Saturday, March 9, 2019

ఆడవారు నమకచమక మంత్రాలు, గాయత్రీ జపించవచ్చునా?

ఇది నేటి ప్రశ్నకాదు. తరతరాలుగా అడుగుతున్న ప్రశ్నే, అదే పంధాలో ఎందరో మహానుభావులు సమాధాన పరిచారు కూడా. నేటి సాంకేతిక విజ్ఞానం వచ్చాక ఆ జ్ఞానవెలుగులో మరొక్కసారి మనవారు చెప్పిన విషయాన్ని పరిశీలిద్దాము.

ముందుగా మన శాస్త్రం ఏమి చెప్పింది అటుపై వచ్చిన మార్పులేమిటి అన్న విషయం చూద్దాము. మధ్యలో కొన్ని విపరీత వాదనలు కూడా వచ్చి అసలు విషయం మరుగునపడి అనవసర విషయాలు ప్రాచుర్యంలోనికి వచ్చాయి. అటునుండి స్త్రీవాదులు తయారయి ఈ మొత్తం తతంగానికి వారి వారి వక్రభాష్యాలు చెప్పి రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. ఒకప్పుడు ఉపనయన సంస్కారం ఉన్న బ్రహ్మవాదినులు ఉండేవారు, వారికి ఇవన్నీ అనుమతింపబడ్డాయి కానీ ఈ కలియుగంలో వారికి, వారి శారీరక స్థితికి నిషేధించింది శాస్త్రం. శాస్త్రం చెప్పిన కొన్ని తార్కిక  కారణాలు:

1. వేదాలు స్వర, మాత్రానుగుణంగా ఉచ్చరింపబడాలి వాటి పూర్తి ప్రభావం ప్రకటింపబడాలి అంటే. పురుషదేహ నిర్మాణానికి, స్త్రీ దేహ నిర్మాణానికి తప్పక తేడా వుంది. వారికున్న నాడీమండల వ్యవస్థ ఆడవారికి సరైన స్వరోచ్చారణకు పూర్తిగా సహకరించదు. పురుషుల వోకల్ ఫోల్డ్స్/కార్డ్స్ 17mm-25mm పొడవు వుండగా, స్త్రీలకు 12.5-17.5mm వుంటుంది, దీనివల్ల వారి pitch లో తేడా వుంటుంది. వేద మంత్రాలన్నీ ఉదాత్త, అనుదాత్త, స్వరానుగుణంగా ఆయా స్థాయిలో ఉచ్చరించడం ఈ నిర్మాణం వలన స్త్రీలకు పూర్తిగా సాధ్యపడదు.

2. ఈ వేదమంత్రాల స్వరాలు నాభినుండి పలకవలసి వస్తుంది. కావున నమకచమక మంత్రాలలో ఇటువంటి ప్రయోగాలు ఎక్కువ వుండడం వలన వాటికి పొత్తికడుపు మీద ఒత్తిడి ఎక్కువ కలుగుతుంది. వారి శరీరనిర్మాణం ప్రకారం వారికి ఇటువంటి ఒత్తిడి పెట్టడం వలన ఉచ్చారణ చెయ్యగా చెయ్యగా వారి ఋతుకాలం మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

3. నేడు మనం చూస్తున్న సంగీత థెరపీ వలన రోగులలో హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడమూ, తక్కువ చెయ్యబడడమూ శాస్త్రీయంగా నిరూపింపబడినది. వేదము, వేదమునందలి ఈ నమక చమక మంత్రాలు ప్రధానంగా శబ్దప్రధానం. వీటి శబ్దప్రకంపనల వలన ఈస్ట్రోజెన్ తదితర హార్మోన్లపై ప్రభావం అధికంగా వుండి కాలక్రమేణా కొన్ని కొన్ని మంత్రాల వలన గర్భస్రావం కూడా జరుగుతుందని ఆడవారు ఆ మంత్రాలు వినరాదు చదవరాదు అని నియమం పెట్టారు.

4. వేదమంత్రాన్ని కొంచెం తప్పుగా చదివితే  రావలసిన ఫలితాలకు వ్యతిరిక్తంగా దుష్ఫలితాలు కలుగుతాయి. ఆడవారికి గురూపదేశం లేకుండా సరైన ఉచ్చారణ అబ్బదు, కాబట్టి వారికి వేదపఠనం, అందునా మరింత శక్తివంతమైన రుద్రాధ్యాయ, ఆదిత్య, సౌర సూక్తాలు వద్దని చెప్పారు.

5. నేటి సాంకేతిక పరిజ్ఞానం చెబుతున్న దాని ప్రకారం ఆడవారికి మెనోపాజ్ వరకు వారిని చాలా శక్తివంతమైన హార్మోన్లు కాపాడతాయి, ఒకసారి ఆ సమయం వచ్చాక వారికి ఒక్కసారి వ్యాధినిరోధక శక్తి తక్కువ అవుతుందని పరిశోధనల ద్వారా నిరూపించారు. వారికున్న రక్షణాత్మక కవచాన్ని కాపాడుకోవాలన్న తాపత్రయం కొద్దీ వారికి కొన్ని పనులు నిషేధించారు, అందులో ముఖ్యంగా ఇటువంటి వేదనాదాన్ని ఉచ్చరించడం.

6. నేటి యుగధర్మ ప్రకారం ఆడవారికి ద్విజత్వం సిద్ధించదు, ఎందుకంటె వారికి ఉపనయన సంస్కారం లేదు కనుక. కావున వారికి గాయత్రి మంత్రోచ్చారణ కానీ వేదపఠన కానీ వద్దని చెప్పారు. ద్విజులంటే బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు అన్న విషయం అందరికీ తెలుసు కదా.

7. వేదం పఠించడం వలన శరీరంలో చక్ర ఉత్తేజితం వలన, ఉచ్చారణాక్రమం వలన ఎక్కువగా ఉష్ణం ఉత్పన్నమవుతుంది. అది ఆడవారి శరీరానికి మంచిది కాదని వారిని చదవద్దని వారిస్తారు.

కొందరు ఏడ్చి పెడబొబ్బలు పెట్టినట్టు ఇందులో ఆడవారిని తక్కువగా ఎక్కడా చూడమని చెప్పలేదు. ఆడదంటే ఆదిశక్తి అని కొలిచిన ధర్మం మనది. వేదం చదవద్దని చెప్పిన  మన ధర్మశాస్త్రాలు వారికి మరెన్నో సౌలభ్యాలు కలుగచేసాయి.
1. వారు వేద వ్యాఖ్యానాలు పూర్తిగా చదివి తత్త్వం తెలుసుకోవచ్చును. మనకు పూర్వం కూడా ఎందరో నారీమణులు వేదార్ధాన్ని, వేదంగాలను నేర్చిన వైనం వినే ఉన్నాము.
2. వారు సౌందర్యలహరి, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం వంటి ఎన్నో శక్తివంతమైన స్తోత్రాలు, వివిధ దేవతల శ్లోకాలు, దివ్యప్రబంధాలు, పురాణ ఇతిహాసాలు, భజనలు, కీర్తనలు తప్పక చదవమని చెబుతుంది శాస్త్రం
3. వారు మాత్రమె చెయ్యగలిగిన ఎన్నో శక్తివంతమైన ఫలవంతములైన వ్రతాలు చెప్పబడి ఉన్నాయి.
4. ఆత్మ విచారం ఇత్యాది గొప్ప ఆధ్యాత్మిక సాధనలు నిషిద్ధం కావు. ఇలా ఎన్నో దైవపూజలకు వారికి అధికారం వుంది.

కేవలం వేదం చదవరాదన్న నియమం వలన వారు ఏ రకంగాను కూడా పురుషులకన్నా తక్కువ స్థాయిలో చూడలేదు.  వారి శరీర భౌతిక నిర్మాణం వారికి కొన్నింటికి అధికారులుగా చేసింది, వారిని రక్షించుకోవడానికి కొన్నింటిని నిషేధించింది. ఏ రకంగా చూసుకున్నా పురుషుడు పురుడు పోసుకోలేడు, స్త్రీ పునరోత్పత్తి చెయ్యలేదు సహజంగా. కావున వారి శరీర తత్త్వం వేరు వేరని గుర్తెరగాలి, వారికి చెప్పిన పనులు చెయ్యాలి, అనువు కానివి కూడదు, కాదు కూడదని శాస్త్రం చెప్పిన దానికి విరుద్ధంగా ఎవరైనా మూర్ఖంగా ముందుకు పోతే వారి ఖర్మకు వారే బాధ్యులు కదా !!

!!సర్వం శ్రీ విద్యా గణేశార్పణమస్తు !!

Friday, March 8, 2019

*The 9 avataars of a devi in our everyday lives....*

*PART I*

1. Morning rush hour, office work... *Ashtabhuja.*
2. Teaching her children.... *Saraswati.*
3. Saves money from her household expenses... *Mahalaxmi.*
4. Puts food on a plate for her family.... *Annapurna.*
5. Stands firmly with her family in the hour of need.... *Parvati.*

PART II

6. Hubby puts a used wet towel on the bed... *Durga.*😂
7. Hubby doesn't want to discuss about the Holiday Plans... *Kali.* 😂😂
8. Hubby Doesn't appreciate her Saree... *Mahishasurmardhini*.😂😂😂
9. Hubby praises qualities in another woman... *Bhavani.*😂😂😂😂

Thursday, March 7, 2019

Try.తాంత్రిక వస్తువులు - శోణ భద్ర శిల :

శోణభద్ర శిల

బీహార్ రాష్ట్రంలో ప్రవహించే శోణ నదిలో లభించేదైవీక శిల శోణభద్ర శిల. పంచాయతన పూజచేయటానికి ఉపయోగించే దైవీక శిల శోణభద్ర శిల.ఆకాశ తత్త్వమైన ఈ శిల గణపతి ఆకారంలో లేనప్పటికీ గణేశుడు ఈ శిలలో నివాసమైయుంటాడు కనుక మహాగణపతిగా భావించి వేదకాలంనుండి అందరూ పూజిస్తూ వస్తున్నారు. ఈ శోణ నది ఛత్తీస్గడ్ రాష్ట్రంలో జన్మించింది. దీని జన్మస్థానం నర్మదానది జన్మస్థానమైన అమరకంటక్ దగ్గర్లోనే. ఈ రెండు నదులు ఒకే ప్రాంతంలో పడే వర్షపాతాన్ని పంచుకుంటాయి. అక్కడినుండి ఉత్తరప్రదేశ్ మీదుగా బీహార్లోకి ప్రవేశించి పాట్నా వద్ద గంగానదిలో కలుస్తుంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శోణ నది ప్రవహించే ప్రాంతంలోని ఒక భాగానికి శోణభద్ర అనే పేరుతో ఒక జిల్లాను ఏర్పాటు చేయడం విశేషం. మరెక్కడా లేని విధంగా ఈ జిల్లా ఛత్తీసుగడ్, ఝార్కండ్, మధ్యప్రదేశ్, బీహార్ మొదలగు నాలుగు రాష్ట్రాలకు సరిహద్దు జిల్లా అవ్వడం మరో విశేషం.

శోణభద్ర గణపతి శిలను పూజించడం ద్వారా కలిగే లాభాలు…

v   పాడ్యమినాడు శోణభద్ర గణపతి శిలను “ఓం గం గణపతయే నమః” అనే మంత్రమును 108 సార్లు పఠించి పూజించి 9 గుంజీలు తీస్తే హృదయ సంబంధ రోగములు రావు, జయము కలుగుతుంది.

v   విదియనాడు పూజించినవారికి బాధలు తొలగి సంతోషము కలుగుతుంది. బలహీనంగా ఉండేవారికి బలము కలుగుతుంది.

v   తదియనాడు పూజించినవారికి కార్యసిద్ధి కలుగుతుంది, సకల సంపదలు చేకూరుతాయి.

v   చవితినాడు పూజించినవారికి సౌఖ్యం లభిస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

v   పంచమినాడు పూజించినవారికి ధనప్రాప్తి కలుగుతుంది. పాకెట్లో పెట్టుకుంటే సర్వ భయాలనుండి రక్షణ కలిగిస్తుంది.

v   షష్ఠినాడు పూజించినవారికి కలహాలు తొలగుతాయి. అవాస్తవ పరిస్థితులు, ప్రమాదకరమైన వ్యక్తులనుండి మీకు రక్షణ కలుగుతుంది.

v   సప్తమినాడు పూజించినవారికి అశుభయోగాలు తొలగి శుభయోగాలు కలుగుతాయి. గర్భవతులు తమ వద్ద ఉంచుకుంటే సుఖ ప్రసవం అవుతుంది. తల్లిని బిడ్డను రక్షిస్తుంది. ప్రశవ వేదన ఉండదు.

v   అష్టమినాడు పూజించినవారికి అష్టకష్టాలన్నీ తొలగుతాయి, ఆధ్యాత్మిక లక్షణాలు కలుగుతాయి.

v   నవమినాడు పూజించినవారికి గతంలో మీరు పడ్డ వ్యయ ప్రయాసలకు ఫలితం దక్కుతుంది, ధైర్యాన్ని ప్రసాదిస్తుంది.

v   దశమినాడు పూజించినవారికి వంశాభివృద్ధి కలుగుతుంది, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి ఉపశమనం కలగుతుంది.

v   ఏకాదశినాడు పూజించినవారికి సుఖదుఃఖాలన్నిసామాన్యంగా అనిపిస్తుంది, కాలేయానికి రక్షణ కలిగిస్తుంది.

v   ద్వాదశినాడు పూజించినవారికి భోజనానికి ఇబ్బందులుండవు, మర్మాంగాలకు రక్షణ కలిగిస్తుంది.

v   త్రయోదశినాడు పూజించినవారికి కష్టాలేమి ఉండవు, ఆనందకరమైన భోగం, సంసార జీవితం కలుగుతుంది.

v   చతుర్దశినాడు పూజించినవారికి సకల శుభాలు కలుగుతాయి, దిండు క్రింద పెట్టుకుని నిద్రించినవారికి సుఖనిద్ర కలుగుతుంది.

v   పౌర్ణమినాడు పూజించినవారికి దీర్ఘ సుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుంది, ఆసుపత్రి పాలైనవారు పూజించిన సోనభద్రను తమ వద్ద ఉంచుకుంటే త్వరగా కోలుకుంటారు.

v   అమావాస్యనాడు పూజించినవారికి దిన దిన ప్రవర్ధమానంగా అభివృద్ధి ఉంటుంది.
◆●◆●◆●◆●◆●◆●◆●●●◆●◆
🌷వివేకచూడామణి🌷
(శంకరాచార్యులవారి పరిచయము)
◆●◆●◆●◆●◆●◆●◆●◆●◆●◆

1. *శ్రీ శంకరాచార్యులవారు వివేకచూడామణి అనే అత్యంత ప్రాచుర్యము పొందిన ఆధ్యాత్మిక గ్రంధ రాజము, అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదిస్తూ 580 సంస్కృత శ్లోకాలతో వ్రాయగా* దానిని స్వామి మాధవానందుల వారు ఆంగ్లములోకి అనువాదము చేసియున్నారు.
దానిని పరిశీలించి అందులోని అద్వైత తత్వాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొందే విధానమును తెలుగు భాషలోకి నా యొక్క స్వేచ్ఛానువాదము ద్వారా తెలియజేయు నా ప్రయత్నము సాహసమే అవుతుంది. అయినను వ్రాయాలనిపించి నాదైన సులభ శైలిలో వ్రాసినాను. నా యొక్క ఇతర పుస్తకములవలె దీనిని కూడా ఆదరిస్తారని తలచెదను.
*వివేకచూడామణి అనగా సత్యాసత్యములను, మంచి చెడులను విడదీసి తెలుసుకొనుటలో ఈ గ్రంధము మణిశిఖ వంటిదని అర్థము.*

*2. మానవ జన్మ*

1. మొదటి శ్లోకములో శ్రీ శంకరాచార్యులవారు *''గురువే ప్రత్యక్ష దైవ''* మన్నట్లు తన గురువైన గోవిందా చార్యుల వారిని దైవముగా స్తుతించినారు.

2. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనది. మానవులలో పురుషజన్మ ఉన్నతమైనది. అందులోనూ వైదిక మతములో బ్రహ్మ జ్ఞానము గొప్పది. *బ్రహ్మ జ్ఞానము ద్వారా ఆత్మ అనాత్మల భేదమును గ్రహించుట, బ్రహ్మమును తెలుసుకొనుట అరుదైన విషయము.* అట్లాంటి మానవుడు ముక్తిని పొందాలంటే 100 కోట్ల జన్మలు ఎత్తవలసి ఉంటుంది.

3. భగవంతుని కృపతో మానవునిగా జన్మించుట, *జన్మ పరంపర నుండి విముక్తికై కృషి చేయుట మరియు అందుకు సద్గురువు యొక్క రక్షణ* అను మూడు ముఖ్య విషయములు అవసరము.

4. పురుషునిగా లభించిన మానవ జన్మ ద్వారా వేదవిజ్ఞానమును పొందిన మనిషి జన్మ రాహిత్యానికి కృషి చేయకుండా, ఆత్మహత్య సదృశమైన లౌకికానందములో చిక్కుకొనుట అనుచితము.

5. మనిషి తనకు లభించిన పురుష మానవ జన్మను జన్మ పరంపర నుండి విముక్తికై కృషి చేయకుండుట ఎంత తెలివి తక్కువ తనము.

6. జీవాత్మ పరమాత్మ ఒక్కటే అను సత్యాన్ని గ్రహించకుండా ప్రపంచమున్నంత కాలము 432 మిలియన్ల సంవత్సరములు యగ్నయాగాదులు చేసి, దేవతలను తృప్తి పరచినను జన్మ రాహిత్య స్థితి లభించదు.

 7. సంపదలు, వేదాల పఠనము, యగ్నయాగాదులు మొదలగు వాటి వలన పరమాత్మను పొందలేము. జన్మ రాహిత్యము లభించదు.

8. అందువలన మానవుడు జన్మ రాహిత్య స్థితికై కృషి చేయవలెను. జ్ఞానియై మనిషి భౌతిక వస్తు సముదాయము వలన పొందే లౌకిక సుఖాలకై ప్రాకులాడకుండా తన మనస్సును సత్యమువైపు మరల్చవలెను.

9. వ్యక్తి జ్ఞానేంద్రియాలపై అదుపును పొంది భౌతిక వస్తు సుఖాలకు అతీతుడై యోగారూఢ స్థితిని పొందినపుడు పుట్టుక, చావు; మంచి, చెడు అను స్థితులను అధిగమించి విచక్షణతో కూడిన జీవితాన్ని పొందగలడు.

10. జ్ఞాని అయిన విద్యావంతుడు ఆత్మను పొందే మార్గమును ఎన్నుకొని మంచి, చెడులకు అతీతుడై భౌతిక బంధనాలైన పుట్టుక, చావుల నుండి విముక్తిని పొందుటకై సాధన చేయవలెను.

11. యజ్ఞ, యాగాల వలన మనస్సు స్వచ్ఛమవుతుంది. కాని సత్యాన్ని తెలుసుకొనలేము. కేవలము నిత్యానిత్య వివేకము ద్వారానే పరమాత్మను పొందగలము. కర్మలు 10 లక్షలు చేసినను సత్యాన్ని గ్రహించలేము.

12. తాడును చూసి పామని భ్రమించి భయభీతులు చెందువాడు మనస్సులో తగినట్లు విచారణ చేసిన అది పాము కాదు తాడని గ్రహించగలడు.

13. సత్యాసత్య జ్ఞానాన్ని పొందిన జ్ఞానులతో సంభాషణ ద్వారా మాత్రమే సత్యము అవగతమగును. ఇతరత్రా నదీ జలాలలో స్నానాలు, దేవతలకు పూజలు, సమర్పణలు మరియు ప్రాణాయామము ద్వారా ప్రాణ శక్తిని అదుపుచేసినను సత్యము అవగతము కాదు.

14. శాస్త్ర పరిజ్ఞానముతో సత్యాసత్య వివేకము పొంది, శాస్త్ర చర్చలలో ప్రశ్నించుట, వాదనలలో ప్రావీణ్యం పొందిన వాడే విజయాన్ని పొందగలడు. సమయము, ప్రదేశము మరియు ఇతరత్రా ఏవైన, కేవలము అందుకు సహాయకారులు మాత్రమే.
(ఇంకా ఉంది)

Wednesday, March 6, 2019

*'సర్వేవేదా యత్పద మామనంతి'* మనము శ్రుతుల నుండి ఒక విషయాన్ని శివభక్తి
తెలిసికొంటున్నాము. అదేమిటి? ఒక వేదాలేకాక ఋషులూ, మునులూ, జ్ఞానులూ, యోగులూ, అందరూ ఏవస్తువును పొందగోరి దేనిని వెతుకుతున్నారో ఆ వస్తువేది? అది ఓంకారము. ఈ ఓంకారమును మాండూక్యము విరివిగానూ స్పష్టంగానూ చెప్పింది - *'శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే ఆత్మా స విజ్ఞేయః'* అని అనగా ఆ బ్రహ్మము శాంతమూ శివమూ. అంతేకాక అద్వయమైన విశ్వతైజపప్రాజ్ఞులకు మీదివస్తువూ అదియే; అట్టి ఆ ఆత్మ ఎరుగదగినదీ అని :

*'విద్యాను శ్రుతి రుత్కృష్టా రుద్రైకాదశినీ శ్రుతౌ,*
*తత్ర పంచక్షరీ తస్యాం శివ ఇ త్యక్షరద్వయమ్||*

వేదములో యజుర్వేదము మేలుబంతి. యజుర్వేదములో నాలుగవ కాండలో రుద్రము ఉండుటవల్ల నాలుగవ ప్రశ్నముదానికి మిక్కిలి. రుద్రము మధ్య పంచాక్షరి దాని కంటె దొడ్డది. ఆ పంచాక్షరిలోనూ రెండు అక్షరము లిను మిక్కిలి. ఆ అక్షరములు శివ అనునవి. ఈ అక్షరద్వయము జీవరత్నమని శ్రీమరప్పయ దీక్షితులవారు బ్రహ్మతర్కస్తవములో ఇట్లా చెప్పారు:

*యజ్జీవరత్న మఖిలాగమ లాలనీయం*
*యే చ త్రినేత్ర మృడ శంకర నామధేయైః,*
*ఏతై రపి స్ఫుట మనన్యసమాశ్రయం తే*
*విఖ్యాప్యతే సకల జీవ సుఖ ప్రదత్వమ్.*

అట్టి పరమమంగళమైన శివస్వరూపాన్ని అనుసంథానం చేయగోరేవారు చేయవలసిన పని ఏమిటి? మొదటిది విభూతిథారణ. విభూతి అనగా ఐశ్వర్యం అది అగ్నిలో కాలి శుద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటినిండా భస్మ అలదుకుంటాడు. రెండవది రుద్రాక్షథారణ రుద్రాక్షం అంటే శివుని మూడవ కన్ను. ఇంతమంది దేవతలలో ఫాలమందు కన్ను ఉన్నవాడు ఆయన ఒక్కడే. మూడవది పంచాక్షరీజపము. పంచాక్షరీ మంత్రోపదేశం లేనివారు శివశివ అన జపం చేయాలి. నాలుగవది మారేడు దళాలతో శివుని పూజించటం. లక్ష్మి ఐదు చోటులలో ఎక్కువగా ఉంటుందట. మారేడు, ఆవు వెనుక తట్టు, పతివ్రతల పాపట, ఏనుగుతల పద్మము అనేవి లక్ష్మీ నివాసస్థానాలు. అందుచేత లక్ష్మీప్రదమైన మారేడుదళాలతో చేసే పూజ శివునికి అత్యంత ప్రీతి కల్గిస్తుంది. ఐదవది హృదయంలో సదా సదా శివధ్యానంపై జెప్పిన వెలుపలి పూజతో పాలులోపల శివస్వరూపానుసంథానం ఎడతెగకుండా చేయాలి అని అభిప్రాయం.

సాయంకాలం సమయాన్ని ప్రదోషం అని అంటారు. త్రయోదశినాటి సంధ్యాకాలం మహాప్రదోషం. ప్రదోష సమయాలలో శివస్మరణ విధిగా చెయ్యాలి. కనీసం ఐదు నిమిషాలైనా ప్రదోషసమయంలో శివస్మరణ చేస్తారని సంకల్పం చేసుకొని మానసికంగా స్మరణమూ వాచికంగా శివశబ్దోచ్చారణమూ చేస్తే ఆత్మకు శ్రేయస్సు కలుగుతుంది.

శివ అంటే మంగళం. *'శ్వశ్రేయసం శివం భద్రరి కళ్యాణం మంగళం శుభం'* అని అమరుడు. ప్రాయోపవేశానికి సిద్ధుడైన పరీక్షిత్తుకు శుకాచార్యులవారు భాగవతం వినిపించారు. దానిలో దక్షునికథ ఉన్నది. దక్షుడు శివద్వేషి, శివుడు మంగళస్వరూపుడు. అట్టి శివుని ద్వేషించినవానికి అమంగళం అశివం కాక మరేమి తటస్థిస్తుంది? 'దాక్షాయణిదక్షునిచూచి
*యద్ ద్వ్యక్షరం నామ గిరే రితం నృణాం*
*సకృత్ర్పనంగా దఘ మాశు హన్తి తత్,*
*పవిత్ర కీర్తిం త మలంఘ్య శాసనం*
*భవా నహూద్వేష్టి శివం శివేతరం||*

ఇదెక్కడి పాపం! నీవు శివుణ్ణే ద్వేషిస్తున్నావు! నీకు అశివమే ప్రాప్తించక ఓహో ఏంప్రాప్తిస్తుంది?

పూర్వం ఎవరైనా సహగమనంచేస్తే వారివస్త్రాలు భద్రపరచి కొలిచేవారట. మనోనిగ్రహం ఎంతో ఎంతో లేకపోతే సహగమనం చేసే ధైర్యం కలుగదు. అట్టి నిగ్రహంతో మనోనిశ్చయం చేసుకొని సహగమనం చేసినవారు ఆత్మజ్ఞానం కలవారితో సమానమైనవారు. అందుచేతనే పూజింపదగినవారు అయ్యేవారు. అట్టి సందర్భంలో అంబిక ఈ మాటలు చెప్పింది గనుక ఇది ముమ్మాటికీ సత్యం. నిప్పుగుండంలో శరీరం త్యాగం చేసేటప్పుడు చెప్పిన మాటకంటే నిక్కమైన మాట వేరే ఏమన్నా ఉంటుందా?

పాపాన్ని వొక్కకోణంలో పోగొట్టగలిగే వస్తువు ఒక్కటి ఉన్నది. దానికై అన్నిచోట్లా వెదకనక్కరలేదు. వేదాలకు జీవరత్నమూ, దేహానికి ప్రాణమూ, దేవాలయానికి మహాలింగమువలె వెలుగుచున్న శివ అనే రెండక్షరాలు పాపాన్ని పటాపంచలు చేయటానికి పరమౌషధం. మనిషి పుట్టక పుట్టి సాఫల్యం కోరేవానికి శివనామోచ్ఛారణ తప్ప వేరే ఉపాయంలేదు. పరమేశ్వరుడు మనకు నాలుక యిచ్చినందులకు ఫలం శివ శివ అని జపం చేయడమే.

*అపి వా య శ్చాండాలః శివ ఇతి వచం విసృజేత్ తేన సహ సంవసేత్*

అని శాస్త్రాలు చండాలునికి సైతం శివనామోచ్ఛారణం విధించినవి. సారాంశం ఏమిటంటే ఎప్పుడూ శివస్మరణం వైష్ణవ ప్రధానమైన భాగవతం శివనామ ప్రశస్తిని చెప్పటం మరొక విశేషం. ఒకానొక గొప్ప స్త్రీ ఒకానొక గొప్ప సమయంలో చెప్పిన మాటలు ఇవి.

పరమేశ్వరునికీర్తిని నోరారా వర్ణించడం చేతనూ వీనులారా వినడంచేతనూ మనము పవిత్రులము అవుతాము. అతని ఆజ్ఞ అనుల్లంఘనీయం, అతడు అంతటా నిండి ఉన్నాడు.

అహంభావమున్నవారిని ఆయన శిక్షిస్తాడు. తప్పుచేసిన పిల్లలను దండించే తండ్రివలె దేవతల నాతడు దక్షయజ్ఞంలో శిక్షించాడు. సముద్రమధన కాలంలో కాలకూటం పుట్టినపుడు ఆయన దానిని గుటుక్కున మింగి వానినందరిని రక్షించాడు. ఇట్లా రక్షణ శిక్షణాలు రెండూ చేయగల దక్షుడు ఆయన. పరమేశ్వరుని ముఖాముఖిగా చూడపనిలేదు. ఆయన నామం వొకటేచాలు. పాపపరిహారానికి శివనామం కంటె సులభోపాయంలేదు. ప్రదోషంలో శివ శివ అంటే చాలు. శిష్టులు సాయంసమయమున శివనామం చెప్పడం వాడుక. ఆపరమేశ్వరుడు వేదముల కన్నింటికీ తాత్పర్యం అనదగిన ఓంకార స్వరూపమై యున్నాడు. పరమేశ్వరుడు ప్రభవ బ్రహ్మమేకాక స్వరూప బ్రహ్మము కూడాను- 'సర్వే వేదా యత్ పదమామనన్తి' వేదములన్నీ ఓంకారాన్ని చెప్పినవి. సాయంసమయంలో శివథ్యానమూ ప్రదోష సమయంలో ఈశ్వరదర్శనమూ చేయాలి. దేవతలు శివదర్శనం కోసం శివాలయానికి ప్రదోష సమయంలో వస్తారట.

సాంఖ్య సూత్రాలు ఈశ్వరుణ్ణి త్రినేత్రుడని చెప్పినవి. అతడు మహాపురుషుడని యోగసూత్రాలలో పతంజలి –

*'క్లేశ కర్మ విపాకాశయై రపరామృష్టః పురుషవిశేష ఈశ్వరః'*

అని అంటాడు.

'శబ్దాదేవప్రమితః' అని బ్రహ్మసూత్రములు చెప్పినవి.

ఇట్లా శ్రుతులూ, కర్మకాండకు చెందిన రుద్రమూ, జ్ఞానకాండకు సంబంధించిన ఉపనిషత్తులూ, సూత్రాలూ, పురాణాలూ పరమేశ్వరుని నామమాహాత్మ్యం వర్ణించినవి. ఈశాన శబ్దానికి ఏది అర్థమో అదే పరమేశ్వర స్వరూపం. శివశబ్దానికి దీర్ఘంతీస్తే శివా అని ఔతుంది. అది అంబికా నామం.

*'యా తే రుద్ర శివా తనూ రఘోరఽపాపకాశినీ,*
*తయా నస్తను వా శంతమయ గిరిశం తాభిచాకశీహి'*

- శ్రీరుద్రమ్.

*'తతస్మైతే తనువౌ ఘోరాన్యా శివా న్యా'*

- తై. సంహిత

పరమేశ్వరునికి రెండురూపాలు. పరమ మంగళమైన రూపం వొకటి. కంకాళంతోటి జుంజురు జడలతో ఉన్న రూపం వొకటి. సర్వమంగళానామం అంబికది.

*'యాతే రుద్ర శివ తనూః శివా విశ్వాహ భేషజీ,*
*శివా రుద్రస్య భేషజీ తయా నో మృడ జీవసేః'*

ఆ అంబికయే ప్రాణం. ఈస్వరూపద్వయమే జగత్తుకు తలిదండ్రులు.

*'కో బ్రాహ్మణౖ రుపాస్యః?*
*గాయత్ర్యర్కాగ్ని గోచరః శంభుః'*

అని ఆదిశంకరులు ప్రశ్నోత్తరమాలికలో చెప్పారు. గాయత్రి, సూర్యుడు, అగ్ని - వీనిలో ఉండేవాడు శివుడు. ఈ మూటిలోను పరమేశ్వరుని ఆరాధించవలెను.

*'సౌరమండల మధ్యస్థం సాంబం సంసారభేషజం*
*నీలగ్రీవం విరూపాక్షం నమామి శివ మవ్యయమ్|'*

అని మరొక శ్లోకం.

'యోరుద్రోగ్నౌ' అని శ్రీరుద్రం పరమేశ్వరుని అగ్ని స్వరూపాన్ని వర్ణించింది.

*'శాస్త్రం శారీర మీమాంసా దేవః శ్రీ చంద్రశేఖరః*
*గురుః శ్రీ శంకరాచార్యః నంతు మే జన్మజన్మని||'*

నేను ఎన్ని జన్మలెత్తినా నాకు చంద్రమౌళీశ్వరుడే స్వామి. శంకరాచార్యులే గురువు. ఏజన్మ యెత్తినా అన్ని అవస్థలలోను శివనామస్మరణ చేస్తే మనకు పరమశాంతి దొరుకుతుంది.
*🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Tuesday, March 5, 2019

అర్ధ నారీశ్వరత్త్వం సృష్టికీ, పరమేష్టికీ, మాతాపితృ సంబంధానికి చిహ్నంగా ఉన్నది. ఈ సంబంధమేకాక మరికొన్ని సంబంధాలు ఉన్నాయి. శ్రీ దక్షిణమూర్తిస్తోత్రంలో శ్రీభగవత్పాదులు అన్నారు-

*విశ్వం పశ్యతి కార్యకారణతమా స్వస్వామి సంబంధతః*
*శిష్యాచార్యతయా తధైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః,*
*స్వప్నే జాగ్రతి వాయఏష పురషో మాయా పరిభ్రామితః*
*తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే||*

జీవుడు మెలకువలోనూ కలలోనూ ఈ విశ్వంలో కొన్నింటిని కార్యాలుగానూ కొన్నింటిని కారణాలుగానూ కొందరను దొరలగానూ, కొందరను బంటులనుగానూ, కొందరను గురువులనుగానూ, కొందరును శిష్యులనుగానూ, కొందరను కొడుకులనుగానూ, మరికొందరను తండ్రులనుగానూ చూస్తూ మాయచే బ్రమసి నానాజ్ఞానాలతో నిండియున్నాడు. నిజానికి ఈ జీవుడు దేవుడే, పరమాత్మే; ఇవి అన్నీ అసత్యాలే అని దీని భావం.
*🙏🙏🙏🙏🙏🙏🙏🙏
R🌸🌸🌸🌸🍁🍁🌸🌸🌸🌸 🌷* కురవి వీరభద్రుడు🌷
🍁🍁🍁🍁🌸🌸🍁🍁🍁🍁
నల్లని రూపం, కోర మీసాలు, పదునైన చూపులు! కుడివైపున ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో పుష్పం, ఒక చేతిలో గద, ఒక చేతిలో దండం. ఎడమవైపున ఒక చేతిలో డమరుకం, ఒక చేతిలో సర్పం, ఒక చేతిలో విల్లు, ఒక చేతిలో బాణం, ఒక చేతిలో ముద్దరం. మొత్తంగా ఐదు జతల చేతులు! స్వామి పాదాలకింద వినయంగా నంది వాహనం. ఎడమవైపున భక్తులకు అభయమిస్తూ భద్రకాళిక. వీరభద్రుడి రౌద్ర రూపం భూతప్రేత పిశాచాలకు వణుకుపుట్టిస్తుందని భక్తుల విశ్వాసం. కాబట్టే దుష్టశక్తుల పీడ తొలగించుకోడానికి ఎక్కడెక్కడి జనమో ఇక్కడి దేవుడిని శరణువేడతారు.

వరంగల్‌ జిల్లాలోని కురవిలో భద్రకాళీ సమేతుడై కొలువుదీరాడు వీరభద్రుడు! కురవి అంటే ఎరుపు... ఆ రంగు వీరభద్రుడి రుధిర నేత్ర జ్వాలకు ప్రతీక కావచ్చు. ఇక్కడే పరమశివుడూ పూజలందుకుంటున్నాడు. ప్రధాన ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించగానే...అనుజ్ఞ గణపతి దర్శనమిస్తాడు. గణపయ్య ఆనతి తీసుకున్నాకే వీరభద్రుడికి పూజలు చేయడం ఆనవాయితీ. అనుమతి ఇచ్చేవాడు కాబట్టే, ‘అనుజ్ఞ’ గణపతి అన్న పేరొచ్చింది. ఆలయ ఉత్తర భాగంలో రామలింగేశ్వరస్వామి, దక్షిణంలో చంద్రమౌళీశ్వరుడూ ఉన్నారు. ఇంకా ఇక్కడ నవగ్రహాల్నీ సప్తమాతృకల్నీ ప్రతిష్ఠించారు. ఆలయానికి అనుబంధంగా ఆంజనేయుడి గుడి ఉంది. నాగేంద్రుడి విగ్రహమూ కొలువుదీరింది.

* పురాణాల్లో...

తండ్రి కాదని అన్నా, వద్దని చెప్పినా వినకుండా...దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి పరమేశ్వరుడిని పరిణయమాడింది. ఆతర్వాత కొంతకాలానికి, దక్షుడు మహాయజ్ఞాన్ని తలపెట్టాడు. ముల్లోకాలకూ పిలుపులు వెళ్లాయి. ఒక్క... కైలాసానికి తప్ప. అయినా, పుట్టింటి మీద మమకారంతో సతీదేవీ ప్రయాణమైంది. భార్యను చిన్నబుచ్చడం ఇష్టం లేక, పరమేశ్వరుడూ సరేనన్నాడు.

బిడ్డ వచ్చిన సంతోషం దక్షుడిలో మచ్చుకైనా కనిపించలేదు. సరికదా, అజ్ఞానంతో అహంకారంతో ఆ ఆలూమగల్ని చిన్నచూపు చూశాడు. ఈశ్వరుడిని నానా మాటలూ అన్నాడు. ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి అగ్నికి ఆహుతైంది. పరమేశ్వరుడు...ఆ ఘోరాన్ని చూడలేకపోయాడు. మహోగ్రరూపం దాల్చాడు. ప్రళయ తాండవం చేశాడు. దుష్టశిక్షణ కోసం తన జటాజూటంలోంచి వీరభద్రుడిని సృష్టించాడు. ఆ వీరుడు ‘హరహర మహాదేవ’ అంటూ వెళ్లి దక్షుడి తల తెగనరికాడు. అంతలోనే, ‘పరమేశ్వరా, శాంతించు! యజ్ఞాన్ని మధ్యలోనే ఆపేయడం క్షేమం కాదు’ అని దేవతలంతా వేడుకున్నారు.

శివుడు శాంతించాడు. దక్షుడి మొండేనికి మేక తలను తగిలించి...కార్యాన్ని పరిసమాప్తి చేయించాడు. శివుడైతే శాంతించాడు కానీ, వీరభద్రుడి క్రోధాగ్ని చల్లారలేదు. దీంతో మహాశక్తి... తనలోని పదహారు కళలలో ఒక కళని భద్రకాళిగా పంపింది. ఆమె సమక్షంలో వీరభద్రుడు చల్లబడ్డాడు. ముక్కోటి దేవతల సమక్షంలో భద్రకాళీ వీరభద్రుల వివాహం ఘనంగా జరిగింది.

* ఎన్నో నమ్మకాలు...

వీరభద్రుడి ఆలయంలోని ధ్వజస్తంభం మహిమాన్వితం. పూర్వం, సరిగ్గా దీని కింద ఓ శక్తియంత్రం ఉండేదట. స్తంభాన్ని ఆలింగనం చేసుకోగానే... ఎంతటివారైనా, అప్రయత్నంగా సత్యాన్నే పలికేవారట. నిజం నిప్పులాంటిది. ఆ తీక్షణతను సామాన్యులు భరించలేరు. ఫలితంగా, ప్రజల మధ్య అపనమ్మకాలు పెరిగాయి, ఘర్షణలు చెలరేగాయి. దీంతో... శక్తియంత్రాన్ని ధ్వజస్తంభానికి కాస్త పక్కగా జరిపినట్టు స్థానికులు చెబుతారు.

సంతానభాగ్యాన్ని కోరుకునేవారు, తడిబట్టలతో పాణసరం పెట్టే (పొర్లుదండాలు వేసే) సంప్రదాయమూ ఉందిక్కడ. శివరాత్రికి ఈ క్షేత్రం కైలాసగిరిని తలపిస్తుంది. అంగరంగవైభవంగా భద్రకాళి-వీరభద్రుల కల్యాణం జరుపుతారు. పదహారు రోజుల పాటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఘనంగా రథోత్సవం జరుగుతుంది. ప్రభ బండ్లని ప్రదర్శిస్తారు.

* పోతన భాగవతంలో వీరభద్రుడి వర్ణన

అభ్రంలిహాదభ్ర విభ్ర మాభ్రభ్రమ;
కృన్నీలదీర్ఘ శరీర మమరఁ
బ్రజ్వలజ్జ్వలన దీప్తజ్వాలికా జాల;
జాజ్వల్యమాన కేశములు మెఱయఁ
జండ దిగ్వేదండ శుండాభ దోర్దండ;
సాహస్ర ధృత హేతిసంఘ మొప్ప
వీక్షణత్రయ లోకవీక్షణ ద్యుతి లోక;
వీక్షణతతి దుర్నిరీక్ష్యముగను
గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ
ఘన కపాలాస్థి వనమాలికలును దనర
నఖిలలోక భయంకరుఁ డగుచు వీర
భద్రుఁ డుదయించె మాఱట రుద్రుఁ డగుచు.
(పోతన భాగవతంలో వీరభద్రుడి వర్ణన)

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁