Thursday, April 11, 2019

🌹 *వివేక చూడామణి* 🌹
*35 వ భాగము*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*

🍃  *ఆత్మ మార్పులేనిది*  🍃

*380. బుద్దిని స్థిరముగా ఆత్మపై ఉంచినప్పుడు అది శాశ్వతముగా ప్రకాశమును వెదజల్లుతూ స్వయం ప్రకాశమైన సాక్షిగా అన్నింటిని దర్శిస్తుంది. ఈ ఆత్మ అసత్య వస్తు సముదాయము కంటే వేరుగా ఉంటూ, లక్ష్యమును చేరుటకు ఆత్మపై ధ్యానము చేయుము. ఇతర ఆలోచనలను వదలివేయుము.*

*381. నిరంతరముగా ఆత్మపై స్పందిస్తూ ఏవిధమైన ఇతర ఆలోచనలు మధ్యలో అడ్డుపడకుండా, ప్రతి వ్యక్తి ఖచ్చితముగా బ్రహ్మామే తన నిజమైన ఆత్మ అని తెలుసుకోవాలి.*

*382. ప్రతి వ్యక్తి తన గుర్తింపును ఆత్మతో జోడించి, అహమును ఇతర భౌతిక వస్తువులను వదలి, వాటితో ఎట్టి సంబంధమును పెట్టుకోకుండా, (ఎందువలనంటే అవి చిక్కులతో కూడినవి, పగిలిన కుండ ముక్కల వంటివి.) అలా ఆత్మను దర్శించాలి.*

*383. స్వచ్ఛమైన మనస్సును ఆత్మపై స్థిరపర్చి తమ ఖచ్చిమైన ఆత్మ విజ్ఞానమును పొందుతూ, నిదానముగా అట్టి స్థితిపై మనస్సును నిల్పిన అట్టి వ్యక్తి తన శాశ్వతమైన ఆత్మను తాను తెలుసుకొనగలడు.*

*384. ప్రతి వ్యక్తి తన ఆత్మను తాను దర్శించవలెను. అది విభజించుటకు వీలులేని, శాశ్వతమైనది. అన్ని పరిమితులకు అతీతమైనది. అది శరీరము, శరీర భాగాలు, ప్రాణాలు, అహమును తన యొక్క అజ్ఞానము వలన సృష్టించబడినవని గ్రహించి, అవన్నీ ఆకాశముతో నిండి యున్నవని తెలుసుకోవాలి.*

*385. ఆకాశము వందలకొలది పరిమిత వస్తు సముదాయమును తనలో నింపుకొని; అవి కుండ, జాడి, పార, సూది మొదలగునవి; తాను ఒకటిగా, అనేకముగా కాకుండా ఉన్నది. అదే విధముగా పవిత్రమైన బ్రహ్మము కూడా అహాన్ని ఇతరమైన వాటిని తనలో లేకుండా చేసి ఒకటిగానే తోచుచున్నది.*

*386. అపరమిత వస్తు సముదాయము గడ్డితో సహా అన్ని బ్రహ్మములోంచి వ్యక్తమైనప్పటికి అవి నిజముగా లేనివే అగును. అందువలన ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి, తాను శాశ్వతమైన బ్రహ్మమని అదే ఒకానొక సిద్దాంతము.*

*387. పొరపాటున ఏ వస్తువైనా ఒక దానిలో ఉన్నదని భావించిన, వెంటనే దాని గూర్చి వివరణ ద్వారా గ్రహించాలి. ఆ వస్తువునకు మూలము బ్రహ్మమేనని, దానికి వేరు కాదని గ్రహించాలి. ఎపుడైతే తప్పు భావన తొలగిపోతుందో, అసలు సత్యమైన తాడు వ్యక్తమై పాము తొలగిపోతుంది. అదే విధముగా విశ్వము నిజానికి ఆత్మయే.*

*388. ఆత్మయే బ్రహ్మము. ఆత్మయే విష్ణువు. ఆత్మయే ఇంద్రుడు. ఆత్మయే శివుడు. ఆత్మయే ఈ విశ్వమంతా దానికి మించినది ఏదీ లేదు.*

*389. ఆత్మయే లోపల బయట ఉన్నది. ఆత్మయే ముందు వెనుక ఉన్నది. ఉత్తరదక్షిణాలలో ఉన్నది ఆత్మయే. అలానే ఆత్మ పైన క్రింద ఉన్నది.*

*390. అలలు, నురుగు, సుడులు, బుడగలు మొదలైనవన్నియూ నీరుగాక వేరుకాదు. అదే విధముగా ఆత్మ జ్ఞానము, అన్ని అదే అయి ఉన్నది. శరీరము నుండి అహం వరకు ప్రతిది కేవలము చిత్‌తో సమానమైనవే.*
🌹🌹🌹🌹🌹
🙏 *ప్రసాద్*
🌹 *గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌)* 🌹
*34 వ భాగము*
✍ రచన : *పేర్నేటి గంగాధరరావు*
🍃 *వాసనలు 1* 🍃

*235. వాసన అనునది ఒక భయంకరమైన, అంధకారమైన వికారములతో కూడి; మానవునకు సుఖదుఃఖములు, రాగద్వేషములు, పునర్జన్మలకు కారణమవుతాయి.*

*236. వాసనలు మాయాజాలము పిశాచములవలె జన్మ జన్మలుగా వెంబడించి మనిషిని మింగి వేయచున్నవి. ప్రతి సాధకుడు తీవ్రముగా విచారణ అభ్యాసము ద్వారా వాటి స్వభావములను తెలుసుకొని ఎవరికి వారు తమ జన్మలను, సంస్కారములను ఉద్ధరించుకొనవలెను. ఇదే సృష్టి రహస్యము, జన్మ రహస్యము, మాయాతత్వము.*

*237. వ్యక్తి ఎంత పండితుడైనను, గొప్ప జాతి వారైనను, వాసనల వలననె బంధింపబడి పునఃజన్మలకు ఈడ్వబడుచున్నాడు. జననమరణ హేతువైన సంస్కారముల నుండి విడుదలయినవాడే ధీరుడనబడును.*

*238. పంచేంద్రియములు, మనస్సు ద్వారా విషయ భోగములపై వ్యామోహము కల్గిన మనిషికి దుఃఖము కలుగుచున్నది.*

*239. వాసనలకు పుట్టుక, ఆది లేదు. అనాదిగా ఇది మానవుని వెంబడిస్తూ ఉన్నాయి. ఇవి వాటంతట అవె నశించవు. అది నశించాలంటే యోగ సాధన, యోగ విజ్ఞానము, సత్‌గ్రంధ పఠనము, దృఢ చిత్తముతో వాటి రహస్యమును తెలుసుకొని అంతము చేయాలి.*

*240. ఈ భౌతిక శరీరము వాసనలచే నిండియున్నది. మానవ దేహముచే, ఇంద్రియములచే, సూక్ష్మ శరీరములు చేయు కర్మల ఫలితములే వాసనలు. పూర్వవాసనలు ప్రారబ్ధాను భవమునిచ్చునప్పుడు సంస్కారములని పిలువబడును. జన్మ జన్మలుగా వెంబడించు కోరికలు, అలవాట్లు, అభ్యాసములతో కూడిన సంస్కారములు ఒకదానితో ఒకటి పెనవేసుకొనిపోయి బలపడి వాసనా రూపములుగా ఉంటున్నవి.*

*241. వాసనలు మూడు రకములు: 1) కర్మ వాసనలు 2) స్మృతి మాత్ర వాసనలు 3) కర్మలను అనుభవించుట వలన కలుగునవి (ఆగామి).*

*242. అనేక జన్మలందు అభ్యాసము చేతను, సంసార బంధముల చేతను, భోగముల చేతను, కోరికలు మొదలగు లౌకిక కార్యములే వాసనలగుచున్నవి.*

*243. విషయ వాసనలనే విషము, అవిద్యా, అజ్ఞానము వలన ప్రోగై దృఢపడి వాటితో నిండిన ఈ శరీరమే శాశ్వతమని భావన కలుగుటచే, అజ్ఞానములో కర్మలకు, బద్ధులగుచున్నారు.*

*244. వాసనలు అనేక రకములు.*
*1.లోకవాసన: అనగా లోకముచే గుర్తింపబడవలెనని కోరిక.*
*2.శాస్త్రవాసన: తాను గొప్ప శాస్త్రవేత్తననే భావన.*
*3. దేహవాసన: దేహమునందు ప్రీతి.*
*4.శుద్ధవాసన: సాధన ద్వారా తనలోని దుర్గుణములను వదలివేయుట.* *5.అశుద్ధవాసన: కామ క్రోధాదుల ద్వారా, వస్తు భోగముల ద్వారా ఏర్పడునది.*
*6. శుభవాసన: సాధన ద్వారా శుద్ధుడై శాశ్వతమైన మోక్షమునకు అర్హుడగుట.*
*7. సంచితవాసన: గత జన్మల వాసనలే సంచిత వాసనలు.*
*8. ప్రారబ్ధవాసన: తన యొక్క తన పూర్వికుల ద్వారా ఏర్పడిన వాసన ఈ జన్మలో వెంటవచ్చును.*
*9. ఆగామివాసన: కొత్తగా చేసినది రాబోవు జన్మలకు ప్రోగుపడినది.*
*10. ఇహలోక వాసనలు: ఈ లోకములోని ప్రసిద్ధ దృశ్యముల భావనలు.*
*11. పరలోక వాసనలు: సత్కర్మల ద్వారా పుణ్యలోక(స్వర్గ), దుష్కర్మల ద్వారా పాపలోక (నరక) అనుభవముల వాసనలు.*
🌹 🌹 🌹 🌹 🌹
🙏 *ప్రసాద్*
ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులున్నాయంటుంది వేదం. ఈ జీవరాశులన్నింటినీ నాలుగు తరగతులుగా వర్గీకరించారు.

1. జరాయుజములు  - మావితోపుడతాయి

2. అండజములు -గుడ్డుబద్దలు కొట్టుకుని బయటికి వస్తాయి

3. స్వేదజములు -చెమట నుండి పుడతాయి, పేలవంటివి.

4. ఉద్బుజములు - భూమిని చీల్చుకుని పైకి వస్తాయి, చెట్లవంటివి.

ఈ నాలుగురకాలైన ప్రాణులలో కొన్ని కోట్ల జన్మలు తిరిగి తిరిగి అంటే పుట్టీ చచ్చీ, పుట్టీచచ్చీ, దాన్ని సంసార చక్రం అంటారు. అంటే జననమరణ చక్రమందు తిరుగుట అని. దీనికి అంతుండదు. శరీరం తీసుకోవడం విడిచిపెట్టడం, తీసుకోవడం విడిచిపెట్టడం. ఈ సంసార చక్ర పరిభ్రమణం తాపం అంటే వేడితో ఉంటుంది. ఎందుచేత?

అమ్మ కడుపులో పడి ఉండడం అన్నది అంత తేలికయిందేమీ కాదు. భాగవతంలో *కపిలగీత* చదివితే పుట్టుక ఇంత భయంకరంగా ఉంటుందా! అనిపిస్తుంది.

శుక్రశ్రోణితములు కలిసిన దగ్గర్నుంచీ తల్లి కడుపులో బుడగగా ఆకృతి ఏర్పడి, తర్వాత ఆ పిండం పెరిగి పెద్దదై, మెల్లమెల్లగా అవయవాలు సమకూరిన తరువాత తలకిందకు, కాళ్లు పైకీ పెట్టి గర్భస్థమైన శిశువు పడి ఉన్నప్పుడు దానికి నాభిగొట్టం ద్వారా ఆహారం అంది చైతన్యాన్ని పొంది, జీవుడు అందులోకి ప్రవేశించిన తరువాత సున్నితమైన క్రిములు కరిచేస్తుంటే, తొమ్మిది నెలలు అమ్మ కడుపులో కటిక చీకట్లో కొట్టుకుని కొట్టుకుని పరమేశ్వరుని ప్రార్థన చేసి, ఆయన అనుగ్రహించి ప్రసూతి వాయువు బయటికి తోసేస్తే అమ్మ కడుపులోంచి బయటికి వచ్చి పడిపోతాడు జీవుడు.

ఈ మనుష్యజన్మ ఎత్తడానికి ముందు ఎన్ని కోట్ల జన్మలెత్తాడో! ఆఖరికి చేసుకున్న పాపాలన్నీ చాలా భాగం తగ్గిపోయిన తర్వాత జన్మపరంపరలో పూర్తి చేసుకోవడానికి అవకాశమివ్వబడే చిట్టచివరి అవకాశం మనుష్య శరీరం. ఇదే మనుష్య శరీరానికి ఉన్న గొప్పతనం అంటారు శంకరులు.

జననమరణాలు పోగొట్టుకునే అవకాశం ఒక్క మనుష్య శరీరానికి తప్ప మరే శరీరానికీ ఉండదు. దానితో ఒక్క మనుష్యుడు మాత్రమే కర్మానుష్ఠానం చేయగలడు.

మనుష్యజన్మ వైశిష్ట్యాన్ని అంతసేపు చెప్పి చివరన *కురుపుణ్య మహోరాత్రం* అన్నాననుకోండి. అంటే మంచి కర్మలు చేయండి అన్నప్పుడు *మనుష్య శరీరం కానప్పుడు అదెలా సాధ్యం*?

మనుష్య శరీరం కానిది కేవలం నమస్కారం కూడా చేయలేదు. రెండు చేతులు కలిపి అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు కలిపి తలమీద ఉంచి బుద్ధిస్థానాన్ని దానితో కలిపి పదకొండింటినీ భగవంతుని పాదాల వద్ద న్యాసం చేయడం నమస్కారం. ఇలా ఏ ఇతర ప్రాణీ చేయలేదు. అందుకే అలా కర్మలను చేయుటవలన భక్తితో జీర్ణించిన కారణంచేత ఈశ్వరుని అనుగ్రహం ఏదో ఒకనాటికి కలుగుతుంది. అప్పుడు మోక్షాన్ని పొందుతాడు.

అందుకే *జంతూనాం నరజన్మ దుర్లభం* అంటారు శంకరాచార్యులు. అంటే మనుష్యుడు కూడా జంతువే.

*మనుష్యుడు జంతువెలా అవుతాడు*?

జంతువును సంస్కృతంలో ‘పశు’ అంటారు.

పాశంచేత కట్టబడినది కాబట్టి పశువు అయింది. నాలుగు కాళ్ళు, రెండు కాళ్ళు ఉన్నవే కాదు, శాస్త్రంలో మనుష్యుడు కూడా జంతువుగానే పరిగణింపబడతాడు. ఎందుకంటే తత్త్వాన్నిబట్టి మనకు కూడా ఆ మూడూ ఉంటాయి. అందువల్ల మనల్ని కూడా పశువులు అని పిలుస్తారు.

అయితే అలా అంటే మనం కాస్త చిన్నబుచ్చుకుంటామేమోనని శంకర భగవత్పాదులు *శివానందలహరి* చేస్తూ అదేదో తన మీద పెట్టుకున్నారు.

*ఓ పరమేశ్వరా! నేను పశువుని, నీవు పశుపతివి* అన్నారు.

మనకు పశువుకులాగే ఒక శరీరం, మెడలో ఒక తాడు. ఆ తాడు కట్టడానికి ఒక రాయి. మెడలో తాడు అంటే కర్మపాశాలు. కర్మపాశాల చేత జన్మ అనే రాయికి కట్టబడతాడు. అలా కట్టబడి ఉంటాడు కనుక మనిషిని కూడా పశువు అని పిలుస్తారు.

ఏ జంతువయినా పాశాలను విప్పుకుంటే యజమాని పట్ల ధిక్కార ధోరణి ప్రదర్శించిందని గుర్తు. కానీ మనుష్యుడి విషయంలో ఇది భిన్నంగా ఉంటుంది.

*సాధన* చేత మనుష్యుడి తాళ్ళు తెగిపడిపోతాయి. అంటే ఇక మళ్ళీ పుట్టనటువంటి స్థితిని పొందాడని గుర్తు. ఇది మిగిలిన జంతువులకు, మనిషికి ఉండే తేడా. కర్మపాశాల ముడి విప్పడం కాదు. కర్మపాశాన్ని పరమేశ్వరుడు తెంచేస్తాడు.

అందుకే భగవంతుని స్వరూపాలన్నింటిలో ఏదో ఒక చేతిలో గొడ్డలి లేదా కత్తి కనిపిస్తుంది. దానితో కర్మపాశాలను తెంపి, భక్తి పాశం వేసి ఆయన తన దగ్గరకు లాక్కుంటాడు. తన పాద పంజరంలో కూర్చోబెట్టుకుంటాడు. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరంలేని స్థితి కల్పిస్తాడు. ఇంత అదృష్టం ఒక్క మనుష్య శరీరానికే సాధ్యం. అందుకే శంకరుల వారు *జంతూనాం నరజన్మ దుర్లభం* అన్నారు.
భారతీయులు ఉపయోగించిన పుష్పక విమానాల గురించి సంపూర్ణ వివరణ  - 2 .

  అంతకు ముందు పోస్టులో మీకు మన ప్రాచీన భారతీయులు ఉపయోగించిన పుష్పకవిమానాల గురించి కొన్ని విశేషాలు మీకు తెలియచేశాను . ఇప్పుడు కొంతమంది ప్రాచీన విమానవిద్య నిపుణుల పేర్లు మీకు వివరిస్తాను .  వరుసగా

  నారాయణముని , శౌనకుడు, గర్గుడు, వాచస్పతి, చాక్రాయణి , దండినాధుడు, విశ్వనాథుడు, గౌతముడు, లల్లాచార్యుడు , విశ్వంభరుడు, అగస్త్యుడు, గోభిలుడు , అత్రి, గాలవుడు , వ్యాసుడు వీరు కాక మరికొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు మొత్తం 36 గురు విమానవిద్యానిపుణులు కలరు. అదేవిధంగా మరికొన్ని ప్రాచీన రహస్య గ్రంథాలలో కూడా ఈ పుష్పక విమాన విశేషాలు ఇవ్వడం జరిగింది. ఆ రహస్యగ్రంధాల పేర్లు మీకు నేను వివరిస్తాను. అవి

       క్రియాసారము , యంత్రసర్వస్వము , శౌనకీయము , లోహతంత్రము, దర్పణ ప్రకరణము, విమాన చంద్రిక, వ్యోమయాన తంత్రము , యంత్రకల్పము, ఖేటయాన ప్రదీపిక , యానబిందువు , మణిభద్రకారిక , లోహాప్రకారణము , వ్యోమయానార్క ప్రకాశము, శక్తితంత్రము , దర్పణ శాస్త్రము, ధాతు సర్వస్వము , శబ్దమహోదధి , గతినిర్ణయాధ్యాయము , సమ్మోహక్రియాకాండము , రూపశక్తి ప్రకరణము , ఔషధీ కల్పము .ఇలా 97 రహస్య గ్రంథాలలో ప్రాచీన విమానయాన రహస్యాలు ఉన్నాయి.

                మహర్షి భరద్వాజుడు రచించిన సూత్రము యొక్క వ్యాఖ్యాన ప్రసంగములో బోధానంధయతి విమానాశబ్దాన్ని వివరిస్తూ నలుగురు ఆచార్యులు ఇచ్చిన పలు అర్ధాలను పొందుపరిచారు. ఆ నలుగురు ఆచార్యుల పేర్లు లల్లాచార్య, నారాయణాచార్య, శంఖాచార్య, విశ్వంభరాచార్య వారు పొందుపరిచిన అర్ధములలో ఒక్కటి మీకు వివరిస్తాను .

         ఒక దేశము నుండి ఇంకొక దేశమునకు , ఒక ద్వీపము నుండి మరియొక ద్వీపమునకు అదే విధముగా ఒక లోకము ( గ్రహము ) నుండి మరియొక లోకమునకు ఆకాశములో ప్రయాణము చేయగలది ఈ విమానము అని ఆకాశ శాస్త్ర నిపుణులు నిర్వచించారు.  అదేవిధముగా విమాన చోదకుని ( పైలెట్ ) అర్హతలు ఏమిటి అన్నది కూడా కులంకుశముగా వివరించారు . ఈ అంశంపైనా అతడు మొత్తం విమానచోదకుడు 32 రకాల అర్హతలు కలిగి ఉండాలని తీర్మానించారు. ఈ అర్హతల గురించి లల్లాచార్యుడు "రహస్యలహరి " అనే గ్రంథములో వర్ణించినట్లు తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఆ అర్హతల గురించి సంక్షిప్తముగా తెలియచేస్తాను .

 32 రకాల అర్హతలు  -

     మాంత్రిక, తాంత్రిక, కృతక, అంతరాలక , గూడ , దృశ్య, అదృశ్య, పరోక్ష, అపరోక్షక, సంకోచ, విస్తృత, విరూపకరణ, రూపాంతర , సురూప, జ్యోతిర్భావ , తమోమయ, ప్రలయ , విముఖ , తారా , మహాశబ్ద విమోహన, లంఘన , సార్పగమన, పల, సర్వోతోముఖ  , పరశబ్ద గ్రాహక , రూపాకర్షణ, క్రియా రహస్య హరణ , కర్షణ, దిక్ ప్రదర్శన, ఆకాశాకార, స్తబ్దక, జలదరూప,  ఇలా 32 రకాల అర్హతలే కాక మరొక 5 రకాల అర్హతలు కూడా అవసరం అని మరొక సూత్రములో తెలియచేశారు. దీనిని శౌనక ఋషి రేఖాపధము , మండలము , కక్ష్య, శక్తి, మరియు కేంద్రము అను అయిదు విధములైన ఆకాశమార్గములు చోదకునకు తెలియుట అత్యావశ్యకం అని తెలియచేసారు.

         పైన తెలిపిన విమాన చోదకునికి ఉండవలసిన అర్హతలలో కొన్నింటి వివరణ మీకు తరవాతి పోస్టులో వివరిస్తాను.

   గమనిక  -

           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.

           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.

            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.

      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. కొరియర్ చార్జీలు కూడ ఇందులోనే పైన మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు . పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.

            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .

                  కాళహస్తి వేంకటేశ్వరరావు

                         9885030034

               అనువంశిక ఆయుర్వేద వైద్యులు
*యాసా పద్మాసనస్థా విపుల కటితటి పద్మపత్రాయాక్షీ*
*గంభీరావర్తనాభిః స్తనభరనమితా శుభ్ర వస్థ్రోత్తరీయా*
*లక్ష్మీర్థివైః  గజేంద్రైర్మణిగణఖచితైః స్నాపితా హేమకుంభై*
*నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వ మాంగల్య యుక్తః*

*జయ పద్మ విశాలక్షి జయత్వం శ్రీపతిప్రియే*
*జయ మాతర్మహా లక్ష్మీ సంసారార్ణవ తారిణీ*

*(అగస్థ్య విరచిత లక్ష్మీ స్థ్రోత్రము)*


ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని,
నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను అదుపులో ఉంచు కోగలిగితే మన జీవితం అదుపు తప్పకుండా ఉంటుంది.

నాలుకను అదుపు చేసుకోగల విద్య తెలిస్తే, అనేక విద్యలు అవలీలగా ఒంటపడతాయి.

నోటిని అదుపులో పెట్టుకుని అందరితో మర్యాదగా మాట్లాడుతూ,
పద్ధతిగా నడుచుకుంటూ ఉంటే ఎక్కడైనా,
ఎప్పుడైనా మంచే జరుగుతుంది.

చెట్టు సారం పండులో వ్యక్తమైనట్లుగా,
మనిషి సారం అతడి మాటలో తొంగి చూస్తూ ఉంటుంది.
మంగళకరమైన మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి.

మనిషికి నిజమైన అలంకారం అతడి మాట తీరే.

వాగ్భూషణం భూషణం

కేయూరాణి న భూషయంతి పురుషం* *హారా న చన్ద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం
నాలంకృతా మూర్ధజాః
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా* సంస్కృతాధార్యతే
క్షీయన్తే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం

ఇది భర్తృహరి
నీతి శతకంలో విద్వత్పద్ధతిని చెప్పే శ్లోకాల్లో ఒకటి.
 ‘వాగ్భూషణమొక్కటే మనిషికి సుభూషణం’ అన్నాడు భర్తృహరి._*

సంభాషణం
మిత భాషణం,
హిత భాషణం,
స్మిత భాషణం,
ప్రియ భాషణం,
పూర్వ భాషణం,
సత్య భాషణం అయినప్పుడు-
అంతకన్నా భూషణం మరొకటి లేదు.

‘మితంగా,
హితంగా మాట్లాడాలి.
మనిషికి గౌరవం తెచ్చేవి ఇవే’
అనేవారు గాంధీజీ.

ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతూ ఉండాలి.
మధుర భాషణం వల్ల మర్యాద లభిస్తుంది.
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కదా.
ప్రియంగా మాట్లాడాలి.
ఎదుటివారిని ముందుగా మనమే పలకరించడం పూర్వ భాషణం.

రాముడు స్మిత పూర్వ భాషి-
మాట కన్నాముందు ఆయన చిరునవ్వు ఎదుటివారిని పలకరించేది.

సత్యమే సర్వోన్నతమైంది
కనుక నిర్భయంగా సత్యాన్ని పలుకు.
ఆ సత్యాన్ని ప్రేమగా,
నేర్పుగా చెప్పాలి.
మర్యాదగా,
హుందాగా మాట్లాడాలి.

ఆలోచించకుండా మాట్లాడటం,
గురి చూడకుండా బాణం వేయడం లాంటిది.
మాట్లాడిన తరవాత ఆలోచించాల్సిన అవసరం రాకూడదు.
కాబట్టి ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి.

‘తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు.
*తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు’*
అన్నారు స్వామి వివేకానంద.

ఎవరైతే తమ మాటలవల్ల,
చేతల వల్ల ఇతరులకు బాధ కలిగించకుండా ఉంటారో వారే ఉత్తములు.

ఆచరిస్తూ చెప్పే మాటలకు
ఆదరణ ఎక్కువ.
ఆదరణపూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ ఎక్కువ.
ఆకట్టుకునేలా మాట్లాడటం ఓ కళ.
అయితే ఆ మాటలను ఎప్పుడు మొదలుపెట్టాలో,
ఎప్పుడు ఆపాలో తెలియడం మరీ
గొప్ప కళ.
మాటలే మంత్రాలు, చెట్లే ఔషధాలు.
మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి,
బలమైనవి కనుక సున్నితంగా వాడాలి,
ఖరీదైనవి కనుక పొదుపుగా వాడాలి.

మాట్లాడటం
అందరూ చేస్తారు.
అయితే అందరిలాగా కేవలం నోటితో మాట్లాడితే సరిపోదు.
మరింత ప్రభావాన్వితంగా ఉండాలంటే మనసుతో,
శరీరంతో మాట్లాడాలి.

మాటే సంపదలకు, మానవ సంబంధాలకు మూలం.
మాటే స్నేహితుల్ని సంపాదించి పెడుతుంది,
శత్రువుల్నీ తయారు చేస్తుంది.

నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు.

అలాంటివారికి శత్రువులే ఉండరు.
మాటలు గాయపరచగలవు,
అదే గాయాన్ని నయం చేయనూగలవు.
సరైన మాటతీరు-
చంపడానికి వచ్చిన శత్రువు మనసునైనా మార్చగలదు.

మాటల మధ్యలో సందర్భానుసారంగా సామెతలు,
లోకోక్తులు వాడితే పాయసంలో అతి మధురమైన పదాలు,
మరింత మధురంగా,
వినసొంపుగా అనిపిస్తుంది.
సంభాషణ సరస చతురత కలిగి ఉండాలి.
తిడుతూనే నవ్వించే హాస్య కుశలత కలిగి ఉండాలి.

ఎవరితో, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి.
ఈ విషయంలో రామాయణంలో నాయకుడైన మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు,
సుందరకాండకు నాయకుడైన సుందరమూర్తి హనుమంతుడు మనకు ఆదర్శం కావాలి.

మనిషికి భావ వ్యక్తీకరణ గొప్ప ఆస్తి.
ఏం చెప్పారనేదాని కన్నా ఎలా చెప్పారనే దాన్నిబట్టి భావ ప్రసరణ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

భావవ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటే ఫలితం అంత మహత్తరంగా ఉంటుంది.