Saturday, January 4, 2020

అమ్మలగన్నయమ్మ.....

"అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాల బెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, దన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్"

మనము తెలిసి కాని, తెలియక గాని పోతనగారు వ్రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మనము ఊరికే చదువుకున్నా సద్యః ఫలితాలను ఇచ్చేస్తాయి. ఎందుకు అంటే, మనము కొన్ని కొన్ని చదవకూడదు, కొన్ని కొన్ని చెయ్యకూడదు, ప్రక్కన గురువులు ఉంటే తప్ప. మేరువుని, శ్రీచక్రమును ఇంట్లో పెట్టి పూజ చెయ్యకూడదు. అది మనవల్ల కాదు. అలాగే అందరమూ గురోపదేశం లేకుండా బీజాక్షరాలను ఉపాసన చెయ్యకూడదు. అది కష్టం. కాని పోతనగారు మనకు ఇచ్చిన గొప్ప కానుక ఆయన రచించిన పద్యములు పై పద్యములో అమ్మలను కన్న దేవతా స్త్రీలైన వారి మనస్సుల యందు ఏ అమ్మవారు ఉన్నదో, అటువంటి అమ్మని మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్. ఈ నాలుగింటి కోసము నమస్కరిస్తున్నాను. అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు. మనము చెయ్యలేని ఒక చాలా కష్టమైన పనిని పోతనగారు చాలా తేలికగా, మనకు ప్రమాదం లేని రీతిలో మనతో చేయించడానికి ఈ పద్యాన్ని అందించారు.

అమ్మలగన్నయమ్మ ఎవరు..? మనకి లలితాసహస్రం 'శ్రీమాతా' అనే నామంతో ప్రారంభమవుతుంది. శ్రీమాతా అంటే 'శ' కార, 'ర' కార, 'ఈ' కారముల చేత సత్వ, రజస్తమోగుణాధీశులైన శక్తి. బ్రహ్మశక్తి, రుద్రశక్తి, విష్ణుశక్తి. సరస్వతి, పార్వతి, లక్ష్మీదేవి, ఈ ముగ్గురికీ అమ్మ. ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ ఎవరో ఆ యమ్మ, అంటే, 'లలితాపరాభట్టారికా' స్వరూపం. ఈ అమ్మవారికి, దుర్గా స్వరూపమునకు బేధం లేదు. ముగ్గురమ్మల మూలపుటమ్మ, అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతులుగా కొలిచే తల్లులు. 'చాలా పెద్దమ్మ', అనగా మహాశక్తి. అండపిండబ్రహ్మాండం అంతటా నిండిపోయిన బ్రహ్మాండమైన శక్తి స్వరూపం. శక్తి స్వరూపం చిన్నా, పెద్దా బేధం లేకుండా సమస్త జీవులలో నిండిపోయినది. అలా ఉండడం అనేది మాతృత్వం. ఇది దయ. దీనిని సౌందర్యం అంటారు. 'సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ', అనగా దేవతలకు శత్రువైన వాళ్ళ అమ్మ అనగా 'దితి'. దితి, అయ్యో! అని ఏడ్చేటట్లుగా ఆవిడకు కడుపు శోకమును మిగిల్చింది, అనగా రాక్షసులు నశించడానికి కారణమైన అమ్మ. 'తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబున నుండెడి అమ్మ'. అనగా మనకి అష్టమాత్రుకలు...

1. బ్రాహ్మి,
2. మహేశ్వరి,
3. వైష్ణవి,
4. మహేంద్రి ,
5. చాముండా,
6. కౌమారి,
7. వారాహి,
8. మహాలక్ష్మి..

ఈ అష్టమాత్రుకలు శ్రీచక్రములో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరం అమ్మవారిని లోపల కొలుస్తూ ఉంటారు.

ఈ అష్టమాత్రుకలకు శక్తిని ఇచ్చిన అమ్మవారు ఎవరో ఆవిడే వేల్పుటమ్మల మనంబున ఉండెడి యమ్మ. 'దుర్గ మాయమ్మ' ఈ దుర్గమ్మ ఉన్నదే ఆవిడే లలితాపరాభట్టారికా. అ అమ్మ, మా యమ్మ. 'మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్, అంటే ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదలను ఇవ్వాలి. నాకు అర్హత ఉన్నది అని ఇవ్వఖ్ఖర్లేదు. దయతో ఆ తల్లి ఇచ్చెయ్యాలి. అమ్మవారికి శాక్తేయ ప్రణవములు అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌహ్ అని పిలుస్తారు. వీటిని ఎలా పడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాని, ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మహత్వమునకు, బీజాక్షరము 'ఓం', కవిత్వమునకు, బీజాక్షరం 'ఐం', పటుత్వమునకు, భువనేశ్వరీ బీజాక్షరము ' హ్రీం', ఆ తరువాత సంపదల్, లక్ష్మీదేవి 'శ్రీం'.ఓం, ఐం, హ్రీం, శ్రీం, అమ్మలగన్నయమ్మ 'శ్రీమాత్రేనమః'. మనము అస్తమానమూ బీజాక్షరాలను పలకటానికి వీలులేదు కాని, మనం రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, స్నానం చెయ్యకుండా ఎక్కడ ఉన్న కూడా, సౌచంతో ఉన్నామా లేదా అని కాకుండా 'ఈ అమ్మలగన్నయమ్మ' శ్లోకం అంటూ ఉన్నామనుకోండి, మనము మనకి తెలియకుండానే..

"ఓం, ఐం, హ్రీం, శ్రీం, శ్రీమాత్రేనమః"

..అనేస్తున్నామన్నమాట. మనము అస్తమానం ఆ తల్లిని ఉపాసన చేస్తున్నట్లే. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ ఈ పద్యం రాజద్వారం మీద ఒక తోరణంలా ఉంది. ఆ తల్లి దర్శనానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరినీ అనుగ్రహిస్తుందా అన్నట్లుగా రాసి ఉంటుంది. మనం ప్రతి ఒక్కరం ఆ పోతన గారికి ఋణపడిపోయాము. రోజులో ఒక్కసారి అన్నా ఆ మహనీయుడి యొక్క నామాన్ని మనము తలుచుకోక పోతే నిజంగా మనము కృతజ్ఞులమే.ఆవిడ రాజరాజేశ్వరి. ఆవిడ ముందు అమ్మ అని అనేసరికి ఆవిడ పొంగిపోతుంది. మన కోర్కెలను (ధర్మబద్ధం అయితే ఆ తల్లి తీర్చి తీరుతుంది)...posted as received

Friday, January 3, 2020

108 రూపాలలో శ్రీ గణపతి.....

1. ఏకాక్షర గణపతి
 ప్రాతర్భజామ్య్భయదం ఖలు భక్త శోక
దావానలం గణ్విభుం వరకుంజరాస్యమ్
అజ్ఞాన కానన వినాశన హవ్యవాహం
ఉత్సాహ వర్ధనమహం సుతమీశ్వరస్య

2. మహా గణపతి
భిభ్రాణోబ్జక బీజాపూరక కదా దంతేక్షు బాణైస్సమం
భిభ్రాణో మణికుంభశాలి కణిశం పాశంచ వక్ర్తాంచితం
గౌరంగ్యారుచి రారవిందయుతయా దేవ్యాసనాధాంతిక:
శోణాంగ శ్శుభమాతనోతుభవతాం నిత్యం గణేశో  మహాన్

3. బాల గణపతి
కరస్ధ కదళీచూత పనసేక్షు కపిత్ధకం
బాలసూర్యప్రభందేవం వందే బాలగణాధిపం

4. తరుణ గణపతి
పాశాంకుశాపూస కపిత్ధ జంబూ
ఫలం తిలాం చేక్షు మపిసవ హసై:
ధత్తే సదాయ స్తరుణారుణాంభ:
పాయాత్సయుష్మాన్ తరుణో గణేశ:

5. విఘ్నరాజ గణపతి
విఘ్నరాజావతారశ్చ శేషవాహన ఉచ్చతే
మమతాసుర సంహర్తా విష్ణు బ్రహ్మేతివాచక:

6. సిద్ది గణపతి
ఏకదంతం చతుర్హస్తం పాశాంకుశ ధారిణమ్
అభయంచవరదం హసైర్ద దానమూషకధ్వజమ్

7. బుద్ధి గణపతి
త్రయీమయాఖిలం బుద్ధిధాత్రే
బుద్ధి ప్రదీపాయ సురాధిపాయ |
నిత్యాయ సత్యాయచ నిత్యబుద్ధే
నిత్యం నిరీహాయ నమోస్తు నిత్యమ్ ||

8. లక్ష్మీ గణపతి
బిభ్రాణశ్శుక బీజపూర కమలం మాణిక్య కుంభాంకుశాన్
పాశం కల్పలతాంచ బాణకలికా ప్రోత్సస్సరో నిస్సర:
శ్యామో రక్త సరోరుహేణ సహితో  దేవీ చ యస్యాంతికే
గౌరాంగో వరదాన హస్తకమలో లక్ష్మీగణేశో మహాన్

9. సంతాన లక్ష్మీ గణపతి
శరణం భవదేవేశ సంతతిం సుదృఢాంకురు |
భవిష్యంతియే పుత్రామత్కులే గణనాయక: ||

10. దుర్గా గణపతి
తప్తకాంచన సంకాశం శ్చాష్ట్ట్ట మహత్తను: |
దీప్తాంకుశం శరం చాక్షం దంతం దక్షే వహన్కరై: ||

11. సర్వశక్తి గణపతి
ఆలింగ్య దేవీం హరితాం నిషణ్ణాం
పరస్పరాశ్లిష్టకటీ నివేశం
సంధ్యారుణం పాశసృణీం వహస్తం
భయాపహం శక్తి గణేశ మీఢే

12. విరివిరి గణపతి
సుసిద్ధాదం భక్తిజనస్యదేవ సకామిదా మామిహ సౌఖ్యదంతం |
అకా మికాగాం భవబంధహరం గజాననం భక్తియుతం భజామ ||

13.  క్షిప్ర గణపతి
దంతం కల్పలతా పాశ రత్నకుంభోప శోభితం
బంధూక కమనీయాంగం ధ్యాయేత్ క్షిప్ర వినాయకం

14. హేరంబ గణపతి
అభయ వరద హస్త: పాశదంతాక్షమాల:
పరశుమధ త్రిశీర్షం ముద్గరం మోదకం చ
విదధతు నరసింహ: పంచమాతంగ వక్త్ర:
కనక రుచిర వర్ణ: పాతు హేరమ్బ నామా

15. నిధి గణపతి
విచిత్ర రత్నై: ఖచితం సువర్ణ సమ్బూతకంగుహ్యమయా ప్రదత్తమం |
తధాంగులీష్పంగులికం గణేశ చిత్తేన సంశోభయ తత్పరేశ

16. వక్రతుండ గణపతి
స్వర్ణవర్ణ చతుర్బాహుం | పాశాంకుశధరం విభుం |
ఆమ్రపాత్ర స్వదంతంచ | శక్తియుతం విచింతయేత్

17. నవనీత గణపతి
దానాయ నానావిధ రూపకాంస్తే గృహాణ దత్తాన్మనసామయావై|
పదార్ధ భూతాన్ స్థిర జంగమాంశ్చ హేరమ్నమాం తారయ మోహభావాత్ ||

18.  ఉచ్ఛిష్గ్ట గణపతి
లీలాబ్జం దాడిమం వీణాశాలి గుంజాక్ష సూత్రకం
దధ దుచ్ఛిష్ట నామాయం గణేశ: పాతు మేచక:

19. హరిద్రా గణపతి
హరిద్రాభం చతుర్బాహుం హరిద్రా వదనం ప్రభుమ్
పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ
భక్తాభయ ప్రదాతాం వందే విఘ్న వినాశనమ్

20. మోదక గణపతి
నాదబిందు కళాత్మకం వరనారదాది సుపూజితం |
మోదక ఫలదాయకం ప్రమోదవదన వినాయకం ||

21. మేధా గణపతి
సకలభాగ్య వశంకరం వర సాధు సజ్జన సంహితం
అఖిలదేవ ప్రదాయకం  మమ ఆత్మరక్ష వినాయకం

22. మోహన గణపతి
రక్ష రక్ష గణాధ్యక్ష రక్షత్రైలోక్య రక్షక
భక్తానాం అభయంకర్తా త్రాతాభవ భవార్ణవాన్

23. త్రైలోక్య మోహన గణపతి
గదా బీజాపూరే ధను: శూలచక్రే సరోజతృలే
పాశాధాన్య ప్రదంతారి కరై: సందధానం
స్వశుండాగ్ర రాజం | మణి కుంభ
మంగాధి రూఢం స పత్న్యా ||

24.  వీర గణపతి
భేతాళ శక్తి శరకార్ముక ఖేటఖడ్గ
ఖట్వాంగ ముద్గర గధాంకుశ ముద్వహస్తం
వీరం గణేశ మరుణం సతతం స్మరామి

25.  ద్విజ గణపతి
యం పుస్తకాక్ష గుణ దండకమండలు
శ్రీవిద్యోతమాన కరభూషణమిందు వర్ణం
స్తంబేర మానన చతుష్టయ శోభమానం
త్వాం య: స్మరే ద్ద్విజ గణాధిపతే సధన్య: ||

26. ఋణవిమోచన గణపతి
సృష్ట్యా బ్రహ్మణా సమ్యక్ పూజిత: ఫలసిద్ధయే
సదైవ పార్వతీపుత్ర: ఋణనాశం కరోతుమే

27.  సంకష్టహర గణపతి
ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావాసం స్మరేన్నిత్యంమాయుష్కారమార్ధ సిద్ధయే

28.  గురు గణపతి  
ప్రవరం సర్వదేవానాం సిద్ధినాం యోగినాం గురుం |
సర్వస్వరూపం సర్వేశం జ్ఞానరాశి స్వరూపిణమ్ ||
అవ్యక్తమక్షరం నిత్యంసత్యమాత్మ స్వరూపిణం |
వాయుతుల్యంచ నిర్లిప్తం చాక్షతం సర్వసాక్షిణం ||

29. స్వర్ణ గణపతి          
వందే వందారుమందార, మిందు భూషణ నందనం |
అమందానంద సందోహ, బంధురం సింధురాననమ్ ||

30.  అర్క గణపతి          
మూషారూఢం లంబసూత్రం సర్పయజ్ఞోపవీతినల|
విషాణం పాష కమలం మోదకంచ కరైధృతం ||

31.   కుక్షి గణపతి        
సరోజన్మన భూషాణాం భరణోజ్వలహస్త తన్వ్యా సమా
లింగితాంగాం | కరీంద్రాననాం చంద్ర చూడం త్రినేత్రం రక్తకాంతిం భజేత్తం ||

32.   పుష్టి గణపతి        
ఏకదంతం మహాకాయం లంబోదరం గజాననం |
విఘ్ననాశకరం దేవం హేరంబం ప్రణమామ్యహం ||

33.  వామన గణపతి          
లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం |
అర్ధచంద్రధరం దేవం విఘ్నప్యూహం వినాశనం ||
     యోగ విఘ//t

35.   నృత్య గణపతి        
పాశాంకుశాపూప కుఠార దన్త చంచత్కరం వచరుతరాంగుళీయం
పీతప్రభం కల్పతరో రధస్ధం భజామి నృత్తైక పదం గణేశం

36.  దూర్వా గణపతి          
దూర్వాంకురాన్వై మనసా ప్రదత్తాం స్త్రిపంచపత్రైర్యుతకాంశ్చ స్నిగ్ధాన్ |
గృహాణ విఘ్నేశ్వర సంఖ్యయా త్వం హీనాంశ్చ సర్వోపరి వక్రతుండ ||

37.    అభీష్టవరద గణపతి
నమస్తే వేద విదుషే నమస్తే వేద కారిణే |
కమన్యం శరణం యామ: కోను న: స్వాద్భయాపహ: ||

38. లంబోదర గణపతి          
లంబోదరావతారో వైక్రోధాసుర నిబర్హణ:
శక్తిబ్రహ్మ ఖగ: సద్యత్ తస్యధారక ఉచ్యతౌ ||  

39.విద్యా గణపతి            
భక్త ప్రియాయ దేవాయ నమో జ్ణాన స్వరూపిణే |
నమో విశ్వస్యకర్త్రేతే నమస్తత్పాలకాయచ ||

40.  సరస్వతీ గణపతి          
వాగీశాద్యా స్సుమనస: సర్వార్ధానాముపక్రమే
యంనత్వాకృత కృత్వాస్స్యు: తం నమామి గజాననమ్ ||

41.  సంపత్ గణపతి          
పక్వచూత ఫలపుష్ప మంజరీచేక్షుదండ తిలమోదకైస్సహ
ఉద్వహన్ పరశుమస్తుతే నమ: శ్రీ సమృద్ధియత హేమపింగళ:

42.  సూర్య గణపతి          
హిరణ్యగర్భం జగదీశితారరమృషిం పురాణం మండలస్థం |
గజాననం యం ప్రవిశన్తిసంతస్తత్కాలయోగైస్త మహం ప్రపద్యే ||

43. విజయ గణపతి          
శంఖేక్షు చాప కుసుమేఘ కుఠారదంత
పాశాంకుశై: కళమమంజరికా సనైధై:
పాణిస్థితై: పరిసమావృత భూషణ శ్రీ:

44. పంచముఖ గణపతి          
గణేశాయ ధామ్నే పరేశాయ తుభ్యం సదానంద రూపాయ సర్వార్తిగాయ|
అపారస్వరూపాయ దేవాధిదేవ నమస్తే ప్రభో భక్త సంరక్షకాయ ||

45. నీలకంఠ గణపతి          
వినాయకం నాయకమౌక్తికం త్రయీ హారావళే రావళితం భుజంగమై: |
పినాకిజం నాకిజనేడ్య మంహసాం నివారణం వారణ్వక్త్ర మాశ్రయే ||

46.   గాయత్రి గణపతి        
యజ్ఞోపవీతం త్రిగుణస్వరూపం సౌవర్ణమేవం హ్యహినాధ భూతం |
భావేనదత్తం గణనాథతత్వం గృహాణ భక్తోద్దృతి కారణాయ ||

47.     చింతామణి గణపతి      
కల్పద్రుమాధ: స్థితకామధేయం |
చింతామణిం దక్షిణపాణి శుండమ్ |
బిభ్రాణ మత్యద్భుత చిత్రరూపం |
య: పూజయేత్తస్య సమస్త సిద్ధి: ||

48. ఏకదంత గణపతి          
అగజానన పద్మార్కమ్ గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే

49.    వికట గణపతి        
వికటోనామ విఖ్యాత: కామాసుర విదాహక: |
మయూర వాహనశ్చాయం సౌరబ్రహ్మధర: స్మ్రత: ||

50.   వరద గణపతి        
వరదాభయ హస్తాయ నమ: పరశుధారిణే |
నమస్తే సృణిహస్తాయ నాభివిశేషాయతే నమ: ||

51.  వశ్య గణపతి          
విఘ్నేశ వీర్యాణి విచిత్రకాణి వన్దే జనైర్మాగధకై: స్మృతాని |
శ్రుత్వాసమత్తిష్ఠ గజానన త్వం బ్రహ్మేజగన్మంగళకం కురుష్వ ||

52. కుల గణపతి          
శుండావిభూషార్థమనన్తఖేలిన్ సువర్ణజం కంచుకమాగృహేంణ |
రత్నైశ్చయుక్తం మనసామయాయ ద్ధతం ప్రభోతత్సఫలం కురుష్వ ||

53.  కుబేర గణపతి          
రత్నై: సువర్ణేన కృతాని గృహాణచత్వారి మయాప్రకల్ప్య |
సమ్భూషయ త్వం కటకాని నాథ చతుర్భుజేషు వ్యాజ విఘ్నహారిన్ |

54.  రత్నగర్భ గణపతి          
హేరంబతే రత్నసువర్ణయుక్తే సునూపుర మంజీరకే తథైవ|
సు కింకిణీ నాద యుతే సుబుద్ధ్యా సుపాదయో: శోభమయే ప్రదత్తే ||

55. కుమార గణపతి          
మాత్రే పిత్రేచ సర్వేషాం హేరంబాయ నమో నమ:
అనాదయేచ విఘ్నేశ విఘ్నకర్తే నమోనమ:

56.  సర్వసిద్ధి గణపతి          
పరంధామ పరంబ్రహ్మ పరేశం పరమేశ్వరం |
విఘ్నవిఘ్నకరం శాంతం పుష్టం కాంతమనంతకం |
సురాసురేంద్ర్యై: సిద్ధేంద్ర్యై: స్తుతం స్తౌమి పరాత్పరం |
సురపద్మచినేశంచ గణేశం మంగళాయనం ||

57.  భక్త గణపతి          
నారికేళామ్ర కదళీ గుడ పాయస ధారిణం
శరచ్ఛశాంక సదృశం భజే భక్తగణాధిపమ్

58.    విఘ్న గణపతి        
పాశాంకుశం ధరన్నామ ఫలాశీ చాఖవాహన:
విఘ్నం నిహస్తు న: సర్వ రక్తవర్ణో వినాయక:

59.   ఊర్ధ్వ గణపతి        
కల్హారిశాలి కణిశేక్షుక చాపబాణ,
దంత ప్రరోహ కబర: కనకోజ్జ్వలాంగ:,
ఆలింగనోద్యత కర: తటిదాభకట్యా
దేయాత్స శతృభయ మూర్థ్వ గణేశ్వరస్తే

60.   వర గణపతి        
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన
ఈప్సితం మేం వరం దేహి పరత్రా చ పరాంగతిమ్

61.  త్ర్యక్ష్యర గణపతి          
సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితం
సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణనాయకమ్

62.    క్షిప్రప్రసాద గణపతి        
యక్షకిన్నర గంధర్వ సిద్ధవిద్యా ధరైస్సదా
స్తూయమానం మహాబాహుం వందే హం గణనాయకమ్

63.  సృష్టి గణపతి          
ప్రాతర్నమామి చతురానన వన్ద్యమానం
ఇచ్ఛానుకూలమఖిలం చ వరం దదానమ్
తం తుందిలం ద్విరసనాధిప యజ్ఞసూత్రం
పుత్రం విలాస చతురం శివయో: శివాయ

64.  ఉద్దండ గణపతి          
ప్రాత:స్మరామి గణనాథమనాథ బంధుం
సిందూరపూర పరిశోభితగండయుగ్మం
ఉద్ధండవిఘ్న పరిఖండన చండదండం
అఖండలాది సురనాయక బృందవంద్యమ్

65.     డుండి గణపతి      
అక్షమాలాం కుఠారంచ రత్నపాత్ర స్వదంతకమ్
ధతైకరైర్విఘ్నరాజో డుంఢినామా మదేస్తున:

66.ద్విముఖ గణపతి            
స్వదంత పాశాంకుశ రత్నపాత్రం కరైర్దదానో హరినీలగాత్ర:
రత్నాంశుకో రత్న కిరీటమాలీ భూత్యై సదామే ద్విముఖో గణేశ:

67.  త్రిముఖ గణపతి          
శ్రీమత్తీ పతి          
నమస్తే గణనాధాయ గణానాం పతయే నమ: |
భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యో సుఖదాయక ||

97.   మహాసిద్ధి గణపతి        
గజవక్త్రం సురశ్రేష్ఠ కర్ణచామర భూషితం |
పాశాంకుశ ధరం దేవం వందే హం గణనాయకం ||

98.   గణపతి        
సిందూరాస్త్రినేత్ర: పృథుతర జదరో హస్త పద్మం
దదానం | దంతం పాశాంకుశేష్ట్వానురుతర
విలసద్విజ పూరాభిరామం | బాలేందు ఖ్యాతిమౌళి
కరిపతి వదాన దాన పూర్ణార్థ గంధో | భోగేంద్రై
భూషితాంగోర్జేత్ గణపతిం రక్తస్త్రాంగరాగ: ||

99. కార్యసిద్ధి గణపతి          
యతోబుద్ధి రజ్ఞాననాశో ముముక్షో: |
యత స్సంపదోభక్త సంతోషదాస్సు: |
యతో విఘ్ననాశయత: కార్యసిద్ధి: |
సదాతం గణేశం నమామో భజామ: ||

100.  భద్ర గణపతి    
అనామయాయ సర్వాయ సర్వపూజ్యాయతే నమ:
సుగుణాయ నమస్తుభ్యం బ్రహ్మణే నిర్గుణాయచ ||

101.   సులభ గణపతి    
వందే గజేంద్రవదనం - వామాంకారూఢ వల్లభాశ్లిష్టం
కుంకుమపరాగశోణం - క్వులయినీ జారకోరకా పీడమ్ ||

102.   నింబ గణపతి    
విఘ్నహర్తే స్వభక్తానాం లంబోదర నమోస్తుతే |
త్వాదేయ భక్తియోగేన యోగీశాం శాంతిమాగతా: ||

103. శుక్ల గణపతి      
అంతరాయ తిమిరోపశాంతయే
శాంతపావనమచింత్య వైభవం |
తంనరం వపుషికుంజరం ముఖే
మన్మహే కిమపి తుందిలంమహ: ||

104.   విష్ణు గణపతి
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

105.  ముక్తి గణపతి
పాశాంకుశౌ భగ్నరథం త్వభీష్టం కరైర్దధానం కరరన్ద్రముక్తై: |
ముక్తాఫలాభై: పృథుశీకరౌఘై: సిఙ్చన్తమఙ్గం శివయోర్భజామి ||

106.  సుముఖ గణపతి
ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమోనమ: |
ప్రసన్న జనపాలాయ ప్రణతార్తివినాశినే ||

107.  సర్వ గణపతి
చతు: పదార్థా వివిధ ప్రకాశాస్త్త వివ హస్తా: సచతుర్భుజం |
అనాథనాథాంచ మహోదరంచ గజాననం భక్తియుతం భజామ:

108.  సిద్ధిబుద్ధి గణపతి
సత్పద్మరాగ మణివర్ణ శరీరకాంతి:
శ్రీ సిద్ధిబుద్ధి పరిచర్చిత కుంకుమశ్రీ:
వక్షస్థలే వలయితాతి మనోజ్ఞ శుణ్డో
విఘ్నం మామపహర సిద్ధి వినాయకత్వమ్ ||

34.  యోగ గణపతి        
యోగరూఢో యోగ పట్టాభిరామో
బాలార్కభశ్చేంద్ర నీలాంశుకాఢ్య:
పాశాక్ష్వక్షాన్ యోగదండం దధానో
పాయాన్నిత్యం  posted as received
ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది ?

నిత్యము భగవాన్ నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశించి , మరణ అనంతరం పుణ్య లోకాలు పొందుతాము ...

💠 గణనాయకాష్టకం - అన్ని విజయాలకు !!
💠 శివాష్టకం - శివ అనుగ్రహం !!
💠 ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం !!
💠శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది !!
💠 అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి !!
💠 కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం !!
💠 దుర్గష్టోత్తర శతనామం - భయహరం !!
💠 విశ్వనాథ అష్టకం - విద్య విజయం !!
💠 సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం !!
💠 హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ !!
💠 విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి !!
💠 శివ అష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి !!
💠 భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి !!
💠 శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం !!
💠 లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం !!
💠 కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం !!
💠 ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత !!
💠 శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం !!
💠 లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి !!
💠 శ్యామాల దండకం - వాక్శుద్ధి !!
💠 త్రిపుర సుందరి స్తోత్రం - సర్వజ్ఞాన ప్రాప్తి !!
💠 శివ తాండవ స్తోత్రం - రథ గజ తురంగ ప్రాప్తి !!
💠 శని స్తోత్రం - శని పీడ నివారణ !!
💠 మహిషాసుర మర్ధిని స్తోత్రం - శత్రు నాశనం !!
💠 అంగారక ఋణ విమోచన స్తోత్రం - ఋణ బాధకి !!
💠 కార్యవీర్యార్జున స్తోత్రం - నష్ట ద్రవ్యలాభం !!
💠 కనకధార స్తోత్రం - కనకధారయే !!
💠 శ్రీ సూక్తం - ధన లాభం !!
💠 సూర్య కవచం - సామ్రాజ్యంపు సిద్ది !!
💠 సుదర్శన మంత్రం - శత్రు నాశనం !!
💠 విష్ణు సహస్ర నామ స్తోత్రం - ఆశ్వమేధయాగ ఫలం !!
💠 రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి !!
💠 దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు !!
💠 భువనేశ్వరి కవచం - మనశ్శాంతి , మానసిక బాధలకు !!
💠 వారాహి స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!
💠 దత్త స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!
💠 లాలిత సహస్రనామం - సర్వార్థ సిద్దికి !!

⭐⭐⭐ పంచరత్నం - 5 శ్లోకాలతో కూడినది !!
⭐⭐⭐ అష్టకం - 8 శ్లోకాలతో కూడినది !!
⭐⭐⭐ నవకం - 9 శ్లోకాలతో కూడినది !!
⭐⭐⭐ స్తోత్రం - బహు శ్లోకాలతో కూడినది !!
⭐⭐⭐ శత నామ స్తోత్రం - 100 నామాలతో స్తోత్రం !!
⭐⭐⭐ సహస్రనామ స్తోత్రం - 1000 నామాలతో స్తోత్రం !!

పంచపునీతాలు
⭐ వాక్ శుద్ధి
⭐ దేహ శుద్ధి
⭐ భాండ శుద్ధి
⭐ కర్మ శుద్ధి
⭐ మనశ్శుద్ధి

💠 వాక్ శుద్ధి :
వేలకోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికే ఇచ్చాడు .... కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు .... పగ , కసి , ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ , పరోక్షంగా కానీ నిందించకూడదు .... మంచిగా , నెమ్మదిగా , ఆదరణతో పలకరించాలి .... అమంగళాలు మాట్లాడే వారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి ....

💠 దేహ శుద్ధి :
మన శరీరం దేవుని ఆలయం వంటిది .... దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ , రెండు పూటలా స్నానం చెయ్యాలి .... చిరిగిన , అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు ....

💠 భాండ శుద్ధి :
శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం .... అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి .... స్నానం చేసి , పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృతతుల్యమైనది ....

💠 కర్మ శుద్ధి :
అనుకున్న పనిని మధ్యలో ఆపిన వాడు అధముడు .... అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు .... తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు ....

💠 మనశ్శుద్ధి :
మనస్సును ఎల్లప్పుడు ధర్మ , న్యాయాల వైపు మళ్ళించాలి .... మనస్సు చంచలమైనది .... ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది .... దాని వల్ల అనేక సమస్యలు వస్తాయి .... దీని వల్ల దుఃఖం చేకూరుతుంది .... కాబట్టి ఎవ్వరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనఃశుద్ధి ...

⏩ ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదమౌతుంది !!
⏩ ఆకలికి భక్తి తోడైతే ఉపవాసమౌతుంది !!
⏩ నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమౌతుంది !!
⏩ యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది !!
⏩ సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనమౌతుంది !!
⏩ గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయమౌతుంది !!
⏩ సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది !!
⏩ పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది !!
⏩ భక్తి ప్రవేశిస్తే మనిషి మనీషి అవుతాడు !!forwaded By Nr mudigonda
*ప్రవర యొక్క అర్ధం.*

*చతుస్సాగర పర్యంతం*
(మానవ పరిభ్రమణానికి నలువైపులా కల మహాసముద్రాల అంచుల వరకూ)...

*గో బ్రాహ్మణేభ్య శుభం భవతు*(సర్వాబీష్ట ప్రదాయిణి అగు..గోవూ మరియు నిత్యం సంఘహితాన్నే అభిలషించే సద్బ్రాహ్మణుడు అతడి రూపంలో ప్రకాశించే వేదధర్మం.. సర్వే సర్వత్రా దిగ్విజయంగా.. శుభప్రదంగా వర్ధిల్లాలని కోరుకుంటూ)....

*×××××××. ఋషేయ ప్రవరాన్విత..*
(మా వంశమునకూ..మా గోత్రమునకూ మా నిత్యానుష్ట ధర్మశీలతకు మూలపురుషులైన మా ఋషివరేణ్యులకూ..

*త్యాగే నైకే అమృతత్త్వ మానశుః......*
అన్న వారి మహోన్నతమైన త్యాగనిష్ఠకు సాక్షీభూతుడనై..

*×××××× గోత్రః*
(మా గోత్రమునకూ..)

*ఆపస్తంభ సూత్రః కృష్ణ యజుశ్శాఖాధ్యాయీ.....*
(మా శాఖకూ..అందలి శాస్త్ర మర్మంబులకు..)

*శ్రీ* *** *శర్మ నామధేయస్య*
( కేవలం జన్మతహానే కాక.. ఉపనయనాది సంస్కారాలతో.. శాస్త్రపఠనంతో..వేదాధ్యయనాది వైదిక క్రతువులతో..
1. స్నానము
2. సంధ్య
3. జపము
4. హోమము
5. స్వాధ్యాయము
6. దేవ పూజ
7. ఆతిధ్యము
8. వైశ్యదేవము అనబడే అష్టకర్మలనూ క్రమంతప్పక నిర్వహిస్తూ..త్రివిధాగ్నులు...
1.కామాగ్ని
2.క్రోధాగ్ని
3.క్షుద్రాగ్ని..
అనే త్రివిధాగ్నులను అదుపులో(సమస్థితిలో) ఉంచుకొన్న వాడినై..పేరుకు ముందు శ్రీ అనబడే..ప్రకృతి స్వరూపమైన శక్తిస్వరూపాన్ని.. శుభప్రదమైన శ్రీకారాన్ని ధరించిన..

*శ్రీ * *శర్మా* అనబడే సుశ్రోత్రియుడనైన నేను..జన్మప్రధాతలైన జననీజనకులముందు..  జ్ఞానప్రధాతలైన ఆచార్యులముందు.. జ్ఞానస్వరూపమైన వేదముముందు..యావత్ ప్రపంచానికే మార్గదర్శకమైన వేదధర్మము ముందు.. నిరాకార నిర్గుణ అవ్యాజ పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మ ముందు..

*అహంభో అభివాదయే..*
( కేవలం నేనూ అన్నదిలేక.. సర్వం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహ భాగ్యమేయన్న అహంకారభావ రహితుడనై.. నిగర్వినై..త్రికరణ శుద్ధిగా (మనసా,వాచా,కర్మణా) సాష్టాంగ పూర్వక (మానవశరీరంలోని అత్యంత ప్రాధాన్యమైన ఎనిమిది శరీరాంగములనూ శరణాగత హృదయంచే నేలపై వాల్చి సమర్పిస్తున్న)దండ ప్రణామమిదే..అన్న పరిపూర్ణమైన ఆత్మపూర్వక వేదపూర్వక హృదయపూర్వక నమస్కార భావమే.. సశాస్త్రీయమైన ఈ ప్రవరలోని..అర్ధం అంతరార్ధం పరమార్ధం కూడా..
                          స్వస్తి!forwaded by nr mudigonda
*ఉపనయనము.....*

ఉపనయనం అంటే మరొక నయనం(కన్ను,నేత్రం) అని అర్థం. ఆ మూడవ నేత్రం(జ్ఞాననేత్రం) తెరచి ఉంచాలి, అందుకొరకు ప్రాణాయామము నేర్పబడుతుంది. బ్రహ్మోపదేశం చేసిన తర్వాత ఆ పిల్లవాడిని భిక్షాటనకు పంపుతారు. మొదటి భిక్ష తల్లి నుంచి తీసుకొనబడుతుంది. తండ్రి బ్రహ్మోపదేశం చేస్తే, తల్లి మూడు గుప్పెళ్ళు భిక్ష ఇచ్చి, ఆ బాలకుడు తండ్రి చెప్పిన బ్రహ్మోపదేశం మననం చేసుకోవటానికి శక్తిని ప్రసాదిస్తుంది. ఇక ఆ బాలుడు యాయవారములు చేస్తూ, గురువు గారి వద్దనే ఉండి విద్యాభ్యాసం చేస్తూ విద్యను అభ్యసించాలి. గురువు వద్ద ఉండి జ్ఞానము సంపాదించిన తర్వాత గురువుగారు వారి మనస్సు తాత్కాలిక విషయాలపై ఆకర్షితమవుతుందో, లేక సన్యాసం వైపు ఆకర్షితమవుతుందో తెలుసుకోవటానికి ఆ శిష్యులను తమ తల్లిదండ్రుల వద్దకు పంపేవారు.

కొంత కాలం అలా తల్లిదండ్రుల వద్ద ఉన్న తర్వాత పిల్లలు సంసారిక సుఖాలను విడిచిపెట్టి కాశీకి బయలదేరేవాళ్ళు. కొంత కాలానికి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల ఆ పిల్లలను కాశీకి వెళ్ళకుండా ఆపి వారి కుమార్తెలను వివాహం చేసుకోమని అడిగేవారు. సన్యాసం తీసుకోవాలని ధృఢ సంకల్పం ఉన్న వారు, అవి పట్టించుకోక ముందుకు సాగేవారు, మరి కొంత మంది పెళ్ళిచేసుకుని ఇంటికి వచ్చేవారు. తండ్రి దేశాంతరమందుంటే తాత, అతను లేకుంటే తండ్రి సోదరులు వారుకూడా లేకపోతే వటుడి అన్న దానికి అధికారి అవుతాడు. ఒకవేళ అతను కూడా లేకపోతే సగోత్రమునందు పుట్టినవారు చేయాల్సిఉంటుంది. ఏ వయసులో చెయ్యాలి... బ్రాహ్మణ కులంలో 8వ సంవత్సరాన, క్షత్రియులకు 11వ ఏడున, వైశ్యులకు 12వ ఏడున ఉపనయనం చేయాలి. బ్రాహ్మణులకు చైత్ర మరియు వైశాఖ మాసాలు, క్షత్రియులకు జ్యేష్ట, ఆషాఢ మాసాలూ, వైశ్యులకు ఆశ్వయుజ కార్తీక మాసాలు మంచిది. అందరికీ పనికివచ్చే మాసాలు మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలు.

బ్రహ్మచారులలో బ్రాహ్మణులు జింక తోలుని, క్షత్రియులు కురుమృగ చర్మమును, వైశ్యులు గొర్రె తోలును, ఉత్తరీయంగా ధరించాలి. బ్రాహ్మణుడు నార బట్టలు, క్షత్రియుడు వెల్వెట్టు బట్టలు, వైశ్యుడు ఉన్ని బట్టలు ధరించాలి. బ్రాహ్మణుడైన బ్రహ్మచారి ముంజకసువుతో పేనిన సమానమైన మూడు పేటలుగల మొలత్రాడు కట్టాలి. క్షత్రియ బ్రహ్మచారి ముర్వ అని కసుపుతో చేయబడిన మొలత్రాడు కట్టాలి. వైశ్యుడు జనపనారతో చేసిన ముప్పేట గల మొలత్రాడు కట్టాలి. ముంజకసుపు దొరకనప్పుడు దర్భ, రెల్లు, తుంగ నీటితో ముప్పెరిగా చేసిన ఒక ముడి, బూడు ముళ్ళు, ఐదు ముళ్ళుగల మొలత్రాళ్ళను వరసగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య బ్రహ్మచారులు ధరించవలెను.

బ్రాహ్మణుడు ప్రత్తి నూలుతోను, క్షత్రియులు జనపనారతోను, వైశ్యులు తెల్ల మేక బొచ్చుతోను పేని కుడివైపుగా చుట్టిన తొమ్మిది పోగులుగల యజ్ఞోపవీతమును భుజము నందు ధరించాలి బ్రాహ్మణుడు బిల్వము గానీ, మోదుగ గానీ దండముగా ధరించాలి. క్షత్రియ బ్రహ్మచారి మర్రి కొమ్మ గానీ, చండ్ర కొమ్మ గానీ దండముగ ధరించాలి. వైశ్య బ్రహ్మచారి జివి కొమ్మను గానీ, మేడి కొమ్మను గానీ దండముగా ధరించాలి. ఆ ముగ్గురు బ్రహ్మచారులు వరసగా కేశము వరకుని, నొసటి వరకును, ముక్కు వరకును ఉండునట్లు దండమును ధరించాలి. ఆ దండములు వంకర లేనివియు, గంట్లు గలిగింపనివియు, పై పట్టతో కూడినవియు, అగ్నిలో కాలనివై ఉండవలెను. వారు దండమును గైకొని సూర్యోపస్థానము చేసి, అగ్నికి ప్రదక్షిణము చేసి యధావిధిగా భిక్షాటనము గావించాలి.

ఉపవీతుడైన బ్రాహ్మణుడు 'భవతీ భిక్షాందేహీ అని భవ శబ్దాన్ని మొదట చెప్పి భిక్షాటన చేయాలి. ఉపవీతుడైన క్షత్రియుడు 'భిక్షాం భవతీ దేహీ అని భవ శబ్దాన్ని మధ్యన చెబుతూ భిక్షాటన చేయాలి. వైశ్య బ్రహ్మచారి 'భిక్షాం దేహి భవతీ అని భవతి శబ్దం చివరనుంచి భిక్షాటన చేయాలి. తల్లిని గాని, తల్లి తోడవుట్టిన దానిని గాని ఎవరు తనను అవమానింపదో అట్టివానిని యాచించాలి. ఈవిధంగా మధూకరము తెచ్చి వలసినంతవరకు గురువునకు మంచి అన్నమును నివేదించి, ఆతని అనుజ్ఞను పొంది యాచమించి తూర్పు ముఖంగా కూర్చుండి పరిశుద్ధుడై యవశిష్టాన్ని భుజించాలి. వేరు చింత లేకుండా భుజించి భోజనమైన పిమ్మట చేతులు, కాళ్ళు కడిక్కొని శాస్త్రరీతిని ఆచమనం కావించి నీటితో అన్ని ఇంద్రియాలు తుడుచుకోవాలి.

ఉపనయనము అంటే కేవలము మూడు వరుసల జంధ్యము వేసుకోవటం కాదు. దాని అర్థం మనకు రెండే కాదు మూడు కన్నులు ఉండాలి. ఆ మూడవ నేత్రం జ్ఞాననేత్రం. ఆ నేత్రాన్ని తెరచి నీ యొక్క నిజమైన స్వరూపాన్ని గుర్తించాలి...forwarded By Srinivasan siddhanti

Monday, December 30, 2019

తిరుపతి లో డా ముదిగొండ కు జరిగిన సన్మానం


తిరుపతి లో డా ముదిగొండ Amarnath Sarma కు జరిగిన సన్మానం