పెద్దిరెడ్డి కొండారెడ్డి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఎం .ఏ. ఆస్ట్రాలజీ ,M.SC,B.Ed:
రుద్రాక్షధారణా మంత్రాలు..!💐శ్రీ💐
రుద్రాక్ష అనగా మాగ్నోలియోఫైటా కు చెందిన చెట్టు.
దీని శాస్త్రీయ నామం Elaeocarpus Ganitrus. హిందువులు ఈ చెట్టు యొక్క కాయలను పవిత్రంగా భావిస్తారు.
రుద్రాక్షలు ఎలా పుట్టాయో అంటే ఈశ్వరుడు మూడు నేత్రాలను మూసివేసి ధ్యానంలో చాల సంవత్సరాలు ఉన్నారు .
ధ్యానం నుంచి ఈశ్వరుడు కళ్ళు తెరవగానే,
ఆయన నేత్రాలనుండి రాలిన కొన్ని బాష్పాలు
గౌడ,
మధుర,
అయోధ్య,
కాశీ వంటి క్షేత్రాల యందు –
మలయ ; సహ్యాద్రి పర్వతాలయందు పడి – కాలాంతరాన అవే రుద్రాక్షలుగా పరిణమించాయి.
ఈ బిందువులు రుద్రాక్ష వృక్షాలుగా ఆవిర్భవించాయి. మొత్తం 38 రకాల వృక్షాలు స్వామి కంటి బిందువుల నుంచి ఏర్పడ్డాయి.
ఎడమకన్ను నుంచి 12,
కుడి కన్ను నుంచి 16,
మూడోకన్ను అగ్నినేత్రం నుంచి నల్లని రంగులో వున్న
10 రుద్రాక్ష వృక్షాలు ఆవిర్భవించాయి.
జపం చేసుకోవడానికీ – ధారణకు కూడా చిన్న రుద్రాక్షలే అత్యంత ఫలవంతమైనవి.
గురివింద గింజ ప్రమాణంలో ఉండే రుద్రాక్షలే శ్రేష్ఠమైనవి. రేగుపండు – ఉసిరికాయ ప్రమాణాల్లోనూ రుద్రాక్షలు లభిస్తాయి.
రుద్రాక్షలన్నీ ధరించదగ్గవికావు.
కొన్నిటి విషయంలో అశుభదాయకమైనవీ ఉన్నాయి. పగిలినవీ –
పురుగులు ప్రవేశించినవీ –
గుండ్రంగా లేనివీ –
కండలేనివీ పనికిరావు.
వీటితో జపమైనా నిషిద్ధమే!
నునుపుగా, కంటకయుతంగా, గట్టిగా ఉండే రుద్రాక్షలు ఎంపిక చేసుకోవాలి.
మాల ఏర్పడాలంటే సూత్ర ద్వారం ఉండాలి. కనుక,
అదీ సహజంగా ఏర్పడిన రుద్రాక్ష శ్రేష్ఠం!
పదకొండు వందల రుద్రాక్షలను ధరించినచో అతడు సాక్షాత్ శివస్వరూపుడు,
బ్రాహ్మణులు తెల్లనివీ –
క్షత్రియులు ఎర్రనివి,
వైశ్యులు పసుపు రంగువీ,
అన్నీ కలిసిన వర్ణాలు ఇతర వర్ణాలవారూ ధరించవచ్చు! రుద్రాక్షధారణ ఆరోగ్యరీత్యా కూడా ఎంతో మంచిది.
వ్యాధులు – బాధలు ఉండవు.
మానసిక ప్రశాంతత లభిస్తుంది.
శాంతి సౌఖ్యాలు లభిస్తాయి.
మామిడిచెట్టును పోలినట్టుండే వృక్షం రుద్రాక్ష ఫలాలను ఇస్తుంది. శరదృతువులో ఫలిస్తుంది.
ఫలం యొక్క పై పొర దళసరిగా ఉంటుంది.
పండు రూపంలో దీన్ని సేకరించగలిగితే మంచిదే! దానంతట అదే ఎండి, గట్టి పడుతుంది.
పండు పుల్లగా ఉంటుంది.
వాత – కఫ దోషాలను నివారిస్తుంది.
రుద్రాక్షధారణ క్షయరోగ నివారిణి.
నీటిలో రుద్రాక్షను అరగదీసి మశూచి రోగాన్ని నివారించడం ఆయుర్వేదంలో మనకి తెలిసినదే!
అలాగే తేనెలో అరగదీసి మూర్చరోగాన్ని పోగొట్టవచ్చు! వీటికి ఉండే చారలను బట్టి ముఖాలను నిర్ణయిస్తారు.
ఏకముఖి రుద్రాక్ష:💐
దర్శనం మహాపాతక నాశనం ;
అర్చనం లక్ష్మీకటాక్ష కారణం.
ద్విముఖి :💐
గోహత్యాపాతక నివారిణి,
సర్వాభీష్ట కారిణి.
త్రిముఖి :💐
కార్యసిద్ధి ; విధ్యాభివృద్ధి.
చతుర్ముఖి :💐
బ్రహ్మస్వరూపం,
దర్శన – స్పర్శ మాత్రాన స్పర్శ పాపహారిణి, నరహత్యాదోష నివారిణి.
పంచముఖి:💐
కాలాగ్ని రుద్ర స్వరూపం.
మోక్షకారకం.
షణ్ముఖి :💐
కుమారస్వామి స్వరూపం.
సమస్తపాపహారిణి.
సప్తముఖి : 💐
మన్మధరూపిణి. వశీకరనణి.
అష్టముఖి :💐
దారిద్ర్య విధ్వంసిని ; భైరవ స్వరూపం ;
దీర్ఘాయుష్య కారకం.
నవముఖి :💐
నవదుర్గా స్వరూపం.
శివతుల్య వైభవదాయిని.
దశముఖి :💐
విష్ణురూపిణి. సకలాభీష్టప్రదాయిని.
ఏకాదశముఖి :💐
రుద్రరూపిణి. విశేష ఫలదాయిని.
12, 13, 14 ముఖాలు :💐
ఏవైనా ఒక ప్రత్యేకమైన ఇచ్చను హృదయ మందుంచుకొని, ఆరాధన చేయదగ్గవి.
మండలం (40)రోజుల్లో ఫలితాన్నివ్వగలవు.
పద్నాలుగు ముఖాలు గల రుద్రాక్షలు పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది.
ధారణకు మంత్రబీజాలు..💐
ఏకముఖ,
చతుర్ముఖ,
పంచముఖ,
దశముఖ,
త్రయోదశ ముఖాలకు :
“ఓం హ్రీం నమః” అనే మంత్రంతో ధరించాలి.
ద్విముఖ,
చతుర్ముఖి,
చతుర్దశ ముఖాలకు :
“ఓం హ్రీం నమః”
త్రిముఖ రుద్రాక్షకు :
“ఓం క్లీం నమః” అని 108 సార్లు జపించాలి.
6, 9, 11 ముఖాలు గల రుద్రాక్షలకు :
“ఓం హ్రీం నమః”
సప్త,
అష్టముఖి రుద్రాలకు :
“ఓం హుం నమః”
ద్వాదశ ముఖికి :
“ఓం క్రౌం నమః”
మంత్ర హీనంగా రుద్రాక్ష ధారణ ఫలితాన్నివ్వదు.
రుద్రాక్షలు వాటి విశిష్టతల.!💐
1) ఏకముఖి రుద్రాక్ష :💐
ఇది శివుని ప్రతిరూపం.
ఇది ధరించిన వ్యక్తికి ఏ విషయంలోనూ కొరత ఉండదు. వ్యక్తి వికాసం, జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరతాయి.
2) ద్విముఖి :💐
అర్ధనారీస్వర తత్వానికి సంకేతం.
దీనిని ధరించడం వలన కుండలినీ శక్తి పెరుగుతుంది.
3) త్రిముఖి :💐
ఇది అగ్నికి సంకేతం.
ఆరోగ్యానికీ, అభ్యుదయానికీ ఉపకరిస్తుంది.
4) చతుర్ముఖి :💐
బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
పాలలో వేసి త్రాగితే మానసిక రోగాలు నయమవుతాయి. విద్యార్ధులకు బాగా ఉపకరిస్తుంది.
5) పంచముఖి :💐
గుండె జబ్బులున్నవారికి మంచిది.
శతృవులను సులభంగా జయించవచ్చు.
పాము కాటునుంచి రక్షణ కలుగుతుంది.
6) షణ్ముఖి :💐
కార్తికేయునికి ప్రతీక.
రక్తపోటు, హిస్టీరియా పోతాయి.
7) సప్తముఖి :💐
కామధేనువుకి ప్రతీక.
అకాల మరణం సంభవించదు.
8.) అష్టముఖి :💐
విఘ్నేశ్వరునికి ప్రతీక.
కుండలినీ శక్తి పెరుగుతుంది.
9) నవముఖి : 💐
భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది.
దీనిని ఎడమ
చేతికి ధరించాలి.
10) దశముఖి :💐
జనార్ధనుడికి పరీక్ష.
అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు.
11) ఏకాదశముఖి :💐
11 ముఖాలు. రుద్రుని 11 రూపాలకు ప్రతీక.
దుష్ట శక్తులనుంచి కాపాడుతుంది.
12) ద్వాదశముఖి :💐
12 మంది ఆద్యులకు ప్రతీక.
గౌరవం పెరుగుతుంది.
13) త్రయోదశముఖి :💐
కామధేవునికీ, కార్తికేయునికీ ప్రతీక.
పాలలో వేసి, ఆ పాలను త్రాగితే అందం పెరుగుతుంది.
14) చతుర్దశముఖి :💐
14 ముఖాలు. ఉపనిషత్తుల ప్రకారం ఇది పరమశివుని కన్ను.
15) పంచదశముఖి :💐
పశుపతికి ప్రతీక. ఆధ్యాత్మిక సాధనకు ఉపకరిస్తుంది.
16) షోడశముఖి :💐
16 ముఖాలు కలది. ఇది కల్పిమాడుకుకు ప్రతీక.
17) సప్తదశముఖి :💐
విశ్వకర్మకు ప్రతీక. దీని వలన సంపద కలుగుతుంది.
18) అష్టాదశముఖి :💐
18 ముఖాలు. ఇది భూమికి తార్కాణం.
19) ఏకోన్నవింశతిముఖి :💐
19 ముఖాలు. ఇది సాక్షాత్తూ నారాయణుడికి సంకేతం.
20) వింశతిముఖి :💐
20 ముఖాలు. ఇది సృష్టికర్త బ్రహ్మకు సంకేతం.
జన్మ నక్షత్ర రీత్యా ధరించవలసిన రుద్రాక్షలు.!💐
నక్షత్రము ధరించవలసిన రుద్రాక్ష
అశ్వని - నవముఖి
భరణి - షణ్ముఖి
కృత్తిక - ఏకముఖి, ద్వాదశముఖి
రోహిణి - ద్విముఖి
మృగశిర - త్రిముఖి
ఆరుద్ర - అష్టముఖి
పునర్వసు - పంచముఖి
పుష్యమి - సప్తముఖి
ఆశ్లేష - చతుర్ముఖి
మఖ - నవముఖి
పుబ్బ - షణ్ముఖి
ఉత్తర - ఏకముఖి, ద్వాదశముఖి
హస్త - ద్విముఖి
చిత్త - త్రిముఖి
స్వాతి - అష్టముఖి
విశాఖ - పంచముఖి
అనురాధ - సప్తముఖి
జ్యేష్ఠ - చతుర్ముఖి
మూల - నవముఖి
పూర్వాషాఢ - షణ్ముఖి
ఉత్తరాషాఢ - ఏకముఖి లేదా ద్వాదశముఖి
శ్రవణం - ద్విముఖి
ధనిష్ట - త్రిముఖి
శతభిషం - అష్టముఖి
పూర్వాభాద్ర - పంచముఖి
ఉత్తరాభాద్ర - సప్తముఖి
రేవతి - చతుర్ముఖి.
నవరత్నముల కు బదులు రుద్రాక్షలు కూడా ధరించవచ్చు.
1) కెంపు – ఏకముఖి, ద్వాదశముఖి
2) ముత్యం – ద్విముఖి, ఏకాదశ ముఖి
3) పగడం – త్రిముఖి, అష్టాదశ ముఖి
4) పచ్చ – చతుర్ముఖి, త్రయోదశ ముఖి
5) పుష్యరాగం – పంచ ముఖి, చతుర్దశ ముఖి
6) వజ్రం – షణ్ముఖి, పంచ దశ ముఖి
7) నీలం – సప్త ముఖి, షోడశ ముఖి
8.)గోమేధికం – అష్టముఖి, గౌరీ శంకర ముఖి
9) వైఢూర్యం – నవ ముఖి, ఆష్టా దశ ముఖి.
రుద్రాక్షలు ధరించడం వల్ల వచ్చు ఫలితములు
1) ఏకముఖి రుద్రాక్ష –💐
ఈ రుద్రాక్ష చాలా విలువైనది.
ఎటువంటి మంత్ర తంత్ర ప్రయోగాలు అయినా
తిప్పి కొట్టగలదు.
సిరి సంపదలు, శిరో సంబంధ రోగములు నివారణ అగును.
2) ద్విముఖి –💐
ఇది బ్రహ్మ రుద్రాక్ష అని కొందరి అభిప్రాయం.
అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక అని కూడా అనుకోవచ్చు. సంతాన ప్రాప్తి, ఏకాగ్రత, వ్యాపార అభివృద్ధి. కల్గును. మనోవ్యాకులతను దూరం చేస్తుంది
3) త్రిముఖి –💐
ఈ రుద్రాక్ష చాలా అదృష్టదాయకమయినది. ధనధాన్యసమృద్ధి, కామెర్ల వ్యాధి నివారణ మరియు
సర్ప దోష నివారణ అగును.
4) చతుర్ముఖి –💐
పరిశోధకులు, జ్యోతిర్గణిత వేత్తలు ధరించడం వల్ల అదికరాణింపు ఉండును మరియు ఏకాగ్రత పెరుగును.
5) పంచముఖి –💐
బ్రహ్మ స్వరూపమయిన ఈ రుద్రాక్ష వల్ల అకాలమృత్యు నివారణ, గుండెపోటు వంటి హృద్రోగ సంబంధిత వ్యాధులు నివారణ అగును
మరియు మలబద్దకం నివారణ అగును.
6) షణ్ముఖి –💐
ఈ రుద్రాక్ష కుమార స్వామి స్వరూపం,
శక్తి, విజయం, శరీర ధారుఢ్యం, ఆరోగ్యం లభించును.
7) సప్త ముఖి–💐
సభావశ్యత,సంపద, కీర్తి, ఉత్తేజం కల్గును.
8.)అష్ట ముఖి –💐
ఆకస్మిక ధన ప్రాప్తి కల్గును.
9) నవముఖి రుద్రాక్ష –💐
ఈ రుద్రాక్ష భైరవ స్వరూపమయినది.
రాజకీయ పదవులలో ఔన్నత్యం ఆశించువారికి, అపమృత్యు నివారణకు, పరోపకార దక్షులకు ధరించవచ్చు.
10) దశముఖి రుద్రాక్ష –💐
విష్ణు స్వరూపమయినది.
గొంతు సంబంధ రోగాలను, నవగ్రహముల ద్వారా
కలుగు కష్టములు, సమస్యలు నివారణ అగును.
11) ఏకాదశ ముఖి –💐
ఇది శివాత్మకమయిన రుద్రాక్ష.
వైవాహిక జీవితంలో ఆనందమునకు,
గర్భ సంభందరోగాలకు అనుకూలత లభించును.
ఇలా ఏకవింశతి ముఖ రుద్రాక్షలు అన్నియు
అనేక విధముల సత్ఫలితములు కల్గును.
(తప్పని సరిగా నియమ,నిభందనలు పాటించవలయును)
ఓం నమః శివాయ..!!🙏
సర్వే జనా సుఖినోభవంతు..!!💐
💐శ్రీ మాత్రే నమః💐
ఓం శ్రీమాత్రే నమః
గ్రహ యుద్ధం --- ప్రకృతి పర్యావరణం .
నవ గ్రహాలు ఒక్కొక్కసారి ఒక్క భావములో రెండు లేక ఎక్కువగా కలసి ఉంటుంటాయి. ఒకే నక్షత్రం మీద లేదా ఒకే రాశిలో ఉండటం మనం గమనిస్తూ ఉంటాం .ఏవైనా రెండు గ్రహములు కలిసి ఉంటే వాటికి వివిధ నామములతో పిలుస్తూ ఉంటారు. ఈ మధ్య కొంతమంది కొన్ని పేర్లు తెలుసుకొని అన్నిటికీ అదే అన్వయింప చేస్తూ తాము కంగారుపడుతూ, ఎదుటివారిని కంగారు పెడుతూ ఉంటారు. కనుక, ఏ గ్రహాలు కలిస్తే వాటిని ఏమంటారు అనేది పరిచయం చేసుకుందాం.
కొన్ని పుస్తకాలను చదివినప్పుడు లేదా కొంతమంది కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు లేదా మీడియాలో మిత్రులు చెప్తున్నట్లు గ్రహ యుద్ధం అనేది చాలామంది తరచుగా ఉపయోగించే మాట. నిజానికి మనం రోజువారి చూసుకునే జాతకాలలో ఆ మాట లేదా పదప్రయోగం ఉండదు.
గ్రహ యుద్ధం అనేది ప్రశ్న శాస్త్రంలో మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తారు.
రవి చంద్రుడు రాహుకేతువులు ఈ గ్రహ యుద్ధం పరిధిలోకి రారు.
కుజుడు శుక్రుడు శని గురుడు బుధుడు వీరిలో ఎవరైనా ఇద్దరు కొన్ని డిగ్రీల పరిధిలో ఉంటే దానిని గ్రహ యుద్ధం అని అంటారు.( ఒక డిగ్రీ అంటే 3' 20''.).
ముందుగా అవసరమైన పదములు తెలుసుకుందాము.
రవి తో ఏ గ్రహం కలిసిన అస్తంగత్వం అని అంటాము . సాధారణంగా బుధుడు ఎక్కువగా రవి తో సమానంగా సంచరిస్తూ ఉంటాడు దానివలన బుధుని గుణాల కన్నా సూర్యుని ప్రభావం ఎక్కువగా ఫలితం చూపిస్తూ ఉంటుంది .రవి తో బుధుడు కలవడం వలన తన ఉనికిని కోల్పోతాడు.
ఇవ్వవలసినంత ఫలితాన్ని మాత్రం ఇవ్వలేదు. దీనిని అస్తంగత్వం చెందడం అంటారు.
చంద్రుడు అస్తంగత్వం చెందదు. ఎందుకంటే సూర్యకాంతి మీద ఆధారపడి ఉండే గ్రహము చంద్రుడు.
చంద్రునితో ఏదైనా గ్రహం కలిస్తే దానిని సమాగమము అంటాం.
మిగిలిన గ్రహాల లో ఏ రెండు కలిసిన దానిని గ్రహ యుద్ధం అని అంటాము.
ఉదాహరణ గా ఒక విషయం చూద్దాం
మేష లగ్నానికి పదవ స్థానం అయిన మకర రాశిలో 10 డిగ్రీల మీద కుజుడు 11డిగ్రీల మీద ఉన్నారు .వీరు ఇరువురు ఒకరి పట్ల ఒకరు శత్రు భావనతోనే ఉంటారు. కుజుడు ఎక్కువ డిగ్రీల మీద ఉండటం వల్ల శని ప్రభావాన్ని జయించి తన ఫలితాన్ని ఇస్తాడు. ఈ విధంగా లగ్నాధిపతి కర్మ అధిపతి కన్నా పైచేయి సాధించి జాతకునికి ఎక్కువ అనుకూల ఫలితాలు వచ్చేలా చూస్తాడు.
ఇలాగే ఒకవేళ గురు బుధుల కలయిక ఉంటే తెలివితేటలు గల వారు లేదా జ్ఞాని అవుతారా అన్నది ఆయా గ్రహములు ఉన్న డిగ్రీల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ బుధుడు ఎక్కువ డిగ్రీల మీద ఉంటే జ్ఞానం కన్నా అతి తెలివి ఎక్కువ ఉండి మాటల రాయుడు, కోతలరాయుడు అవుతాడు. అదే గురువు ఎక్కువ డిగ్రీల మీద ఉంటే తన జ్ఞానం వలన పదుగురిలో గౌరవం పొందుతాడు. అది గ్రహ కలయిక వల్ల మనం తెలుసుకోగలిగిన విషయం.
బృహత్ సంహిత అనే గ్రంథము
గ్రహ యుద్ధము నాలుగు విధములుగా తెలిపింది. అవి బేధ, ఉల్లేఖ, అంశుమర్దన మరియు అపసవ్య.
భేద: రెండు గ్రహాలు ఒకే దిక్కు వైపు సంచరిస్తున్నప్పుడు ఒకదానినొకటి కలిసినప్పుడు రెండు యుద్ధము చేసుకుంటాయి భూమికి దగ్గరగా ఉన్న గ్రహం ఆ రెండో గ్రహ ప్రభావాన్ని మొత్తానికి కనిపించనీయకుండా కప్పివేయడం ( ఓవర్ లాప్) చేయగలదు . దీనిని చాడనం అని కూడా అంటారు.
ఉల్లేఖ: రెండు గ్రహాల సంచారం చేస్తున్నప్పుడు వాటి దారులు కలుసుకుంటే దానిని ఉల్లేఖన అని అంటారు. అవి ఒకరినొకరు కప్పి ఉంచరు. గ్రహ బింబములు కలిసినట్లు ఉంటాయి గాని మొత్తము గ్రహములు స్పర్శించుకోరు. దీనిని రోదనం అని కూడా అంటారు.
అంశుమర్దన: రెండు గ్రహముల కిరణాలు ఒకదానితో ఒకటి అడ్డగించు ఉంటే దానిని అంశుమర్దనం అంటారు. దీనిని కిరణ సంఘటన లేదా రశ్మిమర్దనం అని కూడా అంటారు.
అపసవ్యం: ఒక గ్రహము తను సంచరించే దారిలో వ్యతిరేక దిశలో వస్తున్న గ్రహమును కలిస్తే దానిని అపసవ్యం అని అంటారు.
మామూలు మానవుల జాతకాలు చూసుకునే కన్నా ముందే ఈ విధమైన జాతక పరిశీలన గ్రహాల యుద్ధాలు మొదలగునవి వేదాలలో ఎప్పుడో రచించారు.
సరైన వానలు కురవనప్పుడూ అనగా కరువులు ఏర్పడిన నాడు, రాజ కుటుంబాలలో అశాంతి ఉన్నప్పుడు ,ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నప్పుడు పైన పేర్కొన్న గ్రహ యుద్ధాలలో ఒకటైన భేద అనే గ్రహయుద్ధం జరుగుతోంది అని పండితులు చెప్తున్నారు.
సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు దేశ రాజకీయాలలో ప్రధానమంత్రి రాష్ట్రపతి ఇతర మంత్రులను మచ్చ అభిప్రాయభేదాలు ఏర్పడినప్పుడు అది ఉల్లేఖా అనే గ్రహ యుద్ధ ఫలితం అని అంటారు.
రోగ భయంతో, పేదరికంతో దేశ ప్రజలు బాధపడితే దానిని
అంశుమర్దనం అనే గ్రహయుద్ధం వల్ల ఏర్పడే ఫలితం అని అంటారు.
పోరాటాలు యుద్ధాలు అది దేశంలో అంతర్గతంగా గాని లేదా ఇతర దేశాలతో గాని ఉంటే అది అపసవ్య గ్రహయుద్ధము అని అంటారు.
నిజానికి 50 పైగా గ్రహ యుద్ధములను గుర్తించినప్పటికీ పైన పేర్కొన్న నాలుగు మాత్రమే సామాన్యంగా చెప్పుకుంటారు.
కొన్ని గ్రహాలు చాలా తొందరగా సంచరిస్తూ ఉంటాయి కొన్ని అతి నెమ్మదిగా సంచరిస్తూ ఉంటాయి చంద్రుడు కేవలం రెండున్నర రోజులలో ఒక రాశి చప్పున నెల లోపే ఒక పరిక్రమ పూర్తి చేస్తాడు. అదే శనికి 30 సంవత్సరాల పైన పడుతుంది కనుక గ్రహ సమయం అనేది ఆ గ్రహ సంచారం యొక్
క వేగం మీద ఆధారపడి ఉంటుంది. ఇది గమనించాల్సిన విషయం. గ్రహ వేగాలు అనుసరించి గ్రహ స్థానములు ఈ విధంగా ఉంటాయి .
చంద్రుడు బుధుడు శుక్రుడు రవి, కుజుడు గురుడు మరియు శని..
ఒక్కొక్కసారి జాతకునికి కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి గ్రహస్థితి అంతా బానే ఉంది ఈ విధంగా ఎందుకు జరిగింది అని ఇటువంటి ప్రశ్నలు వేస్తుంటారు .అలాంటప్పుడు ప్రశ్న శాస్త్రంలో ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. దశ అంతర్దశలలో జాతకుడు అంతా బానే ఉన్నా కంటికి కనిపించని ఈ సూక్ష్మమైన యుద్ధాల వలన వచ్చిన ఇబ్బంది అని వారు చెప్పగలరు.
సాంఘికమైన సామాజికమైన మార్పులను సూచించే గ్రహ యుద్ధం మామూలుగా సాధారణ జాతకునికి అంతగా వర్తింప చేయడం న్యాయం కాదు అని నా అభిప్రాయం. ఇటువంటి మాటల వలన చిన్న చిన్న విషయాలను కూడా తమకు అన్వయింప చేసుకొని సామాన్య ప్రజలు బాధపడిపోతున్నారు. అంత అవసరం ఉండదు .వ్యక్తిగతంగా కొన్ని కొన్ని విషయాలు తీసుకొనరాదు. ఇతరులను ఇటువంటి విషయాలపై సంప్రదించ రాదు.విషయ జ్ఞానం లేకుండా పద ప్రయోగాలు మంచివి కాదు. ప్రకృతి అనగా పంచభూతాలతో నిండిన ఈ విశ్వం, అలాగే పర్యావరణం మన చుట్టూరా ఉండే ప్రపంచ వాతావరణము .సామాన్య మానవుని దృష్టి కన్నా వీటి పరిధి చాలా పెద్దది. వాటి మీద గ్రహాయుద్ధ ప్రభావాలు ఉంటాయి గాని సామాన్య మానవుడు మీద కాదని మరొకసారి మనవి చేసుకుంటున్నాను..
శుభమస్తు
శ్రద్ధగా చదువుతున్నందుకు ధన్యవాదాలు
శుభాకాంక్షలతో
మీ
రాజేశ్వరి తటవర్తి .
పరిహారాలు, నివారణోపాయాలు.
ఈ మధ్య కొన్ని ప్రసిద్ధి చెందిన దేవాలయ దర్శనాలు చేసుకున్నాం. అక్కడ కొంతమంది హోమాలు చేసుకుంటున్నారు. కొంత మంది ఎగతాళి చేస్తున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవు అంటూ , ఇదంతా దేవాలయాల అర్చకులు ధనార్జనకు చేసే కుట్ర అని మాట్లాడారు.
దేవాలయ దర్శనం సరదాగా వెళ్లే విహారయాత్ర లాగ మారిపోయింది. హిందుసమాజం తన వేలితో తన కన్ను పొడుచుకొంట్టున్నది.
వెేదపరిజ్ఞానం సామాన్యులకు అందుబాటులోకి వచ్చి చాలా కాలమ్మయ్యింది. విశ్వాసం లేక దానిపైన దృష్టి పెట్టక అవగాహనా లేమితో కాలక్షేపానికి మాటలు మొదలు పెట్టీ అంతు తేల్చుకోలేక అయోమయంలో జీవనం గడుపుతున్నారు.
సరళమైన భాషలో, నేను అందిరివి చదివి నాకు అర్ధమైన భావాన్ని మీతో పంచుకుం టున్నాను.
కాలపరిజ్ఞానానికి కొలమానం జ్యోతిషం.
మన కర్మ ఫలితాలు కాలపురుషుని చక్రం ద్వారా తెలుసుకొని మనకు అందించేవారు జ్యోతిష్కులు.ఈ చక్రంలో విశ్వ శక్తి తరంగాలు ఇమిడి ఉన్నాయి.మన సుకర్మ, దుష్కర్మల ఫలితాలు దీని ద్వారా తెలుసుకోగలము.
ప్రతి పనికి ఒక ఫలితం అనేది ఉంటుంది అనేది అందరికీ తెలుసు. మంచి పనికి మంచి ఫలితం , అలాగే మనం తెలిసి ,తెలియక చేసే , లేదా చేస్తున్న, లేదా చేసిన దుష్కర్మ ఫలితాలు కూడా అనుభవించాలి.
తెలియక చేసిన దుష్కర్మ నివారణార్ధం పండితులు చెప్పే చిట్కాలు/ ఉపాయాలు ఈ హోమాలు, శాంతులు.
భగవంతునికి భక్తి శ్రద్ధలతో చేసేవే ఈ పరిష్కారాలు. అవి దానం, మంత్రం,యంత్రం, హోమం, జపం, తపం మొదలు ఏ మార్గం ద్వారా ఐన జరపవచ్చు.
మనకి ఆ విద్య తెలిస్తే స్వయంగా చేసుకోవాలి. లేదా వచ్చిన వారిని ఆశ్రయించాలి. ఇది మనః పూర్వకంగా క్షమార్పణ భగవంతుని అడగడం అని అర్థం చేసుకోవాలి.
ప్రతి వ్యక్తికి వారికి సంబంధించిన ,అనుకూలమైన తిథి, వార నక్షత్ర హోరా సమయాల్లో నిర్దేశిత పరిష్కారం చేసుకోవాలి.ఇవన్నీ ఒక నియమం ప్రకారం, కొన్ని నిబంధనలకు లోబడి ఉంటాయి.
ఇది మనలో ఒక శాంతి ప్రక్రియకు దారితీస్తుంది. సద్గుణాలు పెంపొందిస్తుంది.
ఇదంతా బూటకం అనుకునే వారికి ఏమి చెప్పలేము.
కువిమర్శ మంచిది కాదు. కానీ, కాలనిర్ణయ ఫలితాలు వాస్తవాలే కదా.ఆ కాలపురుషుని మహిమ తెలుసుకు మసలాలి.
పంచభూతాలను ప్రసన్నం చేసుకోవాలనుకుంటే
ఓంకార ప్రణవనాదంతో 9 పచ్చని మొక్కలు పాతి నీరు పోసి సంరక్షించే శక్తి ఉన్న చాలు.
అన్నదాన మహిమ అందరికీ తెలిసిందే కదా !
విద్యాదానం గొప్పతనం వివరించాలా! ఆలయ , గో సంరక్షణ, రహదారులు, విశ్రాంతి గృహ నిర్మాణాలు అన్ని మంచివే. కావా ఇవి పరిహారాలు .
మనసుంటే మార్గం ఉంటుంది.
రాజేశ్వరి తటవర్తి ( అచ్యుత్)
23--10--2018
విశాఖపట్నం.
విజయ్:
వెంకటేష్:
దశమహావిధ్యలు-10
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
9.మాతంగి
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
మా మాతంగుడు అంటే శివుడు. శివుడిశక్తియే మాతంగి. గృహస్థ జీవితము సరిగ్గా సాగడానికి, పురుషార్ధ సిద్ధికై మాతంగి ఉపాసన చేయాలి.
పూర్వకాలంలో మాతంగుడు అనే ముని కదంబవనం లో జనులను వశం చేసుకోవడానికి కఠోరమైన తపస్సు చేశాడు. ఆ సమయంలో త్రిపురాదేవీ నేత్రం నుండి వెలువడిన తేజస్సులోంచి ఒక శ్యామల నారీ విగ్రహం వచ్చింది.ఆ విగ్రహం మే రాజమాతంగి. అమ్మవారు దక్షిణ, పశ్చిమానికి చిందిన దేవి. రాజమాతంగి, సుముఖి,కర్ణమతంగి అనే నామాలు కలవు. మతంగి యొక్క భైరవుడు మతంగుడు.బ్రహ్మయామలలోమాతంగముని కూతురు, మతంగి అని చెప్పబడింది.
వాక్శుద్ధి దీనికంటే మారోక తంత్రం లేదనే తెలియబడుతుంది.
అమ్మవారి యొక్క శ్యామవర్ణం, పరావాక్ బిందువే. త్రినేత్రాలు సూర్యుడు సోమ అగ్ని. నాలుగు చేతులు నాలుగు వేదాలు.
పాశం ఆవిద్యను,అంకుశం విద్యను, కర్మ రాశి దండాన్ని సూచిస్తుంది. కాదంబవనం బ్రహ్మాండాన్ని సూచిస్తుంది. యోగ రాజోపనిషత్తులో, బ్రహ్మలోకం కదంభగోళాకారంగా ఉంటుందని చెప్పబడింది. ఆమె సింహాసనం-శివాత్మకం. అదే త్రికోణం.ఆమె సూక్ష్మరూపం మనం కొలిచే యంత్రంలో ఉంటుంది.ఇక పరరూపం, భావన మాత్రమే.
దుర్గా సప్తశతి లోని ఏడో అధ్యాయంలో మాతంగీ ధాన్యం చెప్పబడింది.
రత్నమాయ సింహాసనం పై కూర్చుని చిలకల గానం వింటుంది. అమ్మవారు శరీరవర్ణం శ్యామం. ఒక కాలు కమలం పై పెట్టి ఉంటుంది. తలపై అర్ధచంద్రుడు, కంఠం లో కల్హారపుష్పమాల. వీణ వాయిస్తూ వుంటుంది. అమ్మవారు ఎర్రని వస్త్రాలు ధరించి చేతిలో శంఖమయ పాత్ర ముఖంలో మధుర మందహాసంతో విరాజిల్లుతూ ఉండగా ఇక చిలుకలు హ్రీంకారాన్ని ఉచ్చరిస్తూ ఉంటాయి. కమలం సృష్టికి గుర్తు. శంఖపాత్రం,
బ్రహ్మరంధ్రాన్ని, అందు జాలువారే అమృతాన్ని సూచిస్తుంది. అమ్మావారు ధరించిన ఎర్రని వస్త్రం జ్ఞానానికి లేదా అగ్నికి గుర్తు. అమ్మవారు వ్యాకరణ రూపమైతే, చిలుకలు ఉపాసకులగా సూచిస్తారు.
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
వెంకటేష్:
దశమహా విద్యలు -1
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
ఆది శక్తి సృష్టి రక్షణ కోసం విభిన్న అవతారంలో ఆవిర్భవించింది. వాస్తవానికి దశ మహా విద్యలు అమ్మవారి అవతారాలు.
ఆది శక్తి ముఖ్యంగా మూడు రూపాలు.
🌹పార్వతీ దేవి
🌸 లక్ష్మి
🌼సరస్వతి.
పార్వతీ దేవియే కాళి.
ఈ ముగ్గురు దేవతలు ధరించిన వివిధ అవతారాలే
దశమహావిద్యలు అని పేరు లో ప్రసిద్ధి చెందింది, పూజలందుకున్నాయి.
కాలాంతరం ఉపసకులు దశమహావిద్యల సాధన విధానం రకాలుగా విభజించారు.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
దశమహావిద్యలు
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🌸కాళి
🍂తార
🌹షోడశి(త్రిపురసుందరి)
🌺భువనేశ్వరి
🌸ధూమావతి
🌺చిన్నమస్త
🌼త్రిపురభైరవి
🥀భాగళాముఖి
🍁మతంగి
🌼కమల
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
దశమహావిద్యలను 2 రకాలుగా విభజించారు.
🌹కాళీకులం.
🍁శ్రీ కులం.
దశమహావిద్యలు ఈ రెండు రకాలలో అంతర్గతమై ఉంటాయి.
🌸🌸కాళీకులం🌸🌸
🍁కాళి
🌸తార
🌼భువనేశ్వరి
🌺చిన్నమస్త
మహాకాళీమరికొన్ని అవతారాలు
🌸రక్తకాళి
🌼మహిషమర్ధిని
🌹త్రిపుర
🌺దుర్గ
🌷ప్రత్యంగిర...
🌼🌼శ్రీకులం🌼🌼
🌸 షోడశి(త్రిపురసుందరి)
🌺త్రిపురభైరవి
🌷ధూమావతి
🥀భగళాముఖి
🌹మాతంగి
🍁కమల
మిగితభాగం రేపటి రోజు సెండ్ చేస్తాను.
గుంటి వెంకటేష్
నల్గొండ
9703229189