Sunday, February 2, 2020

*🌹. శివ తాండవ స్తోత్రం – తెలుగు పద్యాలు ఇంకా తాత్పర్యములు 🌹*

జటాటవీగలజ్జల ప్రవాహపావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ |
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || 1 ||

జటాఝూటం నుండి ప్రవహిస్తున్న గంగాజలంతో అభిషేకించబడుతున్న మెడతో – మెడలోని సర్పహారము మాలలా వ్రేలాడుచుండగా – చేతిలోని ఢమరుకము ఢమ ఢమ ఢమ ఢమ యని మ్రోగుచుండగా శివుడు ప్రచండ తాండవమును సాగించెను. ఆ తాండవ నర్తకుడు- శివుడు – మాకు సకల శుభములను ప్రసాదించుగాక.

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ-
విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని |
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || 2 ||

శివుని జడలు నీటిని ఒడిసిపట్టే లోతైన బావిలా ఉండగా, అందులో సురగంగ వేగంగా సుడులు తిరుగుచున్నది. అప్పుడు దానిలో బారులుతీరి ప్రకాశించే తరంగాలతో ఆయన శిరము మిరిమిట్లుగొలుపుతుంది. అలాంటి మహాదేవునియందు – నుదుటి భాగమున ధగ ధగ మెరుస్తున్న అగ్నిని, శిరస్సుపై బాలచంద్రుని ధరించియున్న శివునిపట్ల నాకు గొప్ప శ్రద్ధ కలదు.

ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర
స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే |
కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని || 3 ||

ఎవరి మదిలోనైతే తేజోవంతమైన విశ్వంలోని జీవులు వర్ధిల్లుతాయో, ఎవరు పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవికి తోడై ఉంటాడో,ఎవరు- తన కరుణా కటాక్షములచే ఎంతటి ప్రమాదాన్ని అయినా అడ్డుకోగలడో, ఎవరు అంతటా విరాజిల్లుతున్నాడో, ఎవరు ముల్లోకములను వస్త్రాలుగా కప్పుకుని ఉన్నాడో – అట్టి పరమ శివుని యందు నా మనస్సు రమించుగాక!

జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా
కదంబ కుంకుమద్రవ ప్రలిప్తదిగ్వధూముఖే |
మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి || 4 ||

సర్వ దిక్కులను పాలించే దేవతల చెక్కిళ్ళపై ఎర్రని కాంతులను విరజిమ్మేవిధంగా ప్రకాశించే మణిని పడగలపై ఉంచుకున్న సర్పమును చుట్టుకుని, మదపుటేనుగు చర్మంతో చేయబడిన అందమైన ఉత్తరీయమును భుజముపై ధరించి,సర్వ ప్రాణులకు సమ న్యాయం చేసే, భూతనాథుడైన పరమ శివునియందు నా మానస్సు మహానందభరితమై వర్ధిల్లుగాక!

సహస్రలోచన ప్రభృత్య శేషలేఖశేఖర
ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః |
భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః || 5 ||

చంద్రుని తలపై కిరీటంగా కలవాడు, ఎర్రని సర్పమాలతో కేశాలను బిగించి ముడివేసిన వాడు, ఇంద్రాదిదేవతల సిగదండలలోని పువ్వుల పుప్పొడితో ధూళి దూసరమైఉన్న నల్లని పాదపీఠముగల వాడు అయిన పరమేశ్వరుడు మాకు తరుగని సిరులను కరుణించుగాక!

లలాటచత్వర జ్వలద్ధనంజయ స్ఫులింగభా-
-నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకమ్ |
సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం
మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః || 6 ||

ఏది- ఇంద్రాది దేవతలచే మ్రొక్కబడుతుందో, ఏది-చంద్రరేఖతో శోభాయమానంగా వెలుగుతోందో, అటువంటి నుదుటిని కలిగి, దానియందు ప్రజ్వరిల్లే అగ్గిరవ్వల సెగలతో ఎవరు, మన్మథుని హరించాడో, అటువంటి పరమశివుని యొక్క చిక్కులుపడ్డ జటల నుండి సర్వ సంపత్కరమైన సిద్ధులు మాకు అనుగ్రహింపబడు గాక!

కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల-
ద్ధనంజయాధరీకృతప్రచండపంచసాయకే |
ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక-
-ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ || 7 ||

విశాల నుదుటి భాగమున ధగ ధగ మనే మహా అగ్నిజ్వాలలతో ప్రచండుడై, మన్మధుని ఆహుతియొనర్చి, పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవి యోక్క కుచాగ్రములపై, మకరికాపత్రరచనా శిల్ప నైపుణ్యమును ప్రదర్శించు మూడుకన్నుల వేలుపు స్వామిపై నా మనస్సు లగ్నమై వర్ధిల్లుగాక!

నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్-
కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః |
నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః
కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః || 8 ||

సర్వ జగత్తు యొక్క భారాన్ని తనపై ఉంచుకున్నవాడు, చంద్రుని ధరించి శోభించేవాడు, సురగంగను తనయందు కలవాడు, కారు మబ్బులు చెలరేగి చుట్టుముట్టిన – అమావాస్య నాటి అర్ధరాత్రమందలి చిమ్మ చీకట్లను ముద్దగా చేసి ఇక్కడ బంధించినారా , అన్నట్టున్న నల్లని కంఠం కలవాడు అయిన మహాదేవుడు మాకు సకల సిరులను కరుణించుగాక!

ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా-
విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరమ్ |
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే || 9 ||

వికసించిన నల్లకలువ పూల మధ్య మూల భాగం ఎంత నల్లని కాంతిని విరజిమ్మునో – అంత నల్లదనముతో ప్రకాశించు కంఠము గలిగి – మన్మథుని హరించినవాడు – త్రిపురములను సంహరించినవాడు – భవబంధ హరుడు- సంసారహారి – గజదనుజారి – అందకాసురుని చీల్చి చెండాడిన శూలపాణి – యముడిని అదుపుచేసిన వాడు అయిన ఆ శివుడికి, నేను మ్రొక్కెదను.

అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీ
రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్ |
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే || 10 ||

సర్వమంగళ కళావిలాసములతో, కదంబ పూల నుండి వచ్చే తేనెల గుభాళింపులకు, గండుతుమ్మెదవలె ఆసక్తుడై చెలగు ప్రభువు- మన్మథుని హరించినవాడు – త్రిపురములను సంహరించినవాడు – భవబంధ హరుడు- సంసారహారి – గజదనుజారి – అందకాసురుని చీల్చి చెండాడిన శూలపాణి – యముడిని అదుపుచేసిన వాడు అయిన ఆ నటరాజుకి నేను మ్రొక్కెదను!

జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస-
ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ |
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ
ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః || 11 ||

వేగంగా చరిస్తూ, సర్పములు చేసే బుసల శ్వాసలకు, మరింతగా రాజుకుని ఎగసిపడే అగ్ని కీలలతో ఉన్న నుదురు గల రుద్రునకు, ధిమి, ధిమి అను మద్దెల సమున్నత మంగళ ధ్వనులకు తగినట్లుగా అడుగులువేయుచు ప్రచండముగా తాండవించు నటరాజునకు – శివునకు జయమగుగాక!

దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్-
-గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః |
తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః
సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే || 12 ||

కటికనేలను, హంసతూలికా తల్పమును – సర్పమును, చక్కని ముత్యాల దండను – మహారత్నమును, మట్టిబెడ్డను – గడ్డిపరకను, కలువకంటిని – సామాన్య ప్రజలను, సకల భూమండలాధీశుడైన మహారాజును – మిత్ర పక్షమును, శత్రుపక్షమును అన్నింటినీ సమప్రవృత్తితో తిలకించుచున్న సదాశివునికి నేనెప్పుడు సేవ చేసుకుంటానో కదా!

కదా నిలింపనిర్ఝరీ నికుంజకోటరే వసన్
విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ |
విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ || 13 ||

గంగానది ఒడ్డున – ఆశ్రయం ఏర్పాటుచేసుకుని, చిత్తమున గల దురాలోచనలను విడిచి, చంచల దృష్టిని స్థిరంగా చేసి, నుదుటిమధ్య నా మనసు నిలిపి, శివనామ మహామంత్రమునుచ్చరించుచు తరించే మహాభాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో కదా!

ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతమ్ |
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ || 14 ||

నిత్యము ఈ స్తోత్రము చదివినను, అర్ధము స్మరించినను, వివరించి పలికినను, మానవుడు శుద్ధుడగును. వాడు మహా శివ భక్తుడగును. శివశక్తి సంపాదనకు వేరుదారి లేదు. శరీరధారుల అజ్ఞానము సదా శివ ధ్యానముచే మాత్రమే నశించును.

పూజావసానసమయే దశవక్త్రగీతం యః
శంభుపూజనపరం పఠతి ప్రదోషే |
తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః || 15 ||

ప్రదోషకాలమున శివపూజా పరిసమాప్తియందు ఎవడీ శివార్చనాపరమైన రావణకృతమైన స్తుతిని పఠించునో వానికి శివానుగ్రహముచే రథగజతురంగములతో సదా సుప్రసన్నయైన స్థిరసంపదలు సిద్ధించును.
🌷 🌷 🌷 🌷 🌷

Friday, January 31, 2020

*రథ సప్తమి*

        తిథులలో సప్తమి తిథికి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. ఏడవ తిథి సప్తమి. అలాగే సప్తమి తర్వాత వచ్చే తిథి అష్టమి. అష్టమి మొదలుగా చంద్రునకు రిఫ అనే దోషము కూడా ఆపాదింప బడుతుంది. సప్తమి తిథి పూర్తి కావడంతో వచ్చే గుణగణాదులు పూర్తిగా మారిపోతాయి అష్టమి తిథితో. అందుకే ఈ సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి, తను భావ కారకుడైనటువంటి, పిత్రుభావ కారకుడైనటువంటి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి ఈ సూర్య నారాయణ మూర్తి పుట్టినటువంటి రోజు మాఘ శుద్ధ సప్తమి. దీనికి సూర్యసప్తమి అని పేరు. అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది? మిగతా ఏ పండుగలకూ లేని ప్రత్యేకత రథసప్తమికి ఎలా ఏర్పడింది? అంటే సూర్య నారాయణ మూర్తి ప్రత్యేకంగా ఆయన రథం చెప్పుకోదగ్గది. ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందిట. ఒక చక్రం ఉండే రథం ప్రపంచంలో ఉంటుందా? రెండు చక్రాలు కావాలి కదా మనం వెళ్ళాలి అంటే. సూర్యుని రథం మటుకు ఒకే చక్రం. నిర్ణీతమైన ప్రమాణంలో ప్రపంచంలో ఏం జరిగినా క్రమం తప్పకుండా ప్రయాణించేటటువంటి వాడు సూర్య నారాయణుడు. కనుక ఆ సప్తమి రథసప్తమి, సూర్య సప్తమి.  *...నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం కృత్తికా నక్షత్రే కళింగ దేశాధిపతిం*  అంటూ సూర్య నారాయణ మూర్తి వృత్తాంతం అంతా కూడా నవగ్రహార్చన చేసే సమయంలో చెప్తూ ఉంటారు. ఆ స్వామి కృత్తికా నక్షత్రంలో జన్మించాడు అని వర్ణిస్తాయి సాంప్రదాయ గ్రంథాలన్నీ కూడా. దక్షిణాయనం పూర్తీ అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సంక్రాంతి పిమ్మట వచ్చే సప్తమి తిథికి రథసప్తమి అని గుర్తించాలి. ఇకనుంచి సంపూర్ణమైన కాంతి కిరణాలు మనపైన ప్రసరిస్తాయి ఉత్తరాభిముఖంగా. కనుక ఈ తిథి నాడు సూర్య రథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్ళలో సూర్య రథం ముగ్గు వేయడం, అలాగే సూర్య నారాయణ మూర్తిని సోత్రం చేయడం, చేయాలి. ఇంతటి ప్రాముఖ్య కలిగిన రోజు రథసప్తమి రోజు. సూర్య నారాయణ మూర్తిని ఆరాధన చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది.(Forwarded as received )
అన్నపూర్ణాస్తుతిః

నిత్యానందకరీ వరాభయకరీ సౌన్దర్యరత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోర పాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ|
ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౧||

నిత్యమైన ఆనందము నిచ్చుదానవు, వరములను- అభయమును ప్రసాదించు దానవు, సౌందర్య సముద్రమైన దానవు, ఘొరమైన పాపముల నన్నిటినీ కడిగి వేయుదానవు, హిమవంతుని వంశమును పవిత్రము చేయుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్ష పెట్టుము.

నానా రత్న విచిత్ర భూషణ కరీ హేమామ్బరాడమ్బరీ
ముక్తాహారవిడమ్బమానవిలసద్వ వక్షోజ కుమ్భాన్తరీ|
కాశ్మీరాగరువాసితాఙ్గరుచిరా కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౨||

వివిధ రత్నముల విచిత్రాభరణములను ధరించినదానవు, బంగారు వస్త్రములను కట్టుకున్న దానవు, వక్షస్థలముపై ప్రకాశించు ముత్యాల హారములు ధరించిన దానవు, కుంకుమ- అగురులు పూసుకొనుటచే సువాసనలు వేదజల్లు శరీరము కలదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్ష పెట్టుము.

యోగానన్దకరీ రిపుక్షయకరీ ధర్మైక నిష్ఠాకరీ
చన్ద్రార్కానల భా సమాన లహరీ త్రైలొక్య రక్షాకరీ|
సర్వైశ్వర్య కరీ తపఃఫల కరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౩||

యోగముచే పొందు ఆనందమును కలిగించుదానవు, శత్రువులను నాశనం చేయు దానవు, ధర్మనిష్టను ఏర్పరచుదానవు, చంద్రుడు- సూర్యుడు- అగ్నులతొ సమానమైన కాంతి ప్రవాహమైనదానవు, మూడులొకములను రక్షించుదానవు, సమస్త్యైశ్వర్యములను ప్రసాదించుదానవు, తపస్సులకు ఫలమునిచ్చుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్ష పెట్టుము.

కైలాసాచల కన్దరాలయకరీ గౌరీ ఉమా శాఙ్కరీ
కౌమారీ నిగమార్థ గోచర కరీ ఓం కారబీజాక్షరీ|
మోక్షద్వార కవాట ఫాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౪||

కైలాస పర్వత గుహయందుడు దానవు, తెల్లని దానవు, ఉమాదేవివి, శంకరుని భార్యవు, కుమారివి, వేదార్థమును బోధించు దానవు, ఒంకార బీజాక్షర స్వరూపము కలదానవు, మోక్ష ద్వారపు తలుపులను తెరచెడి దానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్ష పెట్టుము.

దృశ్యాదృశ్య విభూతి వాహనకరీ బ్రహ్మాణ్డ భాణ్డొదరీ
లీలానాటక సూత్ర ఖేలనకరీ విజ్ఞాన దీపాఙ్కురీ|
శ్రీవిశ్వేశ మనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౫||

కనబడీ కనబడని మహిమలు కలదానవు, గర్బమునందు బ్రహ్మాండములను మోయుచున్న దానవు, లీలానాటకమునకు సూత్రధారివి, విజ్ఞానదీపమును వెలిగించు దానవు, పరమేశ్వరుని ఆనందింప చేయు దానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగునీవు భిక్ష పెట్టుము.

ఆదిక్షాన్త సమస్త వర్ణ నికరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీర త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ|
స్వర్గద్వార కవాట ఫాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౬||

’అ’ కారము మొదలు ’క్ష’ కారము వరకు ఉన్న అక్షరముల సముదాయమైన దానవు, పరమేశ్వరునకు ప్రియురాలవు, శంకరుని భార్యవు, కాశ్మీర త్రిపురేశ్వరివి, మూడుకన్నులు కలదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్ష పెట్టుము.

ఉర్వీ సర్వ జనేశ్వరీ జయకరీ మాతా కృపా సాగరీ
నారీ నీల సమాన కున్తల ధరీ నిత్యాన్నదానేశ్వరీ|
సాక్షాన్మొక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౭||

భూమియందలి సమస్తజనులకు నాయకురాలవు, విజయమునిచ్చుదానవు, తల్లివి, దయాసముద్రమైనదానవు, స్త్రీమూర్తివి, నల్లని కురులు కలదానవు, నిత్యము అన్నదానము చేయుదానవు, సాక్షాత్తుగా మోక్షము నిచ్చుదానవు, ఎల్లప్పుడు శుభమును కలిగించు దానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్ష పెట్టుము.

దేవీ సర్వ విచిత్ర రత్న రుచిరా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదు పయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ |
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౮||

దేవివి, విచిత్రములైన సర్వరత్నములతొ అలంకరింపబడినదానవు, దక్షుని కుమార్తెవు, సుందరివి, యువతివి, మధురమైన పాలిండ్లు కల దానవు, ప్రియమునిచ్చుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్ష పెట్టుము.

చన్ద్రార్కానల కోటి కోటి సదృశీ చన్ద్రాంశు బిమ్బాధరీ
చన్ద్రార్కాగ్ని సమానకుణ్డలధరీ చన్ద్రార్క వర్ణేశ్వరీ|
మాలా పుస్తక పాశసాఙ్కుశకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౯||

కొట్లాది చంద్రులు, సూర్యులు, అగ్నులతొ సమానముగా ప్రకాశించుదానవు, సూర్యబింబము వలే ఎర్రనైన క్రింది పెదవి కలదానవు, చంద్రుడు, సూర్యుడు, అగ్నుల వలే ప్రకాశించు కుండలములు ధరించిన దానవు, చంద్రుడు, సూర్యుడు వంటి వర్ణము కలదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్ష పెట్టుము

క్షత్రత్రాణకరీ మహాభయహరీ మాతా కృపాసాగరీ
సర్వానన్దకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ|
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౧౦||

వీరులను రక్షించుదానవు, మహాభయంకరివి, తల్లివి, దయా సముద్రమైన దానవు, అందరికీ ఆనందము కల్గించు దానవు, ఎల్లప్పుడు శుభము కల్గించు దానవు, విశ్వమునకు రాణివి, శోభిల్లు దానవు, దక్ష ప్రజాపతికి (యాగ నాశనము ద్వారా) దుఃఖమును కల్గించుదానవు, సుఖము నిచ్చుదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్ష పెట్టుము.

అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే|
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి||౧౧||

ఒ అన్నపూర్ణా| ఏల్లప్పుడు పూర్ణముగా ఉండు తల్లీ| శంకరుని ప్రాణవల్లభురాలా| పార్వతీ| జ్ఞానము వైరాగ్యము సిద్ధించుటకు భిక్ష పెట్టుము.By Sivakumar 
శరభ     సాళ్వ    అవతారం By Ksm kasinadhuni
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

         హిందూ పురాణాలలో
ఒకొక్కపురాణంలో ఒక్కొక్క
విధంగా వివరించారు , శరభ
పురాణంలో ""  శరభ "" అంటే సంస్కృత  పదం ,
,"" ,సాల్వ్  ""  కన్నడ  పదం
ఈరెండు కలసిన  అవతారం ,
"'శరభ సాల్వ్ " శివుని యొక్క  అవతారంగా
 ""  శరభ పురాణం ""
చెపుతుంది, ఈ స్వామి అవతారం సంస్కృత సాహిత్యం,      ప్రకారం
8 కాళ్ళు, సింహం  కంటే శక్తి వంతమైన  ఆకారం , ఒక్క
జంపుతోనే, ఒక లోయనే
దాటగలిగే శక్తి సామర్ధ్యములు ,  కలిగి ఉంటారు .
"" శరభవతారాన్ని 8, కాళ్ళు
గల ఒక"" జింకగా"". గా
అభివర్ణించారు. "లింగ పురాణం".   కాలిక పురాణంలో "  విష్ణువు 🐗
వరాహ అవతారం అట్టి  ఎత్తిన సoదర్భంలో , అయన ముగ్గురు కుమారులు  అల్ల కల్లోలం
సృష్టించారు. ఇది పరమేశ్వరుడు  శరభ
రూపాన్ని తీసుకోవడానికి  ,వరాహ రూపాన్ని సంహరించటానికి
శరభ రూపం అవసరమని తలంచి , విష్ణువు తన రూపాన్ని నియంత్రించలేక , వరాహ రూపాన్ని నాశనం , చేయాలనీ , మహా శివుని
విష్ణువు,  అభ్యర్థిస్తాడు  అప్పుడు , "" నరసింహ  ,
వరాహావతారలకు, సహాయం చేస్తున్నట్లుగా  కనపడి, శరభవతారంలో
ఉన్న మహా శివుడు మొదట
నరసింహావతారాన్ని, అంతమొందించి , తదుపరి
వరాహను అంతమొందించి
విష్ణు మూర్తి , తన రెండు భీకర  రూపాల  శక్తిని తిరిగి
గ్రహించటానికి , పరమేశ్వరుడు అనుగ్రహిస్తారు . అప్పుడు  మళ్ళీ  విష్ణువు తన ప్రశాంతమైన  రూపంలోకి  మారి"  శరభ శివునికి  ప్రతీక  ప్రతీక అయిన లింగ రూపంలోకి మారిపోతారు  .

శివపురాణం, లింగపురాణం
నరసింహుని యొక్క భీకర
రూపాన్ని శాశ్వితంగా స్వీకరించవచ్చును అనే అభిప్రాయంతో  ఈ రూపం
మంచి పనులు చేయుటకుఅయన పాత్రకు
హానికరం అందువలన ,శివుడు   శరభ అవతారం ఎత్తి  ""మానవ,  సింహం ,  పక్షిగా  "  మూడు కలిసిన  రూపం శరభాగా
ప్రతీoగిర ,  శూలినీలతో  , శివుని శివుని స్త్రీ శక్తులు రెండు కలసి రెక్కలాగాను  ,
ఏర్పరుచుకొని,  శరభ సాల్వ్ అవతారమునకు నాంది  అయ్యి  కొంతమంది
వీరభద్రుని రూపంగా  కూడా
కొలుస్తారు.

    పరమేశ్వరార్పణమస్తు
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
కాశీనాధుని సుబ్రహ్మణ్యం ,
గాంధీనగర్ , విజయవాడ .

     శుభం      భూయాత్
*శుభోదయం*              రథసప్తమి స్త్నాన శ్లోము
(రేపు రథ సప్తమి సందర్భంగా)
                             "నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే ||
యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు|
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ ||
ఏతజ్జన్మ కృతంపాపం యజ్జన్మాంత రార్జితం |
మనోవాక్కాయజం    యచ్చ జ్ఞాతా జ్ఞాతేచ యే పునః ||
ఇతి సప్త విధం పాపం స్త్నానాన్మే సప్త సప్తికే |
సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరీ సప్తమీ ||"By Mvmrao 
Upa-peetadhipathi sri Mallampalli Durga Mallikarjuna Prasad గారికి -రాజమండ్రి లో సన్మానం Sri SAIVA Aradhya Samiti- Rajamandry has did SANMANAM & GANARCHANA to our upa Peetadhipathi   sri Mallampalli Durga Mallikarjuna 



















Sri SAIVA Aradhya Samiti- Rajamandry has did SANMANAM & GANARCHANA to our upa Peetadhipathi

Sunday, January 26, 2020

*ఆదిత్య కవచమ్*

*ధ్యానం*

*ఉదయాచల మాగత్య వేదరూప మనామయం*
*తుష్టావ పరయా భక్త వాలఖిల్యాదిభిర్వృతమ్ |*
*దేవాసురైః సదావంద్యం గ్రహైశ్చపరివేష్టితం*
*ధ్యాయన్ స్తవన్ పఠన్ నామ యః సూర్య కవచం సదా ||*

*కవచం*
*ఘృణిః పాతు శిరోదేశం, సూర్యః ఫాలం చ పాతు మే*
*ఆదిత్యో లోచనే పాతు శ్రుతీ పాతః ప్రభాకరః*
*ఘ్రూణం పాతు సదా భానుః అర్క పాతు తథా*
*జిహ్వం పాతు జగన్నాధః కంఠం పాతు విభావసు*
*స్కంధౌ గ్రహపతిః పాతు, భుజౌ పాతు ప్రభాకరః*
*అహస్కరః పాతు హస్తౌ హృదయం పాతు భానుమాన్*
*మధ్యం చ పాతు సప్తాశ్వో, నాభిం పాతు నభోమణిః*
*ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు సక్థినీ*
*ఊరూ పాతు సురశ్రేష్టో, జానునీ పాతు భాస్కరః*
*జంఘే పాతు చ మార్తాండో గుల్ఫౌ పాతు త్విషాంపతిః*
*పాదౌ బ్రద్నః సదా పాతు, మిత్రో పి సకలం వపుః*
*వేదత్రయాత్మక స్వామిన్ నారాయణ జగత్పతే*
*ఆయతయామం తం కంచి ద్వేద రూపః ప్రభాకరః*
*స్తోత్రేణానేన సంతుష్టో వాలఖిల్యాదిభి ర్వృతః*
*సాక్షాత్ వేదమయో దేవో రధారూఢః సమాగతః*
*తం దృష్ట్యా సహసొత్థాయ దండవత్ప్రణమన్ భువి*
*కృతాంజలి పుటో భూత్వా సూర్యా స్యాగ్రే స్తువత్తదా*
*వేదమూర్తిః మహాభాగో ఙ్ఞానదృష్టి ర్విచార్య చ*
*బ్రహ్మణా స్థాపితం పూర్వం యాతాయామ వివర్జితం*
*సత్త్వ ప్రధానం శుక్లాఖ్యం వేదరూప మనామయం*
*శబ్దబ్రహ్మమయం వేదం సత్కర్మ బ్రహ్మవాచకం*
*ముని మధ్యాపయామాసప్రధమం సవితా స్వయం*
*తేన ప్రథమ దత్తేన వేదేన పరమేశ్వరః*
*యాఙ్ఞవల్క్యో మునిశ్రేష్టః కృతకృత్యో భవత్తదా*
*ఋగాది సకలాన్ వేదాన్ ఙ్ఞాతవాన్ సూర్య సన్నిధౌ*
*ఇదం స్తోత్రం మహాపుణ్యం పవిత్రం పాపనాశనం*
*యఃపఠేచ్చ్రుణుయా ద్వాపి సర్వపాఫైఃప్రముచ్యతే*
*వేదార్ధఙ్ఞాన సంపన్నః సూర్యలోక మవాప్నయాత్*

*ఇతి స్కాంద పురాణే గౌరీ ఖండే ఆదిత్య కవచం సంపూర్ణమ్||*