🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
*లింగ తత్వము*
*లింగం అంటే ఏమిటి?*
*లీనం గమయతీతి లింగం!!*
*దేనియందు సమస్తమూ లయమునొంది మరల పుట్టుచున్నదో అదే లింగమ్. ఈ చరాచరాత్మక విశ్వమే లింగము /లింగస్వరూపం.*
*లీయతే యత్ర భూతాని నిర్గచ్ఛంతి యథా పుణా ! తేనా లింగం పరం వ్యోమ నిష్కలా పరమ శివా!!*
*ఉత్పత్తి-స్థితి-లయ కారణ భూతమైనట్టి లింగమే పరబ్రహ్మమ్. ఆ పరమశివుడే లింగ స్వరూపము అని సూతసంహిత వచనము.*
*లీనం ప్రపంచ రూపహీ సర్వమేతత్ చరాచరమ్!*
*సర్వదా గమయతే భూయత్సమా లింగ ముదీరథిమ్!!*
*సర్వమూ లింగమందు లీనమై - లింగమునుండే మరల మరల ఉత్పత్తి యగుచుండును.*
*సర్వస్య చరాచరాత్మికస్య ప్రాపంచస్య యల్లింగమ్ ప్రాభవ లీన స్థానమ్!*
*లీయతేస్మిన్ అంతకాలే జగత్సర్వం సృష్టికాలే బహిర్ గచ్ఛతి లింగమ్!!*
*చరాచరాత్మక ప్రపంచపు ఉత్పత్తి - లయములకు లింగమే స్థానభూతము (God Particle).*
*లీయతే గమయతే యత్రా యేన సర్వం చరాచరమ్! తదేత్ తల్లింగ మిత్యుక్తమ్ లింగ తవ విశ్వరాధీవా!!*
*ఈ ప్రపంచమంతయూ లింగమునందే జనించి - తిరిగి లింగము నందే లయమగు చున్నది. అదియే లింగ తత్వము.*
*ఆకాశలింగ మితాహు పృథ్వి తస్యాధి పీఠికా!ఆలయం సర్వ భూతానాం లయనాం లింగ ముచ్ఛతే!!*
*ఆకాశమే లింగ రూపము - పృథ్వియే పీఠం. సర్వభూతములు ఇందులోనే జనించి - ఇందులోనే మరణించు చున్నవి. కావున లింగమే జగత్తు అని శివపురాణ వచనము.*
*లింగ గర్భే జగత్సర్వమ్, త్ర్యైలోక్యమ్ఛా చరాచరమ్! లింగ బాహ్యాత్ పరం నాస్తి, తస్మాల్లింగం ప్రపూజ్యతే!!*
*లింగము లోపలనే ఈ జగత్తులోని సర్వమూ కలదు - త్రిలోకాలూ అందులోనే కలవు. లింగము బయట మరేదియునూ లేదు - కావున అట్టి లింగమును పూజించవలెను.*
*లయం గచ్ఛతి యత్త్వైవ జగధేతత్ చరాచరమ్! పునః పునః సముత్పతిమ్ తల్లింగ బ్రహ్మా శాశ్వతమ్!!*
*తస్మాల్లింగం మితిఖ్యాతమ్ సత్ ఆనంద చిదాత్మకమ్!బృహత్తత్త్వ బ్రహ్మాణత్వకాహా బ్రహ్మ శబ్ధాభి ధేయకమ్!!*
*ఏ పరబ్రహ్మము నందు ఈ చరాచరాత్మక ప్రప్రంచము లయించి తిరిగి జన్మించునో అదే లింగ స్వరూపమైన బ్రహ్మము. సచ్చిదానందాత్మకమై, మహత్తరమైన ఆ మహాలింగము జగత్ సృష్టి కారకమైనందున బ్రహము (బ్రహ్మ పదార్థము - God Particle) అనబడును.*
*లింగం ఎలా ఉంటుంది?*
నిజానికి లింగం ఇలా ఉంటుంది అని చెప్పబడ లేదు. లింగం అనేది బ్రహ్మ పదార్ధం (God Particle). కాగా మానవుని మనస్సు దానిపైన లగ్నం అగుటకు ఏర్పరచుకున్న రూపమే మనకు ప్రస్తుతం అగుపించే లింగరూపం. లింగం పరమశివుని ప్రతి రూపమని అందరూ భావించినా కొందఱు పరమాత్మ గానూ పరబ్రహ్మగానూ ఓంకారము గానూ భావిస్తారు.
శైవ సిద్ధాంతంలో
ఇష్ట లింగాన్ని పరమేశ్వరునిలో మనసు లగ్నమై లీనమయేవరకు ఆ పరమేశ్వరునే ఆ లింగముగా భావించి ప్రాణం పోయే వరకూ పూజించాలని చెప్పబడింది. సిద్దులైన శైవ యోగులు ఎన్నో రూపాల లింగారాధన చేశారు - శైవ సిద్ధాంతాలలోనూ ఎన్నో కనిపించని లింగాల ఆరాధన చెప్పబడుతుంది (ఆత్మలింగం, ప్రాణలింగం,
ప్రసాద లింగం,
తృప్తి లింగం, స్వయం లింగం, చరలింగం,
పర లింగం, పిండజలింగం, అండజ లింగం, బింద్వాకాశ లింగం, ఆచారాది షడ్విద లింగాలు పెక్కు కలవు). శృతిస్మృతి పురాణాదులు చెప్పిన పూర్తి బ్రహ్మ పదార్థాన్ని లింగముగా ఆరాధించే ఉత్కృష్ట సిద్దాంతముతో కూడియున్న మతమే శైవ మతము.
లింగము గూర్చి శ్రుతులు ఏమి చెబుతున్నాయంటే:
*యతో వాతో నిర్వార్థంతే అప్రప్యా మనసా సహః!*
*మహాలింగాన్ని మనోవాక్కాయలు కూడా కనుగోనలేవు.*
*అణోర్నీయాన్ మహతో మహీయాన్!*
*పరమాణువు కన్ననూ అతి సూక్ష్మమైనదీ - గోప్పదానికన్ననూ అతి గొప్పది.*
*సూక్ష్మాత్ సూక్ష్మతరం!*
సూక్ష్మము కంటెనూ సూక్ష్మమైనదీ..
*అధ్యత్తిష్టాః దశాంగులం*
-ఈ సృష్టి కంటెనూ పది రెట్లు పెద్దనైనది.
*చకితామాభిదత్తే సృష్టిరపి*
శ్రుతులు కూడా తెలియనట్టిది.
*సర్వం ఖల్విదం బ్రహ్మా!*
*సర్వమూ బ్రహ్మమే (బ్రహ్మ పదార్థమే-God Particle) - ఆ బ్రహ్మమే లింగము. మొదటి నుండీ లింగమూ బ్రహ్మమూ ఒక్కటే - అని శ్రుతులు చెప్పుచున్నవి.*
*తల్లింగం పరమం బ్రహ్మా సచ్చిదానంద లక్షణం!*
*లింగము పరబ్రహ్మము అని, అది సచ్చిదానంద స్వరూపమని - ధ్యానించుటకు నిజరూపమని సిద్దంతాగామము చెప్పు చున్నది.*
*మహాలింగమిదం దేవి మనోతీత మగోచరం నిర్ణామ నిర్గుణ నిత్యం నిరామయ నిరంజనం నిర్మలం నిష్కలం జ్ఞేయ నిర్భేద్యం నిరుపాదికం అధ్వైత ఆనందమక్షీణ మాసాదృశ్యామిదం అలక్ష్యామధ్వయం శూన్య మూర్తము పాదమవ్యయం అకులానామయం శుధ్ధమనాధ్యం శివముచ్యతే ఊర్ధ్వ శూన్యా మధ్యా శూన్యం స్వరూపకం ఆది మధ్యాంచ శూన్యాంచ నిష్కళం దేహా విరాజిం!!*
*ఓ దేవీ మనస్సునకు కూడా కనిపించ నట్టిదీ, పేరు లేనట్టిదీ, గుణము లేనట్టిదీ, నిరామయమైన, నిరంజనమైన, నిర్మలమూ, స్వరూపము లేనిదీ, అనుపమాన మైనదీ, భేదించుటకు వీలు కానిదీ, ఆదీ అంతము లేక నిత్యమూ సత్యమై ప్రకాశించు నట్టిది మహాలింగమని పార్వతీ దేవికి పరమశివుడు చెప్పెను.*
*అరూపం నిష్కళం బ్రహ్మా , భావాతీతం నిరంజనం! శభ్ధాది విషయాతీతం మూల లింగమ్ల్యోచ్యతే!!*
*రూపము లేనట్టిదీ - నిష్కలమైనదీ భావాతీతమైనదీ, నిరంజనమైనదీ, శబ్దాది విషయములకతీతమైనదీ బ్రహ్మము - అదే మూలమైన లింగము (మూలమైన బ్రహ్మ పదార్థము- God Particle).*
*లింగం సాకార రూపం ఎవరు?*
*బ్రహ్మ ప్రజానానామ్ కూటం పవిత్రం అమృతం స్వాహా ప్రస్థారోజనీమా ప్రాణో దేవో లింగం తధైవచ ప్రయాయ వాచక యతే లింగస్య పరమాత్మనాః!!*
*బ్రహ్మము, ప్రజననము, కూటము, పవిత్రము, అమృతము, ప్రస్తరము, జన్మము, ప్రాణము, దేవత, లింగము అనునవి పరమాత్మ అనబడు లింగము యొక్క పర్యాయ వాచకములు.*
*అథాః సచ్చిధానంద లక్షణః పరమేశ్వరః ! స్వయమేవా సాధలింగమ్ నా లింగం తస్య విధాయతే!!*
*సచ్చిదానంద రూపుడైన పరమేశ్వరుడే సదా లింగ రూపమున ఉండును. కాక మరే లింగమేదియునూ లేదు.*
*అథః శివాస్సర్వ జగత్ విభవాఖ్య స్వయం ప్రకాశః స్వయమేవ కేవలః! మయదితో లింగమితి ద్విజర్షభాస్తా దేవపూజ్యం శృతి మస్థకథతమ్!!*
*స్వయంప్రకాశుడైన శివుడే లింగరూపమున పూజనీయుడనియూ - శ్రుతులు చెప్పిన ఉత్తమ సిద్దాంతము ఇదియే అని సూత సంహిత వచనము.*
*శివ రూపః ప్రాణలింగం!*
*ప్రాణ లింగము శివరూపము అని రుద్రోపనిషత్ వచనం.*
*బ్రహ్మేతి లింగమాఖ్యాతం బ్రహ్మాణాపతిరీశ్వరః!*
*పవిత్రం తధ్విఖ్యాతం తత్ ప్రకారాత్ తనుః శుచిః!!*
*లింగమునకు బ్రహ్మము అనే పేరు కలదు - అట్టి లింగరూపమైన బ్రహ్మము శివుడు. పవిత్రమై ప్రసిద్దమైన ఈ లింగాన్ని ఎవరు కలిగి యుంటున్నారో వారు శుద్దులగు చున్నారు.*
*లింగం యొక్క రూపాలు...*
🔱🚩🔱🚩🔱🚩
*శివలింగ స్వరూపంతే వక్ష్యామి శృణు పార్వతి ఇష్టలింగమ్ భావలింగమ్ ప్రాణలింగమితి త్రిధా!!*
శివలింగము మూడు రూపాలుగా ఉంటుంది.
1) ఇష్టలింగం
2) భావలింగం
3) ప్రాణలింగం
అని శివుడు పార్వతికి చెప్పెను.
*లింగారాధన - ప్రాచీనత్వము*
పరమేశ్వరునిచే ఈ సృష్టి నిర్మించబడినది. ఆ శివుని ఆరాధించిన వారాలనే శైవులు అన్నారు. వారు అవలంబించిన మతమే శైవమ్ అని పిలువబడింది. శైవ మతము అతి ప్రాచీనమైనది. ప్రపంచ చరిత్ర పరిశోధకుల అభిప్రాయం ప్రకారం లింగ రూప శివార్చన ప్రపంచంలో అతి ప్రాచీనమైనది. భారత దేశంలోనే కాక ప్రపంచంలోని పలు నదీ తీర ప్రాంతాల్లో లింగారాధన ఉండినదని నేటికీ బయల్పడుతున్న అవశేషాల ద్వారా దృవీకరించారు. గ్రీకుల ఆరాధనలోనూ లింగ రూపం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈజిప్టులు ఇప్సి అనే పేరున నైలూ నది తీరాన పూజించారు. అమెరికనుల మాయన్ నాగరికతలోని ఉపాస్యదైవమ్ లింగరూపి ఈశ్వరుడే. మక్కాలో మక్కేశ్వర లింగాన్ని ప్రాచీన కాలంలో ఖర్జూరపుటాకులతో పూజించేవారానీ చరిత్ర చెబుతోంది. హరప్పా, లోధాల్, మొహంజదారో త్రవ్వకాలలో లభించిన ఆధారాలూ లింగ పూజ ప్రాచీనత్వాన్ని చాటుతున్నాయి. క్రిష్టియన్లకు మూల స్థానమైన ప్రసిద్ద వాటికన్ సిటీ లోని అతి పెద్దదైన సెయింట్ పీటర్ స్క్వేర్ ప్లాజా సామ్ పీయిట్రో అయితే నల్లగా శివలింగం పానవట్టాన్ని పోలి ఉంటుంది.
ఇటీవలి కాలంలో అక్కడి వాటికన్ సిటీ లో బయల్పడిన పురాతన కాలపు శివలింగం ఆనాడు ప్రపంచ మంతటా వ్యాపించిన లింగారాధనకు ఒక నిదర్శనం.
అతి ప్రాచీనమైన ఈ లింగారాధన గురించి ఎన్నో ప్రాచీన గ్రంధాలలో కనబడుతుంది. నేటికీ ప్రతి హిందువూ ప్రతి ఏటా జరుపుకొనే ప్రధాన పండుగ మహాశివరాత్రి - సృష్టి మొదలైనపుడు బ్రహ్మ, విష్ణువులు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించు సమయాన వారిద్దరి మద్యన శివుడు లింగాకార అగ్నిగా వెలువడి, అబద్ద వచనాలు పల్కిన బ్రహ్మ ఒక తలను ఖండించుట వారికి జ్ఞానోదయం కలిగించుట అందరికీ తెలిసిన విశయమే. ప్రాచీన పురానేతిహాసల్లో కూడా వీరు వారు అని తేడాలేకుండా సర్వులూ లింగ పూజ చేసినట్టు పెక్కు గ్రంధాలలో తెలియగలము.
మహావిష్ణువు కూడా సహస్ర కమలాలతో లింగార్చన చేసి ఒక కమలం తక్కువై తన కంటినే కమలంగా అర్పించి కమలనాధుడై విష్ణు చక్రాన్ని పొందటం జరిగిందని తెలియనగును.
హరిశ్చంద్రాది మహారాజులు మార్కండేయాది మునులు శివలింగార్చన చేసినట్లు కలదు.
త్రేతాయుగంలో కూడా రాముడూ, రావనాసురుడూ లింగార్చన చేయటాన్ని బట్టి ఆ కాలంలోనూ లింగారాధన అంతటా జరుప బడిందని తెలియబడుతుంది.
ద్వాపరంలో శ్రీకృష్ణుడు ఎంతో కాలం రుద్రంతో లింగారాధన చేసి శివుని వరంతో సాంబుడనే కొడుకుని పొందాడని, పాండవులూ విశేషంగా దేశమెల్లెడలా స్థాపించిన పెక్కు లింగాలను బట్టి ఆ కాలంలోనూ లింగారాధన ప్రముఖంగా ఉందని తెలియబడుతుంది.
తరువాతి కాలంలోనూ ఆది శంకరులు లింగారాధన చేయటమే కాకుండా పలు ప్రదేశాల్లో లింగాలను ప్రతిష్టించడం నాటి ప్రాచీన లింగారాదనను తెలుపుతుంది.
ఇక సోమనాథ, శ్రీశైల, శ్రీకాళహస్తి, కొలనుపాక, కాశీ లాంటి పెక్కు లింగ క్షేత్రాలు ప్రాచీన కాలం నాటి శాసనాలతో తమ ప్రాముఖ్యతను చాటుతున్నాయి.
చరిత్రనంతా పరిశీలిస్తే నాటి నుండీ నేటి వరకూ లింగారాధన అను నిత్యమూ ఆచరించబడినదని ఆ లింగాన్నారాధించే పద్దతుల ఆచారాన్ని బట్టి కాల పరంపరలో పలు మతాలూ - సిద్దాంతాలూ పుట్టుకొచ్చాయని చెప్పవచ్చు.
శివుడిని-లింగాన్ని ఆరాధించిన శైవులు ఆచార సంప్రదాయాల పరంగా పలు రకాలుగా వెలిశారు.
నేటి కాలంలో శివాలయం లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదేమో. నవీన సిద్దాంతాలతో వచ్చిన పెక్కు మతాలూ కూడా హిందూ మతపు అతి ప్రాచీనమైన లింగారాధనకు ప్రాముఖ్యత నిచ్చాయి.
ప్రాచీన కాలంలో మునులూ,మహర్షులూ, యోగులూ, సిద్దులూ, రేణుక, ఆది శంకరాదులు సాకారమైన శివుని సంక్షిప్త రూపమే శివలింగముగా భావించి కొలిచి ముక్తి నొందారు అని తెలియాలి.
అలాకాక మనసులో మాలిన్యాన్ని నింపుక ఆరాధించిన మోక్షము లభించుట దుర్లభమూ - పాపయుక్తమూనూ.
ఎలాంటి భావన మదిలో మెదలక, కేవల లింగమున లీనమవ్వాలనే.
*లింగం అంటే ఒక సంకేతం (గుర్తు) లింగా కారాన్ని పూజించడమంటే నిర్గుణ బ్రహ్మను ఆరాధించడ మవుతుంది. అంటే నిర్వికార నిర్గుణ పరబ్రహ్మమును ఆరాధించుటే యని పురాణ సారం.*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
*పంచాక్షరీ సాధన*
——————————
*శైవ మతానికి అత్యంత ప్రధాన సూత్రము శివ పంచాక్షరీ కానీ ఎవరికి తెలియని విషయము ఏమంటే శ్రీవిద్య ఉపాసకులకు సైతం పంచాక్షరీ అత్యంత ముఖ్యమైన సూత్రం.*
*పంచాక్షరీ సాధనలో పురుషుడు, ప్రకృతి సాధనాలు రెండుకలిసివుంటాయి అందుకే అటు శైవానికి ఇటు శ్రీవిద్య ఉపాసనకు తిరుగులేని సూత్రముగా పరిగణిస్తారు.*
*మరి రెండు సిదాంతాలకు ముఖ్యమయిన పంచాక్షరీ ప్రకృతికి అతీతముగా తీసుకు వెళ్లి అమరత్వమును కలగజేయుటలో అత్యంత సులభ సాధనము పంచాక్షరీ.*
*పురుషుడు*
———————-
*ఓం : పరతత్వము*
——————————
*ప్రకృతి*
——————————
*న : పృథ్వి తత్వము*
*మ : జల తత్వము*
*శి : అగ్ని తత్వము*
*వా : వాయు తత్వము*
*య : ఆకాశ తత్వము*
పంచాక్షరీ సాధన విధానము
———————————
*ఓం: సహస్రారము పై మనసు నిలిపి అనగా కేవలము మానసికముగా సహస్రరమును చూస్తూ ‘ఓం’ ఉచ్చరించవలెను.*
*న : ముక్కు కొన భాగము పై మనసునిలిపి అనగా మానసికంగా చూస్తూ ‘న’ అక్షరం ఉచ్చరించవలెను.*
*మ: క్రింది పెదవి మధ్యభాగమును మానసికముగా చూస్తూ ‘మ’ అక్షరమును ఉచ్చరించవలెను.*
*శి : భ్రూమధ్యమును మానసికంగా చూస్తూ ‘శి’ అక్షరమును ఉచ్చరించవలెను.*
*వా: గొంతు భాగమును మానసికముగా చూస్తూ ‘వా’ అక్షరమును ఉచ్చరించవలెను.*
*య : ఎడమ లేదా కుడి లేదా రెండు చెవి రంధ్రమును మానసికముగా చూస్తూ ‘య’ అక్షరమును ఉచ్చరించవలెను.*
పై విధముగా సాధన చేయవలెను ఇదియే పంచాక్షరి సాధన…
ఫలితాలు: సాధన మొదలుపెట్టిన వెంటనే శరీరములో ప్రకంపనలు కలుగాచేస్తుంది.
ఆలోచనలను, దుష్టసంస్కారాలను దూరముచేస్తుంది.
వత్తిడి దూరము చేసి లోతైన గాఢమైన విశ్రాంతి కలుగచేస్తుంది.
చెక్కుచెదరని శారీరక మానసిక ఆరోగ్యము సాధకుని వశమవుతుంది.
*ఈ పంచాక్షరీ సాధనలో సహస్రారము చక్రం తెరువబడుతుంది, ప్రకృతిలోని విశ్వశక్తి విస్తారముగా సాధకుని లోనికి ప్రసరిస్తుంది.*
*అద్భుతమైన గృహణశక్తి కలగజేయటమే కాకుండా ఎటువంటి విద్యనైనా సులభముగా గ్రహిస్తుంది.*
*శివ = శ + ఇ + వ. 'శ'కారం సుఖాలను, పరమానందమును, 'ఇ'కారం పరమ పురుషత్వాన్ని, 'వ'కారం అమృతశక్తిని ప్రసాదిస్తాయి.*
*పరమశివుని రూపంలో పరమార్ధం :- మెడలో సర్పం, శిరస్సుపై గంగ - కుండలిని జాగృతిని సూచిస్తున్నాయి.*
*శివనామంలోని మూడుగీతలు - జాగృతి, స్వప్న, సుషుప్తి స్థితులను తెలుపుతున్నాయి. మద్యబింధువు తురీయావస్థకు ప్రతీక.*
*అలానే శివుని మూడో నేత్రం ఆజ్ఞాచక్ర స్థానంలో ఉండే ప్రజ్ఞాచక్షువు. అర్ధనారీశ్వర తత్వంలో శివపార్వతులు ఇడా పింగళ నాడులకు సంకేతాలు.*
*పాక్షికంగా మూయబడిన కళ్ళు ధ్యానస్థితిలో అంతర్ముఖస్థితికి దర్పణం. శివుడు ఆదిగురువు. యోగ గురువు. శివుని వృత్తి భిక్షాటన, ఆసనం పులి చర్మం, ధరించేది గజచర్మం, నివసించేది స్మశానం (వైరాగ్యానికి సూచన) ఆయన దగ్ధం చేసింది మదాకారం.... ఇవన్నీ జన్మ బంధ విమోచనలకు మార్గంలకు సూచనలు.*
*లింగాభిషేకములో పరమార్ధం :- పానిపట్టుపై శివలింగం అంటే మానవుని హృదయపద్మంపై ఆత్మలింగము. పంచామృతాభిషేకం - భక్తీ, మంత్రజపం, నామస్మరణం, ధ్యానం, కీర్తనంలతో దైవాభిషేకం చేయాలి. జలధారాపాత్ర అనన్య అచంచల నిరంతర సాధనాభక్తికి చిహ్నం, లింగం జీవాత్మకు సంకేతం. జీవాత్మ పరమాత్మలను అనుసంధానం కావించే సాధనమే అభిషేకం.*
*శివలింగం :- నిర్గుణ పరతత్వ స్వరూపం. భగవంతుడు సర్వవ్యాపకుడు. సర్వాంతర్యామి. భక్తులు ఏ రూపంతో పూజించినా, ఏ విధంగా అర్చించినా, ఏ రీతిలో అలంకరించినా అంతర్గతమైన పరతత్వం ఒకటే. ఈ విధమైన పరతత్వానికి రూపం, ఆకారం, అవయవాలు లేవు. ఈ సత్యవిషయంను తెలియజెప్పే తత్వస్వరూపమే "లింగం".*
*ఓం సత్యం! శివం! సుందరం!*