనల మేరకు నడచు కోవడం నాశనం కొని తెచ్చు కోవడమే. ఇక, ఆడువారి ఆలోచనల బట్టి నడుచు కుంటే ప్రళయమే సుమా !🔥


అసమర్ధస్య సాధూనాం
నిర్ధనస్య జితేంద్రియ:
వార్ధక్యో దేవతా భక్తి:
వృద్ధ నారీ పతివ్రతా.

🔥అసమర్ధుని మంచితనం, ధనం లేని పేద వాని ఇంద్రియ నిగ్రహం, ముసలి తనంలో దైవ భక్తి, వయసు ఉడిగిన ఆడుదాని పాతి వ్రత్యం ఒక్కలాంటివే.🔥


ముఖం పద్మ దళాకారం
వచ శ్చందన శీతలం
హృదయం కర్తరీ తుల్యం
అతి వినయం ధూర్త లక్షణమ్

🔥ముఖమేమో, పద్మం లాగా ఉంటుంది. మాటలేమో చందనం వలె చల్లగా ఉంటాయి. కాని, దుర్జనుని మనసు మాత్రం కత్తెర పిట్టలాంటిది. అతి వినయం చూపడం చెడ్డ వాడి లక్షణం సుమా. 🔥


సిద్ధ మన్నం ఫలం పక్వం
నారీ ప్రథమ యౌవ్వనం
కాలక్షేపం నకర్తవ్యం
ఆలస్యం అమృతం విషమ్

🔥వండిన అన్నాన్ని భుజించడానికీ, పండిన పండును కొరుక్కు తినడానికీ, యౌవ్వన వతి పొందును స్వీకరించడానికీ ఆలస్యం చేయ రాదు సుమా ! ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమై పోతుంది. అన్నం చల్లారి పోవడం, పండు కుళ్ళి పోవడం, యౌవ్వనం తరగి పోవడం జరుగుతాయి. ఆలస్యం చేయడం వల్ల అమృతం కూడా విషతుల్యమవుతుంది.🔥


విశ్వా మాత్రా హి పశుషు, కర్ద మేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.

🔥పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువులు వీటిని అదుపు చేయడానికి వరుసగా, బురదలో, నీటిలో, చీకటిలో, గ్రుడ్డితనంలో , ముసలి తనంలో సాయంగా ఉండేది చేతి కర్ర. అందు వల్ల దండానికి (కర్రకి) దశగుణాలు ఉన్నాయి సుమీ !🔥

ఇవీ మూల వాక్యాలకి పూర్తి పాఠాలు.

వీటిలో స్త్రీల విషయమై చెప్పిన వాటి విషయమై నాకూ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. కాని పూర్వులు చెప్పిన దానిని మార్చరాదు కనుక ,v యథాతథంగా ఇచ్చాను. స్త్రీవాదులు  అపార్ధం
చేసుకోకుందురు గాక !