Friday, July 14, 2017
Wednesday, July 12, 2017
09/07/17, 1:17:19 PM: +91 98484 03424: Guru paduka stotram
అనంత సంసార సముద్రతార
నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్।
వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం
నమోనమః శ్రీ "గురు పాదుకాభ్యామ్"॥
కవిత్వ వారాశినిశాకరాభ్యాం
దౌర్భాగ్యదావాం బుదమాలికాభ్యామ్।
దూరికృతానమ్రవిపత్తతిభ్యాం
నమోనమః "శ్రీ గురుపాదుకాభ్యామ్"॥
నతా యయోః శ్రీపతితాం సమియుః
కదాచిద ప్యాశు దరిద్రవర్యాః।
మూకాశ్ర్చ వాచస్పతితాం హితాభ్యాం
నమోనమః"శ్రీ గురుపాదుకాభ్యామ్"॥
నాలీకనీకాశ పదాహృతాభ్యాం
నానావిమోహాది నివారికాభ్యామ్।
సమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం
నమోనమః "శ్రీ గురుపాదుకాభ్యామ్"॥
నృపాలి మౌలివ్రజరత్నకాంతి
సరిద్విరాజత్ ఝషకన్యకాభ్యామ్।
నృపత్వదాభ్యాం నతలోకపంకతేః
నమోనమః"శ్రీ గురుపాదుకాభ్యామ్"॥
పాపాంధకారార్క పరంపరాభ్యాం
తాపత్రయాహీంద్ర ఖగేశ్రరాభ్యామ్।
జాడ్యాబ్ధి సంశోషణ వాడవాభ్యాం
నమోనమః "శ్రీ గురుపాదుకాభ్యామ్"॥
శమాదిషట్కరపదవైభవాభ్యాం
సమాధిదానవ్రతదీక్షితాభ్యామ్।
రమాధవాంధ్రిస్థిరభక్తిదాభ్యాం
నమోనమః "శ్రీ గురుపాదుకాభ్యామ్"॥
స్వార్చాపరాణామ్ అఖిలేష్టదాభ్యాం
స్వాహాసహాయాక్షధురంధరాభ్యామ్।
స్వాంతాచ్ఛభావప్రదపూజనాభ్యాం
నమోనమః "శ్రీ గురుపాదుకాభ్యామ్"॥
కామాదిసర్ప వ్రజగారుడాభ్యాం
వివేకవైరాగ్య నిధిప్రదాభ్యామ్।
బోధప్రదాభ్యాం దృతమోక్షదాభ్యాం
నమోనమః "శ్రీ గురుపాదుకాభ్యామ్"॥
10/07/17, 8:52:53 AM: +91 98857 16254: 💢నిత్య పారాయణ శ్లోకాలు💢
మనలో చాలామందికి తెలియని శ్లోకాలు
ఏ దైవ సన్నిధిలో ఏ శ్లోకం జపించాలో తెలుసుకోండి...
🌷ప్రభాత శ్లోకం :🌷
కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతీ !
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ !!
☘ప్రభాత భూమి శ్లోకం : ☘
సముద్ర వసనే దేవీ పర్వత స్తవ మండలే !
విష్ణుపత్ని సమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే !!
🌝సూర్యోదయ శ్లోకం : 🌝
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ !
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ !!
🍀స్నాన శ్లోకం : ☘
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ !
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు !!
♨భస్మ ధారణ శ్లోకం : ♨
శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ !
లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ !!
🍀భోజనపూర్వ శ్లోకం : 🍀
బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ !
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన: !!
అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహ - మాశ్రిత: !
ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ !!
త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే !
గృమాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర !!
💢 భోజనానంతర శ్లోకం : 💢
అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ !
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ !!
🌷సంధ్యా దీప దర్శన శ్లోకం :🌷
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ !
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోఁస్తుతే !!
😔నిద్రా శ్లోకం :😔
రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ !
శయనే య: స్మరేన్నిత్యమ్ దుస్వప్న - స్తస్యనశ్యతి !!
👍కార్య ప్రారంభ శ్లోకం : 👍
వక్రుతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ: !
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా !!
🌷హనుమ స్తోత్రం : 🌷
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా సమామి !!
బుద్ధిర్భలం యశొధైర్యం నిర్భయత్వ - మరోగతా !
అజాడ్యం వాక్పటుత్వం హనుమత్ - స్మరణాద్ - భవేత్ !!
💢శ్రీరామ స్తోత్రం : 💢
శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే
♨గణేశ స్తోత్రం : ♨
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ !
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !!
అగజానన పద్మార్కం గజానన మహర్ణిశమ్ !
అనేకదంతం భక్తానా - మేకదంత - ముపాస్మహే !!
🔯శివ స్తోత్రం : 🔯
త్ర్యం’బకం యజామహే సుగంధిం పు’ష్టివర్ధినమ్ !
ఉర్వారుకమి’ వ బంధ’ నాన్ - మృత్యో’ర్ - ముక్షీయమాఁ మృతా’’త్ !!
🕉గురు శ్లోకం : 🕉
గురుబ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: !
గురు: సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ: !!
☸సరస్వతీ శ్లోకం :☸
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ !
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా !!
యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా !
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా !!
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ - దేవై: సదా పూజితా !
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా !!
🌷లక్ష్మీ శ్లోకం 🌷:
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ !
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ !
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరమ్ !
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ !!
☘వెంకటేశ్వర శ్లోకం ☘:
శ్రియ: కాంతాయ కళ్యాణనిధయే నిధయేఁర్థినామ్ !
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ !!
♨దేవీ శ్లోకమ్♨ :
సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే !
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే !!
💢దక్షినామూర్తి శ్లోకం💢 :
గురువే సర్వలోకానాం భిషజే భివరోగినామ్ !
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ: !!
☸అపరాధ క్షమాపణ స్తోత్రం☸ :
అపరాధ సహస్రాణి, క్రియంతేఁహర్నిశం మయా !
దాసోఁయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర !!
కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ !
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో !!
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే: స్వభావాత్ !
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి !!
🔯 విశేష మంత్రా: 🔯
💢పంచాక్షరి -
ఓం నమశ్శివాయ
☘అష్టాక్షరి -
ఓం నమో నారాయణాయ
🌷ద్వాదశాక్షరి -
ఓం నమో భగవతే వాసుదేవాయ.
10/07/17, 6:28:34 PM: Yes Pk: ఓం నమ: శివాయ ‘ అనే మంత్రం సకల శుభాలను కలిగిస్తుందని పెద్దల వాక్కు.
🌴🌴 *$PK* 🌴🌴
" కితస్య బహుభిర్మం త్రై:
కింతిర్థై: కిం తపోధ్వరై:
యస్య నమశ్శివాయేతి "
మంత్రో
హృదయ గోచర: అని అన్నారు. అంటే, ఎవరి హృదయంలో నిరతరం “ *ఓం నమ:* *శివాయ*”
అనే మంత్రం జపించబడుతుంటుంతో, వారికి ఇతర మంత్రాలతో, తీర్థయాత్రలతో,
యజ్ఞయాగాదులతో పని లేదని భావం. ఓం నమశ్శివయ (షడక్షరీ) నమశ్శివాయ
(పంచాక్షరీ) మంత్రాలలో ఏ ఒక్క మంత్రాన్ని అయినా శ్రద్ధతో జపించే వ్యక్తి
సమస్త శుభాలను పొందగలుగుతాడు.
అలాగే
మనకు ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, దీర్ఘాయువును, శాంతిని, తృప్తిని
ఇచ్చేది మహామృత్యుంజయ మంత్రం. ఇది శుక్లయజుర్వేద మంత్రం. శైవులు దీనిని
రుద్రాభిషేకంలో, వైష్ణవులు పాచరాత్రదీక్షలో హోమభస్మధారన మంత్రంగా
చెప్పుకుంటారు.
ఇది అందరికీ, అంటే శైవులకు, వైష్ణవులకు, మధ్వులకు ప్రామాణికమయిన మంత్రం.
10/07/17, 12:21:47 PM: +91 91105 71415: ధర్మాకృతి : పట్టాభిషేకము
శంకర
పీఠాధిపతులు సన్యాసులే అయినప్పటికీ బహుకాలంగా అనేకమంది సంస్థానాధీశులకు
గురువులుగా, ఆధ్యాత్మిక సార్వభౌములుగా పరిగణింపబడడం వల్ల అనూచానంగా వారికి
చక్రవర్తి సహజమయిన మర్యాదలు ఏర్పాటు చేయబడి ఉన్నవి. వెండి అంబారీతో కూడిన
భద్రగజం, పెద్ద వెండి సింహాసనం, దంతపు సింహాసనాలు, ఛత్ర చామరాది రాజ
చిహ్నములు, స్వామివారి ముందు వెండి దండాలను పట్టుకొని నడిచే బ్రాహ్మణ
పరివారం, ఆ ముందు కాగడాలు పట్టుకొని వెళ్ళే పరిచారక వర్గం, దాని ముందు
వెండి బాకాల వారు, గౌరీ వాయిద్యం మ్రోగించేవారు ఈ రకంగా ఎన్నో రాజ లాంఛనాలు
ఏర్పాటు చేయబడి ఉన్నాయి. క్రొత్తస్వామి పట్టణానికి వచ్చినప్పుడు
చక్రవర్తులకు జరిగే మాదిరి పట్టాభిషేకం జరుగుతుంది. 67వ పీఠాధిపతులకు ఈ
పట్టాభిషేకం జరగనే లేదు.
ఆ
ఆచారాన్ననుసరించి మహాస్వామివారు పట్టణానికి వచ్చినప్పుడు కూడా
పట్టాభిషేకోత్సవం జరిపించాలని పీఠభక్తులయిన సంస్థానాధీశులు, మిరాసీదారులు,
పండితులు ఉత్సాహపడ్డారు. 1907మే 9వ తేదీన స్వామివారిని
మహాసింహాసనాధిష్ఠితులను చేసి వేదఘోష నడుమ నదీ జలాలతోనూ, మల్లెపూలతోనూ,
అభిషేకం చేశారు. కంచికామకోటి పీఠంతో అత్యంత సన్నిహిత సంబంధమున్న కంచి
కామాక్షీ తిరునావైక్కాల్ అఖిలాండేశ్వర దేవాలయముల ప్రధాన అర్చకులు తొలుదొలుత
నదీజలాలతో స్వామివారిని అభిషేకించగా తంజావూరు మొదలైన సంస్థానాధీశులు
ఒడయార్ పాళెం మొదలైన జమీందారులు స్వామిని మల్లెపూలతో అభిషేకించారు. వివిధ
దేవాలయములనుంచి వచ్చిన ప్రసాదాలు, వివిధ సంస్థానాల భక్తుల వద్దనుండి వచ్చిన
కానుకలు సమర్పించబడినాయి. సింహాసనాధీశులైన స్వామివారికి పీఠభక్తులందరూ తమ
భక్తి ప్రపత్తులను తెలియజేశారు. స్వామి తమ తొలి అనుగ్రహ భాషణము చేశారు.
పండితులకు యధోచితమైన సత్కారములు చేయబడినాయి. భూరి అన్నదానం జరిగింది.
ఆరోజు
రాత్రి తంజావూరు సంస్థానాధీశులు పంపిన బంగారు అంబారీ కూర్చిన భద్రగజంపై
పట్టణ వీధులలో స్వామివారిని ఊరేగించారు. వీధులన్నీ రంగవల్లులతోనూ, ప్రత్యేక
దీపాలతో అలంకరించబడి ఉన్నాయి. దారి పొడుగునా వేలాది భక్తజనులు
స్వామివారికి తమ భక్తి ప్రపత్తులు తెలియజేశారు. ఈవిధంగా స్వామివారి 87ఏళ్ల
ఆధ్యాత్మిక సార్వభౌమత్వము ఆరంభమయింది.
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
10/07/17, 5:54:02 PM: Yes Pk: 🌴🌴 *$PK* 🌴🌴
మనకు
తెలీని శివ లింగాలు ఇంకా అనేకం ఉన్నాయి. అందులో 30 రకాల శివలింగాలు మరీ
ముఖ్యమైనవి, అపురూపమైనవి. ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం. అందుకే వాటి
గురించి తెలుసుకుందాం. రకరకాల పదార్ధాలతో రూపొందిన శివలింగాల గురించి
పురాణాలు వివిధ సందర్భాల్లో వర్ణించాయి.
1.
గంధలింగం: రెండు భాగాలు కస్తూరి. నాలుగు భాగాలు గంధం, మూడు భాగాలు
కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు. దీనిని పూజిస్తే శివ సాయిజ్యం
లభిస్తుంది.
2. పుష్పలింగం: నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు. దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.
3. నవనీతలింగం: వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.
4. రజోమయలింగం: పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది. శివ సాయుజ్యాన్ని పొందగలం.
5. ధాన్యలింగం: యవలు, గోధుమలు, వరిబియ్యపు పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు. దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి, సంతానం కలుగుతుంది.
6. తిలిపిస్టోత్థలింగం: నూగుపిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది.
7. లవణలింగం: హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి.
8. కర్పూరాజ లింగం: ముక్తిప్రదమైనది.
9. భస్మమయలింగం: భస్మంతో తయారు చేస్తారు. సర్వ సిద్ధులను కలుగచేస్తుంది.
10. శర్కరామయలింగం: సుఖప్రదం.
11. సద్భోత్థలింగం: ప్రీతిని కలిగిస్తుంది.
12. పాలరాతి లింగం: ఆరోగ్యదాయకం
13. వంశాకురమయ లింగం: వంశవృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు.
14. కేశాస్థిలింగం: వెంట్రుకలు, ఎముకలతో తయారు చేస్తారు. ఇది శత్రునాశనం చేస్తుంది.
15. పిష్టమయలింగం: ఇది పిండితో తయారు చేయబడుతుంది. ఇది విద్యలను ప్రసాదిస్తుంది.
16. దధిదుగ్థలింగం: కీర్తిప్రతిష్టలను కలిగిస్తుంది.
17. ఫలోత్థలింగం: ఫలప్రదమైనది.
18. ధాత్రిఫలజాతలింగం: ముక్తిప్రదం.
19.
గోమయలింగం: కపిలగోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు. దీనిని పూజిస్తే
ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. భూమిపై పడి మట్టి కలసిన పేడ పనికిరాదు.
20. దూర్వాకాండజలింగం: గరికతో తయారుచేయబడిన ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది.
21. వైడూర్యలింగం: శత్రునాశనం, దృష్టిదోషహరం
22. ముక్తాలింగం: ముత్యంతో తయారుచేయబడిన ఈ లింగం ఇష్టసిద్ధిని కలిగిస్తుంది.
23. సువర్ణనిర్మితలింగం: బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది.
24. రజతలింగం: సంపదలను కలిగిస్తుంది.
25. ఇత్తడి – కంచులింగం: ముక్తిని ప్రసాదిస్తుంది.
26. ఇనుము – సీసపులింగం: శత్రునాశనం చేస్తుంది.
27. అష్ట ధాతులింగం: చర్మరోగాలను నివారిస్తుంది. సర్వసిద్ధిప్రదం.
28. తుsసషోత్థలింగం: మారణక్రియకు పూజిస్తారు.
29. స్పటిక లింగం: సర్వసిద్ధికరం, అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది.
30. సీతాఖండలింగం: పటికబెల్లంతో తయారు చేసింది. ఆరోగ్యసిద్ధి కలుగుతుంది.
శివలింగంలో
శివశక్తుల సమ్మేళనం జరగడం వలన ప్రచండమైన ఊర్థస్సు ఉద్భవిస్తుంది. దాని
ప్రతికూల ఫలితాలు మనపై పడకుండా ఉండేందుకు శివలింగంపై జలధారను పోస్తుండాలి. ఆ
దారనుంచి సూక్ష్మమైన ఓంకారం ఉద్భవిస్తుంది. ఇదే నిర్గుణబ్రహ్మ. ఇలా జీవుడు
మంత్రపూర్వక ధారాభిషేకం ద్వారానిర్గుణ బ్రహ్మను తెలుసుకుంటాడు.
ఇవి కాకుండా మరికొన్ని శివలింగాలున్నాయి. మన పురాణాల్లో ఎవరు ఏ లింగాన్ని పూజిస్తే మంచి ఫలితాలు లభిస్తాయన్నది విశదీకరించారు.
Subscribe to:
Posts (Atom)