Thursday, May 21, 2020

*ప్రవర యొక్క అర్ధం.*

*చతుస్సాగర పర్యంతం*
(మానవ పరిభ్రమణానికి నలువైపులా కల మహాసముద్రాల అంచుల వరకూ)...

*గో బ్రాహ్మణేభ్య శుభం భవతు*(సర్వాబీష్ట ప్రదాయిణి అగు..గోవూ మరియు నిత్యం సంఘహితాన్నే అభిలషించే సద్బ్రాహ్మణుడు అతడి రూపంలో ప్రకాశించే వేదధర్మం.. సర్వే సర్వత్రా దిగ్విజయంగా.. శుభప్రదంగా వర్ధిల్లాలని కోరుకుంటూ)....

*×××××××. ఋషేయ ప్రవరాన్విత..*
(మా వంశమునకూ..మా గోత్రమునకూ మా నిత్యానుష్ట ధర్మశీలతకు మూలపురుషులైన మా ఋషివరేణ్యులకూ..

*త్యాగే నైకే అమృతత్త్వ మానశుః......*
అన్న వారి మహోన్నతమైన త్యాగనిష్ఠకు సాక్షీభూతుడనై..

*×××××× గోత్రః*
(మా గోత్రమునకూ..)

*ఆపస్తంభ సూత్రః కృష్ణ యజుశ్శాఖాధ్యాయీ.....*
(మా శాఖకూ..అందలి శాస్త్ర మర్మంబులకు..)

*శ్రీ* *** *శర్మ నామధేయస్య*
( కేవలం జన్మతహానే కాక.. ఉపనయనాది సంస్కారాలతో.. శాస్త్రపఠనంతో..వేదాధ్యయనాది వైదిక క్రతువులతో..
1. స్నానము
2. సంధ్య
3. జపము
4. హోమము
5. స్వాధ్యాయము
6. దేవ పూజ
7. ఆతిధ్యము
8. వైశ్యదేవము అనబడే అష్టకర్మలనూ క్రమంతప్పక నిర్వహిస్తూ..త్రివిధాగ్నులు...
1.కామాగ్ని
2.క్రోధాగ్ని
3.క్షుద్రాగ్ని..
అనే త్రివిధాగ్నులను అదుపులో(సమస్థితిలో) ఉంచుకొన్న వాడినై..పేరుకు ముందు శ్రీ అనబడే..ప్రకృతి స్వరూపమైన శక్తిస్వరూపాన్ని.. శుభప్రదమైన శ్రీకారాన్ని ధరించిన..

*శ్రీ * *శర్మా* అనబడే సుశ్రోత్రియుడనైన నేను..జన్మప్రధాతలైన జననీజనకులముందు..  జ్ఞానప్రధాతలైన ఆచార్యులముందు.. జ్ఞానస్వరూపమైన వేదముముందు..యావత్ ప్రపంచానికే మార్గదర్శకమైన వేదధర్మము ముందు.. నిరాకార నిర్గుణ అవ్యాజ పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మ ముందు..

*అహంభో అభివాదయే..*
( కేవలం నేనూ అన్నదిలేక.. సర్వం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహ భాగ్యమేయన్న అహంకారభావ రహితుడనై.. నిగర్వినై..త్రికరణ శుద్ధిగా (మనసా,వాచా,కర్మణా) సాష్టాంగ పూర్వక (మానవశరీరంలోని అత్యంత ప్రాధాన్యమైన ఎనిమిది శరీరాంగములనూ శరణాగత హృదయంచే నేలపై వాల్చి సమర్పిస్తున్న)దండ ప్రణామమిదే..అన్న పరిపూర్ణమైన ఆత్మపూర్వక వేదపూర్వక హృదయపూర్వక నమస్కార భావమే.. సశాస్త్రీయమైన ఈ ప్రవరలోని..అర్ధం అంతరార్ధం పరమార్ధం కూడా..By  MVMRAO 

Wednesday, May 20, 2020

🌼🌿శివ గుణాలు 🌼🌿

‘శివ’ శబ్దం మంగళాత్మకం. అందుకే ‘శివుడు’ అనే పేరు ఎన్నో శుభాల్ని సూచిస్తుంది. శుభాలన్నీ గుణాలే! అనేక గుణాలకు నిలయుడైనవాడు శివుడు. ఆయనను లోకమంతా ఆరాధిస్తుంది. శివ నామాన్ని జపిస్తుంది. ఆయన దర్శనం కోసమే తపిస్తుంది. అదీ శివుడి విశిష్టత.
శివుడి అనంత గుణాల్లో త్రినేత్రత్వం ఒకటి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని- శివుడి మూడు కళ్లు. అలా మూడింటిని కలిగి ఉండటం ఆయన ప్రత్యేకత. అందులోనే ఎంతో అంతరార్థం దాగి ఉంది. సూర్యుడు ఆరోగ్యానికి, చంద్రుడు జీవన కళకు, అగ్ని తేజోగుణానికి నెలవులు. ఆ మూడూ ప్రతి మనిషిలోనూ ఉండాలన్న సత్యాన్ని శివుడి త్రినేత్రత్వం చెబుతోంది.
భస్మాన్ని శరీరమంతటా ధరించడం వల్ల శివుడు భస్మధారి అయ్యాడు. లోకంలో చివరికి బూడిద తప్ప ఏదీ మిగలదు. ఈ సత్యాన్ని ఆయన భస్మధారణ తెలియజేస్తుంది. అన్నీ నశించేవే అనడం దాని పరమార్థం.
శివుడు తన అర్ధ శరీరాన్ని భార్యకు ఇవ్వడం వల్ల అర్ధనారీశ్వరుడయ్యాడు. ఏ వ్యక్తి అయినా తన జీవిత భాగస్వామికి అర్ధాంగాన్ని సమర్పించినంతగా ప్రేమను పంచాలన్నదే ఇందులోని భావం.
ఆయన గరళ కంఠుడు. అంటే, కంఠంలో విషాన్ని దాచుకొన్నవాడు. అది కాలకూట విషం. అత్యంత ప్రమాదకరం. అయినా శివుడు చలించకుండా లోక రక్షణార్థం గొంతులో ధరించాడు. మంచి పని కోసం చేదు కష్టాలు భరించక తప్పదనే రూపం అది.
జీవుడి అంతిమ యాత్ర ముగిసేది శ్మశానంలోనే. దాన్ని శివుడు విహారభూమిగా చేసుకొన్నాడు. పుట్టిన ప్రతి ప్రాణీ ఏదో ఒకనాటికి అక్కడికి చేరక తప్పదన్న జీవన సత్యానికి అది సూచిక.
నిరంతరం ప్రవహించే స్వచ్ఛ నది గంగ. ఆ గంగనే తలపై ధరించిన గంగాధరుడు స్వచ్ఛతకు ప్రతిరూపం. ఎవరికైనా నీటితోనే పరిశుభ్రత, పవిత్రత లభిస్తాయి. శివుడి గంగాధరత్వం మానవాళికి మార్గదర్శకం.
చంద్రశేఖరుడు- అంటే, తలపై చంద్రుణ్ని ధరించినవాడు శివుడు. శరీరంలో అగ్రభాగం శిరస్సు. అది అన్ని కళలతో ప్రకాశిస్తేనే, జీవితం వెలుగుతుందని అంతరార్థం.
శివుడు నంది వాహనుడు. ‘నంది’ అంటే ఆనందింపజేసేది. వాహనం ఆనందాన్ని కలిగించాలని, జీవన యాత్రను సుఖవంతం చేయాలని సూచిస్తోంది ఆ నంది.
సర్పహారి శివుడు. అంటే పామును మెడలో వేసుకునేవాడు. గడ్డు పరిస్థితులు ఎదురైనా మనిషి వాటిని అధిగమించాలని, సర్పాన్ని మెడలో వేసుకున్నట్లు ఉండాలే కాని, భయపడి పారిపోకూడదని నాగాభరణత్వం తెలియజేస్తుంది.
శివుడు తాండవ ప్రియుడు. జీవితం ఒక రంగస్థలం. దానిపై నిత్యమూ ఆనందంగా ఆడుకోవాలని సూచిస్తాడాయన.
ప్రమథ గణాలకు నాయకుడు శివుడు. లోకంలో ప్రతి వ్యక్తీ ధర్మాన్ని నిలపడానికి వీలుగా తనకు సహాయం చేసే శక్తుల్ని సమకూర్చుకోవాలి. వాటిని లోక క్షేమం కోసం వాడుకోవాలన్నదే దీనిలో అంతరార్థం.
ఆయన మహా తపస్వి. లోక క్షేమం కోసం చేసే తపస్సు అది. ఏ మంచి పనినైనా దీక్షతో ఓ తపస్సులా ఆచరించాలని, దేనికీ చలించరాదని ఈ శివతత్వం బోధిస్తోంది.
ఇలా శివగుణాలు అనేకం. ఇవన్నీ లోకానికి సందేశాలు అందించేవే. దైవాన్ని మనిషి తన జీవనమార్గ లక్ష్యంగా చేసుకుంటే, అంతటా శివం (మంగళం) వెల్లివిరుస్తుంది!

            🌼🌿 ఓం నమః శివాయ🌼🌿

Monday, May 18, 2020

***ఆరాధ్య బంధువులకు నమస్కారములు...🙏🙏

 శ్రీ ముదిగొండ శంకరరాధ్య మఠం, శ్రీ శైవ మహాపీఠం మరియు శ్రీశైవమహాపీఠం జంటనగర శాఖ  సహకారంతో...
ఈ రోజు అనగా  17.05.2020 ఆదివారం నాడు నాగోల్ శ్రీ  కాశీ విశ్వేశ్వరాలయం నందు 50 మంది పేద బ్రాహ్మణులకు నిత్యావసర గ్రాసం అందజేయడం జరిగింది.

రేపటి నుండి అనగా *18.05.2020* నుండి  *శ్రీ ముదిగొండ శంకరరాధ్య మఠంలో*  ఈ లాక్ డౌన్ ముగియునంత వరకు పేదలకు *5 కేజీల బియ్యం* వితరణ చేయుటకు సంకల్పించినాము.
వితరణ సమయం : *ఉ౹౹ 10 గం౹౹ ల నుండి 11 గం౹౹ ల వరకు మాత్రమే*

ఇట్లు
ములుగు పవన కుమార్   --  9246358204
S P బద్రి.  +91 95023 59124
ముదిగొండ వీరేశ్   +91 92461 09664

Monday, May 11, 2020

I

11.05.2020

***ఆరాధ్య బంధువులకు నమస్కారములు...🙏🙏

ఈరోజు  అనగా 11.05.2020 శ్రీ ముదిగొండ శంకరరాధ్యమఠంలో అన్నదానం కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది...

శ్రీ శైవ మహాపీఠం కార్యవర్గ సభ్యులు శ్రీ ములుగు పవన్ కుమార్ గారు,  శ్రీ SP బద్రి గారు, శ్రీ ముదిగొండ వీరేశ్ గారు,  శ్రీ ముదిగొండ నాగరాజు,   శ్రీ ముదిగొండ లింగమూర్తి గారు, మరియు శ్రీ  విఠల్ గార్ల  బృందం   కలసి సుమారు 200 ప్యాకెట్స్ *బిసిబిళ్లబాత్*  తయారు చేయించి మ౹౹ 12.30 ని!!లకు   50 ఆహార ప్యాకెట్స్ పీఠం వద్ద పేదలకు అందచేయుటమైనది.
150 ఆహార ప్యాకెట్స్ పోలీస్ శాఖవారి సహకారంతో ముషీరాబాద్, గాంధీనగర్,  పద్మారావునగర్ పరిసర ప్రాంతాలలో పేదలకు పంపిణీ చేయడమైనది.

*ఈనాటితో మేము ప్రారంభించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమము విజయవంతంగా ముగిసింది*.
ఈ కార్యక్రముమునకు విరివిగా *విరాళాలు అందజేసిన దాతలందరికి మరొక్కసారి మా కృతజ్ఞతపూర్వక ప్రణామములు*.
ఈ మండలం రోజుల కార్యక్రమములో
# సుమారు *16000 అన్నప్రసాదములు* కరోన లాక్ డౌన్ బాధితులకు అందజేయడం జరిగినది.
#సుమారు *460 నిత్యావసర గ్రాసం కిట్స్* నగరంలో పలుచోట్ల ఉన్న పేద ఆరాధ్య బంధువులకు మరియు ఇతర బాధితులకు అందజేయడమైనది.
#సుమారు *70 నిత్యావసర గ్రాసం కిట్స్* చిక్కడపల్లి త్యాగరాయగానసభ వద్ద  మహేశ్వరులకు వితరణ చేయడమైనది.
# *100 కేజీలు బియ్యం* బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా పేద బ్రాహ్మణులకు వితరణ చేయడమైనది.

ఈ కార్యక్రమమునకు సహకరించిన శ్రీ శైవ మహాపీఠం మరియు శ్రీశైవమహాపీఠం జంటనగర శాఖ కార్యవర్గ సభ్యులకు, ఇతర మిత్రులకు మా శతకోటి  వందనాలు🙏..అభివందనాలు.🙏🙏
ఈ కార్యక్రమమునకు మాకు వచ్చిన విరాళాలు మరియు చేసిన ఖర్చుల వివరాలు త్వరలో సమర్పించగలము.

ఇట్లు
*ములుగు పవన్ కుమార్*
*S P బద్రి*
*ముదిగొండ వీరేశ్*

10.05.2020

***ఆరాధ్య బంధువులకు నమస్కారములు...🙏🙏

ఈరోజు  అనగా 10.05.2020 శ్రీ ముదిగొండ శంకరరాధ్యమఠంలో అన్నదానం కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది...

శ్రీ శైవ మహాపీఠం కార్యవర్గ సభ్యులు శ్రీ ములుగు పవన్ కుమార్ గారు,  శ్రీ SP బద్రి గారు, శ్రీ ముదిగొండ వీరేశ్ గారు,  శ్రీ ముదిగొండ నాగరాజు,  శ్రీ శివలెంక ఉదయభాస్కర్ గారు, శ్రీ ముదిగొండ లింగమూర్తి గారు, డా౹౹ శ్రీ విఠల్ గారు   మరియు శ్రీ & శ్రీమతి విఠల్ గార్ల  బృందం   కలసి సుమారు 400 ప్యాకెట్స్ *మిక్స్డ్ వెజిటబుల్ రైస్*  తయారు చేయించి మ౹౹ 12.30 ని!!లకు   200 ఆహార ప్యాకెట్స్ సికింద్రాబాద్ లో ఉన్న  అంధులకు  అందచేయడం అయినది.
200 ఆహార ప్యాకెట్స్ పోలీస్ శాఖవారి సహకారంతో ముషీరాబాద్, గాంధీనగర్,  పద్మారావునగర్ పరిసర ప్రాంతాలలో పేదలకు పంపిణీ చేయడమైనది.

ఈరోజు మఠంలో *శివరాధ్య శ్రీ ముదిగొండ శంకరరాధ్యులవారి ఆరాధానోత్సవం* ఘనంగా నిర్వహింపబడినది.

విరాళాలు ఇచ్చిన దాతలకు ఆ కాశీ విశ్వేశ్వరుడు ఎల్లప్పుడూ అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు సదా కలగజేయాలని ప్రార్థిస్తూ ...

ఇట్లు
*ములుగు హనుమంత రావు*
*ఫిట్ పర్సన్*
*శ్రీ ముదిగొండ శంకరారాధ్యమఠం*

Saturday, May 9, 2020

శ్రీ ముదిగొండ శంకరారాధ్యా మఠం లో 37వ రోజు కరోనా బాదితులు కీ అన్నప్రసాద వితరణ, శ్రీ ముదిగొండ శాంకారారాధ్యా మఠం, శ్రీ శైవమహాపీఠం నాగోలు మరియు శ్రీశైవమపీఠం జంటనగర శాఖ సoయుక్త ఆధ్వర్యంలో జరిగినది