Wednesday, July 24, 2019

నాది నాది యనియనాదిగ మనుజులు/
ఆశపాశములకు వశులుగాగ/
నీది గానిదేది లేదని తెలియరు/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏
విరిగి పడిన యలలు తిరిగి పైకెగయును/
పడ్డ వాడు కాడు చెడ్డ వాడు/
ఓర్పుయున్నచాలు ఓటమియుండదు/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏By Subrahmanyam M

Tuesday, July 23, 2019

హరిఓం ,
Forwarded by iv
      ఎక్కడ పోతుందో అని లాకర్లలో దాచుకునే భయం, ఐశ్వర్యమా?

      లేక ఎప్పుడు మనతో నే ఉంటుంది అనే ధైర్యం ఐశ్వర్యమా!_

      ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు ,తరాజు లోని తులాల బంగారాలు కాదు...!

  *ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు "ఐశ్వర్యం"*
 
 *ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య "ఐశ్వర్యం"*

  *ఎంత ఎదిగినా,నాన్న తిట్టే తిట్లు "ఐశ్వర్యం"*

  *అమ్మ చేతి ఆవకాయ ఐశ్వర్యం, భార్య చూసే ఓర చూపు "ఐశ్వర్యం"*

*పచ్చటి చెట్టు,పంటపొలాలు ఐశ్వర్యం,వెచ్చటి సూర్యుడు "ఐశ్వర్యం"*

  *పౌర్ణమి నాడు జాబిల్లి "ఐశ్వర్యం"*

  *మనచుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం*

*పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు "ఐశ్వర్యం"*

  *ప్రకృతి అందం ఐశ్వర్యం,పెదాలు పండించే నవ్వు "ఐశ్వర్యం"*

  *అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు  "ఐశ్వర్యం*

 *బుద్ధికలిగిన బిడ్డలు  "ఐశ్వర్యం*

   *బిడ్డలకొచ్చే చదువు  "ఐశ్వర్యం"*

*భగవంతుడిచ్చిన ఆరోగ్యం  "ఐశ్వర్యం*

    *చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి  "ఐశ్వర్యం*

*పరులకు సాయంచేసే మనసు మన  "ఐశ్వర్యం*

    *ఐశ్వర్యం అంటే చేతులు*
 *లేక్కేట్టే కాసులు కాదు*

 *కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం*
 *మనసు పొందే సంతోషం ఐశ్వర్యం*......                            🙏🙏🙏
🥀 *పంచభూతాల ఆరాధనే పంచాయతనం 🌺 By I Umashankar

అనేక విధాలుగా ఉన్న మన ఆరాధనా పద్ధతులను అధ్యయనం చేసిన ఆదిశంకరులు ‘పంచ దేవతారాధన’ను పునరుద్ధరించారు.
‘‘ఆదిత్యమంబికా విష్ణుం గణనాథంచ మహేశ్వరమ్‌’’ ఆదిత్యుడు (సూర్యుడు), అంబిక (అమ్మవారు) విష్ణువు, గణనాథుడు, మహేశ్వరుడు ఈ ఐదుగురిని పంచదేవతలంటారు. ఈ అయిదుగురితో కలిపి చేసే ఆరాధనను ‘పంచాయతనం’ అంటారు. నిజానికి మన దేవాలయ వ్యవస్థంతా ప్రతీకలమయం. దాని బాహ్యం మనల్ని ఆకర్షిస్తుంది అంతే. దాని అంతరంగం, అంతరార్థం వేరుగా ఉంటుంది. సృష్టి ఆధార భూతమైన పరమేశ్వరుని రంగస్థలం ఆద్యంతాలు లేనిది. అందులో ఈ పంచభూతాలు కూడా ఇమిడి ఉన్నాయని తెలిపే సంకేతం పంచభూతలింగాల్లో ఉంది. మానవ దేహం మొదలుకొని సృష్టి అంతా వ్యాప్తమైన ఈ పంచభూత స్థితికి చైతన్యం కల్పించేవాడు పరమాత్మ అనేది ఇందులో అంతరార్థం. విడిగా చూస్తే.. ఆకాశానికి శివుడు, వాయువుకు శక్తి, అగ్ని తత్వానికి సూర్యుడు, జలానికి విష్ణువు, పృథ్వీ తత్వానికి గణపతి ప్రతీకలు. మనలోని పంచభూతాలను గమనించి, వాటికి అధిష్ఠాన దేవతగా పరమాత్మను తెలుసుకోమని చెప్పడమే ఈ అయిదుగురు దేవతల ఆరాధన.

శ్రీకాళహస్తిలోని సువర్ణముఖి నదిలోని శిలను అంబికారాధనకు, మధ్యప్రదేశ్‌లో ప్రవహించే నర్మదా నది శిలలను శివలింగాలకు, కావేరి నదిలోని స్ఫటిక లింగాలను సూర్యారాధనకు, నేపాల్‌లోని గండకీ నదిలో లభించే సాలగ్రామాలను విష్ణువు ఆరాధనకు, బీహార్‌లో ప్రవహించే శోణభద్రా నదిశిలలను గణపతి ఆరాధనకు ఉపయోగించాలని ఆగమాలు చెబుతున్నాయి.

శివే విష్ణౌ తథా శక్తా సూర్యేమయి నరాధిప
నాభే దుర్భుద్ధిర్యోగః ససమ్యగ్‌ యోగతమేమతః

శివ, విష్ణు, శక్తి, సూర్య, గణేశ.. అనే ఐదుగురు దేవతల గురించి చేసే సమష్టి ఆరాధన వల్ల కలిగే బుద్ధి యోగమని గణేశ పురాణం తెలిపింది ఈ దేవతల తత్వం అంతా యోగంలో భాగమే. తమస్సును పారదోలి మనుషుల్లో జ్ఞానాన్ని నింపే గురువులాగా ఆకాశమండలమంతా తన తేజంతో వెలుగులు నింపుతాడు సూర్యుడు. శరీరంలో కొన్ని భాగాలు ఆకాశతత్వం గలవి. మన ఎముకలు పటిష్ఠంగా ఉండాలంటే సూర్యనమస్కారాలు చేయాలి. 365 రోజులూ సూర్యుడుదయించే ఈ దేశంలో సూర్యారాధన మరచిపోయి ‘డి’ విటమిన్‌ మాత్రలు మింగుతున్నామంటే అంతకంటే దురదృష్టమేముంటుంది? ఇక.. శక్తి ప్రాణరూపంలో ఉంటుంది. ఆ తల్లిది వాయుతత్వం. అమ్మను ఆరాధించడమంటే ప్రాణారాధనే; జ్ఞానారాధనే. ఇక.. నీరు జగతికి ప్రాణాధారం. దాని అధిష్ఠాన దేవత నారాయణుడు. నీటిలో పోషకశక్తి, స్థితిశక్తి ఉన్నాయి. విష్ణువు అంటే వ్యాపించినవాడు. ప్రకృతికి ప్రతీక. భూమిలో మూడో వంతు జలమే, విష్ణుతత్వారాధన పోషకశక్తి ఆరాధనే. గణపతి పృథ్వీతత్వస్వరూపుడు. బుద్ధి, సిద్ధి రెండూ కలగాలంటే మనం ఈ భూమిపై జీవించాల్సిందే. అవి రెండూ గణపతి దగ్గరున్నాయి. విజయమూలమైన ఈ రెండు సిద్ధులను పొందటానికే గణపతి ఆరాధన. ఇక.. మహేశ్వరుడు చిదాకాశరూపుడు. ఆయన ఆద్యంతాలను బ్రహ్మ, విష్ణువులే కనిపెట్టలేకపోయారు. నిరాకారతత్వానికి లింగం ప్రతీక. ఏమిలేనిదానికే లింగం (చిహ్నం) అని పేరు. ఆకాశతత్వమంటే అదే. ఈ పంచదేవతల ఆరాధన భౌతికంగా ఆధ్యాత్మికతను కల్గించి ప్రవర్తన మార్చుకొనేట్లు చేసి ఇహంలో సుఖం కలిగిస్తుంది. అంతర్ముఖులయి ఆరాధన చేస్తే ఆత్మజ్ఞానాన్ని కూడా కలిగిస్తుంది.
.🌺*హిందూ ధర్మచక్రం సేకరణ*🌺
By Subrahmanyam Mనాది నాది యనియనాదిగ మనుజులు/
ఆశపాశములకు వశులుగాగ/
నీది గానిదేది లేదని తెలియరు/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏                                                                                                 ఇందుశేఖరుండు ఇంద్రకీలాద్రిపై/
కనకదుర్గమాత ఘనతచేత/.    
మహిమజూప తాను మల్లేశ్వరుండాయె/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏

తోడునీడనీవు తోట్లవల్లూరులో/
చెన్నమల్లికార్జ్నుడన్న చాలు /
తలచినంత నిలచు తల్లి భ్రమరాంబతో/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏

పేరుగొన్నయూరు పెద్థకళ్ళేపల్లి/
కడలి జేర నడచు కృష్ణవేణి/
దురితములను బాపు దుర్గఽనాగేశ్వరా!/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏

కైకలూరులోన కనకలింగేశ్వరా!/
శ్యామలాంబతోడ శాంతినొసగ/
కూడి నిలచినావ కొల్లేటితీరాన/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏

పెడనపురములోన పెద్దదేముడవుగా/
పార్వతీసమేత పరమపురుష!/
శైవ జనుల శ్వాసవౌ అగస్థ్యేశ్వరా!/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏
మహాదేవా నీ  అభిషేకానికి నీళ్ళు తీసుకుని గుడిమెట్లు ఎక్కాను.
పవిత్ర గంగ నిన్ను ప్రతిక్షణం అభిషేకిస్తుంది అని
మర్చిపోయాను.

మహాదేవా! హలాహలం వేడితో నువ్వు తపిస్తున్నావని,
మంచి గంధలేపనం వేద్దాం అనుకున్నాను.
చల్లదనంకి ప్రతిరూపమైన హిమశిఖరమే, నీ వాసం
అయితే, నీ శిరసే శశాంకుడి నివాసం అని, మర్చిపోయాను.

మహాదేవా! మణిమాణిక్యాలతో నిన్ను పూజిద్దాం
అనుకున్నాను.
మణిరాజు అయిన వాసుకి, నీ మెడలో కంఠాభరణం అని,
మర్చిపోయాను

మహాదేవా! వేద స్తోత్రాలతో నిన్ను స్తుతిద్దామని
అనుకున్నాను.
వేదాలనే చెప్పిన ఆదిగురువు దక్షిణామూర్తివి నీవే అని
మర్చిపోయాను.

మహాదేవా! కమ్మని సంగీతంతో నిన్ను పరవశింపచేద్దాం
అని అనుకున్నాను.
సంగీతానికి బీజమైన ఓంకారాం, నీ ఢమరుకనాదమే అని మర్చిపోయాను.

మహాదేవా! శాస్త్రీయనాట్యంతో నిన్ను అలరిద్దాం అనుకున్నాను.
 నాట్యానికే ఆచార్యుడివైన నటరాజు నువ్వే అని,
మర్చిపోయాను.

మహాదేవా! షడ్రుచులతో నీకు నైవేద్యం పెట్టి
మురిసిపోద్దాం అనుకున్నాను.
అందరికి ఆహారాన్ని ఇచ్చే అన్నపూర్ణయే, నీ అర్ధశరీరం
అని మర్చిపోయాను,

మహాదేవా! ఉపచారాలతో నీకు సేవ చేసే భాగ్యం
పొందుదాం అనుకున్నాను.
శిలాదుడి పుత్రుడైన, బసవ నందీశ్వరుడు నీ వద్దే
ఉన్నాడని, మర్చిపోయాను
మహాదేవా!

ఇక నిన్ను ఎలా పూజించాలో ఎలా సేవించాలో
ఎలా తరించాలో తెలియట్లేదు. ప్రభూ!

నాది అంటూ ఏముంది నాలోన?

నాలో వెలుగుతున్న జ్యోతి నాది కాదు,
నాది అని భ్రమించే దేహం నాది కాదు,
నాది అనుకునే "నా అహం" నాది కాదు,
నాలో చెలరేగుతున్న భావాలు కూడా నావి కాదు.

సత్యం తెలిసింది.

"అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ".By S P BADRI

Monday, July 22, 2019

చిన్న దివ్వె చాలు చీకటియందున/
దివ్వె చిన్నబోవు దివిటి ముందు/
దివిటి తెల్లబోవు దినకరు రాకతో/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏By Subrahmanyam M