Sunday, July 16, 2017
Friday, July 14, 2017
13/07/17, 8:54:31 AM: +91 98660 49721: *🔥గురువాక్కు🔥*
*శనైః పంథాః* *శనైఃకంథాః*
*శనైః పర్వత లంఘనం.*
*శనైర్విద్య శనైర్విత్తం*
*వంచైతాని శనైః శనైః.*
నడవటం
మొదలంటూ పెడితే గమ్యాన్ని చేరుతాము.వస్త్రాన్ని కుట్టటం మొదలుపెడితే
దుస్తులు తయారు అవుతుంది.మొదటి అడుగుతోనే పర్వతం ఎక్కటం ప్రారంభమవుతుంది.
నేర్చుకోవడం మొదలు పెడితే జ్ఞానము వస్తుంది.దాచటం అంటూ ప్రారంభిస్తే ధనం
కుడుతుంది
ఇది నిజం.
12/07/17, 11:10:52 PM: ManiTenali: శివాన౦దలాహరి
33.
నాల౦వా సకృదేవ దేవ భవతస్సేవ నతిర్వా నుతిః
పూజా వా స్మరణ౦ కథా శ్రవణమప్యాలోకన౦ దృశామ్
స్వామి న్నస్థిర దేవతానుసరణయాసేన కి౦ లభ్యతే
కావాముక్తిరతః కుతో భవతి చేత్కి౦ ప్రార్థనీయ౦ తదా!!
ఓ
ఈశ్వరా! నిను ఒకసారి మనసారా నమస్కరి౦చినను, సేవి౦చనను, స్తుతి౦చినను,
పూజి౦చిన, స్మరి౦చినను, నీ దివ్యలీలల కథలను విన్నను, నీ దివ్య మ౦గళ
విగ్రహాన్ని దర్శి౦చినను, ముక్తి ప్రసాది౦చెవు కదా! అటువ౦టపుడు అస్థిరమైన
అన్య దేవతలను ప్రార్థి౦చి లాభమేమి మాకు!!!
13/07/17, 8:21:35 AM: +91 80088 84529: ధర్మాకృతి : పట్టాభిషేకము
శంకర
పీఠాధిపతులు సన్యాసులే అయినప్పటికీ బహుకాలంగా అనేకమంది సంస్థానాధీశులకు
గురువులుగా, ఆధ్యాత్మిక సార్వభౌములుగా పరిగణింపబడడం వల్ల అనూచానంగా వారికి
చక్రవర్తి సహజమయిన మర్యాదలు ఏర్పాటు చేయబడి ఉన్నవి. వెండి అంబారీతో కూడిన
భద్రగజం, పెద్ద వెండి సింహాసనం, దంతపు సింహాసనాలు, ఛత్ర చామరాది రాజ
చిహ్నములు, స్వామివారి ముందు వెండి దండాలను పట్టుకొని నడిచే బ్రాహ్మణ
పరివారం, ఆ ముందు కాగడాలు పట్టుకొని వెళ్ళే పరిచారక వర్గం, దాని ముందు
వెండి బాకాల వారు, గౌరీ వాయిద్యం మ్రోగించేవారు ఈ రకంగా ఎన్నో రాజ లాంఛనాలు
ఏర్పాటు చేయబడి ఉన్నాయి. క్రొత్తస్వామి పట్టణానికి వచ్చినప్పుడు
చక్రవర్తులకు జరిగే మాదిరి పట్టాభిషేకం జరుగుతుంది. 67వ పీఠాధిపతులకు ఈ
పట్టాభిషేకం జరగనే లేదు.
ఆ
ఆచారాన్ననుసరించి మహాస్వామివారు పట్టణానికి వచ్చినప్పుడు కూడా
పట్టాభిషేకోత్సవం జరిపించాలని పీఠభక్తులయిన సంస్థానాధీశులు, మిరాసీదారులు,
పండితులు ఉత్సాహపడ్డారు. 1907మే 9వ తేదీన స్వామివారిని
మహాసింహాసనాధిష్ఠితులను చేసి వేదఘోష నడుమ నదీ జలాలతోనూ, మల్లెపూలతోనూ,
అభిషేకం చేశారు. కంచికామకోటి పీఠంతో అత్యంత సన్నిహిత సంబంధమున్న కంచి
కామాక్షీ తిరునావైక్కాల్ అఖిలాండేశ్వర దేవాలయముల ప్రధాన అర్చకులు తొలుదొలుత
నదీజలాలతో స్వామివారిని అభిషేకించగా తంజావూరు మొదలైన సంస్థానాధీశులు
ఒడయార్ పాళెం మొదలైన జమీందారులు స్వామిని మల్లెపూలతో అభిషేకించారు. వివిధ
దేవాలయములనుంచి వచ్చిన ప్రసాదాలు, వివిధ సంస్థానాల భక్తుల వద్దనుండి వచ్చిన
కానుకలు సమర్పించబడినాయి. సింహాసనాధీశులైన స్వామివారికి పీఠభక్తులందరూ తమ
భక్తి ప్రపత్తులను తెలియజేశారు. స్వామి తమ తొలి అనుగ్రహ భాషణము చేశారు.
పండితులకు యధోచితమైన సత్కారములు చేయబడినాయి. భూరి అన్నదానం జరిగింది.
ఆరోజు
రాత్రి తంజావూరు సంస్థానాధీశులు పంపిన బంగారు అంబారీ కూర్చిన భద్రగజంపై
పట్టణ వీధులలో స్వామివారిని ఊరేగించారు. వీధులన్నీ రంగవల్లులతోనూ, ప్రత్యేక
దీపాలతో అలంకరించబడి ఉన్నాయి. దారి పొడుగునా వేలాది భక్తజనులు
స్వామివారికి తమ భక్తి ప్రపత్తులు తెలియజేశారు. ఈవిధంగా స్వామివారి 87ఏళ్ల
ఆధ్యాత్మిక సార్వభౌమత్వము ఆరంభమయింది.
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
12/07/17,
11:10:16 PM: Mani-TTE-Tenali: మన దేశంలో కృష్ణుడి ఆలయాలకు కొదవే లేదు.
వెన్నదొంగకి ఊరూరా ఆలయాలే. అయితే పిఠాపురంలో ఉన్న కుంతీ మాధవ ఆలయానికి ఒక
ప్రత్యేకత ఉంది. కొందరు ఈ ఆలయం ఇంద్రుడు ప్రతిష్టించాడని అంటారు, మరికొందరు
కుంతీ దేవి ప్రతిష్టించిందని అంటారు.
ఒకానొకప్పుడు
ఇంద్రుడు వృత్రాసురుడనే రాక్షసుడిని సంహరిస్తాడు. వృత్రాసురుడు అసురుడైనా
పుట్టుకతో బ్రాహ్మణుడు అందువల్ల బ్రహ్మహత్యా పాతకం నుండి తప్పించుకోవడానికి
ఇంద్రుడు ఈ భూమి పైన ఐదు వైష్ణవాలయాలను నిర్మించాడు... అవే "పంచ మాధవ
క్షేత్రాలు"గా ప్రసిద్ధి చెందాయి. అవే బిందు మాధవ ఆలయం - వారణాసి, వేణీ
మాధవ ఆలయం - ప్రయాగ, కుంతీ మాధవ ఆలయం - పిఠాపురం, సేతు మాధవ ఆలయం -
రామేశ్వరం, సుందర మాధవ ఆలయం - తిరువనంతపురం.
కాకినాడకు
దగ్గరలో ఉన్న పిఠాపురంలో ఉన్న ఈ ఆలయం చరిత్ర చూసినట్లయితే వేదవ్యాస మహర్షి
పిఠాపురం లోని కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి ఇక్కడికి వచ్చి
దర్శనం పూర్తీ చేసుకుని తిరిగి వెళుతూ ఈ కుంతీ మాధవ ఆలయానికి వస్తాడట. తన
దివ్య దృష్టితో ఈ ఆలయం ఇంద్రుడు నిర్మించాడని, పాండవ వనవాస సమయంలో పాండవులు
ఇక్కడకి వచ్చి ఉన్నారని, ఆ సమయంలో కుంతీదేవి ఈ మాధవునికి విశేష పూజలు
చేసిందని చెప్పారట. కుంతీదేవి వనవాస కాలంలో నిరంతరం ఈ స్వామిని పూజించటం
వలన ఈ ఆలయానికి కుంతీ మాధవ ఆలయంగా పేరు వచ్చిందని చెపుతుంటారు.
కుంతీ
మాధవుడి పట్టపురాణిని రాజ్యలక్ష్మి అమ్మవారట. ఈవిడకి ప్రతి శుక్రవారం
విశేష పూజలు చేస్తారట. ఈ ఆలయంలోని స్వామివారి లీలలు ఎంతో మంది ప్రత్యక్షంగా
చూసారని చెపుతుంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా రావు గంగాధర
రామారావుగారికి స్వామివారు కలలో కనిపించేవారని ప్రతీతి.ఏ రోజైనా ఆలయంలో
ప్రసాదం రుచిగా లేకపోతే కృష్ణుడు ఈయన కలలో కనిపించి ప్రసాదం ఏమి బాలేదని
చెప్పేవారట. రాజా వారు మరునాడు ఆలయానికి వెళ్లి ప్రసాదం ఎంతో రుచిగా
వచ్చేటట్టు జాగ్రత్తలు తీసుకునేవారట.
ఇక
ఈ ఆలయంలో జరిగే ఉత్సవాల విషయానికొస్తే మాధవస్వామికి మాఘశుద్ధ ఏకాదశి నాడు
కళ్యాణోత్సవం జరుపుతారట. చతుర్దశి నాడు రథోత్సవము కూడా అత్యంత వైభవంగా
జరుగుతుందిట. మార్గశిర మాసంలో వచ్చే ధనుర్మాసం నెలరోజులు భక్తులు
తిరుప్పావై విన్నవించుకుంటారని ఆలయ వర్గాలు చెప్పాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే
శ్రీ గోదామ్మవారు, లక్ష్మీ అమృతవల్లి తాయారు, ఆళ్వారుల సన్నిధి ఉన్నాయట.
ఆ
మాధవుడి కరుణా కటాక్షాలు మీ మీద కూడా పడాలంటే సామర్లకోట, కాకినాడ పరిసర
ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా కుంతీ మాధవుడిని దర్శించి తరించండి.
14/07/17, 8:51:02 AM: Yes Pk: పరమ పవిత్రమైన త్రి గయా క్షేత్రాలు:
-----------------------------------------
ఇదేమిటి
కొత్త పేరు అనుకుంటున్నారా కొత్త పేరేమీకాదండీ. పురాణకాలంనుంచీ వున్న
క్షేత్రాలే.. వీటిగురించి తెలియాలంటే మీకోకధ చెప్పాలి. అనగనగనగా….
పూర్వం
గయాసురుడనే రాక్షసుడుండేవాడు. ఆయన రాక్షసుల్లో తప్పబుట్టాడు. ఆయనకి దైవ
భక్తి చాలా ఎక్కువ. ఒకసారి గయాసురుడు చేసిన తపస్సుకి విష్ణుమూర్తి
సంతసించి ప్రత్యక్షం కాగా, గయాసురుడు పృధ్వీ మండలంమీద వున్న అన్ని
తీర్ధములకన్నా తన శరీరము పవిత్రంగా వుండే వరాన్ని కోరుకున్నాడు.
విష్ణుమూర్తి వరాన్ని ఇచ్చాడు. దానితో గయాసురుని సందర్శించినవారి
పాపాలన్నీ పటాపంచలయి మరణించినతర్వాత అందరూ స్వర్గానికి పోసాగారు. గయాసురుడు
చేసిన యాగాలవల్ల ఆయనకి ఇంద్ర పదవి లభించింది. గయాసురుడు మంచివాడయినా,
అతని అనుచరులు రాక్షసకృత్యాల చేసేవారు. దానితో యజ్ఞయాగాదులకు అంతరాయాలు
కలగటంవల్ల దేవతలు శక్తిహీనులయ్యారు. వర్షాలు కురవక, పంటలు పండక ప్రజలు
అవస్త పడసాగారు. పదవీచ్యుతుడైన ఇంద్రుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల
గురించి తపస్సు చెయ్యగా వారు ప్రత్యక్షమయ్యారు. ఇంద్రుడు వారికి పరిస్ధితి
వివరించి, గయాసురుని వధించి, దేవతలకు అండగా నిలిచి, సామాన్య ప్రజలను
రక్షించమని కోరాడు.
దానికి
అంగీకరించిన త్రిమూర్తులు గయాసుర సంహారానికి ఒక పధకం వేశారు. వారు
ముగ్గురూ బ్రాహ్మణుల రూపంలో గయాసురుని దగ్గరకు వెళ్ళి విశ్వ శాంతి కోసం
తాము తలపెట్టిన యజ్ఞానికి సహాయపడమని అడిగారు. దానికి గయాసురుడు ఏమి
చెయ్యవలెనో తెలుపమనగా, త్రిమూర్తులు పుణ్య క్షేత్రాలన్నీ మానవుల పాపాలతో
కలుషితమవుతుండటంతో యజ్ఞాన్ని ఆ క్షేత్రాలలో చేయలేమనీ, ఏడు రోజులు జరిగే ఆ
యజ్ఞాన్ని భూమండలం భరించలేదుగనుక, గయాసురుడి శరీరం అన్ని
పుణ్యక్షేత్రాలకన్నా పవిత్రమైనదిగనుక ఆయన అంగీకరిస్తే ఆయన శరీరంమీద యజ్ఞం
చేస్తామన్నారు.
దానికి
గయాసురుడు సంతోషంగా అంగీకరించాడు. అయితే త్రిమూర్తులు ఏడు రోజులు జరిగే ఆ
యజ్ఞం పూర్తయ్యేవరకూ గయాసురుడు కదలకూడదనీ, కదిలినచో యజ్ఞం అసంపూర్తిగా
వుంటుందనీ అలా అయితే తాము గయాసురుణ్ణి సంహరిస్తామనీ చెప్పారు. అందుకు
ఒప్పుకున్న గయాసురుడు తన శక్తిచేత తన దేహాన్ని యజ్ఞానికి అనువుగా
వుండేటట్లు పెంచాడు. అప్పుడా శరీరం తల బీహారు రాష్ట్రంలోని గయలోను, నాభి
ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్ పూర్లోను, పాదములు ఆంధ్ర రాష్ట్రంలోని
పిఠావురంలోనూ వున్నాయి. అలా పెంచిన శరీరంమీద యజ్ఞాన్ని ప్రారంభించమన్నాడు.
విష్ణుమూర్తి
తల భాగమందు, బ్రహ్మ నాభి ప్రాంతమునందు, పరమేశ్వరుడు కాళ్ళ భాగములో వుండి
యజ్ఞము ప్రారంభించారు. గయాసురుడు యోగవిద్యచే తన శరీరాన్ని
కదల్చకుండావుంచి, ప్రతి రోజూ కోడికూతనుమాత్రం వింటూ ఎన్నిరోజులయిందో
లెక్కపెట్టుకునేవాడు. అలా ఆరు రోజులు గడిచాయి. ఏడవ రోజు గయాసురుని
సంహరించే ఉద్దేశ్యంతో శివుడు కోడిరూపము ధరించి తెల్లవారుఝాముకాకుండానే
కొక్కొరకో అని కూశాడు. ఈ విషయం తెలియని గయాసురుడు యజ్ఞం పూర్తయిందని
సంతోషంగా కదిలాడు. అప్పుడు త్రిమూర్తులు యజ్ఞం పూర్తికాకుండా గయాసురుడు
కదిలాడుకనుక అతనిని వధిస్తామన్నారు. గయాసురుడు అసలు సంగతి తెలుసుకుని
త్రిమూర్తుల చేతిలో మరణము ముక్తిదాయకమన్నాడు. త్రిమూర్తులు వరం కోరుకోమనగా
తన శరీరంలోని మూడు ముఖ్య భాగములూ తనపేరున త్రిగయా క్షేత్రములుగా
ప్రసిధ్ధిపొందేటట్లూ,ఆ క్షేత్రాలలో త్రిమూర్తులు ముగ్గురూ మూడు క్షేత్రాలలో
నివసించి భక్తులను కరుణించాలనీ, ఆ మూడు క్షేత్రాలూ శక్తి నివాసాలుకావాలనీ,
మానవులు చనిపోయిన తమ పితరులకు చేసే కర్మకాండలు వగైరాలు ఈ క్షేత్రాలలో
చేస్తే వారికి మోక్షం ప్రసాదించమనీ కోరుకున్నాడు. పూర్వం మహానుభావులు కోరే
కోర్కెలన్నీ మానవోధ్ధరణకోసమే. అందుకే గయాసురుడు సకల మానవ సంక్షేమంకోసం ఆ
కోరికలు కోరుకున్నాడు. త్రిమూర్తులు తధాస్తు అన్నారు.
గయాసురుడి
శిరస్సు వున్న ప్రదేశం శిరోగయ. ఇది బీహారు రాష్ట్రంలో వున్న గయ. ఇది
విష్ణు నివాసం. ఇక్కడ ఫల్గుణా నదీ తీరంలో విష్ణుపాద ఆలయం వున్నది. పితృ
దేవతలకు ఇక్కడ పెట్టే శ్రాధ్ధం గయా శ్రాధ్ధంగా ప్రసిధ్ధి చెందింది.
అవకాశమున్న ప్రతి ఒక్కరూ గతించిన తమ పితృ దేవతలకు ఇక్కడ శ్రాధ్ధ కర్మలు
నిర్వహించాలనుకుంటారు..వాటితో వారు ఉత్తమగతులు పొందుతారనే నమ్మకంతో.
గయలోనే అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మంగళ గౌరీదేవి ఆలయం వున్నది.
ఒరిస్సా
రాష్ట్రంలో కటక్ దగ్గరవున్న జాజ్ పూర్ నాభిగయా ప్రదేశం. ఈ ప్రదేశంలో
యజ్ఞం చేసిన బ్రహ్మదేవుడు ఇక్కడ కొలువుతీరాడు. అయితే
బ్రహ్మదేవునిమూర్తికి పూజలులేవుగనుక ఇక్కడ యజ్ఞవేదికా స్వరూపంగా వున్నాడు.
ఇక్కడా పితృకార్యాలు నిర్వహిస్తారు. ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలలో
ఒకటైన గిరిజాదేవి శక్తి పీఠం వున్నది. ఇక్కడివారు ఈవిడని విరజాదేవి,
బిరజాదేవి అంటారు. ఈ ఆలయంలోనే ఒక బావిలాంటిది వుంటుంది. దానినే
బ్రహ్మదేవుడి యజ్ఞ కుండము అంటారు.
ఆంధ్రప్రదేశ్
లోని పిఠాపురంలో గయాసురుడు పాదాలుంచినచోట పాదగయ అయింది. ఇక్కడ ఈశ్వరుడు
ప్రధాన దైవం. కుక్కుటం రూపంలో యజ్ఞభంగంగావించిన ఈశ్వరుడు, గయాసురుడి కోరిక
ప్రకారం ఇక్కడ కుక్కుటేశ్వరుడిగా వెలిశాడు. అష్టాదశ శక్తి పీఠాలలో
ఇక్కడవున్నది 10వ శక్తి పీఠము పురూహూతికాదేవిది.త్రిగయా క్షేత్రాలలో పాదగయ
శ్రేష్టమయిందంటారు.
గయాసురుడి
కోరికమీద శివుడు కుక్కుటేశ్వరుడుగా ఇక్కడ విరాజిల్లుతున్నాడు. అమ్మవారు
శ్రీ రాజరాజేశ్వరీదేవి. ఇక్కడ అమ్మవారికి ఇరుపక్కలా సుబ్రహ్మణ్యస్వామి,
వినాయకుడు వుంటారు.
శ్రీ దత్తావతారమైన శ్రీపాద
శ్రీవల్లభులు సుమతి, రాజశర్మ అను బ్రాహ్మణ దంపతులకు జన్మించింది ఇక్కడే.
ఆయన జన్మస్ధానం దర్శనీయ క్షేత్రం.
పాదగయాక్షేత్రానికి
క్షేత్రపాలకులు శ్రీ కుంతీ మాధవస్వామి. ఆయనని దర్శించనిదే పిఠాపుర
యాత్రాఫలితం వుండదు. ఇంద్రునిచే ప్రతిష్టించబడిన ఈయనని శ్రీ కృష్ణుని
మేనత్త కుంతీదేవి పూజించింది కనుక కుంతీమాధవస్వామి అయ్యాడు. అసురుడైనా
గయాసురుడు తన భక్తి ప్రపత్తులవల్ల భారత దేశంలోని మూడు ప్రదేశాలలో తన పేరు
శాశ్వతంగా నిలబెట్టుకోవటమేకాదు, భవిష్యత్తరాలకోసం త్రిమూర్తులనుంచి ఎన్ని
వరాలు సంపాదించాడో చూడండి.
14/07/17, 6:21:06 AM: MVMRAO: *నా జీవితం లోనివి కష్టాలు కాదు, భగవంతుని వరాలు*
*ఓ అనుభవజ్ఞుని మాటల్లో*
నేను శక్తిని అడిగాను - భగవంతుడు నాకు కష్టాన్ని ఇచ్చి శక్తిని పొందమన్నాడు.
నేను సంపదను అడిగాను - భగవంతుడు నాకు మట్టిని ఇచ్చి బంగారం చేసుకోమన్నాడు.
నేను ధైర్యాన్ని అడిగాను - భగవంతుడు నాకు ప్రమాదాలు ఇచ్చి ధైర్యం వహించమన్నాడు.
నేను వరాలు అడిగాను - భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు.
నేను ఆయన ప్రేమను అడిగాను- భగవంతుడు ఆపదల్లో ఉన్నవారి చెంతకు నన్ను పంపించాడు.
నేను జ్ఞానాన్ని అడిగాను - భగవంతుడు నాకు సమస్యల్ని ఇచ్చి పరిష్కరించమన్నాడు.
నేను పురోగతి అడిగాను - భగవంతుడు నాకు అవరోధాలు కల్పించి సాధించమన్నాడు.
నేను లోకానికి మంచి చెయ్యాలని అడిగాను - భగవంతుడు ఇబ్బందులు కల్పించి అధిగమించమన్నాడు.
నేను ఆయన్ను మరువకూడదు అని అడిగాను - భగవంతుడు భాధలు ఇచ్చి ఆయన్ను గుర్తుంచుకోమన్నాడు.
నేను పాపాలు క్షమించమని అడిగాను - భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమన్నాడు.
అలా జీవితం లో నేను కోరుకున్నదేదీ పొందలేదు - నాకు కావలసిందే నేను పొందాను.
ఈ విధంగా జీవితంలో జరిగే ప్రతీ సంఘటననుండి నాకు అవసరమైనది పొందటం నేను నేర్చుకున్నాను.
చివరకు ఏది జరిగినా నా మంచికే అని అర్ధం చేసుకున్నాను.
మీరు కూడాఅర్ధం చేసుకోండి. *జరిగేది అంతా మన మంచికే*
*సర్వేజనాఃసుఖినోభవంతు🌷*
Subscribe to:
Posts (Atom)