Thursday, September 12, 2019

🕉🌞🌎🌙🌟🚩    

      *💥నేను ఫలానా అనే అహంకార స్థితిలో ఉండి మనం ఏమి చేసినా, "కర్మబంధం " అవుతుంది.*

    *💥నేను ఏమీ కాను అనే నిరంహకర స్థితిలో ఉండి ఏమి చేసినా అది," కర్మయోగం " అవుతుంది.*

🔆🔆🔆🔆🔆🔆

     *💥'మేను' అనే భావన నుండి బయటకు వస్తే "సవికల్ప సమాధి".*

    *💥'నేను' అనే భావన నుండి బయటకు వస్తే "నిర్వికల్ప సమాధి".*

🔆🔆🔆🔆🔆🔆

   *💥"ధ్యానం  నిర్విషయం మనః"*

 *💥మనస్సులో ఏ విషయము లేకుండా చేసుకోవడమే ధ్యానము.*

🕉🌞🌎🌙🌟🚩Forwarded by Balakoteswara Rao 
🕉🌞🌎🌙🌟🚩

*_Swami Vivekananda's Wisdom for Daily Inspiration - Sept 11._*

*_స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - సెప్టెంబర్ 11._*

*How long is this life for? As you have come into this world, leave some mark behind. Otherwise, where is the difference between you and the trees and stones? They, too, come into existence, decay and die.*

*ఈ జీవితం ఎంత కాలం ఉంటుంది? ఈ ప్రపంచంలోకి వచ్చావు కనుక దాని మీద ఏదో ఒక గుర్తును ముద్రించి వెళ్ళు. లేకపోతే నీకు, చెట్టుచేమలు, రాయిరప్పల మధ్య తారతమ్యం ఏముంటుంది? అవి కూడా పుట్టి, కృశించి చనిపోతాయి.*

🕉🌞🌎🌙🌟🚩Forwarded Balakoteswara Rao 

Tuesday, September 10, 2019

*30 రకాల శివలింగములు మరియు వాటి ప్రతిఫలం.....*

సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే..అందులో కూడా నల్ల రాతి శివలింగాలే అధికం.

కానీ మనకు తెలియని శివలింగాలు ఇంకా అనేకం ఉన్నాయి.

అందులో 30 రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి. అపూరూపమైనవి..

ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం..

రకరకాల పదార్ధాలతో రూపొందించిన శివలింగాలు గురించి పురాణాలు వివిధ సందర్భాలల్లో వర్ణించాయి....

ఏయే శివలింగాలను పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయంటే.....

1) గంధపు లింగం.
రెండు భాగాలు కస్తూరి , నాలుగు భాగాలు గంధం , మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు .....దీనిని పూజిస్తే శివ సాయిజ్యం లభిస్తుంది.

2) నవనీత లింగం.
వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.

3) పుష్పలింగం.
నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు....దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.

4) రజోమయ లింగం.
పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాథరత్వం సిద్ధిస్తుంది..... శివ సాయిజ్యాన్ని పొందగలరు

5) ధ్యాన లింగం.
యవలు , గోధుమలు , వరిపిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు....దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి , సంతానం కలుగుతుంది.

6 ) తిలిపిస్టోత్థ లింగం.
నూగు పిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ది కలుగుతుంది.

7) లవణ లింగం..
హరిదళం , త్రికటుకము , ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి .

8 ) కర్పూరాజ లింగం .
ముక్తి ప్రదమైనది.

9) భస్మమయ లింగం.
భస్మముతో తయారు చేస్తారు ...... సర్వసిద్ధులను కలుగచేస్తుంది

10) శర్కరామయ లింగం..
సుఖప్రదం..

11) సద్భోత్థ లింగం..
ప్రీతికరని కలిగిస్తుంది.

12) పాలరాతి లింగం..
ఆరోగ్యదాయకం.

13) వంకాకురమయ లింగం.
వంశవృద్దిని కలిగిస్తుంది ...... దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు .

14) కేశాస్థి లింగం .
వెంట్రుకలు , ఎముకలతో తయారు చేస్తారు .....ఇది శత్రునాశనం చేస్తుంది.

15) పిష్టమయ లింగం..
ఇది పిండితో తయారు చేయబడుతుంది...ఇది విద్యలను ప్రసాదిస్తుంది.

16) దధిదుగ్థ లింగం .
కీర్తి ప్రతిష్టలను కలిగిస్తుంది.

17) ఫలోత్థ లింగం..
ఫలప్రదమైనది.

18) రాత్రి ఘజాత లింగం.
ముక్తి ప్రదం

19) గోమయ లింగం..
కపిల గోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు ..... దీనిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది..... భూమిపై పడి మట్టి కలిసిన పేడ పనికిరాదు

20) దూర్వాకాండజ లింగం.
గరికతో తయారు చేయబడు ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది

21) వైడూర్య లింగం..
శత్రునాశనం , దృష్టి దోషహరం

22) ముక్త లింగం .
ముత్యంతో తయారు చేయబడిన ఈ లింగం ఇష్ట సిద్దిని కలిగిస్తుంది

23) సువర్ణ నిర్మిత లింగం.
బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది

24) ఇత్తడి - కంచు లింగం..
ముక్తిని ప్రసాదిస్తుంది

25) రజత లింగం..
సంపదలను కలిగిస్తుంది

26) ఇనుము - సీసపు లింగం.
శత్రునాశనం చేస్తుంది

27) అష్టధాతు లింగం.
చర్మరోగాలను నివారిస్తుంది.....సర్వసిద్ధి ప్రదం

28) స్ఫటీక లింగం.
సర్వసిద్ధికరం , అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది

29) తుష్టోత్థ లింగం..
మారణ క్రియకు పూజిస్తారు

30) సీతాఖండ లింగం.
ఫటిక బెల్లంతో తయారు చేసింది..... ఆరోగ్యసిద్ధి కలుగుతుంది

పరమేశ్వర పూజా పుష్పఫలము ..

శివున్ని దర్భలతో పూజిస్తే - దీర్ఘాయుస్సు!
ఉమ్మెత్తలతో పూజిస్తే - సుతప్రాప్తి!

జిల్లేడు పూలతో పూజిస్తే - శౌర్యము !
కలువ పూలతో పూజిస్తే - విక్రమ వృద్ధి !

బంధూక సుమములతో పూజిస్తే - భూషణ ప్రాప్తి !
జాజి పూలతో అర్చిస్తే - వాహన ప్రాప్తి !

మల్లెపూలతో పూజిస్తే - భోగము ప్రాప్తిస్తాయి !
అవిసె పూలతో పూజిస్తే - పరమేశ్వర ప్రాప్తి !

కొండ గోగుపూలతో ఆరాధిస్తే - వస్త్ర లాభం !
నువ్వుల పువ్వులతో ఉమామహేశ్వరుణ్ణి పూజిస్తే - యౌవన ప్రాప్తి కలుగుతుంది !

తుమ్మి పువ్వులతో అర్చిస్తే - మోక్ష లాభం !
నందివర్థన పూజ - సౌందర్యాన్ని చేకూర్చుతుంది !

లోకహితం కోసం శివుడు ఎత్తిన అవతారాలు..
ఓంకార స్వరూపుడైన శివుడు లోకహితం కోసం ఎన్ని రూపాలు ధరించాడు. ఈ విషయంపై శివపురణం ఓసారి తిరగేస్తే అందులో ఎనిమిది రూపాలు ధరించినట్లు పెర్కొంటోంది.
అవేంటంటే....

* రుద్రుడు !
* భవుడు !
* శర్వుడు !
* ఉగ్రుడు !
* భీముడు !
* పశుపతి !
* ఈశానుడు !
* మహాదేవుడు !

1) రుద్రుడు : దుఃఖ నివారకుడైన అగ్నిని అదిష్టించి ఉంటాడు !!

2) శర్వుడు : జీవుల మనుగడ కోసం భూమిని అధిష్టించి ఉంటాడు !!

3) భవుడు : ఈ జగానికి అత్యంతావశ్యకమైన జలాన్ని ఆశ్రయించి ఉంటాడు !!

4) ఉగ్రుడు : జగత్తు కదలికలకు కారకుడై వాయువును అధిష్టించి ఉంటాడు !!

5) భీముడు : ఆకాశాన్ని ఆశ్రయించి ఉంటాడు !!

6) పశుపతి : సంసార బద్ధులైన జీవులను పాప విముక్తులను చేసేందుకై జీవాత్మను అధిష్టించి ఉంటాడు !!

7) ఈశానుడు : ఈ చరాచర జీవులను శాసించే సూర్యునలో ప్రకాశిస్తుంటాడు !!

8) మహాదేవుడు : తన చల్లని కిరణాలతో జీవులను పాలించు చంద్రునిలో ప్రకాశిస్తుంటాడు !!Forwarded by Sita Prasanna 
*******సమాజానికి బ్రాహ్మణుల సేవ*****

 బ్రాహ్మణులేం చేశారో గమనిద్దాం.
పాణిని సంస్కృత వ్యాకరణం వ్రాశాడు.

ఆయన వ్రాసిన పద్ధతిలో కొన్ని భాషలకు వ్యాకరణాలు వ్రాశారని తెలుస్తోంది.

కణాద మహర్షి వైశేషిక తర్కశాస్త్రం రచించాడు.

 దానిలో ప్రపంచం పరమాణువులతో నిర్మింపబడిందని తెలిపాడు.

గౌతముడు వ్యవసాయం చేసి కరవుతో బాధపడే వారికి అన్నం పెట్టాడు.

 ఆయన కార్యకారణ భావాన్ని, పదార్థ లక్షణాలను తెలిపే న్యాయశాస్త్రం రచించాడు

. పతంజలి యోగసూత్రాలు వ్రాసి ఆరోగ్యం పొందడానికి దారిచూపాడు.

చరకుడు ఆయుర్వేదం ద్వారా జనం ఆరోగ్య రక్షణకు బాట ఏర్పరచాడు.

సుశ్రూతుడు శస్తచ్రికిత్స ద్వారా ఆరోగ్య రక్షణకు ప్రయత్నించాడు.

ధన్వంతరి ఆయుర్వేద మూల పురుషుడు,

 అగ్నివేశుడు వైద్య గ్రంథకర్త,

అష్టాంగ హృదయకర్త వాగ్భటుడు.

అత్రి, భరద్వాజుడు, ఆత్రేయుడు, గౌతముడు మొదలైనవారు ఆయుర్వేద ప్రవర్తకులు.

ఆంగ్లేయ వైద్యము భారతదేశంలో ప్రవేశించడానికి పూర్వం ఈ ఆయుర్వేదమే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడింది గదా!

అత్రిముని ‘అందరు సుఖంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంతో ఉండాలి, అందరూ శుభం పొందాలి. ఒక్క రు కూడా దుఃఖం పొందకూడదు అని బోధించాడు.
దానికనుగుణంగా ఆయన భార్య అనసూయ కరవుకాలంలో పంట పండించి అందరికీ అన్నదానం చేసింది.

యాస్కు డు పదాల వ్యుత్పత్తిని తెలిపే నిరుక్తం రచించాడు.

ఆర్యభటుడు ఖగోళానికి చెందిన అనేక విషయా లు తెలిపాడు. భూమి తిరుగుతుందని చెప్పిన శాస్తవ్రేత్త ఆయన. భాస్కరుడు

 లీలావతీ గణిత శాస్త్రాన్ని రచించారు.

 చాణక్యుడు అర్థశాస్త్రం రచించాడు. ఆ జ్ఞానంతో వౌర్య చంద్రగుప్తుని ప్రభువుగా చేశాడు.

 మహామంత్రి తిమ్మరుసు విజయనగర సామ్రాజ్యానికి చేసిన సేవలు ప్రసిద్ధాలు

ఇక లోకానికి ఆనందాన్ని కల్గించే కావ్యాలు, నాటకాలు, కృతులు రచించిన మహానుభావులు సంస్కృతంలోను, దేశ భాషలలోను వందల సంఖ్యలో ఉన్నారు.

ధ్వని మా ర్గాన్ని కనుగొన్న ఆనందవర్ధనుడు......

 ఔచిత్య విచార చర్చ చేసిన క్షేమేంద్రుడు.....

 అభిజ్ఞాన శాకుంతలం రచించిన కాళిదాసు....

 నాట్యశాస్త్రాన్ని రచించిన భరతుడు,

నీతి శాస్త్రం రచించిన శుక్రుడు,

కామశాస్త్రాన్ని రచించిన వాత్స్యాయనుడు,

 పంచతంత్రం ద్వారా నీతి బోధ చేసిన విష్ణుశర్మ వీరందరూ బ్రాహ్మణులే కదా!

కృషి పద్ధతిని రచించినవాడు పరాశరుడు....

 సుధన్వోపాధ్యాయుడు ధనుర్వేద గురువులలో ఒకడు....

కృష్ణమాచార్యుడు ధనుర్విద్యా విలాసమునకు రచయిత.

సంగీత రత్నాకరాన్ని రచించినవాడు శార్జ్ధర దేవుడు.

రుద్రభట్టు స్వర నిర్ణయం రచించాడు.

శిల్ప శాస్త్రం గర్గపరాశరులవలన విశ్వకర్మకు లభించింది.

నీలకంఠ భట్టు, విశ్వనాథ దేవుడు, నరహరి భట్టు, విశ్వనాథ ద్వివేది శిల్పశాస్త్ర గ్రంథాలను వ్రాశారు.

మానసార ముని రచించినది మానసారం. ఇది గృహ నిర్మాణ విషయాలనేకం తెల్పింది.

ఇక తెలుగులో ......
నన్నయభట్టు మొదలయిన కవుల గురించి తెలిపితే అదో పెద్ద గ్రంథమవుతుంది. ఇవన్నీ సమాజానికి మేలు కలిగించేవి కావా?

రూపాయి చేతితో తాకకుండా సాధన చేసి ఏ మతం ద్వారానైనా పరతత్త్వాన్ని పొందుతారని నిరూపించి, విశ్వమత ప్రవక్త వివేకానందుని తయారుచేసిన రామకృష్ణ పరమహంస,

 అమెరికాలో యోగమార్గం ప్రచారం చేసిన పరమహంస యోగానంద, భారతదేశంలో యోగ గంగను ప్రవహింపజేసిన రామ్‌లాల్ ప్ర భూజీ బ్రాహ్మణులే.

గడచిన శతాబ్దాలలో.....

 సంఘ సంస్కర్త, మహారచయిత, కవి కందుకూరి వీరేశలింగం పంతులు...

 తన సర్వస్వం దేశంకోసం సమర్పించిన టంగుటూరి ప్రకాశం పంతులు, వావిలాల గోపాలకృష్ణయ్య,

 శాస్తవ్రిజ్ఞాన ప్రచారకులు కొమర్రాజు లక్ష్మణరావు పంతులు, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొప్ప ఇంజనీరు మోక్షగుండం విశే్వశ్వరయ్య, గొప్ప ఆయుర్వేద వైద్యులు, బహుగ్రంథకర్త, పండిత గోపాలాచార్యులు ఇలా ఎందరి పేర్లయినా చెప్పవచ్చు. ప్రతి రంగంలో వారి కృషి తరువాతి వారికి మార్గదర్శకంగా ఉండేలా చేసిన వారెందరో!

ఆధునికులలో గేయ కవులలో గురజాడ, శ్రీశ్రీ, ఆరు ద్ర, సాంప్రదాయక కవులలో కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్య ఇలా ఎందరినో పేర్కొనవచ్చు.

భారతదేశంలో ఏ పార్టీకి మెజార్టీరాని పరిస్థితిలో ప్రతిపక్షాల మద్దతు కూడగట్టి అయిదు సంవత్సరాలు మధ్యలో ఎన్నికలు రాకుండా నెట్టుకుని వచ్చిన పి.వి.నరసింహారావు, ఇలా ప్రతి రంగంలోనూ సమాజానికి మేలుచేసిన బ్రాహ్మణులనెందరినైనా చెప్పవచ్చు.

పత్రికా రంగంలో ముట్నూరి కృష్ణారావు, నీలంరాజు వెంకట శేషయ్య, భావరాజు నరసింహారావు మొదలైనవారు అంకితభావంతో పనిచేసినవారే. మచిలీపట్నంలో ముట్నూరి కృష్ణారావు, డాక్టర్ పట్ట్భా సీతారామయ్య, కోపల్లె హనుమంతరావు ఆంధ్ర జాతీయ విద్యాపరిషత్తు నెలకొల్పి, ఒకప్రక్క స్వాతంత్య్రోద్యమ కృషి కొనసాగిస్తూ జాతీయ విద్యావ్యాప్తికి కృషిచేశారు. ఆ ఊరిలో రాంజీ పంతులు హరిజనులలో విద్యావ్యాప్తికి అంకితమయ్యారు. ఆయన స్థాపించిన పాఠశాల ఇప్పటికీ నడుస్తున్నది.

ఇంతెందుకు? లోకమాన్య బాలగంగాధర తిలక్, మో తీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ ఆశయాలకు అంకితమయిన భూదానోద్యమం నిర్వహించిన తపస్వి వినోభాభావే, ఆ కాలంలోనే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నెలకొల్పిన మదనమోహన మాలవ్యా బ్రాహ్మణులే గదా! వీరందరు సమాజానికి చేసిన మేలు చాలదంటారా? ఇంతకంటే ఈ విమర్శకుల వర్గం సమాజానికి చేసిన అధికమైన మేలు ఏమిటి?

పూర్వం చేశారు కాని ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించవచ్చు. ఇపుడు బ్రాహ్మణులు జీవన పోరాటంలో ఉన్నారు. కాబట్టి ఎల్లాగో శ్రమపడి ఏదో దేశానికి వెళ్ళి తన చాకచక్యం, కృషి పట్టుదలతో జీవిస్తున్నాడు. అలా వెళ్ళలేనివారు బ్రతుకుబండి భారంగా ఈడుస్తున్నారు. మేధావి, సంపన్నుడు ఎలాగో జీవిస్తాడు. సామాన్యుని మాటేమిటి? పూర్వం ధర్మం, నీతి, దయ, అహింస వంటి సుగుణాలను అలవరచిన కాలంలో స్వాతంత్య్ర సంపాదనమో, సామ్యవాదమో పరమధర్మమని భావించి ఎందరో యువకులు తమ సర్వస్వం వెచ్చించి దానికి అంకితమయ్యారు. సంపన్నులు కొందరయినా తమ డబ్బు గుడికో, బడికో ఇచ్చి చెరువోనుయ్యో తవ్వించి జన్మధన్యమయిందనుకునేవారు. తమ డబ్బుతో పేదలకు సాయం చెయ్యడంవల్ల పేదలకు వారిపై గౌరవం ఉండేది. దాతలకు పుణ్యం, భగవదనుగ్రహం లభిస్తాయనే తృప్తిఉండేది. ఇపుడు పాప పుణ్య విశ్వాసాలు తొలగిపోతున్నాయి. గుడులకు వెళ్ళినా కోరికలు తీరడానికి తప్ప, భగవదనుగ్రహంకోసం అనే పద్ధతి తగ్గింది.

ఇప్పుడు అకారణంగా బ్రాహ్మణులు సోమరులని, వీరి కులం ఉత్పత్తికి సంబంధించినది కాదని, వారు పేద వారైనా సహకరించవద్దని ప్రచారం చేస్తే బాధ, ద్వేషం కలగడం తప్ప దానివల్ల సమసమాజం రాదు. పూర్వం గురుస్థానాల్లో ఉన్న వర్గం ధర్మం చెబితే సమాజం పాటిం చేది. ఇప్పుడు తల్లిదండ్రులనే అనాధాశ్రమాల్లో చేర్పిస్తు న్నారు. రామా యణ, భారతాలు చదివితే మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, శౌచం, ఓరిమి, జ్ఞానం, సత్యం పల కం, పరిశుద్ధత, అహింస, దయ, దొంగతనం చేయక పోవడం ఇలాంటి సుగుణాలు అవలర్చుకోవాలని తెలుస్తాయ. అందువల్ల జనహితం కోరేవారు విశాల హృదయంతో సమసమాజ నిర్మాణానికి కృషి చేయాలి. అంతేకాని ఒక కులాన్నో, వర్గాన్నో నిందిస్తే జరిగే పనా ఇది.Forwarded By Jagan Mohan IVATURI 
Sudhakar:
🌷*గురుభక్తి*🌷

గురువు అనగానే అందరూ చెప్పే మొట్టమొదటి శ్లోకం

*"గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః*
*గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"*

అయితే ఈ శ్లోకం ఎందులోది?

ఏ సందర్భంలోది?
ఎవరు వ్రాశారు? వంటి సందేహాలు ఎవరికయినా ఎప్పుడయినా వచ్చాయా?

ఈ శ్లోకం వెనుక అత్యంత ఆసక్తికరమయిన కథ ఉంది. ఈ కథ ఇంతకుముందు తెలిసినవారు మళ్ళీ చదివేయండి, తెలియని వాళ్ళు శ్రద్ధగా చదవండి

కొనేళ్ళ క్రిందట గురుకులాలు ఉండేవి. అలా ఒకానొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు ఆయన పేరు వేద ధర్ముడు. ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఈయన ఎందఱో పిల్లలని చేరదీసి, ఆయన వద్దే ఉంచుకుని, భోజనం పెట్టి, ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ నిస్వార్ధంగా బోధిస్తూ ఉండేవారు. అలా ఈయన వద్ద కౌత్సుడు అని ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ, విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ (మన గ్రాడ్యుయేషన్ వంటిదనుకోండి) ముగించుకుని గురువుని, ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. అలా కౌత్సుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒక సారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ కౌత్సునికి అప్పగించి వెళతారు. ఆయన తిరిగివచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యధావిధిగా జరుగుతుండటం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు.

ఇదిలా ఉండగా, స్నాతక సభ జరిగే రోజు రానే వచ్చింది. అందరూ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకుని, ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకుని తమ తల్లిదండ్రులతో తమ తమ ఇళ్ళకు వెళిపోయారు. ఈ కౌత్సుడు మాత్రం నోరు మెదపలేదు, తల్లి దండ్రులు ఎంత బ్రతిమాలినా వాళ్ళతో వెళ్ళడానికి విముఖత చూపించాడు. చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళిపోతారు. గురువుగారు ఇతనిని పిలిచి తను మాత్రం వెళ్లకపోవడానికి కారణమేమిటని అడుగుతాడు. అప్పుడు కౌత్సుడు బోరున విలపిస్తూ "గురువుగారూ! మీరు పొరుగూరు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను, ఈ కార్తీక మాసం (పదిహేను రోజుల్లో) నుండి తమకి దారుణమయిన కుష్ఠురోగం రాబోతోందని మీ గ్రహస్థితి చెబుతోంది. నాకు చదువు నేర్పించి, తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమయిన కాలంలో వదిలి వెళ్ళలేను. కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన తరువాతే వెళతాను, అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను" అంటాడు. అది విన్న గురువుగారు ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం అన్నిటినీ కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద భాష్పాలు రాలుస్తారు.

కౌత్సుడు మాత్రం ఈయనకి ఆ వ్యాధి రాకుండా ఏమేం చేయాలో ఆలోచించి గురువు గారితో ఫలానా జపాలు, పూజలు, యాగాలు చేద్దాం, తద్వారా మీకు రోగం రాదు అంటాడు. దానికి గురువుగారు "ప్రారబ్ధం భోగతో నస్యేత్" అన్నట్టుగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడయినా అనుభవించాల్సిందే కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుడిని అవుతున్నాను అన్న ఆనందముతో ఉన్నాను కనుక నువ్వు బాధపడకు అంటాడు. అప్పుడు గురువుగారి మాటను కాదనలేక, కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలం వస్తుంది అంటారు కనుక మనం అక్కడకి వెళ్ళి పుణ్య కార్యాలు చేద్దాం తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు. సరేనని ఇద్దరూ అక్కడకి ప్రయాణమవుతారు. కాశీ వెళ్ళిన తరువాత అక్కడ విద్యాదానం చేయటం, శివపంచాక్షరీ మంత్ర జపం చేయించటం, చేతనయినంతలో ఇతరులకి సహాయ సహకారాలు చేయటం, ఇలా ఎన్నెన్నో మొదలు పెట్టాడు కౌత్సుడు. మిట్టమధ్యాహ్నం కాళ్ళకి చెప్పులు లేకుండా జోలె పట్టుకుని (భిక్ష ద్వారా వచ్చినది మాత్రమే తినేవారు అప్పట్లో) తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి పెట్టి, తను తినేవాడు. ఒక్కోసారి గురువుగారు ఆయన తినక, తనని తిననీయక అన్నాన్ని విసిరేసేవారు. చీటికీ మాటికీ కౌత్సుడిని కొట్టడం, తిట్టడం చేయటం, చీదరించుకోవటం వంటివి చేసేవారు. అయినా కూడా ఎక్కడా విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధపెడుతోంది కాబోలు పల్లెత్తు మాట అనని ఈయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు. కౌత్సుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక పందెం వేసుకున్నారు, "మన ముగ్గురిలో ఎవరు కౌత్సుడిని గురువుగారి వద్దనుండి పంపుతారో వారే మనలో గొప్పవారు" అని.

ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం, గురువుగారిని ఇబ్బంది పెట్టి ఆనందించడం దేవుళ్ళ లక్ష్యం కాదు, కౌత్సుడు భగవంతుడు పరీక్షలు పెట్టే స్థాయిని చేరుకున్నాడు అని. సరే, అనుకున్నట్టుగా ముందుగా బ్రహ్మ మారు వేషంలో వచ్చి "నువ్వు కాశీ వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను, ఎందుకాయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు, పెద్ద వాడిని చెప్తున్నాను, నా మాట విని వేరే గురువుని చూసుకుని వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "గురువుని, అదీ ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయనని వదిలేయమని చెప్తున్న మీరు పెద్దవారెలా అవుతారు? మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలనే అనుకుంటారా?" అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు. తదుప

రి విష్ణువు మారు వేషంలో వచ్చి "రోగముతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, కానీ చేసిన మేలు మఱిచే కృతఘ్నునికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కనుక ఆయనని వదిలి వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "కృతఘ్నత అన్నది ఏదయినా ఉంటే ఇటువంటి సమయములో వదిలి వెళిపోతే నాదవుతుంది కానీ నన్ను చేరదీసి, భోజనం పెట్టి, నా నుండీ ఏమీ ఆశించకుండా తన విద్వత్తునంతా ధారపోసిన ఆయనది కాదు" అనేసరికి విష్ణువు వెను తిరుగుతాడు. ఇహ ఈశ్వరుడు మారు వేషములో వెళ్ళి "మానవ సేవే మాధవ సేవ అన్న మాట వాస్తవమే కానీ ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు? తను తినటం మానేయటమే కాక నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నేలపాలు చేయటం తప్పు కాదా? నువ్వు దూరమయితేనే నీ విలువ తెలిసొస్తుంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు" అంటాడు. దానికి కౌత్సుడు సాష్టాంగ పడి, "తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ, పైగా జీవితమంతా తిండిని పొందగల వీలునిచ్చే విలువయిన విద్యని నాకు ధారపోశారు. కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది. కనుక మహానుభావా!! వీలయితే నాకొక సాయం చేయండి. మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు, మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమయిన నీతులు మరెవరూ చెప్పకుండా చేయండి చాలు" అంటాడు.

అంతే ఆ ముగ్గురూ ఇతని గురుభక్తికి మెచ్చి "కౌత్సా! మేము త్రిమూర్తులం. నీ గురుభక్తికి మెచ్చాం, మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గి నీ అపారమయిన గురుభక్తిని చాటుకున్నావు. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము" అంటారు. దానికి ఆనందించిన కౌత్సుడు "మీ దర్శన భాగ్యం నా అదృష్టం. మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించినది కూడా ఆ గురువుగారే. కనుక నాకు నా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, మీ ముగ్గురినీ సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరయితే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే. అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే, నాకు ఇన్ని నేర్పించి, ఇంతలా తీర్చిదిద్దిన మా గురువు గారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే కనుక ఆయనకే ఇవ్వండి" అంటాడు. ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుడినీ, అటువంటి గొప్ప శిష్యుడిని తయారు చేసినందుకు గురువునీ ఇద్దరినీ మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికీ మోక్షాన్ని ప్రసాదిస్తారు.

ఇటువంటి కథలు విన్నప్పుడు, చదివినప్పుడు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి. ఏ పనయినా పూర్తి చేయటానికి అత్యంత ముఖ్యం, అతి ముఖ్యం, ముఖ్యం అని మూడు కారణాలుంటాయి(ట). ఉదాహరణకి అన్నం వండాలనుకోండి, అత్యంత ముఖ్యమయినది బియ్యం, అతి ముఖ్యమయినవి నీళ్ళు, మంట, పాత్ర, మొ., ముఖ్యమయినది వండే విధానం తెలియటం. అదే విధముగా ఉద్యోగం సంపాదించి సుఖంగా జీవిస్తున్నారు అంటే గురువులు నేర్పిన విద్య అత్యంత ముఖ్యమయినది, అతి ముఖ్యమయినవి మన శ్రద్ధ, క్రమశిక్షణ, మొ., గురువులు నేర్పిన చదువులు బుద్ధికి పట్టేలా చేయగల బుద్ధిని ఇచ్చిన తల్లిదండ్రులు ముఖ్యమయినవారు. అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ తరువాత ప్రాముఖ్యతని ఆచార్యదేవోభవ అంటూ గురువుకి ఇచ్చారు. ఇటువంటి జ్ఞానం మనకి అలవడిన నాడు నా కృషి వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది అన్న అహంకారం ఉండదు. మరీ కౌత్సుడంత లేకపోయినా అసలంటూ గురుభక్తి పెంచుకుని, గురువులని గౌరవించాలని ఆశిస్తూ గురువులందరికీ ఈ పోస్ట్ అంకితం....

       🙏Forwarded by PLN CHARLU 

Saturday, September 7, 2019

Vinayaka chaviti at Guruvayur


జంబుద్వీపే భరతవర్షే భరతఖండే,అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?

జంబుద్వీపే భరతవర్షే భరతఖండే
సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు “జంబుద్వీపే భరతవర్షే భరతఖండే” అనేవి మనమందరం వినే ఉంటాము. మన సనాతన ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.

జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:
1) కేతుముల వర్ష 2) హరి వర్ష 3) ఇలవ్రిత వర్ష 4) కురు వర్ష 5) హిరణ్యక వర్ష
6) రమ్యక వర్ష 7) కింపురుష వర్ష 8 ) భద్రస్వ వర్ష
పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.
ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.
మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.
దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !
మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో ఇటువంతి అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను భోదించడం లేదు.
మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు విద్యావ్యవస్థను కాషాయమయం చేయొద్దని తిరస్కరించాయి. తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?
ఏ రాజకీయ పార్టీ అయినా/ప్రభుత్వం అయినా దేశ సంస్కృతిని/పూర్వీకులను గౌరవించాలి. ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి!Forwarded by PLN CHARLI